పుతుంబాక శ్రీరాములు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

పుతుంబాక శ్రీరాములు (1909 - 1995) స్వాతంత్ర్య సమరయోధులు, మాజీ శాసనసభ్యులు.

వీరు గుంటూరు జిల్లా తెనాలి తాలూకా పెదపాలెంలో 28 నవంబరు 1909లో జన్మించారు. వీరు 1930లో గ్రామ మునసబు ఉద్యోగాన్ని విడిచి ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొన్నారు. 1941లో వ్యక్తి సత్యాగ్రహంలో పాల్గొని 4 నెలలు కఠిన శిక్షను అనుభవించారు. క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొని 1942 నుండి 1944 వరకు వెల్లూరు, తంజావూరు జైళ్లలో ఉన్నారు.

1955లో గుంటూరు జిల్లా, దుగ్గిరాల నియోజక వర్గం నుండి ఆంధ్ర రాష్ట్ర శాసనసభ సభ్యునిగా ఎన్నికయ్యారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 1956 నుండి 1962 వరకు ఆ శాసనసభలో సభ్యునిగా కొనసాగారు.

వీరు గుంటూరు జిల్లా కోపరేటివ్ సెంట్రల్ బ్యాకు ఛైర్మన్ గా, గుంటూరు జిల్లా కోపరేటివ్ మార్కెటింట్ సొసైటీ డైరెక్టరుగాను, ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ సభ్యులుగాను, ఆంధ్ర రాష్ట్ర కాంగ్రెసు సంఘ సంయుక్త కార్యదర్శిగాను, తెనాలిలోని వి.ఎస్.ఆర్. కాలేజీ ఆధ్యక్షులుగా, ఆంధ్ర విశ్వకళా పరిషత్తు సెనేట్ సభ్యులుగా ఉన్నారు. వీరు గుంటూరు జిల్లా హరిజన సేవా సంఘం అధ్యక్షులుగా పది సంవత్సరాలు పనిచేశారు. ఈమని పంచాయతీ సమితి అధ్యక్షులుగా రెండు సార్లు పనిచేశారు. వీరు పలు విద్యాసంస్థలు స్థాపించారు.

వీరు 1995లో పరమపదించారు.