పిత్తాశయము
వికీపీడియా నుండి
|
|
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. వివరాలకు జాబితా లేదా ఈ వ్యాసపు చర్చా పేజీ చూడండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తొలగించండి. |
| పిత్తాశయం | |
|---|---|
| పిత్తాశయం #5 సంఖ్యతో సూచించబడినది | |
| లాటిన్ | వెసికా బిలియారిస్ |
| గ్రే'స్ | subject #250 1197 |
| అంగ వ్యవస్థ | జీర్ణ వ్యవస్థ (GI Tract) |
| ధమని | కోశీయ ధమని |
| సిర | కోశీయ సిర |
| నాడి | సీలియాక్ గాంగ్లియా, వేగస్[1] |
| Precursor | Foregut |
| MeSH | Gallbladder |
| Dorlands/Elsevier | g_01/12383343 |
పిత్తకోశం లేదా పిత్తాశయం (Gall bladder) పైత్యరసాన్ని నిలువచేస్తుంది. బేరిపండు ఆకారములో ఉన్న ఈ అవయవము 50 మి.లీ. వరకు పైత్యరసాన్ని నిలువ ఉంచుకొని జీర్ణక్రియకు అవసరమయినప్పుడు చిన్న ప్రేగులోనికి విడుదలచేస్తుంది.
స్వరూపం[మార్చు]
మానవులలో పిత్తాశయము దాదాపు 10-12 సెంటీమీటర్లు పొడవుగా ముదురు ఆకుపచ్చ రంగులో కనిపిస్తుంది. పిత్తాశయానికి ఈ రంగు కణజాలాల వళ్ళకాక అందులో నిలువవున్న పైత్యరసం వళ్ళ కలుగుతున్నది. పైత్యరసవాహిక పిత్తాశయాన్ని ఒకవైపు కాలేయముతోనూ మరోపైపు ఆంత్రమూలముతోనూ కలుపుతున్నది.
- పిత్తాశయము నుండి బయలుదేరే కోశీయ వాహిక కాలేయ వాహికతో కలసి పైత్యరస వాహిక ఏర్పడుతుంది.
- పైత్యరస వాహిక ఆ తరువాత క్లోమరస వాహికతో కలిసి మేజర్ డ్యూయోడినల్ ఆంప్యుల్లా వద్ద హెపాటో-ప్రాంక్రియాటిక ఆంప్యుల్లా లో చేరుతుంది.
వ్యాధులు[మార్చు]
- కోలిసిస్టైటిస్ (Cholecystitis)
- పిత్తాశయపు కాన్సర్
- స్ట్రాబెర్రీ పిత్తాశయము
- పిత్తాశయ రాళ్ళు: పైత్యరసంలో తయారైన గట్టి పదార్ధాలు.
ఇవి పిత్తాశయం, పైత్యరస నాళాలలో ఎక్కడైనా తయారుకావచ్చును. వీని మూలంగా పైత్యరసం చిన్నప్రేగులోనికి పోవడం పూర్తిగా గాని, పాక్షికంగా గాని ఆగిపోయి పచ్చకామెర్లు వస్తుంది. క్లోమరస వాహికకు అడ్డం పడుట వలన క్లోమము వాచిపోవచ్చును. ఈ రాళ్లు వివిధ రంగులలో, పరిమాణాలలో ఉంటాయి.
మూలాలు[మార్చు]
- ↑ Ginsburg, Ph.D., J.N. (2005-08-22). "Control of Gastrointestinal Function", in Thomas M. Nosek, Ph.D.: Gastrointestinal Physiology, Essentials of Human Physiology. Augusta, Georgia, United State: Medical College of Georgia, p. 30. Retrieved on 2007-06-29.
- ↑ "Laboratory 38. Stomach, Spleen and Liver, Step 14. The Gallbladder and the Bile System". Human Anatomy (Laboratory Dissections). SUNY Downstate Medical Center, Brooklyn, NY. 2003-11-17. Retrieved 2007-06-29.
- ↑ "Abdominal dissection, gall bladder position emphasized" (JPG). Human Anatomy (Laboratory Dissections). SUNY Downstate Medical Center, Brooklyn, NY. 2003-11-17. Retrieved 2007-06-29.