పర్షియన్ భాష
వికీపీడియా నుండి
పర్షియన్ (ఆంగ్లం :Persian) فارسی నాటి పర్షియా దేశం, నేటి ఇరాన్ దేశములో మాట్లాడేభాష. దీనికి పారసీ, పార్శీ, ఫార్శీ అనేపేర్లుగూడా గలవు. ఇది ఇండో-యూరోపియన్ భాష కు చెందిన శాఖ అయిన ఇండో-ఇరానియన్ భాష. ఈ భాష మాట్లాడే దేశాలు ఇరాన్, ఆఫ్ఘనిస్తాన్, మరియు తజకిస్తాన్ మరియు ఈ దేశాలలో అధికారిక భాష.
భారత దేశంలోని అనేక షియా మతస్తులు, జొరాస్ట్రియన్ మతస్తులు మాట్లాడే భాష. మన రాష్ట్రంలో హైదరాబాదు నగరంలో అనేకులు ఈ భాషను మాట్లాడేవారున్నారు. మన దేశంలో మరియు మన రాష్ట్రంలోని అనేక విశ్వవిద్యాలయాలలో ఈ భాషా విభాగమూ గలదు.
ప్రఖ్యాత ఫార్శీ కవులు షేఖ్ సాదీ, మౌలానా రూమీ, ఒమర్ ఖయ్యాం, మిర్జా గాలిబ్, ఇక్బాల్ మొదలగువారు.
ఇవీ చూడండి [మార్చు]
- ఆదిభట్ల నారాయణదాసు : ఒమర్ ఖయ్యాం రుబాయీ లను తెలుగులో అనువదించడానికి పర్షియన్ భాష నేర్చుకుని పాండిత్యం సంపాదించి, తర్జుమాలు చేపట్టిన ఘనుడు.
- ఉర్దూ సాహిత్యం
మూలాలు [మార్చు]
- ↑ 2006 CIA Factbook: Iran 38.210 M (58%), Afghanistan 16.369 M (50%), Tajikistan 5.770 M (80%), Uzbekistan 1.2 M (4.4%)
- ↑ http://www.vistawide.com/languages/top_30_languages.htm