పత్తిగింజల నూనె
పత్తిగింజల నూనె పత్తి (Cottonseed oil) గింజల నుండి తీయు నూనె శాకఖాద్యతైలం (vegetable edible oil). పత్తిని ప్రధానంగా దూది (cotton) కై సాగు చెయ్యడం మొదలైనప్పటికి, ప్రస్తుతం పత్తిగింజల నూనెకు కూడ ప్రాధాన్యం పెరిగినది.
విషయ సూచిక |
పత్తి మొక్క [మార్చు]
పత్తిమొక్క మాల్వేసి కుటుంబం,గాస్పియం ప్రజాతికి చెందినది. గాస్పియంలో చాలాజాతులున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో ఒకమిలియన్ హెక్టారులలో పత్తిసాగు అవుచున్నది.ప్రపంచదేశాల పత్తిదిగుబడితో పోల్చిన ఇండియలో తక్కువదిగుబడి వచ్చుచున్నది. విదేశాలలో హెక్టారుకు 3 టన్నుల పత్తిదిగుబడి వుండగా, ఇండియాలో 1.5-2.0 టన్నుల పత్తిదిగుబడి వున్నది.పత్తిలో 35-45% దూది వుండగా, విత్తనం 55-64-5% వరకు వుండును. పత్తికి చేడపీడల,క్రిమి,కీటాకాలదాడి ఎక్కువ,అందుచే మిగతా పైరుల కన్న రసాయనిక క్రిమిసంహరకమందుల వాడకం చాలాఎక్కువ.ఈ రసాయనిక క్రిమి సంహరక మందులను మోతాదుకు మించి ఎక్కువగా వాడటం వలన, మందుల విషఅవశేషాలు పత్తిగింజలోని పోషక పదార్థాలలో, నూనెలో పెరిగే ప్రమాదమున్నది.
పత్తిగింజ [మార్చు]
పత్తినుండి దూదిని, గింజలను జిన్నింగ్ మిల్లులో వేరుచెయ్యుదురు. పత్తినుండి దూదిని వేరుచేసిన తరువాత కూడా విత్తనంపై సన్నని నూగు పదార్థం వుండును. దీనిని 'లింటర్స్', అంటారు. డిలింటింగ్ మెషిన్ ద్వారా ఈ లింటరును తొలగించెదరు. ఈ లింటరుకు కూడా మార్కెటింగ్ వున్నది. విత్తనం నల్లని, గట్టి పెంకును (hull) కల్గి లోపల మొత్తటి పసుపు వర్ణంలో వున్న గింక/పిక్కను కల్గివుండును. విత్తనంలో 5% వరకు లింటరు, 40-45% వరకు పెంకును కల్గివుండును. విత్తనం అండాకారంగా వుండి, 7-9 మి.మీ. పొడవు,3-5 మి.మీ. వెడల్పు వుండును. మొత్తం విత్తనంలో నయినచో 20-25% వరకు నూనె వుండును. పెంకు తొలగించిన గింజ/పిక్కలో 40-45% వరకు నూనె వుండును. విత్తనం నుండి నూనెను పై పెంకును తొలగించి (decorticated), లేదా ఆలాగే మొత్తం విత్తనాన్ని (non decorticated) మిల్లులో ఆడించి నూనె తీయుదురు. మొత్తం విత్తనంను మిల్లింగ్ చేసిన 13-15% వరకు నూనె వచ్చును, 6-8% వరకు నూనె ఆయిల్‌కేకులో వుండిపోవును. పెంకు తొలగించిన గింజలను ఆడించిన 35-45% వరకు నూనె దిగుబడి వచ్చును. మొత్తం విత్తనంను మిల్లింగ్ చేయగా వచ్చిన కేకులో ప్రొటీన్ శాతం 20-22% వుండగా, పెంకు తొలగించిన గింజల నుండి వచ్చు కేకులో ప్రోటిన్ శాతం 35-40% వుండును.
నూనెను సంగ్రహించుట [మార్చు]
పత్తి/ప్రత్తి గింజలనుండి నూనెను సాధారణంగా ఎక్సుపెల్లరులనబడె స్క్రూప్రెస్సునుపయోగించి తీయుదురు. ఎక్స్పెల్లరుకు విత్తనాన్నిపంపె ముందు స్టీమ్్‌ద్వారా కెటిల్‌లో కుకింగ్ చేసి, పంపెదరు. ఎక్స్‌పెల్లరు నుంది వచ్చు కేకు 2-4 మి.మీ మందంతో, 10-12 సెం.మీ. పరిమాణంలో వుండును. కేకులోమిగిలివున్న నూనెను సాల్వెంట్ ప్లాంట్ ద్వారా తీయు
నూనె [మార్చు]
పత్తిగింజల నుండి తీసిన నూనె నేరుగా వంటనూనెగా పనికిరాదు. రిపైనరిలో రిపైండ్ చేసిన తరువాత మాత్రమే ఖాద్యతైలంగా పనిచేయును. ఎక్స్‌పెల్లరుల ద్వారా వచ్చిన నూనె నలుపు, నీలపు ఛాయ వున్న పచ్చరంగులో వుండును. నూనెలో ఫ్రీఫ్యాటి ఆమ్లాల శాతం3-6% వరకు వుండును. మలినాలు, గమ్స్, గొసిపొల్ అధిక మొత్తంలో వుండును. వీటన్నింటిని తొలగించాలి. నూనెలోని గమ్స్, ఫ్రీఫ్యాటి ఆసిడులను, గొసిపొల్‌ను కెమికల్ రిపైనింగ్ పద్ధతిలో కాస్టిక్ నుపయోగించి తొలగించెదరు. నూనెలోని ఫ్రీఫ్యాటి ఆసిడులు కాస్టిక్‌తో కలసి సబ్బుగా మారి వేరు పడును. ఇలా ఏర్పడిన సబ్బును తొలగించిన నూనెకు బ్లిచింగ్ ఎర్తును (బ్లిచింగ్ పౌడరు కాదు) కలిపి, బ్లిచరులో ప్రాసెస్ చేసి నూనె రంగును తగ్గించెదరు. తుదిదశలో ఫ్రిఫ్యాటి ఆసిడులు, మలినాలు తొలగింపబడి, రంగు తగ్గింపబడిన నూనెను డి్‌ఒడరైజరుకు పంపి, నూనెను నిర్గంధికరించెదరు. రిపైండు చేసిన నూనె వర్ణరహితంగా లేదా లేతపసుపు వర్ణంలో వుండును. పత్తిగింజల నూనెలోని ఫ్యాటి ఆమ్లాల సమ్మేశనం మరియు శాతం, భౌతిక ధర్మాలు, వేరుశనగ నూనె, పొద్దుతిరుగుడు నూనెల రెండికి మధ్యస్తంగా వుండును. కొన్నిసార్లు పత్తిగింజల నూనెను ఈ రెండు నూనెలలో కల్తి చెయ్యడంకూడా జరుగుతున్నది.
పత్తిగింజలనూనె బౌతికలక్షనాలు
| భౌతిక గుణాలు | మితి |
| సాంద్రత | 0.915-0.921 |
| వక్రీభవన సూచిక(400C) | 1.463-1.466 |
| ఐయోడిన్ విలువ | 109-120 |
| సపొనిఫికెసన్ విలువ | 190-198 |
| స్మోక్ పాయింట్ | 2320C |
| అన్‌సపొనిఫియబుల్‌పదార్థం | 1.5%max |
ఫ్యాటి ఆమ్లాల శాతం
| కొవ్వు ఆమ్లాలు | కార్బనుల సంఖ్య:బంధాలు | శాతం |
| మిరిస్టిక్ ఆసిడ్ | C14:0 | 0.5-2.0 |
| పామిటిక్ ఆసిడ్ | C16:0 | 17-29 |
| పామిటొలిక్ ఆసిడ్ | C16:1 | <1.5 |
| స్టియరిక్ ఆసిడ్ | C18:0 | 1.04.0 |
| ఒలిక్ ఆసిడ్ | C18:1 | 13-44 |
| లినొలిక్ ఆసిడ్ | C18:2 | 40-60 |
| లినొలెనిక్ ఆసిడ్ | C18:3 | 0.1-2.0 |
- ఐయోడిన్‌విలువ:ప్రయోగశాలలో 100 గ్రాములనూనెచే శోషింపబడిన(గ్రహింపబడిన)ఐయోడిన్ గ్రాముల సంఖ్య.ప్రయోగసమయంలో నూనెలోని,ఫ్యాటి ఆమ్లంల ద్విబంధంవున్న కార్బనులతో ఐయోడిన్ సంయోగం చెంది,ద్విబంధాలను తొలగించును.ఐయోడిన్‌విలువ నూనెలోని అసంతృప్త కొవ్వుఆమ్లంల వునికిని తెలుపును.నూనె ఐయోడిన్‌విలువ పెరుగు కొలది,నూనెలోని అసంతృప్త కొవ్వుఆమ్లంల శాతం పెరుగును.
- సపొనిఫికెసన్‌విలువ:ఒక గ్రాము నూనెలో వున్న కొవ్వుఆమ్లాలన్నింటిని సబ్బుగా(సపొనిఫికెసను)మార్చుటకు అవసరమగు పొటాషియం హైడ్రాక్సైడు,మి.గ్రాములలో.
- అన్‌సపొనిఫియబుల్ మేటరు: నూనెలో వుండియు,పోటాషియంహైడ్రాక్సైడ్‌తో చర్యచెందని పదార్థములు.ఇవి అలిఫాటిక్‌ఆల్కహల్‌లు,స్టెరొలులు(sterols),వర్ణకారకములు(pigments),హైడ్రోకార్బనులు,మరియు రెసినస్(resinous)పదార్థములు.
నూనె ఉపయోగాలు [మార్చు]
- రిపైండ్ ఆయిల్‌ను వంటనూనెగా వాడెదరు.
- మర్గరిన్‌ల తయారిలో వాడెదరు. మార్గరిన్ లనగా 12-15%, నీటిని,80% వరకు వనస్పతిని,రిపైండ్‌నూనెలనుకలిపి మరికొన్నిఉత్పేరకాలను కలిపి వెన్నను పోలి వుండేలా చెసినది. మార్గరినులను విస్తారంగా బేకరిలో కేకులు, తినిబండారాలల తయారిలో వినియోగిస్తారు.
- వనస్పతి తయారిలోకూడా వినియోగిస్తారు.
ఇవికూడా చూడండి [మార్చు]
|
|||||