పెద్దిభొట్ల సుబ్బరామయ్య

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
పెద్దిభొట్ల సుబ్బరామయ్య
Peddibhotla subbaramayya.jpg
పెద్దిభొట్ల సుబ్బరామయ్య
జననం పెద్దిభొట్ల సుబ్బరామయ్య
1938
గుంటూరు
నివాస ప్రాంతం విజయవాడ
ఇతర పేర్లు పెద్దిభొట్ల సుబ్బరామయ్య
ప్రసిద్ధి కథా రచయిత

పెద్దిభొట్ల సుబ్బరామయ్య సమకాలీన రచయితలలో పేరెన్నికగన్నవాడు. ఈయన రచనలు అత్యధికం విషాదం మేళవించిన సామాన్య జీవన కథలుగా ఉంటాయి.ఈయన తెలుగు భాషలో లఘు కథా రచయిత. ఈయన విజయవాడకు చెందినవారు[1]. ఆయన వ్రాసిన పెద్దిభొట్ల సుబ్బరామయ్య కథలు (వాల్యూం -1) 2012 లో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డుకు ఎంపిక అయినది[2][3].

జీవిత విశేషాలు[మార్చు]

ఈయన రేల్వే స్టేషన్ మాస్టర్ కుమారుడు. 1938లో గుంటూరులో జననం. ఈయన ఒంగోలు విద్యాభాసం చేశారు. కళాశాల విద్యను విజయవాడ కళాశాలలో చదివారు. ఆ కాలంలో ఆయన ప్రముఖ రచయిత విశ్వనాథ సత్యనారాయణ కు శిష్యులైనారు.ప్రముఖ గ్రంథం వేయిపడగలు రచించిన విశ్వనాథ సత్యనారాయణ ఎస్.ఎస్.ఆర్ మరియు సి.వి.ఆర్ కాలేజి.[4] కి లెక్చరర్ గా ఉండేవారు.

సుబ్బరామయ్య ఆంధ్ర లయోలా కాలేజీ లో లెక్చరర్ గా 40 సంవత్సరాల పాటు పనిచేసి డిసెంబర్ 1996 లో పదవీవిరమణ చేశారు.

ఈయన 1959 లో తన రచనలను మొదలుపెట్టారు[5]ఈయన రచనలు పేద మద్యతరగతి కుటుంబాల జీవితాలతో ముది పడి ఉంటాయని తెలిపారు[1] ఈయన 200 లకు పైగా కథలను వ్రాసారు. ప్రాధమిక విద్య ఏ వ్యక్తి యొక్క అభివృద్ధి మీదనైనా ప్రభావం చూపిస్తుందని ఆయన నమ్మకం.

పనులు[మార్చు]

 • "చక్రనేమి" అనే కథ ఆయన మొదటి రచన. అది ఆంధ్ర పత్రిక (వార పత్రిక) లో ప్రచురింపబదినది. ఆ తర్వాత అనేక రచనలను అంరియు రెండు నవలను "భారతి పత్రిక" కు వ్రాసారు.
 • పెద్దిభొట్ల సుబ్బరామయ్య కావ్యాలు (వాల్యూమ్‌ - 1)
 • పెద్దిభొట్ల సుబ్బరామయ్య కథలు - 2[6]

అవార్డులు[మార్చు]

 • రవిశాస్త్రి స్మారక సాహిత్య నిథి
 • గోపీచంద్ మెమోరియల్
 • అప్పజ్యోస్యుల విష్ణుభొట్ల కందలం ఫౌండేషన్ అవార్డు.'
 • 2012 లో తెలుగు లో సాహిత్య అకాడమీ అవార్డు

పెద్దిబొట్ల కథలు[మార్చు]

 • పూర్ణాహుతి
 • దుర్దినం
 • శుక్రవారం
 • ఏస్‌ రన్నర్‌

ఇవి కూడా చూడండి[మార్చు]

సూచికలు[మార్చు]

 1. 1.0 1.1 "Sahitya Akademi Award for Vijayawada writer". The Hindu. 2012-12-25. సంగ్రహించిన తేదీ 2013-08-16. 
 2. "Sahitya Akademi Awards for 24". The Hindu. 2012-12-21. సంగ్రహించిన తేదీ 2013-08-16. 
 3. "Sahitya Akademi : Poets Dominate Sahitya Akademi Awards 2012". Sahitya-akademi.gov.in. సంగ్రహించిన తేదీ 2013-08-16. 
 4. "Sahitya Akademi Award for writer Subbaramaiah". The Hindu. 2012-12-25. సంగ్రహించిన తేదీ 2013-08-16. 
 5. "Peddibhotla gets sahitya award for short story". Deccan Chronicle. 2012-12-21. సంగ్రహించిన తేదీ 2013-08-16. 
 6. "Telugu Book Reviews". Cpbrownacademy.org. సంగ్రహించిన తేదీ 2013-08-16. 

వెలుపలి లింకులు[మార్చు]

తెలుగు సాహిత్యము|తెలుగు సాహితీకారులు|ప్రముఖ కావ్యాలు