పెబ్బేరు

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
పెబ్బేరు
—  మండలం  —
మహబూబ్ నగర్ జిల్లా పటములో పెబ్బేరు మండలం యొక్క స్థానము
మహబూబ్ నగర్ జిల్లా పటములో పెబ్బేరు మండలం యొక్క స్థానము
అక్షాంశరేఖాంశాలు: 16°13′00″N 77°59′00″E / 16.2167°N 77.9833°E / 16.2167; 77.9833
రాష్ట్రం తెలంగాణ
జిల్లా మహబూబ్ నగర్
మండల కేంద్రము పెబ్బేరు
గ్రామాలు 19
ప్రభుత్వము
 - మండలాధ్యక్షుడు
జనాభా (2001)
 - మొత్తం 57,630
 - పురుషులు 29,390
 - స్త్రీలు 28,230
అక్షరాస్యత (2001)
 - మొత్తం 42.65%
 - పురుషులు 55.82%
 - స్త్రీలు 29.02%
పిన్ కోడ్ 509104

పెబ్బేరు, తెలంగాణ రాష్ట్రములోని మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన ఒక మండలము. పిన్ కోడ్: 509104. ఈ ఊరి యొక్క సంత చాలా పెద్దది .ఇది ప్రతి శనివారం నాడు జరుగుతుంది .ఇది జాతీయ రహదారి 7 మీద ఉంది .ఈ ఊరికి సమీపంలో కృష్ణా నది ప్రవహిస్తుంది .శ్రీ రంగాపురం పెబ్బేరు నుండి 10 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇది ఆది, ఛత్రపతి మరియు చెన్నకేశవరెడ్డి, యమదొంగ (Jr ఎన్టీఆర్)చిత్రీకరించబడ్డాయి. ఇక్కడి రంగనాయక స్వామి ఆలయం ప్రసిద్ధి చెందింది. పెబ్బేరులో షిర్డీ సాయి బాబా, హనుమాన్ , బ్రహ్మం గారు, వేణు గోపాల స్వామి, అయ్యప్ప ఆలయం, చౌడేశ్వరి అమ్మ వారు మరియు వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మ వారితో సహా పెబ్బెరులో అనేక ఇతర దేవాలయాలు ఉన్నాయి. ఇక్కడ ప్రతి సంవత్సరం చౌడేశ్వరి జాతర జరుపుకుంటారు .

జనాభా[మార్చు]

2011 జనాభా లెక్కల ప్రకారం మండల జనాభా 68691. ఇందులో పురుషులు 35061, మహిళలు 33630. అక్షరాస్యుల సంఖ్య 33480.[1]

రాజకీయాలు[మార్చు]

2013, జూలై 31న జరిగిన గ్రామపంచాయతి ఎన్నికలలో గ్రామ సర్పంచిగా సుశీలమ్మ ఎన్నికయింది.[2]

మండలంలోని గ్రామాలు[మార్చు]

మూలాలు[మార్చు]

  1. Census of India 2011, Provisional Population Totals, Anadhra Pradesh, Published by Director of Census Operations AP, Page No.129
  2. నమస్తే తెలంగాణ దినపత్రిక, మహబూబ్‌నగర్ జిల్లా టాబ్లాయిడ్, తేది 01-08-2013
"http://te.wikipedia.org/w/index.php?title=పెబ్బేరు&oldid=1257926" నుండి వెలికితీశారు