పరమహంస యోగానంద

వికీపీడియా నుండి
పరమహంస యోగానంద
Paramhansa-Yogananda.png
జననం: జనవరి 5 1893(1893-01-05)
జన్మస్థలం: గోరఖ్‌పూర్, ఉత్తరప్రదేశ్
అసలు పెట్టిన పేరు: ముకుంద్ లాల్ ఘోష్
మరణం: మార్చి 7 1952 (వయసు: 59)
మరణ స్థలం: లాస్‌ఏంజిలస్, కాలిఫోర్నియా, అమెరికా
గురువు: యుక్తేశ్వర్ గిరి
యోగానంద గారి తల్లి.

పరమహంస యోగానంద (జ: జనవరి 5, 1893 — మ: మార్చి 7, 1952) బెంగాల్ కు చెందిన ఒక యోగి. ఆయన జన్మనామం ముకుంద లాల్ ఘోష్. ఆయన రాసిన ఒక యోగి ఆత్మకథ అనే ఆధ్యాత్మిక రచన అనేక ప్రతులు అమ్ముడై సంచలనం సృష్టించింది.

యోగానంద, ఉత్తరప్రదేశ్ లోని గోరఖ్‌పూర్ లో ఒక సాంప్రదాయ బెంగాలీ కుటుంబంలో జన్మించాడు. [1] ఆయన తమ్ముడు సనందుడి మాటలను బట్టి యోగానంద చిన్నవయసు నుంచే ఆధ్యాత్మికతలో వయసుకు మించిన ఆసక్తిని, పరిణతిని కనబరిచేవాడు. [2] యవ్వనంలో ఉండగా ఆయన తన ఆధ్యాత్మిక తృష్ణను తీర్చుకోవడానికి ఎంతో మంది భారతీయ సన్యాసులను కలిశాడు.[3] చివరకు ఆయనకు 17 ఏళ్ళ వయసులో, 1910 సంవత్సరంలో యుక్తేశ్వర్ గిరిని తన గురువుగా కనుగొనడం జరిగింది. ఆయన గురువుతో కలిసిన మొట్టమొదటి కలయిక జన్మజన్మలకీ గుర్తుండిపోతుందని తన ఆత్మకథలో రాసుకున్నాడు.

కలకత్తాలోని స్కాటిష్ చర్చి కళాశాల నుండి ఆర్ట్స్ లో ఇంటర్మీడియట్ పరీక్షలో ఉత్తీర్ణుడై 1915, జూన్ లో కలకత్తా విశ్వవిద్యాలయానికి అనుబంధ కళాశాల అయిన సీరాంపూర్ కళాశాలనుండి ఇప్పటి బి.ఏ డిగ్రీకి సమానమైన డిగ్రీని పొందాడు. అప్పట్లో దాన్ని ఏ.బి డిగ్రీగా వ్యవహరించేవారు. అక్కడ చదివే రోజుల్లో యోగానంద సీరాంపూర్ లోని యుక్తేశ్వర ఆశ్రమంలో సమయాన్ని గడిపేవాడు. 1956లో సన్యాస ఆశ్రమ ధర్మాన్ని స్వీకరించి స్వామి యోగానంద గిరి అయ్యాడు.[4] 1917లో యోగానంద పశ్చిమ బెంగాల్లోని దిహికాలో ఒక బాలుర పాఠశాల స్థాపించాడు. ఈ పాఠశాలలోఆధునిక విద్యాబోధన పద్ధతులతో పాటు యోగాభ్యాసము మరియు ఆధ్యాత్మిక చింతనను కూడా విద్యార్ధులకు బోధించేవారు. ఆ మరుసటి సంవత్సరం పాఠశాలను రాంచీకి తరలించారు.[5] ఈ పాఠశాలే ఆ తర్వాత కాలంలో భారత యోగద సత్సంగ సమాజంగా రూపుదిద్దుకొన్నది. ఇది యోగానంద యొక్క అమెరికా సంస్థకు భారతీయ శాఖ. క్రియాయోగాన్ని బోధించడం వారు చేసిన పని.

[మార్చు] మూలాలు

  1. Ghosh, p. 3
  2. Ghosh, p. 23
  3. Yogananda, p. 59
  4. Yogananda, p. 217
  5. Yogananda, p. 240
వ్యక్తిగత పరికరాలు
నేంస్పేసులు

వైవిధ్యాలు
పేజీకి సంభందించిన లింకులు
చర్యలు
మార్గదర్శకము
పరస్పరక్రియ
పరికరాల పెట్టె
ఇతర భాషలు