పదము (సంగీతం)

వికీపీడియా నుండి
(పదము(సంగీతం) నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
భారతీయ సంగీతం
వ్యాసముల క్రమము
సాంప్రదాయక సంగీతం

కర్ణాటక సంగీతము  · హిందుస్థానీ సంగీతము
భారత ఫోక్ సంగీతం  · తుమ్రి · దాద్రా · గజల్ · ఖవ్వాలీ
చైతీ · కజ్రీ · సూఫీ

ఆధునిక సంగీతము

భాంగ్రా · చలన చిత్ర సంగీతము
పాప్ సంగీతం · రాక్ సంగీతం · బ్లూస్ సంగీతం
 · జజ్ సంగీతం · ట్రాన్స్ సంగీతం

వాగ్గేయకారులు, సంగీత విద్వాంసులు

హిందుస్థానీ సంగీత విద్వాంసులు
కర్ణాటక సంగీత విద్వాంసులు

గాయకులు

హిందుస్థానీ సంగీత గాయకులు
హిందుస్థానీ సంగీత గాయకులు

సంగీత వాద్యాలు

సంగీత వాద్యపరికరాల జాబితా
సంగీత వాయిద్యాలు

భావనలు

రాగము · తాళము · పల్లవి
తాళదశ ప్రాణములు
షడంగములు · స్థాయి · స్వరము
గీతము · కృతి · వర్ణము
రాగమాలిక · పదము · జావళి · తిల్లాన
మేళకర్త రాగాలు · కటపయాది సంఖ్య
జానపదము

సంగీత ధ్వనులు

స్థాయి · తీవ్రత · నాదగుణము
ప్రతిధ్వని · అనునాదము
సహాయక కంపనము
గ్రామఫోను · రేడియో

సంగీత పద నిఘంటువు

సంగీత పదాల పర్యాయ పదములు

భారతీయ సంగీతము
భారతీయ సాంప్రదాయ సంగీతము
కర్ణాటక సంగీతము

పదము అను పదము భక్తి కీర్తనలకు ఉపయోగింపబడుచున్నది. దాసర పదగళు అని పురందరదాసుల వారి జ్ఞానపాటలకు పేరు రాయలసీమలో సామాన్య జనులు "ఒక పదం పాడమ్మా" అనేది అలవాటు. పదము అనగా భక్తికి సంబంధించిన పాట అని అర్థము. కళగాను, శాస్త్రముగాను జనులకు తెలియక పోయినను, మతమును వ్యాపించుటకై దైవ భక్తిని జనుల హృదయంలో పెంపొందింప జేయుటకై అనేక రకములైన పాటలను మన పూర్వులు రచించిరి. వాటిలో కలుపు తీసేవారు "కలుపు పాటలు", దంపుళ్ల వారికి "దంపుడు పాటలు", జోలపాట, మొదలగునవి ఉన్నాయి. చాల వరకు జానపదములు నాయకా నాయకీ భాఅములతోనే రచించబడినవి కానీ కొంతవరకు యివన్నియు భక్తి పాటలే. శృంగార రసములోనే దేవుని ధ్యానించుట పూర్వము నుండి మన దేశములో ఉంది. పరమాత్ముడు నాయకుడుగను, జీవాత్మను నాయకిగను రచయిత మనస్సులో పెట్టుకొని ఈ రచనల రచించెను. ఆ శాఖకు చెందినదే ఈ "పదము" ఆను రచన. ఇది సంగీత రచనలో ఒకటి, జానపదములతో కాక శాస్త్ర నిబంధనలలో రచింపబడింది.

లక్షణము[మార్చు]

పల్లవి, అనుపల్లవి, చరణములను అంగములను కలిగి యుండును. ఒక్క చరనమైననూ ఉండవచ్చును. లేదా పెక్కు చరణములను కలిగియూ ఉండవచ్చును. కఠిన సంచారములు గాని ఎక్కువ సంగతులు కాని పకములందుండకూడదు. చాల నెమ్మదిగా పాడదహిన రచన. రాగ భావము ఉట్టిపడు చుండును. సాహిత్యము సామాన్య వాడుక భాషలో రచింపబడి యుండును. చరణములు ఒకే ధాతులో పాడునవిగా నుండును.

సాహిత్యము లోని పదములు ద్వందార్థములు కలవిగా నుండును. కొన్ని పదములు నాయకుడు పాదునవిగానూ, కొన్ని నాయకి పాడునవిగాను, కొన్ని సఖితో నాయకుడో, నాయకీయో పాడినట్లు గాను ఉండును. నాయకానాయకీ భావముతో సాహిత్యము రంజితముగా నుండును.

క్షేత్రజ్ఞుల వారు విజయ రాఘవ నాయకులను తంజావూరు రాజులపై, "విజయ రాఘవ పంచరత్నములు" అను పేర ఐదు పదములను రచించిరి.

తెలుగు పద రచయితలు[మార్చు]

కేత్రజ్ఞ, పెద్ద దాసరి, పరిమళరంగ, సారంగపాణి, కస్తూరిరంగ, ఘనం శీనయ్య, శోభనాద్రివారు, ఘటపల్లివారు, జటపల్లివారు, ఇనుకొండవారు, వీరభద్రయ్య, కవి మాతృ భూతయ్య మొదలగువారు.

తమిళ రచయితలు[మార్చు]

ఘనం కృష్ణయ్యర్, వైదీశ్వరన్, కోయిల్ సుబ్బరామయ్యర్, కవికుంజర భారతి, మాంబళి, కవిరాయర్.

కొన్ని పదములు[మార్చు]

సంఖ్య
పదము
రాగము
తాళము
రచయిత
1. అలిగితే హునేని చాపు క్షేత్రజ్ఞ
2. మంచిదినము ఆనందభైరవి త్రిపుట క్షేత్రజ్ఞ
3. ఏమందునమ్మా కేదారగౌళము త్రిపుట క్షేత్రజ్ఞ
4. ఏరీతి గౌళిపంతు చాపు క్షేత్రజ్ఞ
5. దండనిట్టేన్ యన్రు తోడి ఆది వైదీశ్వరన్ కోయిల్ సుబ్బరామయ్యర్
6. చల్ల నాయెను శంకరాభరణము ఆది క్షేత్రజ్ఞ
7. ఎవడే శంకరాభరణం చాపు క్షేత్రజ్ఞ
8. ఏరీతి బొంకేవు గౌళిపంతు చాపు తాళ్ళ పాకం వారు
9. ఇందెందు సురటి త్రిపుట కస్తూరిరంగ
10. మగవాడని దర్బారు ఆది మన్నారురంగ

యివి కూడా చూడండి[మార్చు]

సూచికలు[మార్చు]

యితర లింకులు[మార్చు]