పెరుగు

వికీపీడియా నుండి

పెరుగు లేదా దధి ఒక మంచి ఆహార పదార్ధము. మరిగించిన పాలలో గోరువెచ్చగా ఉండగా మజ్జిగ చుక్కలను వేసిన పాలు గట్టిగ తోడుకొనును. దీనినే పెరుగు అంటారు. పెరుగు నుండి వెన్న, నెయ్యి, మీగడ ను తీస్తారు. పాలలో తోడు తక్కువ వేసిన పెరుగు తియ్యగా నుండును. తోడు ఎక్కువయైన పుల్లగా నుండును.

[మార్చు] రకాలు

పెరుగులో అయిదు రకములున్నవి.

  • మంద దధి: ఇది తోడుకొని తోడుకొనకుండా యుండును. రుచి పాలరుచియే.
  • మధుర దధి: గట్టిగా తోడుకొని యుండును. తీపిరుచి అనగా కమ్మదనము ఎక్కువగా నుండును. కొంచెము పులుపుండును
  • మధురామ్ల దధి: ఇది గట్టిగా తోడుకొని మధుర రసము కలిగి ఉండును. కషాయరసము అనురసముగా నుండును.
  • ఆమ్ల దధి: ఇది గట్టిగా తోడుకొని పుల్లగా నుండును. మధురరసము కనపడదు.
  • అత్యామ్ల దధి: ఇది నోటిలో నుంచుకొనగానే పళ్ళు జివుమనిపించి పులవబెట్టునది. శరీరమంతటను పులకలు రేకెత్తించును.
    • పాలలో కొద్దిగా ...పెరుగు గాని ,మజ్జిగ గాని కలిపిన యెడల ... తెల0గాణ వలె కలిసిమెలిసి చిక్కగా పెరుగు తయారవును.

[మార్చు] పోషక విలువలు

Yoghurt, full fat
పోషక విలువలు, ప్రతి 100 గ్రాములకు
శక్తి 60 kcal   260 kJ
పిండిపదార్థాలు     4.7 g
- చక్కెరలు  4.7 g (*)
కొవ్వు పదార్థాలు 3.3 g
- సంతృప్త  2.1 g
- ఏకసంతృప్త  0.9 g  
మాంసకృత్తులు 3.5 g
రైబోఫ్లేవిన్ (విట. బి2)  0.14 mg   9%
కాల్షియమ్  121 mg 12%
(*) Lactose content diminishes during storage.
శాతములు, అమెరికా వయోజనులకు
సూచించబడిన వాటికి సాపేక్షంగా
Source: USDA పోషక విలువల డేటాబేసు
వ్యక్తిగత పరికరాలు
నేంస్పేసులు

వైవిధ్యాలు
పేజీకి సంభందించిన లింకులు
చర్యలు
మార్గదర్శకము
పరస్పరక్రియ
పరికరాల పెట్టె
ఇతర భాషలు