Coordinates: 13°03′14″N 80°16′36″E / 13.05395°N 80.27675°E / 13.05395; 80.27675

పార్థసారథి దేవాలయం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
Venkatakrishna Parthasarathy Temple
Venkatakrishna Parthasarathy Temple is located in Tamil Nadu
Venkatakrishna Parthasarathy Temple
Venkatakrishna Parthasarathy Temple
Location in Tamil Nadu
భౌగోళికాంశాలు :13°03′14″N 80°16′36″E / 13.05395°N 80.27675°E / 13.05395; 80.27675
పేరు
ఇతర పేర్లు:Sri Parthasarathy Perumal
ప్రధాన పేరు :Parathasarathy Swamy Thirukoil
సంస్కృతం:Brindaranya Kshetram
తమిళం:Thiruallikeni Thiru Parthasarathy Kovil
ప్రదేశం
దేశం:India
రాష్ట్రం:Tamil Nadu
ప్రదేశం:Triplicane, Chennai
ఆలయ వివరాలు
ప్రధాన దైవం:Sri Venkatakrishnan (a) Parthasarathy
ప్రధాన దేవత:Sri Rukimini Thaayar
ఉత్సవ దైవం:Sri Parthasarathy Perumal
ఉత్సవ దేవత:Sri Sreedevi, Sri Bhoodevi Nachiyar, Sri Andal
దిశ, స్థానం:Nindra Thirukolam(Standing), Facing East
పుష్కరిణి:Kairaveni Saras
విమానం:5 Nilaya Vimanam (Anantha, Pranava, Pushpaka, Sesha, Thaivagai) Vimanam
కవులు:Peyyazhwar (1), Thirumangai Azahwar (10), Thirumazhisai Azhwar (1)
ప్రత్యక్షం:Rukmini Pirati, Anirudhan, Pradhyuman, Balaraman, Brughu Maharishi, Madhuman, Saptha Rishi's, Thondaiman King, Sri Vyasar,Athreya Maharishi, King Sumathi
ముఖ్య_ఉత్సవాలు:Panguni Serthi, Pallava Utsavam, Ramanujar Utsavam, Vaikunda Ekadashi, Every Friday Sri Vedavalli Thayar Purappadu
నిర్మాణ శైలి, సంస్కృతి
వాస్తు శిల్ప శైలి :Dravidian architecture
ఇతిహాసం
నిర్మాణ తేదీ:8th century AD[1][2]
సృష్టికర్త:Pallavas[1]
చెన్నైలోని పార్థసారథి దేవాలయ గోపురం

చెన్నైలోని పార్థ సారథి దేవాలయం ప్రసిద్ధ వైష్ణవ దేవాలయాలలో ఒకటి. ఈ దేవాలయం చెన్నై నగరం ట్రిప్లికేను (తిరువల్లిక్కేణి) లో ఉంది. ఈ ఆలయాన్ని 108 వైష్ణవ దివ్య క్షేత్రాలలో ఒకటిగా చెబుతారు. ఈ దేవాలయం ఎనిమిదవ శతాబ్దానికి చెందినది చరిత్రకారుల అంచనా. సంస్కృత భాషలో పార్థసారథి అంటే పార్థుడు = అర్జునుడు యొక్క సారథి = రథాన్ని నడిపినవాడు అని అర్థం అంటే శ్రీ కృష్ణుడు.

స్థల పురాణం[మార్చు]

సుమతి అనే మహారాజుకి ఇచ్చిన మాట ప్రకారం వేంకటేశ్వర స్వామి పార్థసారథిగా ఇక్కడ వెలసినాడని అంటారు. ఈ పార్థసారథి విగ్రహాన్ని ఆత్రేయ మహర్షి ప్రతిష్ఠించాడని చెబుతారు. ఇంకో కథ ప్రకారం శ్రీ రామానుజాచార్యుల తల్లిదండ్రులు ఇక్కడకు వచ్చి సంతానం కొఱకు స్వామిని వేడుకొనగా రామానుజాచార్యుడు జన్మిస్తాడు. మఱియొక కథ ప్రకారం పార్థసారథి స్వామి ధర్మ సంస్థాపనకు విశిష్టాద్వైతాన్ని ఆవిష్కరించడానికి రామానుజాచార్యులగా జన్మించాడని చెబుతారు. బ్రహ్మాండ పురాణం ప్రకారము ఈ క్షేత్రానికి తిరువల్లిక్కేణి అని పేరు. ఆంగ్లేయులు తిరువల్లిక్కేణిని ట్రిప్లికేన్ అని వ్యవహరించిరి .

మూల విరాట్టు పార్థసారధి విగ్రహ విశిష్టత[మార్చు]

పార్థసారథి మూల విరాట్టు

మహాభారత ఇతిహాస ప్రకారం శ్రీకృష్ణుడు కురుక్షేత్ర సంగ్రామంలో అర్జునుని రథసారథిగా ఉంటాడు. కురుక్షేత్ర సంగ్రామ ప్రారంభంలో అర్జునుడు ఇరువైపుల ఉన్న బంధువు యుద్ధ సంగ్రామంలో మరణిస్తారని తలచి అస్త్రాలను విడిచి పేడుతుంటె కృష్ణుడు భగవద్గీతను బోధించి అర్జునుణ్ణి యుద్ధానికి సమాయత్తం చేస్తాడు. కురుక్షేత్రంలో పాల్గొన్న ఆనవాళ్ళను తెలియజేస్తూ ఇక్కడి మూల విరాట్టుకు కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. భీష్ముడు విడిచిన అస్త్రాలు, బాణాలు శ్రీకృష్ణుడికి కూడా తగలడం వల్ల స్వామి ముఖంపై కొన్ని మచ్చలు ఉంటాయి. సాధారణానికి భిన్నంగా స్వామికి మీసాలు ఉంటాయి. కురుక్షేత్ర సంగ్రామంలో ఆయుధం పట్టనని ప్రతిజ్ఞ చేయడం వల్ల ఈ విగ్రహానికి మహావిష్ణువు ఆయుధమైన సుదర్శన చక్రం ఉండదు. చేతిలో కేవలం శంఖం మాత్రమే ఉంటుంది. పార్థసారథి యాదవుల వంశంలో జన్మించడం వల్ల ఉత్సవ మూర్తిగా ఒక దారుశిల్పం (చెక్క బొమ్మ) మాత్రమే ఉంటుంది. సాధారణంగా ఉత్సవ మూర్తుల విగ్రహాలను పంచలోహాలతో గాని రాతితో గాని తయారు చేస్తారు.

ఆలయ విశేషాలు, అనుబంధ ఆలయాలు[మార్చు]

చెన్నై నగరములోని అత్యంత పురాతనమైన దేవాలయాలలో పార్థసారథి దేవాలయం ఒకటి. ఈ దేవాలయానికి రెండు వేర్వేరు ధ్వజ స్తంభాలు ఉన్నాయి. ఒకటి గర్భగుడికి ఎదురుగా, మరొకటి నరసింహ స్వామి దేవాలయానికి ఎదురుగా ఉన్నాయి. ఆలయ గోపురము, మండపాలు ద్రావిడ ఆలయ నిర్మాణ శైలిలో నిర్మించబడ్డాయి.

ఈ దేవాలయ ప్రాంగణములో ఉన్న అనుబంధ గుళ్ళు

  • వేదవల్లి గుడి
  • రంగనాథ స్వామి గుడి
  • శ్రీరాముని గుడి
  • వరదరాజస్వామి గుడి
  • నరసింహ స్వామి దేవాలయం
  • ఆండాళ్ళమ్మ గుడి
  • అంజనేయ స్వామి దేవాలయం
  • అళ్వార్ల సన్నిధి
  • రామానుజాచార్యుల సన్నిధి
  • భృగు మహర్షి గుడి

తీర్థ ప్రసాదాలు[మార్చు]

సాధారణంగా భక్తులకు చక్కెర పొంగలి లేక పుళిహోర లేక దధ్యోదనము రూపంలో ప్రసాదం అందజేయబడుతుంది.

ఆలయ సంప్రదాయాలు[మార్చు]

ఈ దేవాలయం శ్రీ వైష్ణవులలో తెనకలై శాఖకు చెందిన సంప్రదాయలను మఱియు వైశాసన ఆగమ సంప్రదాయాన్ని పాటిస్తారు.

108 దివ్యక్షేరాలు[మార్చు]

పార్ధసారధి ఆలయం[మార్చు]

వివరణ[మార్చు]

బృందావన క్షేత్రము. పార్థసారథి పెరుమాళ్-రుక్మిణీదేవి తాయార్, బలరామ, సాత్యకి, అనిరుద్ద, ప్రద్యుమ్నులు కొలువై ఉన్నారు. కైరవీణీ పుష్కరిణి-తూర్పు ముఖము-నిలచున్నసేవ-ఆనందవిమానము-అత్రిమహామునికి ఆరాధన-అర్జునునకు ప్రత్యక్షము అచటనే మన్నాధర్. (ఎన్నెయాళుడై యప్పన్;రంగనాథులు) వేదవల్లిత్తాయార్-తూర్పుముఖము-భుజంగశయనము-భృగుమహర్షిచే కన్యాదానము పొందినారు. తెళ్ళి అళగియసింగర్ (నరసింహస్వామి) -పశ్చిమ ముఖము-కూర్చున్నసేవ-జాబాలికి అత్రిమహర్షికి ప్రత్యక్షము.

చక్రవర్తి తిరుమగన్ (శ్రీరామచంద్రులు) సీతాలక్ష్మణ భరత శత్రుఘ్నులు దక్షిణముఖము-శశపదుని కుమారుడగు మధుమానునకు ప్రత్యక్షము


దేవప్పెరుమాళ్ (గజేంద్రవరదన్) -తూర్పుముఖము-గరుడా రూడులు-శేష విమానము-ఇంద్ర అగ్ని సోమ మీన-విష్ణుతీర్థములు. వీనిచే చుట్టబడిన కై రవిణీ సరస్సు. ఆకై రవిణీ తీరమున పార్థసారథి రంగనాథ నరసింహ శ్రీరామచంద్ర గజేంద్రవరదులుగా వేంచేసియున్నారు. మార్కండేయ, అత్రి, సుమతి, మరీచి, భృగు, జాబాలి, సర్పరోములకు ప్రత్యక్షము. పేయాళ్వార్-తిరుమழிశై ఆళ్వార్-తిరుమంగై ఆళ్వార్ కీర్తించింది. ఈ తిరువల్లిక్కేణిలో స్వామి పంచమూర్తులుగా వేంచేసియున్నారు

విశేషాలు[మార్చు]

తమిళములో కలువపువ్వును "అల్లి" అంటారు. కలువపూవులు అధికంగా ఉన్న పుష్కరిణి యగుటచే "తిరు అల్లిక్కేణి" అని ప్రసిద్ధి చెందింది. ఈ క్షేత్రము మైలాపూరునకు సమీపమునందుండుటచే మయిలై తిరువల్లిక్కేణి అని కూడా అంటారు. బృందారణ్యక్షేత్రమని కూడా పేరు ఉంది. తొండమాన్ చక్రవర్తి ప్రార్థనచే తిరుమలై తిరువేంగడముడైయాన్ (శ్రీనివాసుడు) కృష్ణావతారముగా సకుటుంబముగా సేవ వెలసిన ప్రదేశము. అందువలన స్వామి వేంకటేశ్వరుని తిరునామముతో "వేంకటకృష్ణన్" అను తిరునామమేర్పడినది. ఈ దివ్యదేశమున స్వామి రుక్మిణీదేవితోను, బలరాముడు సాత్యకి (సోదరులు) ప్రద్యుమ్నుడు (కుమారుడు) అనిరుద్దుడు (మనుమడు) వీరితో కలసి సకుటుంబముగా కొలువై ఉన్నాడు. ఇట్టి సన్నివేశమును మరియొకచోట దర్శింపలేము. అట్లే శ్రీరంగనాథులు (శయనించిన) చక్రవర్తి తిరుమగన్ (నిలచున్న) గజేంద్రవరదన్ (పయనించుచున్న) అళగియశింగర్ (కూర్చున్న) విధము దర్శించతగినది. (ఒకే దివ్యదేశమున నిన్ఱ, ఇరున్ద, కిడన్ద, నడన్ద తిరుక్కోలములు).

ఇచటనే ఆసూరి కేశవాచార్యులవారు పుత్రకామేష్ఠి చేసి "భగవద్రామానుజులను" పుత్రునిగా పొందిరి.

సాహిత్యం[మార్చు]

శ్లో. శ్రీ మత్కై రవిణీ సరోవర లసత్ బృందావనాఖ్యాయుతే
   వల్లిక్కేణి పురే స్థిత స్సుర దిశా పక్త్రాంబుజో రాజతే|
   రుక్మిణ్యా త్వవిరుద్ద సాత్య బల ప్రద్యుమ్న సేవ్యో త్రిణా
   సంపూజ్యో భువి పార్దసారధి విభు: పార్దాక్షి యుగ్మా తిధి:||
   
   తత్తైవ రంగనాథఖ్యో వేదవల్ల్యా ఫణీంద్రగ:|
   భృగుణా కన్యకాదానం ప్రాపిత స్సుర దిజ్ముఖ||
   తత్తైవ నరసింహాఖ్య: పశ్చిమాభిముఖానస:
   జాబాల్యత్రి మునీంద్రాభ్యాం సేవితో మోక్షదస్తయో::||

   సీతాలక్ష్మణ శత్రుఘ్న భరతై స్తత్ర రాఘవ:
   దక్షిణాభి ముఖస్తిష్ఠన్ మధుముమ్మవి వీక్షిత:||
   గజేంద్ర వరద స్తత్ర సప్తరోమ మునీక్షిత:|
   ప్రాజ్ముఖో గరుడా రూడ శ్శేషాహ్వయ విమానగ:||

   ఇంద్రాగ్ని సోమ మీనాఖ్య విష్ణు తీర్థాతి సుందరే
   శ్రీ మత్కైరవిణీ తీరే రాజంతే పంచమూర్తయ:||
   మార్కండేయాత్రి సుమతి మరీచి భృగు యోగిన:|
   జాబాలి సర్ప రోమణౌ తేపురత్ర పరం తప:||

   పరకాల మహాయోగి భక్తిసార పరిస్తుత:|
   తిరువల్లిక్కేణి నగరే పంచదేవాశ్చ వాసతే ||

పా. విఱ్పెరు విழవుమ్‌ క-నుమ్‌ మల్లుమ్;వేழముమ్‌ పాగనుమ్‌ వీழ;
   శెత్తవన్ న్ఱన్నై పురమెరిశెయ్‌ద; శివనుఱుతుయర్ కళై తేవై;
   పత్‌తలర్ వీయక్కోల్ కైయిల్ కొణ్డు; పార్తన్ఱన్ తేర్‌మున్ నిన్ఱానై
   శిత్‌తవై పణియాల్ ముడితుఱన్దానై; త్తిరివల్లిక్కేణి క్కణ్డేనే.
         తిరుమంగై ఆళ్వార్-పెరియ తిరుమొழி 2-3-1

పండుగలు[మార్చు]

ఉత్సవ విగ్రహం
  • చైత్రై (ఏప్రిల్-మే) అనే తమిళ మాసంలో స్వామి బ్రహ్మోత్సవాలు జరుతాయి.
  • ఆణి (జూన్-జూలై) అనే తమిళ మాసంలో అయగియసింగార్ ఉత్సవాలు జరుగుతాయి.
  • రామానుజాచార్యుల గురించి ప్రత్యేక ఉత్సవాలు ఏప్రిల్- మేలో జరుతాయి.
  • మణవలమ్ముణిగళ్ (అక్టోబరు-నవంబరు) ఆళ్వార్లకు, ఆచార్యులకు ప్రత్యేక ఉత్సవాలు జరుగుతాయి.
  • వైకుంఠ ఏకాదశి, చైత్త్రై మాసం ఇక్కడ ప్రత్యేక విశేషం. ఈ కాలములో భక్తులు అసంఖ్యాకంగా స్వామి దర్శనం చేసుకొంటారు.
  • స్వామి ఉభయ నాంచారులతో ఉత్సవమూర్తిగా ఉరేగింపుగా వెళ్ళేటప్పుడు ఆయన దర్శనం నయనానందం చేస్తుంది.
  • పవిత్ర దినాల్లో ఆలయ మండపాలలో అనేక పురాణ సంబంధిత కథా కాలక్షేపాలు జరుగుతూ ఉంటాయి.

స్వామి పుష్కరిణి[మార్చు]

దేవాలయానికి ఎదురుగా ఉన్న తటాకం లేదా పుష్కరిణిని కైరవిణి (తెలుగులో తెల్లటి మల్లెపూవు) అని పిలుస్తారు. తెల్లని మల్లెపువ్వు భగవంతుడుని అర్చించడానికి అత్యంత పవిత్రమైన పుష్పము. ఈ కైరవిణికి అనుసంధానంగా ఇంద్ర, సోమ, మీనా, అగ్ని, విష్ణు అనే ఐదు తీర్థాలు ఉన్నాయి.

దస్త్రం:Parthasarathy Triplicane.jpg
పార్థ సారథి దేవాలయం

మరికొన్ని విషయాలు[మార్చు]

  • ఈ దేవాలయ జీర్ణోద్ధారణ 2004 సంవత్సరంలో జరిగింది.
  • ఈ ఆలయంలో వేరుశెనగ నూనె మఱియు మిరప కాయలు నిషిద్ధం

చిత్రమాలిక[మార్చు]

ఇవికూడా చూడండి[మార్చు]

వైష్ణవ దివ్యదేశాలు

మూలాలు[మార్చు]

  1. 1.0 1.1 Silas 2007, p. 114
  2. M.N. Ninan 2008, p. 133

బయటి లింకులు[మార్చు]

వికీమీడియా కామన్స్‌లో కి సంబంధించిన మీడియా ఉంది.