ఇరాన్
| جمهوری اسلامی ايران జమ్‌హూరియె ఇస్లామీయె ఇరాన్ ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్
|
||||||
|---|---|---|---|---|---|---|
|
|
||||||
| నినాదం పర్షియన్: ఇస్తెఖ్‌లాల్, ఆజాది, జమ్హూరియ-ఎ- ఇస్లామీ (తెలుగు భాష: "స్వతంత్రం, స్వేచ్ఛ, ఇస్లామీయ గణతంత్రం") |
||||||
| జాతీయగీతం సొరూద్-ఎ-మిల్లి-ఎ-ఇరాన్ |
||||||
| రాజధాని (మరియు అతిపెద్ద నగరం) |
టెహరాన్ |
|||||
| అధికార భాషలు | పర్షియన్ | |||||
| ప్రభుత్వం | ఇస్లామిక్ రిపబ్లిక్ | |||||
| - | ప్రధాన లీడరు | అలీ ఖుమైనీ | ||||
| - | అధ్యక్షుడు | మహ్‌మూద్ అహ్మద్ నెజాద్ | ||||
| ఇరానియన్ విప్లవం | రాజరికం పరిసమాప్తి | |||||
| - | ప్రకటితం | ఫిబ్రవరి 11, 1979 | ||||
| విస్తీర్ణం | ||||||
| - | మొత్తం | 1,648,195 కి.మీ² (17వ) 636,372 చ.మై |
||||
| - | జలాలు (%) | 0.7% | ||||
| జనాభా | ||||||
| - | 2005 అంచనా | 68,467,413 [1] (18వ) | ||||
| - | 1996 జన గణన | 60,055,488 [2] | ||||
| - | జన సాంద్రత | 41 /కి.మీ² (128వది) 106 /చ.మై |
||||
| జీడీపీ (PPP) | 2005 అంచనా | |||||
| - | మొత్తం | $561,600,000,000 (19వది) | ||||
| - | తలసరి | $8,065 (74వది) | ||||
| మా.సూ (హెచ్.డి.ఐ) (2006) | 0.736 (medium) (99వది) | |||||
| కరెన్సీ | ఇరానియన్ రియాల్ (ريال) (IRR) |
|||||
| కాలాంశం | (UTC+3.30) | |||||
| - | వేసవి (DST) | గుర్తించలేదు (UTC+3.30) | ||||
| ఇంటర్నెట్ డొమైన్ కోడ్ | .ir | |||||
| కాలింగ్ కోడ్ | +98 | |||||
ఇరాన్ (పురాతన నామం = పర్షియా) (పర్షియన్: ایران) నైఋతి ఆసియాలోని ఒక మధ్యప్రాచ్య దేశము. 1935 దాకా ఈ దేశము పాశ్చాత్య ప్రపంచములో పర్షియా అని పిలవబడేది.1959లో మహమ్మద్ రెజా షా పహ్లవి ఉభయ పదములు ఉపయోగించవచ్చని ప్రకటించారు.కానీ ప్రస్తుత ఇరాన్ ను ఉద్దేశించి "పర్షియా" పదము వాడుక చాలా అరుదు. ఇరాన్ అను పేరు స్థలి "ఆర్యన్" అర్థం "ఆర్య భూమి".
ఇరాన్ కు వాయువ్యాన అజర్బైజాన్ (500 కి.మీ) మరియు ఆర్మేనియా (35 కి.మీ), ఉత్తరాన కాస్పియన్ సముద్రము, ఈశాన్యాన తుర్కమేనిస్తాన్ (1000 కి.మీ), తూర్పున పాకిస్తాన్ (909 కి.మీ) మరియు ఆఫ్ఘనిస్తాన్ (936 కి.మీ), పశ్చిమాన టర్కీ (500 కి.మీ) మరియు ఇరాక్ (1458 కి.మీ), దక్షిణాన పర్షియన్ గల్ఫ్ మరియు ఒమాన్ గల్ఫ్ లతో సరిహద్దు కలదు. 1979లో, అయాతొల్లా ఖొమేని ఆధ్వర్యములో జరిగిన ఇస్లామిక్ విప్లవం పర్యవసానముగా ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్ (جمهوری اسلامی ایران) గా అవతరించినది.
విషయ సూచిక |
చరిత్ర[మార్చు]
ఇరాన్ యొక్క జాతీయత పర్షియా నుండి ఉద్భవించినది. పర్షియా అన్నపదము నేటి ఇరాన్, తజికిస్తాన్, టర్కీ, ఆఫ్ఘానిస్తాన్, కాకసస్ ప్రాంతాలకు ఉన్న ప్రాచీన గ్రీకు పేరు పర్సిస్ నుండి వచ్చినది. క్రీ.పూ 6వ శతాబ్దములో ఈ ప్రాంతాలన్నీ ఆకెమెనిడ్ వంశము యొక్క పాలనలో గ్రీస్ నుండి వాయువ్య భారతదేశము వరకు విస్తరించిన మహాసామ్రాజ్యములో భాగముగా ఉన్నవి. అలెగ్జాండర్ మూడు ప్రయత్నాల తర్వాత ఈ సామ్రాజ్యాన్ని జయించగలిగాడు. అయితే పర్షియా వెనువెంటనే పార్థియన్ మరియు సస్సనిద్ సామ్రాజ్యాల రూపములో స్వతంత్ర్యమైనది. అయితే ఈ మహా సామ్రాజ్యాలను 7వ శతాబ్దములో ఇస్లాం అరబ్బీ సేనల చేత చిక్కినచి. ఆ తరువాత సెల్జుక్ తుర్కులు, మంగోలులు మరియు తైమర్‌లేను ఈ ప్రాంతాన్ని జయించారు.
16వ శతాబ్దములో సఫవిదులు పాలనలో తిరిగి స్వాతంత్ర్యమును పొందినది. ఆ తరువాత కాలములో ఇరాన్ను షాహ్ లు పరిపాలించారు. 19వ శతాబ్దంలో పర్షియా, రష్యా మరియు యునైటెడ్ కింగ్ డం నుండి వత్తిడి ఎదుర్కొన్నది. ఈ దశలో దేశ ఆధునీకరణ ప్రారంభమై 20వ శతాబ్దములోకి కొనసాగినది. మార్పు కోసము పరితపించిన ఇరాన్ ప్రజల భావాల అనుగుణంగా 1905/1911 పర్షియన్ రాజ్యాంగ విప్లవం జరిగినది.
సంస్కృతి[మార్చు]
ఇరానీ సంస్కృతి ప్రపంచం లోని ప్రాచీన సంస్కృతుల్లో ఒకటి.అసలు 'ఇరాన్' అనే పదం 'ఆయిర్యాన' అను పదం నుండి ఉధ్భవంచింది.ఇరానీయుల సంప్రాదాయల కు,భారతీయ సంప్రదాయలకు దగ్గరి పోలిక ఉంది.వారు అగ్ని ఉపాసకులు.వారు కూడ ఉపనయనాన్ని పోలిన ఒక ఆచారాన్ని పాటిస్తారు.దీనిని బట్టి వారి పూర్వికులు కూడా ఆర్యులే నని పలువురు చరిత్రకారుల అభిప్రాయం.
అన్నీ ప్రాచీన నాగరికతల వలెనే, పర్షియన్ నాగరికతకు కూడా సంస్కృతే కేంద్ర బిందువు. ఈ నేల యొక్క కళ, సంగీతం, శిల్పం, కవిత్వం, తత్వం, సాంప్రదాయం మరియు ఆదర్శాలే ప్రపంచ విఫణీలో ఇరానియన్లకు గర్వకారణము. ఇరానీ ప్రజలు తమ నాగరికత ఆటుపోట్లను తట్టుకొని వేల సంవత్సరాల పాటు మనుగడ సాగించడానికి దాని యొక్క సాంస్కృతే ఏకైక ప్రధాన కారణమని భావిస్తారు.
ఇరాన్ కేబినెట్‌లో మహిళలు[మార్చు]
- దాదాపు మూడు దశాబ్దాల తర్వాత తొలిసారిగా ఇరాన్ కేబినెట్‌లో మహిళలకు చోటు లభించింది. దేశాధ్యక్షుడిగా వరుసగా రెండోసారి బాధ్యతలు చేపట్టిన అహ్మదీ నెజాద్ కేబినెట్‌లో గైనకాలజిస్టు మర్‌జిహే వహిద్ దస్త్‌జెర్ది(50), శాసనకర్త ఫాతిమే అజోర్లు(40) మహిళలు.1970ల తర్వాత ఇరాన్ కేబినెట్‌లో స్త్రీలకు చోటు దక్కడం ఇదే ప్రథమం. 1968-77 మధ్య ఫరోఖ్రో పార్సే చివరి మహిళా మంత్రిగా పనిచేశారు. 1979లో ఇస్లామిక్ విప్లవం అనంతరం అవినీతి ఆరోపణలపై ఆమెను పాలకులు ఉరితీశారు.ఈనాడు 17.8.2009
అధికారిక ప్రభుత్వ లింకులు[మార్చు]
- Official site of the Supreme Leader, (Qom office)
- Presidency of the Islamic Republic of Iran - Official website.
- The Council of Guardians, Official website.
- The Majlis, Iran's parliament. (2).
- Ministry of Foreign Affairs
సూచికలు[మార్చు]
- ↑ Statistical Centre, Government of Iran. ""Selected Statistical Information"". Retrieved 2006-04-14.
- ↑ Statistical Centre, Government of Iran. ""Population by Religion and Ostan, 1375 Census (1996 CE)"". Retrieved 2006-04-14.
బయటి లింకులు[మార్చు]
- News and Economy Portal
- Encyclopaedia Iranica
- Iranian Cultural & Information Center at Stanford University, California
- Iran Travel and Tourism Guide
- CIA World Factbook - Iran
- The Dismal Reality of Ahlus Sunnah in Iran
- Iran, The Persian Gulf - Iran in the Persian Gulf
- ప్రపంచంలో ఇరాన్ హైకమీషన్, ఎంబసీ, కాన్సులేట్ (రాయబార కార్యాలయా) ల జాబితా Iranian High Commissions, embassies and consulates
|
|
||
|---|---|---|
|
ఆఫ్ఘనిస్తాన్ · ఆర్మేనియా · అజెర్బైజాన్1 · బహ్రయిన్ · బంగ్లాదేశ్ · భూటాన్ · బ్రూనై · కంబోడియా · చైనా · తూర్పు తైమూర్ · సైప్రస్1 · జార్జియా1 · భారత దేశము · ఇండొనేషియా · ఇరాన్ · ఇరాక్ · ఇస్రాయెల్ · జపాన్ · జోర్డాన్ · కజకస్తాన్1 · దక్షిణ కొరియా · ఉత్తర కొరియా · కువైట్ · కిర్గిజిస్తాన్ · లావోస్ · లెబనాన్ · మలేషియా · మాల్దీవులు · మంగోలియా · మయన్మార్ · నేపాల్ · ఒమన్ · పాకిస్తాన్ · ఫిలిప్పీన్స్ · కతర్ · రష్యా1 · సౌదీఅరేబియా · సింగపూర్ · శ్రీలంక · సిరియా · తజికిస్తాన్ · తైవాన్ · థాయిలాండ్ · టర్కీ1 · టుర్క్మెనిస్తాన్ · యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ · ఉజ్బెకిస్తాన్ · వియత్నాం · యెమెన్1 1 ఐరోపా, ఆసియా - రెండు ఖండాలలోనూ విస్తరించిన దేశం. |
||
|
||||||||||||||||||
|
|
|
|---|---|
| అల్జీరియా · అర్జెంటీనా · బ్రెజిల్ · చిలీ · ఈజిప్టు భారత దేశము · ఇండోనేషియా · ఇరాన్ · జమైకా · కెన్యా మలేషియా · మెక్సికో · నైజీరియా · సెనెగల్ · శ్రీలంక · వెనుజులా · జింబాబ్వే |