పుట్టింటి గౌరవం (1996 సినిమా)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పుట్టింటి గౌరవం
(1996 తెలుగు సినిమా)
దర్శకత్వం విజయనిర్మల
తారాగణం కృష్ణ,
సౌందర్య
సంగీతం యమ్. సురేష్
నిర్మాణ సంస్థ సాయి మహేష్ ప్రొడక్షన్స్
భాష తెలుగు

పుట్టింటి గౌరవం 1996 ఫిబ్రవరి 16న విడుదలైన తెలుగు సినిమా. సాయి మహేష్ ప్రొడక్షన్స్ పతాకం కింద జి.ఉమామహేష్ వర్మ నిర్మించిన ఈ సినిమాకు విజయనిర్మల దర్శకత్వం వహించింది. కృష్ణ సౌందర్య లు ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు మాధవపెద్ది సురేష్ సంగీతాన్నందించాడు.[1]

ఒక కన్నడ చిత్రం ఆధారంగా తీసిన ఈ చిత్రానికి కథానాయకుడు కృష్ణ. సిద్ధాంత అనే పాత్రలో తన భార్య జ్యోతి (సౌందర్య) పుట్టింటి గౌరవం నిలపడానికి, కాపాడటానికి చేసిన త్యాగమే ఈ కథా రూపం. చిత్రం భార్యా భర్తలు ఇరువురి మరణంతో దుఃఖాంతంగా ముగుస్తుంది.

చిత్రాన్ని సంగీత భరితంగా రూపు దిద్దాలన్న ఆకాంక్షతో దర్శకురాలు విజయనిర్మల దాదాపు తొమ్మిది పాటలని దీనిలో పొందుపరిచారు.

తారాగణం[మార్చు]

సాంకేతిక వర్గం[మార్చు]

  • మాటలు: పరచూరి బ్రదర్స్
  • సంగీతం: మాధవపెద్ది సురేష్
  • ఫోటోగ్రఫీ: వి.శ్రీనివాసరెడ్ది
  • నిర్మాత: జి.ఉమామహేష్
  • స్క్రీన్ ప్లే, దర్శకత్వం: విజయనిర్మల

మూలాలు[మార్చు]

  1. "Puttinti Gowravam (1996)". Indiancine.ma. Retrieved 2023-07-29.

బాహ్య లంకెలు[మార్చు]