పుట్టపర్తి
| ?పుట్టపర్తి మండలం అనంతపురం • ఆంధ్ర ప్రదేశ్ |
|
|
|
|
|
|
|
|
|
|
| అక్షాంశరేఖాంశాలు: | |
| కాలాంశం | భాప్రాకా (గ్రీ.కా+5:30) |
| ముఖ్య పట్టణము | పుట్టపర్తి |
| జిల్లా(లు) | అనంతపురం |
| గ్రామాలు | 12 |
| జనాభా • మగ • ఆడ • అక్షరాస్యత శాతం • మగ • ఆడ |
50,091 (2001) • 25678 • 24413 • 56.63 • 68.96 • 43.75 |
పుట్టపర్తి (ఆంగ్లం: Puttaparthi) (14°9.91′N 77°48.70′E) ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని అనంతపురం జిల్లాకు చెందిన ఒక మండలము.
ఈ పట్టణమునకు ముఖ్య ఆకర్షణ శ్రీ సత్య సాయిబాబా వారి ప్రశాంతి నిలయం ఆశ్రమము. ఈ ఆశ్రమము చూసేందుకు నిత్యం కొన్ని వేల నుంచి లక్షలలో అనేక దేశాల నుంచి భక్తులు విచ్చేస్తుంటారు. ఈ ప్రాంత ఆర్ధికాభివృద్ధికి ప్రశాంతి నిలయం ఆశ్రమము ముఖ్య కారణము.
విషయ సూచిక |
చరిత్ర[మార్చు]
పుట్టపర్తి కి తొలుత ఉన్న పేరు గొల్ల పల్లి . ఆ తరువాత దాన్ని వాల్మీకిపురం అనే పేరు కూడా వచ్చింది.
చేరుకునే విధం[మార్చు]
రోడ్ మార్గం[మార్చు]
పుట్టపర్తి నగరమునకు ఆంధ్రప్రదేశ్ మరియు కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వములచే బస్సులు నడపబడుచున్నాయి. ఈ నగరము అనంతపురమునకు 84 కి.మీ., హిందూపురమునకు 65 కి.మీ., బెంగుళూరుకు 156 కి.మీ., హైదరాబాదుకు 472 కి.మీ. దూరములో ఉంది. బెంగుళూరు నుండి బస్సులో రోడ్డు ప్రయాణం 3 గంటలు పడుతుంది.
బెంగుళూరు నుండి సొంత వాహనము పై వచ్చేవారు జాతీయ రహదారి నం.7 (NH 7) మీద కోడూరు గ్రామం చేరుకుని, ఆంధ్రప్రదేశ్-కర్ణాటక సరిహద్దు వద్ద కుడి వైపునకు తిరిగి పుట్టపర్తి రోడ్డు గుండా వెళ్ళాలి.
రైలు మార్గం[మార్చు]
పుట్టపర్తి నగరమునకు రైల్వే స్టేషను కలదు. "శ్రీ సత్య సాయి ప్రశాంతి నిలయం" పేరిట దీనిని 23 నవంబరు 2000 నుండి ప్రారంభించారు. ఇది ఆశ్రమమునకు దాదాపుగా 8 కి.మీ. (5 మైళ్ళు) దూరములో కలదు. ఇక్కడికి బెంగుళూరు, హైదరాబాదు, విశాఖపట్టణం, భుభణేశ్వర్, ముంబయి, కొత్త ఢిల్లీ మొదలగు పట్టణముల నుండి రైళ్ళు కలవు. దీనికి 45 కి.మీ. (28 మైళ్ళు) దూరములో ఉన్న ధర్మవరం రైల్వేస్టేషను (రైలు కూడలి) నుండి, ఇండియాలో అన్ని ముఖ్య పట్టణములకు రైళ్ళు కలవు. ధర్మవరం స్టేషను నుండి పుట్టపర్తి ఆశ్రమమునకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వముచే నడపబడుచున్న బస్సులు కూడా కలవు.
విమాన మార్గం[మార్చు]
పుట్టపర్తి నగరములో విమానాశ్రయము కలదు. ఇచ్చటి నుండి ముంబయి మరియు చెన్నై పట్టణములకు హైదరాబాదు మరియు విశాఖపట్టణం మీదుగా ఇండియన్ ఎయిర్లైన్స్ వారిచే నడుపబడుతున్న విమానములు కలవు. ఈ విమానాశ్రయము ఆశ్రమమునకు 4 కి.మీ. (2.5 మైళ్ళు) దూరములో కలదు. దీనికి 110 కి.మీ. (68 మైళ్ళు) దూరములో బెంగుళూరు అంతర్జాతీయ విమానాశ్రయము కలదు. శ్రీ సత్య సాయి సెంట్రల్ ట్రస్టు వారు పుట్టపర్తి విమానాశ్రయ హక్కుదారులు. ఈ విమానాశ్రయ విస్థీర్ణము 450 ఎకరములు, రన్ వే పొడవు 2,230 మీ.
పలు వార్తల ప్రకారం, ప్రస్తుతము ఈ విమానాశ్రయమును రూ. 600 కోట్ల కు అమ్మకమునకు పెట్టారు.[1]
మండలంలోని గ్రామాలు[మార్చు]
- కప్పల బండ
- జగరాజుపల్లె
- కోట్లపల్లె
- నిడిమామిడి
- పెదపల్లె
- బీడుపల్లె
- బ్రాహ్మణపల్లె
- పుట్టపర్తి
- యెనుమలపల్లె
- వెంగళమ్మచెరువు
- సతార్లపల్లె
- ఆమగొండపాలెం
చిత్రమాలిక[మార్చు]
వెలుపలి లింకులు[మార్చు]
- గ్రామసంబంధిత వివరాలకు ఇక్కడ చూడండి [1]
|
|||||||
|
|
|
|---|---|
| కప్పల బండ · జగరాజుపల్లె · కోట్లపల్లె · నిడిమామిడి · పెదపల్లె · బీడుపల్లె · బ్రాహ్మణపల్లె · పుట్టపర్తి · యెనుమలపల్లె · వెంగళమ్మచెరువు · సతార్లపల్లె · ఆమగొండపాలెం |