నేల ఉసిరి

వికీపీడియా నుండి
నేల ఉసిరి
Quebra-Pedra. Phyllanthus niruri.JPG
శాస్త్రీయ వర్గీకరణ
సామ్రాజ్యము: ప్లాంటే
విభాగము: మాగ్నోలియోఫైటా
తరగతి: మాగ్నోలియోప్సిడా
వర్గము: Malpighiales
కుటుంబము: ఫిలాంథేసి
ప్రజాతి: ఫిలాంథస్
జాతి: P. niruri
ద్వినామము
Phyllanthus niruri
లి.
Synonyms
Phyllanthus amarus

నేల ఉసిరి (లాటిన్ Phyllanthus niruri) ఒక ఔషధ మొక్క. ఇది ఫిలాంథేసి (Phyllanthaceae) కుటుంబానికి చెందినది. దీనిలో కాడ యొక్క రంగును బట్టి ఎరుపు మరియు తెలుపు అని రెండు రకాలు.

విషయ సూచిక

[మార్చు] లక్షణాలు

  • ఉద్వక్ర నిర్మాణంలో పెరిగే గుల్మం.
  • గురు అగ్రంతో దీర్ఘవృత్తాకారంలో హ్రస్వశాఖలపఇ అమరివున్న సరళ పత్రాలు.
  • పత్రగ్రీవాలలో నిశ్చిత సమూహాలుగా ఏర్పడిన చిన్న ఆకుపచ్చ పుష్పాలు.
  • గుండ్రటి విదారక ఫలాలు.

[మార్చు] ప్రాంతీయ నామములు

  • సంస్కృతం : భూమ్యామలకి, తామలకి, బహుపత్రా, బహుఫలా
  • హిందీ : భూయిఆమ్లా
  • బెంగాళీ : భూయీఆమ్లా
  • గుజరాతీ : బోయారలీ

[మార్చు] ఉపయోగాలు

నేల ఉసిరి మొక్క అన్ని భాగాలు ఔషధాలలో ఉపయోగిస్తారు.[1]

  • శరీరంపై కలిగే వాపు, అభిఘాతములలో నేల ఉసిరిని దంచి పైపూతగా రాయాలి
  • ఎముకలు విరిగినపుడు నేల ఉసిరిని ఉప్పుతో కలిపి దంచి ప్రయోగిస్తారు.
  • దీని వేరును బియ్యపు కలితో నూది వాపులలో, సెగగడ్డ పక్వము చెందినపుడు పైకి అంటించాలి.
  • ఉప్పుతో దంచి రసాన్ని తీసి లేపనము చేసిన దురదతో కూడిన చర్మ వ్యాధులు ఉపశమిస్తాయి.
  • నాలుక, నోరు, పెదవులు పాకము చెందినప్పుడు, నేల ఉసిరిని రాత్రి దంచి నీళ్లలో వేసి ఉదయం వడకట్టి ఆ నీటితో పలుమార్లు పుక్కిలించాలి.
  • దగ్గు, దమ్ములలో దీని రసాన్ని గాని, చూర్ణాన్ని గాని కషాయాన్ని గాని సేవించాలి.
  • కామెర్లలో దీన్ ఆకురసము ఒక టీ స్పూను కాని, దంచిన ముద్ద గచ్చకాయంత గాని, చూర్ణం చెంచాడు గాని 3 రోజులు సేవించాలు.
  • ఆకలిలేమి, అరుచి, దాహములలో కూడా నేల ఉసిరిని కడుపులోనికి తీసుకోవాలి.
  • దీని వేళ్ల రసాన్ని చక్కెరతో కలిపి సేవించిన లేదా నస్యము చేసిన ఎక్కిళ్లు ఉపశమిస్తాయి.
  • మూత్రవ్యాధులలో మూత్రము జారీ కావడానికి నేల ఉసిరి సమూలం దంచి తినిపించాలి.
  • స్త్రీలలో ఋతుస్రావమెక్కువగా ఉన్నప్పుడు తగ్గించడానికి, నేల ఉసిరి చూర్ణాన్ని బియ్యముతో కడుగుడు నీళ్లతో త్రాగించాలి.
  • దీని కషాయం సేవనతో దౌర్బల్యము, లివరు జబ్బులు, జ్వరాలు తగ్గిపోతాయి.

[మార్చు] మూలాలు

  1. నేల ఉసిరి, వాణిజ్య ప్రాముఖ్యత గల ఔషధ మరియు సుగంధమొక్కలు, డా. కొండపల్లి నరసింహారెడ్డి, స్వామి రామానంద తీర్థ ప్రచురణలు, హైదరాబాద్, 2002, పేజీలు: 14-16.
"http://te.wikipedia.org/w/index.php?title=నేల_ఉసిరి&oldid=594926" నుండి వెలికితీశారు
వ్యక్తిగత పరికరాలు
నేంస్పేసులు

వైవిధ్యాలు
పేజీకి సంభందించిన లింకులు
చర్యలు
మార్గదర్శకము
పరస్పరక్రియ
పరికరాల పెట్టె
ఇతర భాషలు