పూర్వాభద్రనక్షత్రము గుణగణాలు [మార్చు]
పూర్వాభాద్ర నక్షత్రాధిపతి గురువు, అధిదేవత అజైకపాదుడు, మానవగణము, జంతువు సింహము, రాశ్యాధిపతులు శని, గురువులు. ఈ నక్షత్రములో జన్మించిన వారికి గురువుల సహకారము, మేధావుల సహకారము, సలహాదారుల వలన మంచి స్థితిని సాధిస్తారు. అనేక రంగాల గురించి అవగాహన ఉంటుంది. పెద్దల పట్ల గౌరవం, భయం ఊంటాయి. వృత్తి, ఉద్యోగాల పరంగా ఎవరి సలహాలు తీసుకోరు. ఏక పక్ష ధోరని వలన కష్టాలు ఎదుర్కొంటారు. తమకు అన్నీ తెలుసన్న భావన మంచి చేయదు. స్నేహాలు, విరోధాలు వెంట వెంటనే ఏర్పడతాయి. వ్యతిరేకమైన అభిప్రాయాలను వ్యక్తపరచి సమస్యలను ఎదుర్కొంటారు. ఆతురత వలన తగిన సమయం కొరకు ఎదురు చూసే ఓర్పు నశిస్తుంది. ఉద్యోగపరంగా నిజాయితీ, సత్ప్రవర్తన కారణంగా విరోధాలు వస్తాయి. వీరి శక్తిని వీరికి ఇతరులు చెప్పె వరకు వీరికి తెలియదు. సాహిత్య, కళారంగాలలో రాణిస్తారు. దేశదేశాలలో విహరిస్తారు. జీవితంలో ఇబ్బందులు ఉంటాయి కాని ధనం అప్పటికప్పుడు అంది వస్తుంది. అదృష్టం వలన పైకి వచ్చారన్న ప్రచారం సదా ఉంటుంది. సంతానాన్ని అతిగారాబం చెస్తారు లేక పోతే విచక్షణా రహితంగా కొడతారు. ఆర్ధిక స్థిరత్వం సాధించిన తరువాత దానగుణం ఉంటుంది. పిసినారితనం ఉండదు. తనకు మాలిన దానం చెయ్యరు. సామాజిక సేవలో పేరు వస్తుంది. రాజకీయంలో రాణిస్తారు. ఆధిపత్యపోరు ఇబ్బందికి గురి చేస్తుంది. వైవాహైక జీవితం సాధారణం. బాల్యం సౌఖ్యవంతంగా ఉంటుంది. తరువాత జీవితం సాధారణంగా ఉంటుంది.
నక్షత్ర వివరాలు [మార్చు]
నక్షత్రములలో ఇది25వ నక్షత్రము.
| నక్షత్రం |
అధిపతి |
గణము |
జాతి |
జంతువు |
వృక్షము |
నాడి |
పక్షి |
అధిదేవత |
రాశి |
| పూర్వాభద్ర |
గురువు |
మానవ |
పురుష |
జంతువు |
మామిడి |
ఆది |
|
అజైక పాదుడు |
1,2,3,కుంభం,4 మీనం |
| నక్షత్రం/వివరం |
ప్రత్యేక వివరం |
| నక్షత్ర అధిపతి |
|
| గణము |
|
| జాతి |
|
| జంతువు |
|
| పక్షి |
|
| వృక్షం |
|
| రాశి |
|
| అధిదేవత |
|
| నాడి |
|
పూర్వాభాద్ర నక్షత్ర జాతకుల తారా ఫలాలు [మార్చు]
| తార నామం |
తారలు |
ఫలం |
| జన్మ తార |
పునర్వసు, విశాఖ, పూర్వాభద్ర |
శరీరశ్రమ |
| సంపత్తార |
పుష్యమి, అనూరాధ, ఉత్తరా భద్ర |
ధన లాభం |
| విపత్తార |
ఆశ్లేష, జ్యేష్ట, రేవతి |
కార్యహాని |
| సంపత్తార |
అశ్విని, మఖ, మూల |
క్షేమం |
| ప్రత్యక్ తార |
భరణి, పూర్వ ఫల్గుణి, పూర్వాషాఢ |
ప్రయత్న భంగం |
| సాధన తార |
కృత్తిక, ఉత్తర ఫల్గుణి, ఉత్తరాషాఢ |
కార్య సిద్ధి, శుభం |
| నైత్య తార |
రోహిణి, హస్త, శ్రవణం |
బంధనం |
| మిత్ర తార |
మృగశిర, చిత్త, ధనిష్ట |
సుఖం |
| అతిమిత్ర తార |
ఆరుద్ర, స్వాతి, శతభిష |
సుఖం, లాభం |
పూర్వాభద్రా నక్షత్రము నవాంశ [మార్చు]
- 1వ పాదము - మేషరాశి.
- 2వ పాదము - వృషభరాశి.
- 3వ పాదము - మిధునరాశి.
- 4వ పాదము - కర్కాటకరాశి.
చిత్రమాలిక [మార్చు]
-
పూర్వాభాద్ర నక్షత్ర వృక్షము
-
పూర్వాభాద్ర నక్షత్ర జంతువు
-
పూర్వాభాద్ర నక్షత్ర జాతి(పురుష)
-
పూర్వాభాద్ర నక్షత్ర పక్షి నెమలి.
-
పూర్వాభాద్ర నక్షత్ర అధిపతి గురువు.
-
పూర్వాభాద్ర నక్షత్ర అధిదేవత
-
పూర్వాభాద్ర నక్షత్ర మానవగణము
ఇతర వివరాలు [మార్చు]