పూసపాటి విజయానంద గజపతి రాజు

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

క్రికెట్ ప్రపంచంలో విజ్జీగా పేరొందిన పూసపాటి విజయానంద గజపతి రాజు (1905-1965) భారతీయ క్రికెట్ కెప్టెన్, రాజకీయ నాయకుడు. విజయనగర గజపతి వంశానికి చెందిన యువరాజు.

విజయానంద గజపతి, విజయనగరం పాలకుడైన పూసపాటి విజయరామ గజపతిరాజు రెండవ కుమారుడు. అందుచే ఈయన మహారాజకుమార్ అన్న రాచరిక పట్టం పొందాడు. 1922లో తండ్రి మరణం తర్వాత కుటుంబం బెనారస్ ఎస్టేటును వారసత్వంగా పొంది, 1923 ఫిబ్రవరీలో కాశీపూర్ జమిందారు రాజా ఉదయరాజ్ సింగ్ యొక్క పెద్దకూతురు భగీరథీ దేవిని వివాహమాడాడు.[1] ఈయన విద్యాభ్యాసం అజ్మీరులోని ప్రిన్సెస్ కళాశాల, హెయిల్స్‌బరీ మరియు ఇంగ్లాండులోని ఇంపీరియర్ సర్వీసు కాలేజీలలో సాగింది. టెన్నీస్ మరియు క్రికెట్ క్రీడలలో మంచి ప్రావీణ్యం సంపాదించిన విజ్జీ చేయితిరిగిన వేటగాడు కూడా. ఈయన 383 సింహాలను వేటాడాడని ప్రతీతి. అయితే ఈయన 1965 డిసెంబరు 2న కాన్పూరు సమీపంలో ఒక చెరుకు తోటలో ఏనుగుపై ఎక్కి వేటాడుతుండగా, గాయపడిన సివంగి లంఘించగా, ఏనుగు పైనుండి జారిపడిన ప్రమాదంలో కిడ్నీ దెబ్బతిని మరణించాడు.[2]

విజ్జీ కేవలం మూడు టెస్టు క్రికెట్ మ్యాచ్‌లు ఆడాడు. ఈయన 1936లో ఇంగ్లాడు పర్యటించిన భారతజట్టుకు నేతృత్వం వహించాడు. ఆ సంవత్సరమే ఇంగ్లాడుకు చెందిన ఏడవ ఎడ్వర్డ్ రాజు జన్మదిన సందర్భంగా ఈయన్ను బ్రిటీషు ప్రభుత్వం సర్ బిరుదుతో సత్కరించింది. విజ్జీ 1954 నుండి 1957 వరకు బి.సి.సి.ఐ అధ్యక్షునిగా పనిచేశాడు. సంయుక్త పరగణాల్లో, స్వాతంత్ర్యం తర్వాత ఉత్తరప్రదేశ్లో క్రికెట్ అభివృద్ధికి విశేషకృషి చేశాడు.

మూలాలు[మార్చు]