నైవేద్యం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దాదాపు ప్రతి మహారాష్ట్ర పండుగ సందర్భంగా తయారుచేసిన ప్రామాణికమైన రుచికరమైనదైన పదార్థాన్ని ఎక్కువగా నైవేద్యంగా ఉపయోగిస్తారు

నైవేద్యం అనునది భుజించడానికి మునుపు దేవునికి ఆహారము సమర్పించు ప్రక్రియ. కావున దేవునికి ఆహారము సమర్పించు మునుపు, ఆ ఆహారము వండునప్పుడు దాని రుచి చూడటము నిషిద్ధం. ఆహారమును దేవుని మూర్తి ముందు ఉంచి పూజించడం జరుగుతుంది. ఆ పై దానిని పుణ్యఫలంగా ఆరగించవచ్చు.[1]

ఈ పదము సంస్కృతం నుండి వచ్చింది. నైవేద్యము అంటే సరైన అర్థము దేవునికి సమర్పణ అని - ఈ సమర్పణ ఆహారపదార్థమే కానవసరము లేదు. ఈ సమర్పణ భౌతిక వస్తు సంబంధమే అవ్వవలసిన అవసరము లేదు. ఒక మొక్కు, ప్రతిజ్ఞ, ఏదైనా చేయవలను లేక చేయరాదు అన్న నిశ్చితాభిప్రాయము మున్నగునవన్నీ కూడా నైవేద్యముగా భావించవచ్చు. అయితే నైవేద్యానికి, ప్రసాదానికి ఉన్న తేడా తెలుసుకోవడం అవసరం. వాడుకలో రెండూ సమానార్థంలో ఉపయోగించినప్పటికీ, ప్రసాదమంటే దేవుని దగ్గర లభ్యమయ్యేదిగా అర్థం.

ఇవి కూడా చూడండి[మార్చు]

మూలాలు[మార్చు]

  1. "నైవేద్య విశిష్టత, పద్ధతి ఎలాగో మీకు తెలుసా?". TeluguOne Devotional (in english). 2021-04-05. Retrieved 2021-04-05.{{cite web}}: CS1 maint: unrecognized language (link)

బాహ్య లంకెలు[మార్చు]

"https://te.wikipedia.org/w/index.php?title=నైవేద్యం&oldid=4010819" నుండి వెలికితీశారు