పూర్ణకుంభం

వికీపీడియా నుండి
Poorna kumbbam..jpg

పూర్ణ కుంభం (Poorna Kumbham) (నిండు కుండ) అనేది మన రాష్ట్ర అధికారిక చిహ్నము. ఈ కుంభం లేదా కలశమ్ అనేది సాధారణంగా నీటితో నింపబడిఉండి, పైభాగాన 'టెంకాయ'(కొబ్బరికాయ) ను కలిగి, చుట్టూ మామిడాకులచే అలంకరింపబడి వుంటుంది.

[మార్చు] పూర్ణ కుంభ తయారీ

దీని కొరకు సాంప్రదాయికంగా ఇత్తడి కుండను ఉపయోగిస్తారు,ఆది అందుబాటు కానప్పుడు లేదా మట్టి, లేక రాగి లేక కుండలు కూడా ఉపయోగిస్తారు. ఈ కుండను కలశం లేదా కుంభం అనికూడా అంటారు. కొన్నిసార్లు ఈ కుంభాన్ని బియ్యం తో నింపుతారు, తెల్లని లేదా ఎర్రని దారాన్ని ఈ కుండ మెడకు లేదా మొత్తం కుండకు కడతారు. మామిడాకులతో ఈ కుండ ముఖం వద్ద వృత్తాకారంలో అలంకరిస్త్రారు. కొన్నిసార్లు టెంకాయను తెల్లటి లేదా పసుపు బట్టతో కప్పుతారు. ఈ విధంగా పూర్ణకుంభ తయారవుతుంది. దీనిని సాంప్రదాయికంగా పవిత్రమైనదిగా భావిస్తారు, మంత్రోచ్ఛారణలతో తయారుచేస్తారు. దీనిని శుభసూచకంగా భావించి శుభకార్యాలలో ఉపయోగిస్తారు. ఉదాహరణకు పెండ్లి, గృహప్రవేశం, రోజువారీ ప్రార్థనలు మొదలగునవి. దీనిని ముఖద్వారాలవద్ద 'స్వాగత సూచకంగా' ఉంచుతారు.

ఈ పూర్ణకుంభం, ఆంధ్రప్రదేశ్ అధికారిక గుర్తు.

[మార్చు] ఇవీ చూడండి

[మార్చు] మూలాలు

"http://te.wikipedia.org/w/index.php?title=పూర్ణకుంభం&oldid=723553" నుండి వెలికితీశారు
వ్యక్తిగత పరికరాలు
నేంస్పేసులు

వైవిధ్యాలు
పేజీకి సంభందించిన లింకులు
చర్యలు
మార్గదర్శకము
పరస్పరక్రియ
పరికరాల పెట్టె
ఇతర భాషలు