పాల్వంకర్ బాలూ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పాల్వంకర్ బాలూ
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
పాల్వంకర్ బాలూ
పుట్టిన తేదీ(1876-03-19)1876 మార్చి 19
ధర్వాడ్, బొంబాయి ప్రెసిడెన్సీ, బ్రిటిష్ ఇండియా
మరణించిన తేదీ1955 జూలై 4(1955-07-04) (వయసు 79)
బొంబాయి, బొంబాయి రాష్ట్రం, భారతదేశం
బౌలింగుఎడమ చేతి ఆర్థడాక్స్ స్పిన్
పాత్రబౌలర్
బంధువులుపాల్వంకర్ శివరాం (సోదరుడు) , పాల్వంకర్ గణపత్ (సోదరుడు) , పాల్వంకర్ విఠల్ (సోదరుడు)
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
1905–1921హిందూ క్రికెట్ టీం
తొలి ఫస్టు క్లాస్ క్రికెట్8 ఫిబ్రవరి 1906 హిందూ - యూరోపియన్ క్రికెట్ టీం
చివరి ఫస్టు క్లాస్ క్రికెట్8 డిసెంబరు 1920 హిందూ - పార్శీస్ క్రికెట్ టీం
కెరీర్ గణాంకాలు
పోటీ ఫస్టు క్లాస్ క్రికెట్
మ్యాచ్‌లు 33
చేసిన పరుగులు 753
బ్యాటింగు సగటు 13.69
100లు/50లు –/3
అత్యుత్తమ స్కోరు 75
వేసిన బంతులు 6431
వికెట్లు 179
బౌలింగు సగటు 15.21
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 17
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 4
అత్యుత్తమ బౌలింగు 8/103
క్యాచ్‌లు/స్టంపింగులు 12/–
మూలం: ESPNcricinfo, 2009 జనవరి 27

బాబాజి పాల్వంకర్ బాలూ, (ధార్వాడ్, 19 మార్చి 18764 జూలై 1955, బొంబాయి), పాల్వంకర్ బాలూగా సుపరిచితుడైన భారతీయ క్రికెట్ క్రీడాకారుడు. ఇతను ఎడమ చేతివాటం స్పిన్ బౌలర్. బాలూ బంతిని రెండు వైపులా తిప్పగలడు. ఇతను కొద్దిపాటి నేర్పుగల ఆఖరి వరుస బ్యాట్స్‌మన్. బాలూ 1905/06 నుండి 1920/1921 వరకూ మొత్తం 33 ఫస్టుక్లాస్ మ్యాచులు ఆడి 15.21 సగటుతో 179 వికెట్లను సాధించాడు.

బాల్య జీవితం[మార్చు]

పాల్వంకర్ బాలూ బొంబాయి ప్రెసిడెన్సీ లోని ధర్వాడ్ లో చంభర్ కులంలో జన్మించాడు. అతని తండ్రి బ్రిటిష్ ఇండియన్ ఆర్మీలో 112వ ఇన్‌ఫాంట్రీ రెజిమెంట్ కు చెందిన సిపాయి. బాలూ పూణేలో ఉన్న అధికారులు వదిలిపెట్టిన పరికరాలతో క్రికెట్ ఆడాడు. [1]

బాలూకు ముగ్గురు సోదరులు ఉన్నారు. వారు పాల్వంకర్ శివ్రామ్, విఠల్ పాల్వాంకర్, పాల్వాంకర్ గణపత్‌ లు. తరువాత వారు క్రికెట్ ఆటగాళ్ళుగా పేరు తెచ్చుకున్నారు.

క్రికెట్ జీవితం[మార్చు]

అతను పూణేలోని పార్శీల కోసం పిచ్‌ను నిర్వహించే గ్రౌండ్స్‌మన్‌గా పనిచేయడం ప్రారంభించాడు. అప్పుడప్పుడు బ్రిటిష్ పూనా జిమ్‌ఖానాకు చెందిన ఇంగ్లీష్ బ్యాట్స్‌మన్ జె.జి.గ్రిగ్‌కు బౌలింగ్ చేశాడు. ఆ సమయంలో అతను స్పిన్ బౌలింగ్ చేయడం నేర్చుకున్నాడు.

1896 లో అతను బొంబాయికి వెళ్లి పర్మానందస్ జివాండాస్ హిందూ జింఖానాలో ఎంపికయ్యాడు. బొంబాయి క్వాడ్రాంగులర్ టోర్నమెంట్లలో రెండింటినీ ఆడాడు[2].

అతను బాంబే బెరార్, సెంట్రల్ ఇండియన్ రైల్వేలలో ఉద్యోగం పొందాడు. రైల్వే కార్పొరేట్ క్రికెట్ జట్టు కోసం కూడా ఆడాడు.

అతను 1911 లో ఇంగ్లాండ్ పర్యటన కోసం 'మహారాజా ఆఫ్ పాటియాలా' అఖిల భారత జట్టులో ఆడాడు. ఈ పర్యటన విఫలమైంది. కానీ బాలూ అత్యుత్తమ ప్రదర్శన ప్రశంసించబడింది.[3]

"బాలూ కోసం క్రికెట్ కెరీర్‌లో సమానత్వం లేకుండా కుల వివక్షను ఎదుర్కొన్నాడు.. అతను మ్యాచ్‌లలో టీ విరామ సమయంలో అతనికి పెవిలియన్ వెలుపల పునర్వినియోగపడని ప్లేట్‌లో వడ్డించేవారు. అతను చేతులు, ముఖం కడుక్కోవాలని కోరుకుంటే తోటి దళిత పరిచారకుడు అతనికి ఒక మూలలో నీళ్ళు తెచ్చేవాడు, ఒక ప్రత్యేక టేబుల్ వద్ద ఒక ప్రత్యేక ప్లేట్ లో భోజనం తీసుకునేవాడు"[4]

అతను భారత క్రికెట్ చరిత్రలో గొప్ప క్రికెటర్లలో ఒకరిగా పరిగణించబడ్డాడు.[5]

రాజకీయాలు[మార్చు]

  • అతను గాంధేయ భావజాలం నుండి బాగా ప్రభావితమయ్యాడు. హోమ్ రూల్ ను భారతదేశానికి తీసుకురావడానికి పనిచేశాడు.
  • 1910 లలో పాల్వంకర్ బాలూ డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ ను కలసి అతని సన్నిహితుడు అయ్యాడు. ఇద్దరూ ఒకరినొకరు మెచ్చుకుని దళిత సమాజం అభ్యున్నతి కోసం పనిచేశాడు.
  • 1932 లో అణగారిన వర్గాలకు ప్రత్యేక నియోజకవర్గాలు కావాలనే డాక్టర్ అంబేద్కర్ చేసిన డిమాండ్‌ను బలూ వ్యతిరేకించాడు. తరువాత అతను ప్రతిపక్షంగా "రాజా-మూన్జే ఒప్పందం" పై సంతకం చేశాడు. బౌద్ధమతంలోకి మారాలని అంబేద్కర్ తన అభిప్రాయాలను వ్యక్తం చేసినప్పుడు దళితులను ఇతర మతాలుగా మార్చడం 'ఆత్మహత్య' అని ఆయన వ్యాఖ్యానించారు.[6]
  • 1933 లో బాలూ హిందూ మహాసభ నుండి బొంబాయి మునిసిపాలిటీ నియోజకవర్గంలో పోటీ చేసాడు కానీ విజయవంతం కాలేదు.
  • 1937 లో బాలూ కాంగ్రెస్‌లో చేరాడు. బాంబే శాసనసభ ఎన్నికలలో డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కు ప్రత్యర్థిగా పోటీ చేసాడు కానీ ఎన్నికల్లో ఓడిపోయాడు.[7]

అతను 1955 లో మరణించాడు. అతని అంత్యక్రియలకు అనేక మంది జాతీయ నాయకులతో పాటు క్రికెటర్లు కూడా హాజరయ్యారు.[8]

మూలాలు[మార్చు]

  1. "The 'Untouchable' Cricketer Who Challenged the British & His Fellow Countrymen". The Better India (in అమెరికన్ ఇంగ్లీష్). 2018-09-18. Archived from the original on 2020-06-04. Retrieved 2020-06-03.
  2. "ఇండియా's first Dalit cricketer Palwankar Baloo fought against caste barriers on the field and off it". Hindustan Times (in ఇంగ్లీష్). 2018-09-16. Retrieved 2020-06-03.
  3. Kidambi, Prashant (2019-06-30). "From disdain to heroes — the journey of two Dalit brothers in India's first cricket team". ThePrint (in అమెరికన్ ఇంగ్లీష్). Archived from the original on 2020-06-04. Retrieved 2020-06-04.
  4. Jyoti, Dhrubo (2018-09-16). "Why India has forgotten its first Dalit cricketer". ThePrint (in అమెరికన్ ఇంగ్లీష్). Archived from the original on 2020-06-04. Retrieved 2020-06-03.
  5. "Palwankar Baloo, the Dalit bowler, was the "first great Indian cricketer"" (in అమెరికన్ ఇంగ్లీష్). Archived from the original on 2019-07-05. Retrieved 2020-06-04.
  6. "Yahoo Cricket". cricket.yahoo.net. Archived from the original on 2020-06-04. Retrieved 2020-06-04.
  7. Menon, Dilip M. (2006). Cultural History of Modern India (in ఇంగ్లీష్). Berghahn Books. ISBN 978-81-87358-25-1.
  8. Kidambi, Prashant (2019), Cricket Country: An Indian Odyssey in the Age of Empire, Oxford University Press, ISBN 978-01-98843-13-9

వనరులు[మార్చు]

ఇతర పఠనాలు[మార్చు]