పెండలం

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
Purple Yam
Starr 061106-1435 Dioscorea alata.jpg
శాస్త్రీయ వర్గీకరణ
రాజ్యం: ప్లాంటే
(unranked): పుష్పించే మొక్కలు
(unranked): Monocots
క్రమం: Dioscoreales
కుటుంబం: డయోస్కోరియేసి
జాతి: డయోస్కోరియా
ప్రజాతి: D. alata
ద్వినామీకరణం
Dioscorea alata
L.[1]
పర్యాయపదాలు

Dioscorea rubella Roxb.[2]

పెండలం యొక్క వృక్ష శాస్త్రీయ నామం Dioscorea alata. దీనికి తెలుగు గల ఇతర పేర్లు దుక్క పెండలం, గున్న పెండలం, కవిలి గడ్డ.

ఇతర భాషలలో పేర్లు[మార్చు]

సంస్కృతం : ఆలూకం, హిందీ : ఛుప్రీ ఆలు, ఖమాలు, కన్నడ : తెన్గుగెనసు, హెగ్గెనసు, మలయాళం : కాసిల్, కావుట్టు, తమిళం : కస్టన్ కాసిల్, ఆంగ్లము : గ్రేటర్ యాం, ఏషియాటిక్ యామ్

మొక్క వర్ణన[మార్చు]

తీగ జాతికి చెందిన ఈ తీగ చెట్ల పైన, నేల పైన పాకుతుంది. ఈ తీగకు దూరం దూరంగా పెద్ద ఆకులు ఉంటాయి. హృదయాకారంలో మొదలు వెడల్పుగా కొస సన్నగా కొలగా పొడుగ్గా ఆకులు ఉంటాయి. ఆకులు ఎదురుబదురుగా ఉంటాయి. ఆకులు ఒకదాని తర్వాత ఒకటి అరుదుగా ఉంటాయి. తీగ బాగా ముదిరితే ఎర్రటి కాయలు కాస్తాయి. నేలలో పొడుగుగా దుంపలు పెరుగుతాయి. దుంపలపై మందపాటి ముదురు గోధుమ రంగు బెరడు ఉంటుంది. లోపలి భాగం తెల్లగా ఉంటుంది.

ఔషధీ లక్షణాలు[మార్చు]

దుంపలు రుచిగా ఉంటాయి. చలవ చేస్తాయి. బలవర్థకము. వీర్యవృద్ధి, కామాన్ని పెంచుతుంది. మూత్రము సాఫీగా అయ్యేటట్లు చేస్తుంది. కడుపులో పురుగులను చంపుతుంది. మేహశాంతి కలిగిస్తుంది. దాహాన్ని తగ్గిస్తుంది. పిత్త రోగములపై పనిజేయును. మధుమేహము, కుష్టు, గనేరియా, మూత్రము బొట్లు బొట్లుగా అగుటను మాన్పును. కాయలు కూర చేసుకొని తినిన దేహ పుష్టి, బలమును కలిగిస్తుంది.

ఇవి కూడా చూడండి[మార్చు]

చిత్రమాలిక[మార్చు]

ఇవి కూడా చూడండి[మార్చు]

బయటి లింకులు[మార్చు]

మూలాలు[మార్చు]

  1.  Dioscorea alata was first described and published in Species Plantarum 2: 1033. 1753. "Name - Dioscorea alata L.". Tropicos. Saint Louis, Missouri: Missouri Botanical Garden. Retrieved May 26, 2011. 
  2.  GRIN (May 9, 2011). "Dioscorea alata information from NPGS/GRIN". Taxonomy for Plants. National Germplasm Resources Laboratory, Beltsville, Maryland: USDA, ARS, National Genetic Resources Program. Retrieved May 26, 2011. 

వనమూలికా వైద్యము

"http://te.wikipedia.org/w/index.php?title=పెండలం&oldid=855981" నుండి వెలికితీశారు