పాశ్చరైజేషన్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
జపాన్ లోని పాశ్చరైజేషన్ చేసిన పాలు

పాశ్చరైజేషన్ (pasteurization) అనేది లూయీ పాశ్చర్ ప్రవేశపెట్టిన ఒక వ్యాధి నిరోధక పద్ధతి. ఈ పద్ధతిలో ద్రవ పదార్ధాలను వేడిచేసి బాక్టీరియా, ప్రోటోజోవా, శిలీంద్రాలు మొదలైన్ వ్యాధికారక క్రిములను నిర్మూలిస్తారు. మొట్టమొదటగా దీనిని పాశ్చర్, క్లాడ్ బెర్నార్డ్ ఏప్రిల్ 20, 1862లో పరీక్షించారు.

స్టెరిలైజేషన్ పద్ధతిలో వలె ఇందులో మొత్తం అన్ని క్రిములను పూర్తిగా నాశనం చేయదు. పాశ్చరైజేషన్ లో ఈ క్రిముల సంఖ్యను గణనీయంగా తగ్గించి తద్వారా వ్యాపించే వ్యాధుల వ్యాప్తిని నిరోధించడం. ఈ పద్ధతి తర్వాత ఆహార పదార్ధాలను ఫ్రిజ్ లో కొంతకాలం నిలువచేయవచ్చును. అదే వీటిని స్టెరిలైజేషన్ చేస్తే ఆహార పదార్ధాల నాణ్యత, రుచి మారిపోతుంది.

పాశ్చరైజేషన్ పద్ధతిలో సామాన్యంగా ఆయా ద్రవాలను మరిగే ఉష్ణోగ్రత కంటే తక్కువగానే వేడిచేస్తారు. ఇందులో మూడు పద్ధతులు ప్రస్తుతం ఉపయోగంలో ఉన్నాయి: High Temperature Short Time (HTST) పాశ్చరైజేషన్, Extended Shelf Life (ESL) పాశ్చరైజేషన్, Ultra-High Temperature పాశ్చరైజేషన్. HTST పద్ధతిలో పాలను లోహ ప్లేట్లు లేదా పైపుల ద్వారా పంపి బయట వేడి నీరు (71.7 °C (161 °F) for 15-20 సెకండ్లు) లో ఉంచుతారు. అదే UHT పద్ధతిలో ఉష్ణోగ్రత 138 °C (250 °F) వద్ద సెకండు కన్నా తక్కువ కాలం ఉంచుతారు. ESL పద్ధతిలో HTST కంటే తక్కువ ఉష్ణోగ్రత వద్ద వేడి చేసి క్రిములను వడపోత పద్ధతితో కలిపి ఉపయోగిస్తారు.[1]

పాశ్చరైజేషన్ పద్ధతిని ఆ దేశపు పాడి పరిశ్రమ నియంత్రణ సంస్థలు నిర్దేశిస్తాయి. అమెరికా, బ్రిటన్ దేశాలలో HTST పద్ధతిని నాణ్యత సంస్థలు నిర్ణయించాయి. ఈ నాణ్యత విధానాలు పాలకు, జున్ను, వెన్న మొదలైన వివిధ పదార్ధాలకు వేరువేరుగా ఉంటాయి.

HTST పాశ్చరైజేషన్ లో సుమారు 99.999% జీవించియున్న సూక్ష్మక్రిములను నిర్మూలిస్తారు. ఇది క్షయ వ్యాధి కారకమైన మైకోబాక్టీరియం లను కూడా చాలా వరకు తొలగిస్తాయి.

మూలాలు[మార్చు]

  1. "Paving the Way for ESL - extended shelf-life milk products | Dairy Foods | Find Articles at BNET.com". Archived from the original on 2012-07-08. Retrieved 2012-07-08.

బయటి లింకులు[మార్చు]