పూరీ మఠం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పూరీ మఠం ప్రవేశ ద్వారం

పూరీ మఠము జగద్గురువులు ఆది శంకరులచే స్థాపించబడిన నాలుగు మఠములలో ఒకటి. దీనినే పూర్వామ్నాయ మఠము అని, గోవర్ధన మఠమని కూడా అంటారు. ఇది దేశానికి తూర్పు తీరాన గల పూరీ పట్టణంలో ఉంది.

మఠ విశేషాలు[మార్చు]

ఈ మఠం భోగవార సంప్రదాయానికి చెందినది. ఇక్కడి సన్యాసులు 'వన', 'అరణ్య'అను యోగపట్టములు ధరిస్తారు.

  • మఠక్షేత్రం పురుషోత్తమం (పూరీ).
  • పీఠ దేవత పురుషోత్తముడు (జగన్నాథుడు).
  • పీఠశక్తి వృషలాదేవి (సుభద్ర).
  • మఠము యొక్క మొదటి ఆచార్యుడు హస్తామలకాచార్యుడు.
  • మహోదధి ఈ మఠ తీర్థము.

ఈ మఠానికి చెందిన సన్యాసులను 'ప్రకాశకులు' అని వ్యవహరిస్తారు. భోగమంటే విషయములు. ఎవరు జీవులను విషయ లంపటముల నుండి దూరంగా ఉంచేందుకు వారిస్తారో వారిది భోగవాళ సాంప్రదాయం. ప్రజల భోగలాలసత్వాన్ని నివారించి ఉన్నత లక్ష్యాలవైపు మళ్ళించడానికి ఈ మఠం ప్రత్యేక బాధ్యత వహిస్తుంది. ప్రజ్ఞానం బ్రహ్మ అనేది ఈ మఠం యొక్క మహావాక్యము. ఇక్కడ ఋగ్వేదం ప్రత్యేకంగా అధ్యయనం చేయబడుతుంది. ఇక్కడి బ్రహ్మచారులు కాశ్యపగోత్రీకులుగా పరిగణింపబడతారు. అంగ, వంగ, కళింగములు ఈ మఠ పరిధిలోని ప్రాంతాలు. ఈ ప్రాంత హిందూధర్మ పరిరక్షణ ఈ పీఠం బాధ్యత.

ఇవికూడా చూడండి[మార్చు]

"https://te.wikipedia.org/w/index.php?title=పూరీ_మఠం&oldid=4010845" నుండి వెలికితీశారు