పుట్ట గొడుగు

వికీపీడియా నుండి
(పుట్ట గొడుగులు నుండి దారిమార్పు చెందింది)
The mushroom Amanita muscaria, commonly known as "fly agaric"

పుట్టగొడుగు ను ఇంగ్లీషులో Mushroom ( మష్రూమ్స్)అంటారు. ఇవి ఎక్కువగా పుట్టలపై గొడుగు ఆకారంలో మొలస్తాయి (పెరుగుతాయి) అందువలన వీటిని పుట్ట గొడుగులు అంటారు. వర్షాకాలంలో ముఖ్యంగా చిత్తకార్తెలో ఇవి ఎక్కువగా (చిత్తచిత్తగా) మొలుస్తాయి. వాతావరణంలోని తేడాలను బట్టి ఇవి జీవిస్తాయి. వీటి పరిమాణం వీటిలోని సిద్ధబీజాలపై, మరియు ప్రాంతాలపై, ఇవి భూమి లోపల ఉన్న లోతును బట్టి, వాతావరణ పరిస్థితులను అనుసరించి మారుతూ ఉంటాయి. ఈ పుట్ట గొడుగులు చాలా రకాలు ఉన్నాయి. వీటిలో విషపూరితమయిన జాతులు అనేకం ఉన్నాయి. ఇవి విత్తనాలు లేని మొక్క జాతికి సంబంధించినవి.

[మార్చు] తిన దగిన పుట్ట గొడుగులు

పుట్ట గొడుగులను మామూలు కూరలాగానే వండుకుని తినే అలవాటు చాలాకాలం నుంచే జరుగుతున్నది. ఈ కూర రుచికి శాఖాహారానికి, మాంసాహారానికి మధ్యస్తంగా ఉంటుంది. ఇవి తెలుపు రంగులో ఉంటాయి. వీటిలో బటన్ మాష్రూం, ట్రఫుల్, జపాను,చైనాలోని షీతాకే కొన్ని.

[మార్చు] కృత్రిమంగా పండించే పుట్ట గొడుగులు

పుట్ట గొడుగులు పెరగడానికి తగిన వాతావరణ పరిస్థితులను కల్పించి ఇప్పుడు మార్కెట్లో అమ్ముతున్నారు. ఇవి తెలుపు రంగులో ఉంటాయి.

Amanita jacksonii buttons emerging from their universal veils
An image of the gills of Lactarius indigo.



[మార్చు] ఇవి కూడా చూడండి

పుట్టగొడుగుల పెంపకం

వ్యక్తిగత పరికరాలు
నేంస్పేసులు

వైవిధ్యాలు
పేజీకి సంభందించిన లింకులు
చర్యలు
మార్గదర్శకము
పరస్పరక్రియ
పరికరాల పెట్టె
ఇతర భాషలు