పరావర్తనం
వికీపీడియా నుండి
ఒక కాంతి కిరణ పుంజం రెండు యానకాలను వేరు చేసే తలంపై పతనమైనపుడు, కొంతభాగం తిరిగి మొదటి యానకానికి ప్రసారమవుతుంది. దానినే కాంతి పరావర్తనం అందురు. అధిక భాగంలో పరావర్తనం చెందించే తలములను పరావర్తన తలములు అందురు.సమతల దర్పణంలో కాంతి పరావర్తనం చెందడం ద్వారా ప్రతిబింబం ఏర్పడుతుంది.
విషయ సూచిక |
పరావర్తనం- రకములు [మార్చు]
- క్రమ పరావర్తనం
- అక్రమ పరావర్తనం
క్రమ పరావర్తనం [మార్చు]
కాంతి కిరణాలు మెరుగు పెట్టబడిన నున్నని క్రమ తలాలపై పడినపుడు క్రమ పరావర్తనం జరుగుతుంది.
అక్రమ పరావర్తనం [మార్చు]
కాంతి, గరుకైన, మెరుగులేని, క్రమరహిత తలాలపై పడినపుడు అక్రమ పరావర్తనం జరుగుతుంది.