పనస

వికీపీడియా నుండి
పనస
చెట్టుకు వేలాడుతున్న పనస పండ్లు.
చెట్టుకు వేలాడుతున్న పనస పండ్లు.
శాస్త్రీయ వర్గీకరణ
సామ్రాజ్యము: ప్లాంటే
విభాగము: మాగ్నోలియోఫైటా
తరగతి: Magnoliopsida
వర్గము: Rosales
కుటుంబము: మోరేసి
ప్రజాతి: ఆర్టోకార్పస్
జాతి: ఆ. హెటిరోఫిల్లస్
ద్వినామము
ఆర్టోకార్పస్ హెటిరోఫిల్లస్
Lam.

పనస (ఆంగ్లం Jackfruit) ఒక పండ్ల చెట్టు. పనస మల్బరీ కుటుంబానికి చెందిన చెట్టు. తూర్పు ఆసియా దీని జన్మస్థలం. ప్రపంచంలోనే అతి పెద్ద పండును ఇచ్చే చెట్టు ఇదే. దాదాపు ఒక్కోటి 36 కేజీలుంటుంది. 90 సెంటీమీటర్ల పొడవు, 50 సెంటీమీటర్ల వ్యాసం కలిగి ఉంటాయి. పనసపండును కోసేప్పుడు చాకుకు, చేతులకు నూనె రాసుకోవడం వల్ల దాని జిగురు చేతులకు అంటదు.

విషయ సూచిక

[మార్చు] ఔషధ విలువలు

పనసలో విటమిన్లు, ఖనిజాలు ఎక్కువగా ఉండడం వల్ల మంచి ఆరోగ్యాన్నిస్తుంది. దానిలోని యాంటీఆక్సిడెంట్లు, ఫైటోన్యూట్రియెంట్స్‌ క్యాన్సర్‌ వ్యాధిని నిరోధిస్తాయి. అజీర్తి, అల్సర్లను కూడా నయం చేస్తుంది. పొటాషియం మెండుగా లభించడం వల్ల అది రక్తపోటును తగ్గిస్తుంది. పనస ఆకులు, మొక్క జొన్న, కొబ్బరి చిప్పలను కాల్చి చేసిన పొడి పుండ్లను నయం చేయడానికి ఉపయోగిస్తారు. పనస ఆకులను వేడి చేసి గాయాల మీద పెట్టుకుంటే త్వరగా ఉపశమనం లభిస్తుంది. చర్మవ్యాధులు, ఆస్తమా, జ్వరం, డయేరియా నివారణకు పనస వేర్లు ఉపయోగపడతాయి. అధిక బరువును, టెన్షన్‌ను, మలబద్ధకాన్ని తగ్గిస్తుంది.

[మార్చు] రకాలు

భారతదేశంలో రెండు రకాల పనసను పండిస్తారు. ఒకటి కూజా చక్క. దీనిలో చిన్న చిన్న తొనలుంటాయి. అవి చాలా తియ్యగా, పీచుగా ఉంటాయి. అవి మృదువుగా ఉండడం వల్ల అందులోని తొనలను వలవడానికి చాకు వంటి పరికరాల అవసరం లేదు. వీటిని బార్కా, బెర్కా అని కూడా అంటారు. రెండవది కూజా పాజమ్‌. ఇవి వాణిజ్య పరంగా ముఖ్యమైనవి. వీటిలో తొనలు పెళుసుగా ఉంటాయి. వీటిని వలవడానికి చాకును తప్పకుండా ఉపయోగించాలి. వీటిని కప, కపియా అని అంటారు.పనస కాయలు పండిన తరువాత త్వరగా పాడవుతాయి. అయితే వీటిని 11 నుండి 13 డిగ్రీల ఉష్ణోగ్రత దగ్గర నిల్వ ఉంచితే 3 నుండి 6 వారాల వరకు ఉంటాయి. పచ్చివాటిని ముక్కలుగా కోసి బాగా ఎండబెడతారు. వాటిని డబ్బాల్లో వేసుకుని సంవత్సరమంతా ఉపయోగించుకుంటారు.

వాతావరణాన్ని బట్టి ఒక్కో ప్రాంతంలో ఒక్కో సమయంలో పక్వానికి వస్తాయి. కొన్ని చోట్ల మార్చి నుండి జూన్‌ మధ్యలో, మరి కొన్ని చోట్ల ఏప్రిల్‌ నుండి సెప్టెంబర్‌ మధ్యలో, ఇంకొన్ని చోట్ల జూన్‌ నుండి ఆగస్టు మధ్యలో అవి కాస్తాయి. వెస్ట్‌ ఇండీస్‌లో జూన్‌లోనూ, ఫ్లోరిడాలో వేసవి చివరిలోనూ వస్తాయి.

పనసకాయ పైతొక్క తీసి లోపలి భాగాన్ని చిన్న చిన్న ముక్కలుగా కోసి కూర చేస్తారు. దీన్ని పనస పొట్టు కూర అంటారు.నేపాల్‌, బంగ్లాదేశ్‌, శ్రీలంక, ఇండోనేషియా, కంబోడియా, వియత్నాం దేశాలవారు పనసను వంటల్లో విరివిగా వాడతారు. కొందరు దీన్ని ప్రధానమైన వంటగా చేసుకుంటారు

[మార్చు] లక్షణాలు

  • ఒక సతతహరిత వృక్షం.
  • కాండంపై అమరిన కంకి పుష్పవిన్యాసాల్లో ఉన్న తెలుపు రంగు పుష్పాలు.
  • సంయుక్త సోరోసిస్ ఫలం.

[మార్చు] ఉపయోగాలు

పనస పండే కాదు ఆ చెట్టులోని అన్ని భాగాలూ మనకు ఉపయోగపడేవే. పనస కలపతో మృదంగం, కంజీర వంటి సంగీత పరికరాలను తయారు చేస్తారు. ఫర్నిచర్‌, తలుపులు, కిటికీలు వంటి గృహోపకరణాల తయారీలోనూ ఉపయోగిస్తారు. ఫిలిప్పైన్స్‌లో కుతియాపి అనే పడవ భాగాలను కూడా తయారు చేస్తారు. పనస ఆకులను, పండ్లను పశువులకు మేతగా వేస్తారు. మనదేశంలో పనసాకులను వంటల్లో ఉపయోగిస్తారు. వీటిని ఇస్తరాకులుగా కూడా ఉపయోగిస్తారు. పనస జిగురును పింగాణి పాత్రలకు, బకెట్‌లకు పడిన చిల్లులను మూయడానికి ఉపయోగిస్తారు. దీన్ని వార్నిష్‌లలో కూడా ఉపయోగిస్తారు. పనస చెట్టు వేర్లను చెక్కి ఫొటో ఫ్రేములు తయారు చేస్తారు. కొన్ని ఉత్సవాల్లో ఎండిన పనస కొమ్మలను రాకుతూ నిప్పును పుట్టిస్తారు. బౌద్ధ సన్యాసుల దుస్తులకు పనస బెరడుతో తయారు చేసిన డై వేస్తారు.

[మార్చు] పోషక విలువలు

"http://te.wikipedia.org/w/index.php?title=%E0%B0%AA%E0%B0%A8%E0%B0%B8&oldid=700519" నుండి వెలికితీశారు
వ్యక్తిగత పరికరాలు
నేంస్పేసులు

వైవిధ్యాలు
పేజీకి సంభందించిన లింకులు
చర్యలు
మార్గదర్శకము
పరస్పరక్రియ
పరికరాల పెట్టె
ఇతర భాషలు