నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్
వికీపీడియా నుండి
నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ (National Thermal Power Corporation) కరీంనగర్ జిల్లా రామగుండం లోని ప్రముఖ సంస్థ.
- 1 జనవరి 2010 నాటికి నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ (ఎన్టీపిసి), రామగుండం లో రికార్డు స్థాయి ఉత్పత్తి. రామగుండం ఎన్టీపిసి 2009-10 ఆర్థిక సంవత్సరంలో విద్యుత్ ఉత్పత్తి లక్ష్యాలను అదిగమించే దిశలో కొనసాగుతున్నాయి. ఎన్టీపిసికి చెందిన 200 మెగావాట్ల 3 యూనిట్లు (600 మెగావాట్ల ఉత్పత్తి) , 500 మెగవాట్ల 4 యూనిట్లు (2000 మెగావాట్ల ఉత్పత్తి) మొత్తం రోజుకు 2600 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి జరుపుతూ దక్షిణాది రాష్ట్రాలకు నిరాటంకంగా విద్యుత్తును ఉత్పత్తి చేస్తుంది. ఎన్టీపిసి 92.66 శాతం పిఎల్‌ఎఫ్‌తో ఉత్పత్తి జరుపుతుంది.
- ఎన్.టి.పి.సి. రామగుండం ఉత్పత్తి చేసిన విద్యుత్తు, నెలవారీగా, ఈ కింది పట్టికలో చూడండి.
| నెల | సంవత్సరం | మిలియన్ యూనిట్లు |
|---|---|---|
| ఏప్రిల్ | 2010 | 1889.199 |
| మే | 2010 | 1840.53 |
| జూన్ | 2010 | 1691.814 |
| జూలై | 2010 | 1542.146 |
| ఆగస్టు | 2010 | 1636.88 |
| సెప్టెంబర్ | 2010 | 1542 |
| అక్టోబర్ | 2010 | 12072 |
| నవంబర్ | 2010 | 13957.218 |
| డిసెంబర్ | 2010 | 15900.76 |
- ఎన్టీపిసి వద్ద 2600 మెగావాట్ల విద్యుత్ ఉత్పదన జరపడం కోసం రోజుకు 30వేల పై చిలుకు మెట్రిక్ టన్నుల బొగ్గు అవసరం ఉండగా ఎన్టీపిసి కోల్ యార్డ్‌లో సుమారు 7లక్షల పైచిలుకు మెట్రిక్ టన్నుల బొగ్గు నిల్వ ఉంది.