పది ఆజ్ఞలు
వికీపీడియా నుండి
|
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. |
[మార్చు] పరిశుద్ధ బైబిలులో చెప్పబడిన పది ఆజ్ఞలు
బైబిల్ లోని నిర్గమ కాండము 20:2-17,ద్వితీయోపదేశ కాండము 5:6--21 లలో దేవుడు మోషేకు రాతి పలకలపై ఈ పది ఆజ్ఞలను చెక్కి ఇచ్చాడని ఉంది.ఈ ఆజ్ఞల గురించి “నీ దేవుడనైన యెహోవాయను నేను రోషముగల దేవుడను. నన్ను ద్వేషించు వారి విషయంలో మూడు నాలుగు తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీద రప్పించుచు, నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గైకొను వారిని వెయ్యితరముల వరకు కరుణించు వాడనై ఉన్నాను” అని తెలియ జేశాడు..
- "నీ దేవుడైన యెహోవాను నేనే. నేను తప్ప వేరొక దేవుడు నీకుండకూడదు"
- " పైన ఆకాశమందేగాని క్రింది భూమియందేగాని భూమిక్రింద నీళ్ళయందేగాని యుండు దేని రూపమునయినను విగ్రహమునయినను నీవు చేసికొనకూడదు; వాటికి సాగిలపడకూడదు వాటిని పూజింపకూడదు."
- "నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థముగా నుచ్చరింప కూడదు."
- "విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపకముంచుకొనుము."
- "నీవు దీర్ఘాయుష్మంతుడవగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము"
- "నరహత్య చేయకూడదు"
- "వ్యభిచరింపకూడదు"
- "దొంగిలంపకూడదు"
- "నీ పొరుగు వాని మీద అబద్ధ సాక్ష్యము పలుకకూడదు"
- "నీ పొరుగువాని ఇల్లు ఆశింప కూడదు. నీ పొరుగువాని భార్యనైనను అతని దాసునైనను అతని దాసినైనను అతని ఎద్దునైనను అతని గాడిదనైనను నీ పొరుగువానిదగు దేనినైనను ఆశింప కూడదు."