పానగల్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

పానగల్, తెలంగాణ రాష్ట్రం, వనపర్తి జిల్లా, పాన్‌గల్‌ మండలానికి చెందిన గ్రామం.[1]

పానగల్ పరిసరదృశ్యం

ఇది సమీప పట్టణమైన వనపర్తి నుండి 15 కి. మీ. దూరంలో ఉంది. 2016 అక్టోబరు 11 న చేసిన తెలంగాణ జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ గ్రామం పాత మహబూబ్ నగర్ జిల్లా లోని ఇదే మండలంలో ఉండేది. [2]

గణాంకాలు[మార్చు]

2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 1106 ఇళ్లతో, 5174 జనాభాతో 2320 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 2673, ఆడవారి సంఖ్య 2501. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 726 కాగా షెడ్యూల్డ్ తెగల సంఖ్య 26. గ్రామం యొక్క జనగణన లొకేషన్ కోడ్ 576174[3].పిన్ కోడ్: 509120. ఎస్.టి.డి.కోడ్:08545.

చరిత్ర, ఇతర విషయాలు[మార్చు]

1830లో ఈ కోటని కాశీయాత్రలో భాగంగా సందర్శించిన యాత్రాచరిత్రకారుడు ఏనుగుల వీరాస్వామయ్య తన కాశీయాత్రచరిత్రలో పానగల్ కోటను గూర్చి వ్రాశారు. పానగల్ కొండ కింద, కొండ మీద విశాలమైన దుర్గం ఉందని వ్రాశారు. ఆ గ్రామం బస్తీ కాకున్నా ఇంగ్లీషు లష్కర్‌కి సరంజామా చేసి వాడుక పడింది. కనుక యాత్రికులకు అవసరమైన వస్తువులు దొరుకుతున్నాయని వ్రాశారు.[4] పానగల్ గ్రామంలో ఉన్న కొండ చాలా పెద్దగా విస్తరించి ఉంటుంది. కొండని అనుకొని ఉన్న ఒక చాల ఏళ్ళుగా ఉన్న ఒక దర్గా ఉంది. (బార్హా షరిఫ్) పానగల్ గ్రామానికి చాలా పురాతనపు కథ ఒకటి ప్రచారంలో ఉంది. బాలా నాగమ్మను మాయల పకీర్ అపహరించి ఈ గ్రామంలో ఉన్న కొండపై ఉంచి దాచినట్టు ఇక్కడి ప్రజలు చెబుతూ ఉంటారు. పానగల్ గ్రామానికి ఆనుకొని బండపల్లి గ్రామం ఉంది.ఇక్కడ కొండ ప్రాంతం కాబట్టి, వేరుసెనగలు ఎక్కువగా పండిస్తారు.కొల్లాపూర్ కి వెళ్ళే మార్గంలో ఉంది కాబట్టి బస్సు సౌకార్యం ఉంది.

విద్యా సౌకర్యాలు[మార్చు]

గ్రామంలో ఒక ప్రైవేటు బాలబడి ఉంది. ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు నాలుగు, ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలు రెండు, ప్రభుత్వ మాధ్యమిక పాఠశాల ఒకటి ఉన్నాయి. ఒక ప్రభుత్వ జూనియర్ కళాశాల ఉంది.సమీప ప్రభుత్వ ఆర్ట్స్ / సైన్స్ డిగ్రీ కళాశాల, ఇంజనీరింగ్ కళాశాల వనపర్తిలో ఉన్నాయి. సమీప వైద్య కళాశాల మహబూబ్ నగర్లోను, పాలీటెక్నిక్‌ వనపర్తిలోను, మేనేజిమెంటు కళాశాల కొండేర్లోనూ ఉన్నాయి. సమీప వృత్తి విద్యా శిక్షణ పాఠశాల పెబ్బేరులోను, అనియత విద్యా కేంద్రం, దివ్యాంగుల ప్రత్యేక పాఠశాల‌లు మహబూబ్ నగర్లోనూ ఉన్నాయి.

వైద్య సౌకర్యం[మార్చు]

ప్రభుత్వ వైద్య సౌకర్యం[మార్చు]

పానగల్లో ఉన్న ఒకప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఒక డాక్టరు, ముగ్గురు పారామెడికల్ సిబ్బందీ ఉన్నారు. ఒక ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రంలో డాక్టర్లు లేరు. ఇద్దరు పారామెడికల్ సిబ్బంది ఉన్నారు. ఒక పశు వైద్యశాలలో ఒక డాక్టరు, ఒకరు పారామెడికల్ సిబ్బందీ ఉన్నారు. ఒక సంచార వైద్య శాలలో డాక్టర్లు లేరు. ముగ్గురు పారామెడికల్ సిబ్బంది ఉన్నారు. సమీప సామాజిక ఆరోగ్య కేంద్రం, మాతా శిశు సంరక్షణ కేంద్రం, టి. బి వైద్యశాల గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి. అలోపతి ఆసుపత్రి, ప్రత్యామ్నాయ ఔషధ ఆసుపత్రి, డిస్పెన్సరీ, కుటుంబ సంక్షేమ కేంద్రం గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి.

ప్రైవేటు వైద్య సౌకర్యం[మార్చు]

గ్రామంలో5 ప్రైవేటు వైద్య సౌకర్యాలున్నాయి. డిగ్రీ లేని డాక్టర్లు ఐదుగురు ఉన్నారు.

తాగు నీరు[మార్చు]

గ్రామంలో కుళాయిల ద్వారా శుద్ధి చేయని నీరు సరఫరా అవుతోంది. బోరుబావుల ద్వారా కూడా ఏడాది పొడుగునా నీరు అందుతుంది.

పారిశుధ్యం[మార్చు]

మురుగునీరు బహిరంగ కాలువల ద్వారా ప్రవహిస్తుంది. మురుగునీరు బహిరంగంగా, కచ్చా కాలువల ద్వారా ప్రవహిస్తుంది. మురుగునీటిని నేరుగా జలవనరుల్లోకి వదులుతున్నారు. గ్రామంలో సంపూర్ణ పారిశుధ్య పథకం అమలవుతోంది. సామాజిక మరుగుదొడ్డి సౌకర్యం లేదు. ఇంటింటికీ తిరిగి వ్యర్థాలను సేకరించే వ్యవస్థ లేదు. సామాజిక బయోగ్యాస్ ఉత్పాదక వ్యవస్థ లేదు. చెత్తను వీధుల పక్కనే పారబోస్తారు.

సమాచార, రవాణా సౌకర్యాలు[మార్చు]

పానగల్లో సబ్ పోస్టాఫీసు సౌకర్యం ఉంది. పోస్టాఫీసు సౌకర్యం గ్రామానికి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది. పోస్ట్ అండ్ టెలిగ్రాఫ్ ఆఫీసు గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది. లాండ్ లైన్ టెలిఫోన్, పబ్లిక్ ఫోన్ ఆఫీసు, మొబైల్ ఫోన్ మొదలైన సౌకర్యాలు ఉన్నాయి. ఇంటర్నెట్ కెఫె / సామాన్య సేవా కేంద్రం, ప్రైవేటు కొరియర్ గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉన్నాయి.గ్రామానికి సమీప ప్రాంతాల నుండి ప్రభుత్వ రవాణా సంస్థ బస్సులు తిరుగుతున్నాయి. సమీప గ్రామాల నుండి ఆటో సౌకర్యం కూడా ఉంది. వ్యవసాయం కొరకు వాడేందుకు గ్రామంలో ట్రాక్టర్లున్నాయి. ప్రైవేటు బస్సు సౌకర్యం, రైల్వే స్టేషన్ మొదలైనవి గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉన్నాయి.

జిల్లా రహదారి గ్రామం గుండా పోతోంది. జాతీయ రహదారి, రాష్ట్ర రహదారి, ప్రధాన జిల్లా రహదారి గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉన్నాయి. గ్రామంలో తారు రోడ్లు, కంకర రోడ్లు, మట్టిరోడ్లూ ఉన్నాయి.

మార్కెటింగు, బ్యాంకింగు[మార్చు]

గ్రామంలో ఏటీఎమ్, వాణిజ్య బ్యాంకు, సహకార బ్యాంకు ఉన్నాయి. గ్రామంలో స్వయం సహాయక బృందం, పౌర సరఫరాల కేంద్రం, వారం వారం సంత, వ్యవసాయ మార్కెటింగ్ సొసైటీ ఉన్నాయి.

వ్యవసాయ పరపతి సంఘం గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది.

ఆరోగ్యం, పోషణ, వినోద సౌకర్యాలు[మార్చు]

గ్రామంలో సమీకృత బాలల అభివృద్ధి పథకం, అంగన్ వాడీ కేంద్రం, ఇతర పోషకాహార కేంద్రాలు, ఆశా కార్యకర్త ఉన్నాయి. గ్రామంలో గ్రంథాలయం, పబ్లిక్ రీడింగ్ రూం ఉన్నాయి. గ్రామంలో వార్తాపత్రిక పంపిణీ జరుగుతుంది. అసెంబ్లీ పోలింగ్ కేంద్రం, జనన మరణాల నమోదు కార్యాలయం ఉన్నాయి. ఆటల మైదానం గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది. సినిమా హాలు గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది.

విద్యుత్తు[మార్చు]

గ్రామంలో గృహావసరాల నిమిత్తం విద్యుత్ సరఫరా వ్యవస్థ ఉంది. రోజుకు 7 గంటల పాటు వ్యవసాయానికి, 10 గంటల పాటు వాణిజ్య అవసరాల కోసం కూడా విద్యుత్ సరఫరా చేస్తున్నారు.

భూమి వినియోగం[మార్చు]

పానగల్లో భూ వినియోగం కింది విధంగా ఉంది:

  • అడవి: 416 హెక్టార్లు
  • వ్యవసాయేతర వినియోగంలో ఉన్న భూమి: 53 హెక్టార్లు
  • వ్యవసాయం సాగని, బంజరు భూమి: 591 హెక్టార్లు
  • సాగులో లేని భూముల్లో బీడు భూములు కానివి: 337 హెక్టార్లు
  • బంజరు భూమి: 220 హెక్టార్లు
  • నికరంగా విత్తిన భూమి: 700 హెక్టార్లు
  • నీటి సౌకర్యం లేని భూమి: 1038 హెక్టార్లు
  • వివిధ వనరుల నుండి సాగునీరు లభిస్తున్న భూమి: 220 హెక్టార్లు

నీటిపారుదల సౌకర్యాలు[మార్చు]

పానగల్లో వ్యవసాయానికి నీటి సరఫరా కింది వనరుల ద్వారా జరుగుతోంది.

  • బావులు/బోరు బావులు: 220 హెక్టార్లు

ఉత్పత్తి[మార్చు]

పానగల్లో ఈ కింది వస్తువులు ఉత్పత్తి అవుతున్నాయి.

ప్రధాన పంటలు[మార్చు]

వరి, జొన్న

పాన్‌గల్ ఖిల్లా[మార్చు]

ప్రధాన వ్యాసం: పాన్‌గల్ ఖిల్లా

పాన్‌గల్ వనపర్తి జిల్లాలో కొలువైన ఈ ఖిల్లా పేరువినగానే గుర్తుకొచ్చేవి గట్లు. దానిమీదుగా నిత్యం ప్రయాణించే బాటసారులకు అదో సాధారణ గుట్ట మాత్రమే! అందుకే దాని ప్రాశస్థ్యం, ప్రాముఖ్యం ఆ చుట్టుపక్కలవాళ్లక్కూడా తెలియదు! ఆ గట్ల వెనకాలే ఉన్న బాలపీర్లను దర్శించుకునే ప్రజలు సైతం... ఈ ఖిల్లాను దర్శించుకున్న దాఖలాల్లేవ్!ఇది కొంచెం ఆశ్చర్యమే! కళ్లముందు కనిపిస్తూనే కడుపులో బోలెడంత చారిత్రాత్మక రహస్యాన్ని దాచుకున్న బర్లగట్టు ఉరఫ్ ఖిల్లాగట్టు ఉరఫ్ పాన్‌గల్ గట్టు గుట్టువిప్పే కథనం ఇది....

చుట్టూ నాలుగు పెద్ద దుర్గాలు... ఆ దుర్గాల మధ్య మైదానం.. నవాబులు నివసించడానికి ఏర్పాటు చేసుకున్న కోటలు... ఇక్కడ విస్తరించిన పచ్చిక, పెద్దపెద్ద చెట్లు, గుట్టలు, కాలుష్యం లేకుండా వీచే చల్లని గాలి సందర్శకులను ఆహ్లాద పరుస్తాయి. గుట్టపైకి ఎక్కి చూస్తే నలుదిక్కులా ఊర్లు అగుపిస్తాయి. పాములా పాకిపోతున్నట్లు రహదారుల ఆకారం గోచరిస్తుంది. గుండాల్లోని చల్లనినీరు దాహార్తిని తీర్చడమే కాదు స్వస్థతనూ చేకూరుస్తుంది. కారణం అందులో వనకమూలికలుండడం! కాళ్లకు కాసింత పనిచెప్పి తీర్థయాత్ర పూర్తి చేసి ఇక్కడికి వస్తే మనసు కుదుటపడుతుందనే అనుభూతి కలుగుతుంది.

చారివూతక సంపద ఒకప్పుడు ఇక్కడ యుద్ధాలు జరిగాయి అనడానికి ఆధారాలుగా పెద్దపెద్ద ఫిరంగులున్నాయి... శిల్పసంపద... పూజించుకునేందుకు దేవుళ్లు... శిథిలావస్థలో ఉన్న ఉయ్యాల, కోటలు... ఇవన్నీ గతవైభవ దీప్తులే! మిగిలిన చారిత్రాత్మక సంపదలే! చనిపోయిన వారిని ఖననం చేసిన శ్మశానం కూడా నేటికీ చెక్కుచెదరకుండా ఉంది. చనిపోయిన వారిని వరుసగా ఖననం చేసినట్లు ఇక్కడున్న ఆనవాళ్లను చూస్తే అర్థమవుతుంది. ముండ్లగవిని అనే ప్రధానద్వారం ఈనాటికీ దర్జాగా నిలబడి ఉంది. ఈ కట్టడానికి పెద్దపెద్ద బండరాళ్లనుపయోగించారు. దీని గోడలపై సింహం, గజ, లత శిల్పాకృతులున్నాయి! ఇలాంటి అమూల్యమైన సంపదనంతా తన గర్భంలో దాచుకున్న ఈ ఖిల్లా సముద్రమట్టానికి 1800 అడుగుల ఎత్తులో, ఐదు చదరపు కిలోమీటర్ల పరిధిలో విస్తరించి ఉంది!శిలా శాసనాలు ఈ ఖిల్లాపై తెలుగు, కన్నడ, కొంత ఉర్దూ లిపిలో ఓ శిలా శాసనం లభ్యమైంది. అయితే ఇది శిథిలమై చదవడానికి అనువుగా లేదు. ఆ శాసనంపై ఉన్న ఆధారాలతో అది భైరాన్‌ఖాన్ మూడో శాసనమని మాత్రం అవగతమవుతున్నది. దీన్ని చిన్నమంత్రి అనే రచయిత చెక్కినట్లు తెలుస్తున్నది. ‘‘స్వస్తీశ్రీ జయభ్యుదయ శాలివాహన వర్షంబులు 1540 అగుననేడి చాంద్రమాన రౌద్రినామ మహామండలేశ్వర సుల్తాన్ మహ్మద్ కులీ కుతుబ్‌షా వారి సుబేదారుడు భైరాన్‌ఖాన్ ముక్తి పానుగంటి బాలల్లా మీద బురుజు కట్టించి ఈ సుభాకొండలోని కుమ్మరివీధిలో నడ బావిని తవ్వించి రాతి కట్టడంతోపాటు సున్నపుగచ్చు వేయించి ఆ చంద్రార్కరము నిలుచునట్లు ప్రతిష్ఠ చేసె’నని ఆ శాసన సారాంశం.ఇక్కడి శిల్పాలపై ఏనుగు, నెమళ్ల చిత్రాలు చెక్కి ఉన్నాయి. సా.శ. 1604లో రాజమాత నివసించేందుకు వీలుగా భవంతిని నిర్మించినట్లు తెలుస్తున్నది. 1786లో నైజాం వంశీయులైన నిజాంఆలీఖాన్ బహదూర్ కోటలో కొంత కాలం నివసించినట్లు తెలుస్తున్నది. అలంపూర్,జటవూపోలు, నందివడ్డెమాన్, కోయిలకొండ, ఖిల్లా ఘనపురం కేంద్రాలుగా పాలన జరిగినప్పుడు ఇక్కడ నవాబులు కూడా వైభవంగా పాలించారు.రామగుండం.ఖిల్లాలో పడమటి దిశగా ఒక పుష్కరిణి ఉన్నది. దాన్ని రామగుండం అంటారు. ఇప్పటికీ ఆ పుష్కరిణిలో నీటిమట్టం ఎప్పుడూ ఒకే స్థాయిలో ఉంటుంది. ఆ పక్కన ఓ చిన్నగుడిలో సీతమ్మ, రాముల వారి పాదాలను చెక్కారు. ఈ ఖిల్లాలో సీతమ్మ గుండం కూడా ఉన్నది. ఇక్కడ కూడా నీటిమట్టం ఎప్పటికీ ఒకేలా ఉంటుంది. ప్రతి సంవత్సరం ఆషాడశుద్ధ ఏకాదశినాడు చుట్టు పక్కల గ్రామాల ప్రజలు వచ్చి రామగుండంలో స్నానాలు ఆచరించి సీతమ్మ పాదాలకు మొక్కులు చెల్లించుకుంటారు.యుద్ధాలుఇక్కడ రెండు సార్లు యుద్ధాలు జరిగినట్లు చారివూతక ఆధారాలు చెప్తున్నాయి. 13వ శతాబ్దంలో బహమనీ సుల్తాన్, కులీకుతుబ్‌షా విజయనగర సేనలను ఓడించారని పలువురు చెబుతారు. మరోసారి సా.శ. 1417లో గోల్కొండ పరిపాలకుడు ఫిరోజ్‌షా ఓడిపోయినట్లు ‘ఆంధ్ర విజ్ఞాన సర్వస్వం’ అనే గ్రంథంలో ఉంది. ఇక్కడ ఉన్న పది బురుజులపై ఫిరంగులు ఏర్పాటు చేయగా కొన్ని శిథిలం అయ్యాయి. ప్రస్తుతం నాలుగు ఫిరంగులు మాత్రమే కనిపిస్తాయి. ఈ ఖిల్లాపై లభించిన చిన్న ఫిరంగులను నాగర్‌కర్నూలు, గోపాల్‌పేట, వనపర్తి, పాన్‌గల్ పోలీస్‌స్టేషన్లలో ఉంచారు.గుప్తనిధుల కోసం తవ్వకాలు రాజుల పాలనలో దాచి ఉంచిన నగలు, బంగారం, వజ్రాలు దొరుకుతాయనే అత్యాశతో ఖిల్లాపై ఉన్న కట్టడాలను కొందరు నిరంతరం తవ్వుతూనే ఉన్నారు. దీంతో శిల్పాలు, విలువైన కట్టడాలు శిథిలమయ్యాయి. పడమటి వైపున ఓ ఫిరంగిని అలాగే కిందికి తోసేసినట్లు కనిపిస్తున్నది. చుట్టుపక్కల పండే వేరుశనగపై దాడి చేసే పందులు, ఎలుగుబంట్లు ఇక్కడ ఆవాసం ఏర్పర్చుకున్న గుర్తులు ఉన్నాయి. ఆ మధ్య కాలంలో పేరెన్నికగన్న పాన్‌గల్ మియ్యాసావ్ తన దోపిడీకి ఈ ఖిల్లానే వేదికగా చేసుకున్నాడు. పరిరక్షిస్తే.. పాన్‌గల్ ఖిల్లాపై ఉన్న చారివూతక సంపదను పరిరక్షించి, పచ్చదనాన్ని కాపాడి, పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేసే అవకాశం ఉంది. కాని 1997లో అప్పటి జిల్లా కలెక్టర్ పి. కృష్ణయ్య చేసిన ప్రయత్నం ఫలించలేదు. పురావస్తు, పర్యాటక, అటవీ శాఖలు ఈ ఖిల్లాపై దృష్టి నిలిపినట్లు కనిపించదు. ప్రభుత్వం నిధులు కేటాయించి ఈ గట్టును అభివృద్ధి చేస్తే బాగుంటుందనే భావన స్థానికుల్లో బలంగా ఉంది.

వెళ్లొచ్చు ఇలా... మహబూబ్‌నగర్‌కు 80 కిలోమీటర్ల దూరంలో, వనపర్తి, కొల్లాపూర్ దారిలో ఈ పాన్‌గల్ ఖిల్లా ఉంది. ఇక్కడికి వెళ్లడానికి ఆర్టీసీ బస్సు సౌకర్యం ఉంది. పాన్‌గల్‌లోని ప్రతి ఇంటి నుంచి కూడా ఈ ఖిల్లా కనిపిస్తుంది. తగిన ఏర్పాట్లతో పైకి ఎక్కాల్సి ఉంటుంది. తెలిసిన వారు వెంటరావడం తప్పనిసరి. ఇక్కడ సంచరించే అడవి జంతువుల పట్ల జాగ్రత్త వహించాలి.

బార్హా షరిఫ్ దర్గా[మార్చు]

ఈ దర్గాకు ఒక ప్రత్యేకత ఉంది. సాయంత్రం వేళలో, అక్కడ ఎవరూ ఉండటానికి సాహసించరు. రాత్రి సమయంలో అక్కడికి ఒక సింహం వచ్చి దర్గాను శుభ్రం చేస్తుంది.అ సమయంలో అక్కడ ఎవరు ఉన్నా రక్తం కక్కుకుని చనిపోతారు, అని ఇక్కడి ప్రజలు నమ్ముతారు.

మూలాలు[మార్చు]

  1. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వులు GO. Ms. No. 242, Revenue (DA-CMRF) Department, Date: 11.10.2016  
  2. "వనపర్తి జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-01-06. Retrieved 2021-01-06. {{cite web}}: |archive-date= / |archive-url= timestamp mismatch; 2022-01-06 suggested (help)
  3. "Office of the Registrar General & Census Commissioner, India - Village amenities of 2011".
  4. వీరాస్వామయ్య, యేనుగుల (1941). కాశీయాత్రా చరిత్ర (PDF) (మూడవ ముద్రణ ed.). విజయవాడ: దిగవల్లి వెంకట శివరావు. Retrieved 26 November 2014.

వెలుపలి లింకులు[మార్చు]

"https://te.wikipedia.org/w/index.php?title=పానగల్&oldid=3675900" నుండి వెలికితీశారు