పాలగుమ్మి పద్మరాజు

వికీపీడియా నుండి

పాలగుమ్మి పద్మరాజు, ప్రముఖ తెలుగు రచయిత, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత, ప్రపంచ కథానికల పోటీలో రెండో బహుమతి పొందిన గాలివాన కథా రచయిత.హేతువాది .ఎం.ఎన్.రాయ్ భావాల ప్రచారకుడు.

పద్మరాజు జూన్ 24, 1915పశ్చిమ గోదావరి జిల్లా అత్తిలి మండలములోని తిరుపతిపురంలో జన్మించాడు. ఈయన 1939 నుండి 1952 వరకు కాకినాడలోని పీ.ఆర్.ప్రభుత్వ కళాశాలలో సైన్సు లెక్చరర్‌గా పనిచేశాడు.

తన జీవిత కాలములో ఈయన 60 కథలు, ఎనిమిది నవలలు, ముప్పై కవితలు ఇంకా ఎన్నెన్నో నాటికలు మరియు నాటకాలు రచించాడు. ఈయన వ్రాసిన 60 కథలు గాలివాన, పడవ ప్రయాణం, ఎదురుచూసిన ముహూర్తం అనే మూడు సంపుటాలుగా వెలువడ్డాయి. పద్మరాజు 23 యేళ్ళ వయసులో తన మొదటి కథ సుబ్బిని వ్రాశాడు. ఈయన ఎన్నో కథలు వ్రాసినా వాటిలో బాగా పేరుతెచ్చిన కథ గాలివాన. ఈ కథ 1952లో న్యూయార్క్ హెరాల్డ్ ట్రిబ్యూన్ నిర్వహించిన ప్రపంచ కథల పోటీలో రెండవ బహుమతిని గెలుచుకుంది. మొత్తం 23 దేశాల నుండి 59 కథలు ఎంపికయిన ఈ పోటీలో భారత్ నుండి మూడు కథలు ఎంపికయ్యాయి. గాలివాన ప్రపంచములోని అనేక భాషాలలోకి అనువదించబడింది. ఈ విధముగా తెలుగు కథను ప్రపంచ సాహితీ పటములో నిలిపిన ఘనత ఈయనకే దక్కినది. పాలగుమ్మి రచించిన నవలలో బతికిన కాలేజి, నల్లరేగడి, రామరాజ్యానికి రహదారి, రెండో అశోకుడి మూన్నాళ్ళ పాలన ముఖ్యమైనవి.

1954 లో ప్రముఖ తెలుగు సినిమా నిర్మాత బొమ్మిరెడ్డి నరసింహారెడ్డి వాహినీ పతాకము కింద నిర్మించిన బంగారు పాప సినిమాకు మాటలు రాయమని పద్మరాజును కోరాడు. దీనితో మొదలుపెట్టి, పద్మరాజు సినీ రంగములో మూడు దశాబ్దాల పాటు పలు సినిమాలకు కథలు, పాటలు సమకూర్చాడు. ఈయన భక్త శబరి, బంగారు పంజరం వంటి అనేక సినిమాలలో పనిచేశాడు. ఈయన సినిమాలు విమర్శకుల ప్రశంసలు పొందినా వ్యాపారపరంగా విజయవంతము కాలేదు. దర్శకుడిగా బికారి రాముడు అనే చిత్రం తీశారు కానీ చిత్రం విజయవంతం కాలేదు. ఈయన నవల నల్లరేగడి ని 'మన (మా) వూరి కథ 'పేరుతో సినిమా తీశారు (కృష్ణ కథానాయకుడుగా). పడవ ప్రయాణం కథ ను 'స్త్రీ' పేరు తో చిత్రంగా నిర్మించారు (పా.ప. మరణానంతరం). రోహిణి కథానాయిక గా నటించిన చిత్రం వ్యాపార పరంగా విడుదల కాలేదు. ఈయన అనేక దాసరి నారాయణరావు సినిమాలకు ఘోష్టు రైటరుగా పనిచేశాడని వినికిడి.[1]

పద్మరాజు 1983లో మరణించాడు.

[మార్చు] మూలాలు

[మార్చు] బయటి లింకులు

వ్యక్తిగత పరికరాలు
నేంస్పేసులు

వైవిధ్యాలు
పేజీకి సంభందించిన లింకులు
చర్యలు
మార్గదర్శకము
పరస్పరక్రియ
పరికరాల పెట్టె
ఇతర భాషలు