పెళ్ళి బృందం

వికీపీడియా నుండి

వివాహ వేడుకలలో పాల్గొనేవారు , వివాహ బృందం గా కూడా వ్యవహరించబడతారు, వీరు ప్రత్యక్షంగా వివాహ వేడుకలలో పాల్గొనే ప్రజలు.

వివాహం జరిగే ప్రాంతం, మతం, మరియు పద్ధతిపై ఆధారపడి, ఈ బృందంలో కేవలం వివాహం చేసుకొనే వ్యక్తులు మాత్రమే ఉండవచ్చు, లేదా దానిలో ఒకరు లేదా అంతకంటే ఎక్కువమంది వధువులు , వరులు (లేదా పెండ్లి కొడుకులు ), గౌరవ పరిచారికలు , తోడి పెండ్లి కూతుళ్ళు , బెస్ట్ మెన్ , తోడి పెండ్లికొడుకులు , సుమబాలలు , పేజ్ బాయ్స్ మరియు రింగ్ బేరర్స్ ఉండవచ్చు.

ఒక స్త్రీ యొక్క వివాహ బృందం ఆమె తరఫు పెండ్లి వారిని మాత్రమే కలిగిఉంటుంది. వరుని తరఫు వారిని వరుని బృందం గా పిలుస్తారు.

విషయ సూచిక

వధువు [మార్చు]

భారతదేశంలోని సాంప్రదాయ హిందూ వివాహ వేడుకలో ఒక వధువు
సాంప్రదాయ చైనీయుల వస్త్రధారణలో వధువు మరియు వరుడు.చైనీయుల సంస్కృతిలో ధైర్యం, విశ్వాసం, గౌరవం, విజయం, అదృష్టం, సంతాన సాఫల్యత, ఆనందం మరియు అభిమానంతో జత కూడిన ఎరుపు వస్త్రాలను లేదా ఎరుపు అలంకరణను వధువు మరియు వరుడు ధరిస్తారు.
దస్త్రం:1929wedding.jpg
కుడివైపు చివర ఉన్న స్త్రీ 1929కి చెందిన సాధారణ వివాహ దుస్తులను ధరించింది. 1930ల చివరి వరకు వివాహ వస్త్రాలు ఆనాటి ధోరణిని ప్రతిబింబించాయి. ఆ తరువాత వివాహ వస్త్రాలు విక్టోరియన్ బాల్ గౌనులపై ఆధారపడ్డాయి.
1929 నుండి ఒక విస్తృత వస్త్రధారణ

వివాహం చేసుకోబోయే లేదా నూతనంగా వివాహమైన స్త్రీ వధువు గా పిలువబడుతుంది.

ఈ పదం "వంట" కొరకు ఉపయోగించిన ట్యుటోనిక్ పదం నుండి వచ్చి ఉండవచ్చు.[1] పాశ్చాత్య సంస్కృతిలో, ఒకరు లేదా అనేకమంది తోడి పెండ్లికూతుళ్ళు లేదా గౌరవ పరిచారికలు వధువుతో పాటు ఉండవచ్చు.

వివాహం తరువాత భర్తగా మారే ఆమె భాగస్వామి, మగవాడయినట్లయితే వరుడిగా(లేదా పెండ్లి కుమారుడుగా) సూచించబడతాడు.

వస్త్రధారణ [మార్చు]

ఐరోపా మరియు ఉత్తర అమెరికాలో, ఒక వధువు యొక్క సాధారణ వస్త్రధారణలో సాంప్రదాయ దుస్తులు మరియు ఒక ముసుగు ఉంటాయి. సాధారణంగా, "శ్వేత వివాహ" నమూనాలో, వధువు యొక్క దుస్తులు ప్రత్యేకంగా వివాహం కొరకు ఖరీదు చేయబడి, తరువాత ఏ సందర్భంలోనూ ధరించడానికి వీలు లేని విధంగా ఉంటాయి. గతంలో, కనీసం 19వ శతాబ్ద మధ్యభాగం వరకు, పెండ్లి కూతుళ్ళు రంగుతో సంబంధం లేకుండా తమ దుస్తులలో ఉత్తమమైన వాటిని ధరించేవారు, లేదా వధువు సంపన్నురాలైతే, ఆమె తనకు ఇష్టమైన రంగులో తిరిగి ధరించడానికి వీలుపడే నూతన వస్త్రాలను ఖరీదు చేసేది.[2]

పాశ్చాత్య దేశాలలో మొదటి వివాహాల కొరకు, సాధారణంగా శ్వేత వివాహ వస్త్రాలను ధరిస్తారు, ఈ సాంప్రదాయం విక్టోరియా రాణి యొక్క వివాహం నుండి ప్రారంభించబడింది. 20వ శతాబ్దం యొక్క ప్రారంభ భాగాలలో, శ్వేత వస్త్రాలను ధరించడం కన్యత్వం యొక్క పురాతన చిహ్నంగా భావించి కొందరు పొరబడటం వలన, పాశ్చాత్య ఆచారంలో శ్వేత వస్త్రాలను తరువాత జరిగే వివాహాలలో ధరించరాదని నిర్ణయించబడింది, అయితే వివాహ సాంప్రదాయాలలో తెల్ల దుస్తులు ధరించడం ఇటీవలి పరిణామం.[3][4] నేడు, పశ్చిమ దేశాల పెండ్లి కూతుళ్ళు తరచుగా తెలుపు, మీగడ రంగు, లేదా దంతపు రంగు దుస్తులను ఎన్ని వివాహాలకైనా ధరిస్తారు; దుస్తుల రంగు పెండ్లి కూతురి యొక్క లైంగిక చరిత్రపై వ్యాఖ్య కాదు. చైనీయులు, హిందూ, వియత్నాం దేశస్థులు, కొరియన్, మరియు జపనీయుల వివాహ సాంప్రదాయాలలో శ్వేత వివాహ దుస్తులు సాధారణంగా ఉండవు, దీనికి కారణం తెలుపు ఆ సంస్కృతులలో విషాదం మరియు మరణాల రంగు. ఎరుపు రంగు శక్తి మరియు ఆరోగ్యానికి సూచికగా మరియు చాలా కాలం నుండి పెండ్లి కూతుళ్ళకు వాడటం వలన అనేక ఆసియన్ సంస్కృతులలో సాధారణంగా వధువులకు ఎరుపు రంగు ఉపయోగిస్తారు. ఏదేమైనా ఆధునిక కాలంలో ఇతర వర్ణాలను కూడా ధరించవచ్చు, లేదా పాశ్చాత్య శైలికి ప్రాధాన్యత ఇవ్వవచ్చు. రంగుతో సంబంధం లేకుండా ఆసియా సంస్కృతిలో ఎక్కువగా పెండ్లి కుమార్తెల దుస్తులు బాగా అలంకరించబడి, తరచు పూసలు లేదా బంగారంతో కుట్టబడి ఉంటాయి. కొన్ని సంస్కృతులలో వధువులు ఒకటి కంటే ఎక్కువ వస్త్రాలను ధరిస్తారు, ఇది జపాన్, భారతదేశంలోని కొన్ని ప్రాంతాలు, మరియు, ప్రాచీనకాలం నుండి, అరబ్ ప్రపంచంలో కనిపిస్తుంది.

ప్రత్యేక శైలుల నగలు తరచు వధువుల దుస్తులతో పాటు జతకూడి ఉంటాయి, పాశ్చాత్య సంస్కృతిలోని వివాహ ఉంగరం, లేదా పంజాబీ సిఖ్ సంస్కృతిలోని చురా (ఎరుపు మరియు తెలుపు గాజులు) దీనికి ఉదాహరణలు. పెండ్లి నగలు సాంప్రదాయకంగా వధువు యొక్క కట్నం విలువను ప్రదర్శించడానికి ఉపయోగపడుతున్నాయి.

గౌనుతో పాటు, వధువు తరచు ఒక ముసుగును ధరించి పూల గుత్తిని, అదృష్ట నాణెం వంటి ఒక చిన్న కుల ద్రవ్యాన్ని, ఒక ప్రార్ధనా గ్రంధాన్ని, లేదా ఇతర చిహ్నాన్ని తీసుకువస్తుంది. పశ్చిమ దేశాలలో, వధువు “కొంత పురాతనమైనది, కొంత నూతనమైనది, కొంత బదులు తీసుకున్నది, మరియు కొంత నీలం రంగుది” ధరించవచ్చు; వధువు పర్స్ (లేదా డబ్బు సంచి) కూడా సాధారణం.[5]

చరిత్ర [మార్చు]

వధువు అనే పదం అనేక పదాల కలయికతో కనిపిస్తూ ఉంటుంది, వీటిలో కొన్ని వ్యవహారములో లేనివి. "వరుడు" నూతనంగా వివాహమైన పురుషుడు, మరియు "వధువు-గంట", "వధువు-విందు" వివాహ గంటలు, వివాహ ఉదయపు ఆహారానికి సమానమైన అర్ధాన్నిచ్చే పురాతన పదాలు. "బ్రైడల్" (బ్రైడ్-అల్ నుండి) అనగా నిజానికి వివాహ విందు, ఇది సామాన్య వివరణాత్మక విశేషణంగా మారింది, బ్రైడల్ వేడుక. వధువు-రొట్టె కు మూలం ఒక వివాహ రూపమైన కన్ఫరియటియో నుండి వచ్చింది, వివాహమైన జంట ఉప్పు, నీరు మరియు స్పెల్ట్ గోధుమ పిండితో తయారైన రొట్టెలను తినడం దీని ముఖ్య లక్షణం, మరియు సంపదకు చిహ్నంగా వధువు మూడు గోధుమ కంకులను పట్టుకొంటుంది.

నూతనంగా అభివృద్ధి చెందిన ఛాయా చిత్ర కళా రూపానికి 1840 నాటి వివాహ భంగిమను తిరిగి చూపుతున్న విక్టోరియా రాణి మరియు యువరాజు ఆల్బర్ట్.(1854)

రొట్టె-తినడం అనేది నాగరికత నుండి పోయినప్పటికీ, గోధుమ కంకులు మిగిలే ఉన్నాయి. మధ్య యుగాలలో వధువు వాటిని ధరించడం లేదా మోయడం చేసేది. చివరకు ఇది యువతులు చర్చ్ బయట వరండాలో నిలబడి వధువుపై గోధుమ గింజలు విసిరే సాంప్రదాయంగా మారి, తరువాత కాలంలో గింజల కొరకు ప్రాకులాడటం ఏర్పడింది. తరువాత కాలంలో గోధుమ-గింజలు పలుచటి బిస్కెట్లుగా వండబడి, నేటి స్కాట్లాండ్ సాంప్రదాయం వలె వధువు తలపై విరిచి వేయబడ్డాయి, ఓట్ మీల్ కేక్ కూడా ఉపయోగించబడింది. ఎలిజబెత్ యొక్క పాలనలో ఈ బిస్కెట్లు, గుడ్లు, పాలు, చక్కెర, ఎండు ద్రాక్ష మరియు సుగంధ ద్రవ్యాలతో చేసిన చిన్న దీర్ఘచతురస్ర రొట్టెల రూపాన్ని పొందటం ప్రారంభమైంది. వివాహానికి హాజరయ్యే ప్రతి అతిధి ఒక రొట్టెను కలిగి ఉండేవారు, మొత్తం అన్నీ సేకరించి వధువు గడప దాటిన వెంటనే ఆమెపై విసిరేవారు. ఆమె తలపై లేదా భుజాలపై నిలిచి ఉన్న వాటికి ప్రాకులాడేవారి వద్ద అధిక విలువ ఉండేది. చార్లెస్ II యొక్క కాలంలో చివరకు ఈ రొట్టెలన్నీ కలిపి ఒక పెద్ద రొట్టెగా రూపొందించబడి, అది బాదం పిండి మరియు అలంకరణలతో పూర్తి శోభను పొందేది. అయితే ఇప్పటికీ, ఉత్తర నోట్స్ వంటి గ్రామీణ పారిష్ లలో, వివాహమైన జంటపై "జీవితానికి రొట్టె మరియు ఎప్పటికీ పిండివంట," అని అంటూ గోధుమలు చల్లుతారు, నూతనంగా వివాహమైన జంట ఎప్పుడూ సంపదతో తులతూగాలని దీని భావం. బియ్యాన్ని చల్లడం కూడా చాలా పురాతనమైన సాంప్రదాయం కానీ గోధుమ చల్లడం తరువాతదే, ఇది కూడా వివాహమైన జంట సంపన్నంగా ఉండాలనే కోరికను సూచించేదే.[6][7]

వధువు-పాత్ర అనేది ఒక గిన్నె లేదా వధూవరులు ఒకరికొకరు త్రాగుటకు ప్రతిపాదించే ఒక ప్రేమ-పాత్ర. పెండ్లి జంట దానిలోని పానీయాన్ని త్రాగిన తరువాత, ఆ ద్రాక్షరసం యొక్క పాత్రను పగుల కొట్టడం యూదు సంప్రదాయంలో సాధారణం. దానిని కాళ్ళ క్రింద తొక్కుతారు. "వధువు-గిన్నె" అనే పదం కూడా కొన్నిసార్లు రాత్రి పూట పెళ్లి జంట కొరకు చేసే సుగంధ ద్రవ్యాలతో కూడిన ద్రాక్ష పానీయపు గిన్నె కొరకు ఉపయోగించబడుతుంది. గతంలో వివాహంలో ధరించే రోజ్ మేరీ కొమ్మలను బంధించేందుకు ఉపయోగించే ప్రారంభంలోని బంగారం, పట్టు లేదా ఇతర కుచ్చు ప్రాచీన కాలంలో వధువు-జలతారు గా పిలువబడేది. ఇవి తరువాత కాలంలో రిబ్బన్ల గుచ్ఛం రూపాన్ని పొంది, అవే చివరికి రోజెట్ గా రూపాంతరం చెందాయి.

వధువు-శకటం అనేది వధువుని తన నూతన గృహానికి తీసుకువెళ్ళే వాహనం, ఒక "శకటం"లో ఊరంతా తిరిగి, తమ గృహ అవసరాల నిమిత్తం చిన్న మొత్తాలను లేదా గృహోపకరణ వస్తువులను సేకరించే అవసరంలో ఉన్న పేద జంట వివాహాల నుండి దానికి ఆ పేరు వచ్చింది. ఇవి "ప్రయోజనకర" విందుల రూపంలో ఉండటం వలన, ఈ వివాహాలను వేలపు-వివాహాలు, లేదా వేలాలుగా పిలిచేవారు. వేల్స్ లో ఈ "వేలపు-వివాహాల" ఆచారం ఇప్పటికీ వాడుకలో ఉండటం వలన, ముద్రణదారులు తగిన ఆహ్వాన పత్రాలను సిద్ధంగా ఉంచుతారు. కొన్నిసార్లు వివాహ ఊరేగింపులో ఆరువందల మంది జంటలు పాల్గొనేవి.

యూదు వధువులు అందరూ ధరించే బంగారు తాపడ కిరీటానికి క్రైస్తవ ప్రత్యామ్నాయం వధువు పూల కిరీటం . వధువులకు ఈ కిరీట ధారణ ఇప్పటికీ రష్యన్లు, మరియు హాలండ్ మరియు స్విట్జర్లాండ్ కు చెందిన కాల్వనిస్ట్‌లచే ఆచరింపబడుతోంది. కాషాయ వర్ణపు పూలను ధరించడం సారసెన్స్‌తో ప్రారంభమైంది, వారు దీనిని గర్భధారణకు చిహ్నంగా భావించేవారు. ఇది ఐరోపాలో క్రూసేడర్‌లచే ప్రవేశపెట్టబడింది. గ్రీకు మరియు రోమన్ వధువులను వేడుక సమయంలో పూర్తిగా కప్పి ఉంచే ఒక పెద్ద పసుపు వర్ణపు ముసుగు లేదా ఫ్లేమీయం యొక్క ఆధునిక రూపమే వధువు యొక్క ముసుగు . ఈ విధమైన పరదా, యూదులు మరియు పర్షియన్లలో ఇప్పటికీ ఉపయోగంలో ఉంది.[8][9]

వరుడు [మార్చు]

పట్టు వస్త్రాలు మరియు పూల దండ ధరించిన భారతదేశపు వధువు

ఒక పెండ్లి కుమారుడు (సాధారణ సంక్షిప్త రూపం వరుడు ) వివాహం చేసుకోనబోయే, లేదా అప్పుడే వివాహమైన వ్యక్తి.

బ్రైడ్ గ్రూమ్ అనే పదం 1604 నాటిది, ఇది బ్రైడ్ మరియు ప్రాచీన ఆంగ్ల పదం గుమ అంటే "బాలుడు" అర్ధం వచ్చే పురాతన గూమ్ నుండి వచ్చింది.[10]

ఒక వరుడు సాధారణంగా ఒక బెస్ట్ మాన్ మరియు సంబంధితులతో హాజరవుతాడు.

వరుని వస్త్రాలంకరణ ఆ రోజు యొక్క సమయం, వేడుక జరిగే ప్రదేశం, వేడుక జరిగే పధ్ధతి, మరియు అతడు సైనిక దళాలకు చెందినవాడా, కాదా అనే అంశాలపై ఆధారపడి ఉంటుంది. ప్రపంచపు అధిక ప్రాంతాలలో, సైన్యంలో క్రియాశీల-విధులను నిర్వర్తించే సభ్యులు మరియు చట్ట అమలు సంస్థల సభ్యులు పౌర దుస్తులను కాకుండా వారి సైనిక దుస్తులను ధరిస్తారు.

పశ్చిమ సాంప్రదాయాలలో సాధారణంగా వరుడు ఆ సందర్భపు ఆచారం మరియు ఆ రోజు సమయానికి తగినట్లుగా సూట్ ధరిస్తాడు. US లో, వివాహ వేడుకలో వరుడు సాధారణంగా ముదురు-రంగు సూట్ (పగటి సమయం) లేదా సాంప్రదాయ తక్సేడో (రాత్రి విందులో ధరించే జాకెట్) (సాయంత్రం) ధరిస్తాడు. బ్రిటిష్ సాంప్రదాయం ప్రకారం వరుడు, మగ ద్వారపాలకులు మరియు సమీప కుటుంబ సభ్యులు ఉదయపు సూట్ లు ధరిస్తారు.[11] స్కాట్లాండ్‌లో సాయంత్రపు వేడుకలకు, తరచు కిల్ట్(మోకాలి వరకు వేలాడే లంగా వంటిది)‌తో కూడిన ఒక పూర్తి సాయంకాలపు సూట్ సాంప్రదాయకంగా ధరించబడుతుంది.

వరుడు సాధారణంగా అతను ధరించే దుస్తులకు తగిన కంఠధారణను ఉపయోగిస్తాడు. ఎక్కువమంది వరులు, అధిక సాంప్రదాయ కంఠధారణ అయిన బోటైని వారి తక్సేడో లేదా సూట్ కి తగినట్లు ధరిస్తారు.[12] సాధారణంగా అంతగా సాంప్రదాయకం కాని, అధిక ఆకర్షణీయంగా ఉండే ఒక క్రావట్(టై) ఉదయపు సూట్‌తో ధరించబడుతుంది. అధికంగా లభ్యమయ్యే రకం కావడం వలన ఫోర్ ఇన్ హాండ్ టై కూడా చాలా సాధారణంగా మారింది.

తోడి పెండ్లికూతుళ్ళు [మార్చు]

వధువుతో, ఒకే విధమైన దుస్తులు ధరించిన ఏడుగురు వధువు పరిచారికలు

ఒక వివాహంలో తోడి పెండ్లికూతుళ్ళు వధువు యొక్క వివాహ బృందంలోని సభ్యులు. తోడి పెండ్లి కూతురు సాధారణంగా ఒక యువతి అయి, తరచూ సన్నిహిత స్నేహితురాలు లేదా సోదరిగా ఉంటుంది. వివాహం లేదా పెండ్లి వేడుక రోజున ఆమె వధువుకు తోడుగా ఉంటుంది. సాంప్రదాయకంగా, తోడి పెండ్లికూతుళ్ళు వివాహ వయసు వచ్చిన వివాహం కాని యువతుల నుండి ఎన్నుకోబడతారు.

ప్రధాన తోడి పెండ్లి కూతురిగా ఒకరిని నియమించినట్లయితే, ఆమెకు పెండ్లి కానట్లయితే ముఖ్య తోడిపెండ్లికూతురు లేదా గౌరవ పరిచారిక అని, లేదా ఆమెకు పెండ్లి అయినట్లయితే గౌరవ పర్యవేక్షకురాలు అని పిలువవచ్చు. ఒక చిన్న తోడి పెండ్లికూతురు పెండ్లి వయసుకు మరీ చిన్నదైన ఒక బాలిక, కానీ ఆమె గౌరవ తోడి పెండ్లికూతురిగా చేర్చబడుతుంది.

తరచూ ఒకరి కంటే ఎక్కువ మంది తోడి పెండ్లి కూతుళ్ళు ఉంటారు: ఆధునిక కాలంలో ఎంతమందిని అడగాలో వధువు నిర్ణయిస్తుంది. చారిత్రకంగా, ఒక స్థాయిని కలిగిన ఏ వ్యక్తి తోడ లేకుండా బయటకు వెళ్ళేవారు కాదు, మరియు కుటుంబం యొక్క సాంఘిక స్థితికి తగినట్లుగా పరిజనం యొక్క పరిమాణం దానికి సమీపంగా లెక్కించబడేది. అప్పుడు, ఇప్పటివలెనే, కుటుంబం యొక్క సాంఘిక స్థితి మరియు సంపదను ప్రదర్శించడానికి తోడి పెండ్లికూతుళ్ళను పెద్ద సంఖ్యలో కలిగి ఉండటం ఒక అవకాశంగా ఉండేది.

తోడి పెండ్లి కూతుళ్ళు చేయవలసిన పనులు చాలా పరిమితంగా ఉంటాయి.[13] వివాహం జరిగే రోజు వధువుకు సహాయం చేయడానికి వారు వివాహ వేడుకకు హాజరు కావలసి ఉంటుంది. ఐరోపా మరియు ఉత్తర అమెరికాలలోని తోడి పెండ్లి కూతుళ్ళని తరుచు వివాహానికి ప్రణాళిక వేయడం మరియు వివాహ ఆతిధ్యంలో సహాయం చేయవలసిందిగా కోరడం జరుగుతుంది. ఆధునిక కాలంలో తోడి పెళ్లి కూతుళ్ళని పెళ్ళికి సంబంధించిన వేడుకలకు చెందిన ప్రణాళికలలో కూడా పాత్ర పోషించవలసిందిగా కోరడం జరుగుతోంది, వీటిలో పెళ్లి కూతురిని చేయడం(మంగళ స్నానం) లేదా కన్య విందు వంటివి జరిగితే అవి వుంటాయి. ఏదేమైనా, ఇవన్నీ, ఐచ్చిక కార్యకలాపాలు; ఆచార నిపుణురాలు జుడిత్ మార్టిన్ ఈ విధంగా పేర్కొన్నారు, "పుకార్లకు విరుద్ధంగా, తోడి పెళ్ళి కూతుళ్ళు వధువు యొక్క మర్యాద కొరకు బాధ్యత వహించరు, లేదా వారు భరించలేనంత ఖరీదుగల వస్త్రాలు ధరించరు."[14] తోడి పెండ్లి కూతుళ్ళ విందు వధువు ప్రాంతంలో సాంప్రదాయం అయితే, దానికి ఆతిధ్యం ఇవ్వబడుతుంది, వధువు దానిని నిర్వహించి, చెల్లించడం జరుగుతుంది.[15] చిన్న తోడి పెండ్లి కూతురికి వివాహానికి హాజరు కావడం మినహా ఏ విధమైన బాధ్యతా ఉండదు.

గతంలోని తోడి పెళ్లి కూతుళ్ళ వలె కాక, ఆధునిక తోడి పెళ్ళి కూతుళ్ళు వారి దుస్తులు మరియు ప్రయాణపు ఖర్చుల కొరకు వధువు కుంటుంబంపై ఆధారపడలేరు, కొన్నిసార్లు వివాహానికి ముందు వధువు ఇచ్చే విందుకు కూడా చెల్లింపు చేయవలసి వస్తుంది, అందువలన వధువు తోడి పెళ్లికూతుళ్ళకు వారి ఆసరా మరియు వారి పాత్రల వలన వారు నిర్వహించిన ఆర్ధిక బాధ్యతలకు కృతజ్ఞతగా బహుమానాలను ఇవ్వడం జరుగుతుంది. అందువలన తోడి పెండ్లి కూతుళ్ళుగా పనిచేయడానికి ఆహ్వానించబడిన స్త్రేలలో జాగ్రత్త కలిగిన వారు, ఆ పనిని అంగీకరించే ముందు వధువు వారి నుండి ఆశించే సమయం, శక్తి, మరియు ధనం గురించి అడుగుతారు.

గౌరవ పరిచారిక [మార్చు]

"గౌరవ పరిచారిక" అనే పదం ప్రారంభంలో యునైటెడ్ కింగ్డంలో రాణి యొక్క స్త్రీ సేవకురాలిని సూచించడానికి ఉపయోగించబడేది. సాధారణంగా తోడి పెండ్లికూతురు అనే పదం UKలో వధువుకు సహాయం అందించే వారందరికీ ఉపయోగించబడుతుంది. అయితే, వారికి వివాహమైనా లేదా పెద్ద వయసు స్త్రీ అయినా గౌరవ పర్యవేక్షకురాలు అనే పదం ఉపయోగిస్తారు. అమెరికన్ ఆంగ్లం యొక్క ప్రభావం కొన్నిసార్లు ప్రధాన తోడి పెండ్లి కూతురిని గౌరవ పరిచారికగా పిలవడానికి దారితీసింది.

ఉత్తర అమెరికాలో, ఒక వివాహ బృందంలో అనేక మంది తోడి పెండ్లి కూతుళ్ళు ఉండవచ్చు, కానీ గౌరవ పరిచారిక పేరు మరియు హోదా వధువు యొక్క ముఖ్య సేవకురాలికి ఇవ్వబడుతుంది, వారు సాధారణంగా ఆమె సన్నిహిత స్నేహితురాలు లేదా సోదరి అయి ఉంటారు. ఆధునిక వివాహాలలో కొంత మంది వధువులు దీర్ఘకాల స్నేహితుడిని లేదా సోదరుడిని వారి ముఖ్య సేవకుడిగా ఎంపిక చేసుకుంటున్నారు, వారికి తోడి పెండ్లి కొడుకు లేదా గౌరవ పురుషుడు గా పేరు ఇవ్వబడుతుంది.[citation needed]

ప్రధాన తోడి పెండ్లి కూతురికి అనేక కార్యకలాపాలు ఉండవచ్చు లేదా వధువు తనపై ఉంచిన విధులను ఆమె అంగీరించినంత వరకు ఉంటాయి. ఆమె చేయవలసిన ఒకే ఒక బాధ్యత వివాహ వేడుకలో పాల్గొనడం. ఏదేమైనా, సాధారణంగా ఒక సంఘటనగా వివాహం యొక్క విధాన నిర్వహణలో ఆమె సహాయపడాలని కోరడం జరుగుతుంది, వీటిలో ఆహ్వానాలు పంపడం, వధువు తన వివాహ దుస్తులను కొంటున్నపుడు వంటి వాటిలో ఒక స్నేహితురాలిగా సహాయపడటం ఉంటాయి.

సాంప్రదాయకంగా, పెళ్లి కూతురిని చేసే బాధ్యత వధువు తల్లిపై ఉంటుంది. ఈ స్నానానికి హాజరయ్యే వారికి బహుమానాలు ఇవ్వవలసిన అవసరం లేదు, అయితే అది ఒక మర్యాద. ఈ స్నానం సాధారణంగా వివాహానికి నాలుగు నుండి ఆరు వారాల ముందు జరుగుతుంది.[16]

వివాహం జరిగే రోజు, ఆచరణాత్మక మరియు భావావేశపరమైన ఆసరాను ఇవ్వడం ఆమె ప్రధానమైన విధి. ఆమె, వధువుకు వస్త్రధారణలో సహాయ పడవచ్చు, ముసుగు వేసుకోవడంలో, పూల గుత్తి, ఒక ప్రార్ధనా పుస్తకం, లేదా ఆ రోజు ఆమె వివాహ దుస్తుల వెనుక వ్రేలాడే భాగ నిర్వహణలో అవసరమైతే సహాయపడవచ్చు. ఒక జంట-ఉంగరాల వివాహంలో, ప్రధాన తోడి పెండ్లికూతురి వద్దు పెండ్లికొడుకు యొక్క వివాహ ఉంగరము వేడుక సమయంలో అది అవసరం అయ్యేవరకు ఉంచబడుతుంది. తోడి పెండ్లికూతుళ్ళు వయోజనులు అయినట్లయితే, వారిని వేడుక తరువాత వివాహ అనుమతికి న్యాయపరమైన సాక్షులుగా ఉండవలసిందిగా అనేకమంది వధువులు కోరతారు. వివాహం తరువాత ఆతిధ్యం ఉన్నట్లయితే, నూతన జంటకు గౌరవ పానీయం ఇవ్వమని గౌరవ పరిచారికను కోరవచ్చు.

పుట్టుక మరియు చరిత్ర [మార్చు]

పాశ్చాత్య తోడి పెళ్లికూతురి ఆవిర్భావం రోమన్ చట్టం నుండి ఏర్పడిందని భావిస్తారు, దీని ప్రకారం వివాహంలో దుష్ట ఆత్మలను ఓడించడానికి(వివాహ వేడుకలకు హాజరవుతాయని నమ్మబడింది) వివాహంలో పది మంది సాక్షులు వధువు మరియు వరుడు ధరించిన దుస్తుల వంటి దుస్తులను ధరించవలసి ఉంటుంది, దీని వలన వివాహం ఎవరికి జరుగుతోందో దుష్ట ఆత్మలు తెలుసుకోలేవు.[citation needed] ఇంగ్లాండ్‌లో 19వ శతాబ్దపు చివరి నాటికి కూడా, చెడు-కోరుకునేవారు శాపాలు పెట్టి వివాహాన్ని చెడగొడతారని నమ్మేవారు .[citation needed] ఉదాహరణకు విక్టోరియన్ వివాహ ఛాయాచిత్రాలలో తరచూ వరుడు మరియు వధువు వివాహ బృందంలోని ఇతర సభ్యుల వలె ఒకే విధమైన వస్త్రధారణలో ఉండేవారు.[citation needed]

ఇతర ప్రజలు బైబిల్ కధ జాకబ్ ను చూపుతారు, మరియు అతని ఇద్దరు భార్యలు లేః మరియు రాచెల్, బుక్ అఫ్ జెనెసిస్ (29:24, 46:18) లో వివరించిన విధంగా, తోడి పెళ్లికూతుళ్ళకు సాంప్రదాయానికి మూలంగా ఇద్దరు పరిచారికలతో వచ్చారు. ఈ స్త్రీలు సాంఘికంగా సమాన హోదా కలవారిగా కంటే పనిమనుషులుగా (సేవకులు లేదా బానిసలు) ఉండేవారు.[citation needed]

తోడి పెండ్లికొడుకులు [మార్చు]

వివాహ వేడుకలో వరునికి సేవలను అందించే వ్యక్తి తోడి పెండ్లికొడుకు . అషర్ అనే పదం UKలో చాలా సాధారణం, కానీ USలో ఆ విధమైన పదానికి వరుడి స్నేహితులు వధువు స్నేహితుల కంటే తక్కువ ప్రాముఖ్యత కలిగిన వారనే అర్ధం ఉంటుంది. సాధారణంగా వరుడు తన సమీప స్నేహితుని మరియు/లేదా బంధువులని తోడి పెండ్లికొడుకుగా సేవ చేయడానికి ఎంపిక చేసుకుంటాడు, మరియు ఈ విధంగా ఎంపిక కాబడటం గౌరవంగా భావిస్తారు. సాధారణంగా తన తోడి పెండ్లికొడుకులలో ఒకరిని వరుడు బెస్ట్ మాన్‌గా సేవ చేయడానికి ఎంపిక చేసుకుంటాడు. అతిధులకు వారి స్థానాలను చూపడంలో సహాయపడటం మరియు వివాహ వేడుకలో పాల్గొనడం తోడి పెండ్లికొడుకుల బాధ్యత.

అదనంగా, ఇతర రకాలైన సేవలను కోరవచ్చు, వీటిలో వేడుకగా చేసుకొనే సంఘటనలైన స్టాగ్ నైట్ లేదా బక్'స్ నైట్ గా కూడా పిలువబడే బ్రహ్మచారి విందు ప్రణాళిక వేయడం; ఒంటరిగా ఉన్న అతిధులతో మాట్లాడటం లేదా వివాహ ఆతిధ్యంలో నృత్యం ఉంటే సాహచర్యం లేని అతిధులు లేదా తోడి పెండ్లి కూతుళ్ళతో నృత్యం చేయడం ద్వారా వివాహాన్ని ఆహ్లాదంగా చేయడానికి సహాయపడం; లేదా కానుకలను అందించడం, సామానులు, లేదా అనూహ్యమైన ఇబ్బందులలో సహాయాన్ని అందించడం ఉంటాయి. నూతన జంట యొక్క కారుని అలంకరించడం వంటి స్థానిక లేదా ప్రాంతీయ సాంప్రదాయాలలో కూడా తోడి పెండ్లికొడుకులు పాల్గొనవచ్చు.


అనేక మంది అతిధులు హాజరయ్యే వివాహంలో, వరుడు తన ఇతర మగ స్నేహితులని వివాహ వేడుకలలో మరే విధంగా పాల్గొనకుండా ద్వారపాలకులు గా ఉండవలసినదిగా అడగవచ్చు; వీరి ఏకైక బాధ్యత వేడుక ప్రారంభానికి అతిధులను లోనికి వారి స్థానాల వద్దకు తీసుకువెళ్లడం. పెద్ద వివాహ వేడుకలలో ద్వారపాలకులని నియమించడం కూడా జరుగుతుంది.

సైనిక అధికారి వివాహంలో, తోడి పెండ్లికొడుకుల బాధ్యతను ఖడ్గవీరులు లేదా ఖడ్గ గౌరవ రక్షకుడు పోషించడం జరుగుతుంది. వారు సాధారణంగా వరునితో పనిచేసే అతని సన్నిహిత వ్యక్తిగత మిత్రుల నుండి ఎన్నుకోబడతారు. వివాహమైన జంట మరియు అతిధులు నడవడానికి ఖడ్గ ద్వారమును ఏర్పాటు చేయడం వారి బాధ్యతలలో ఉంటుంది.

తోడి పెండ్లికొడుకులు మరియు పెండ్లికూతుళ్ళు గతంలో ప్రధానమైన విధులను కలిగి ఉండేవారు. ఈ పురుషులు వధువు-యోధులుగా పిలువబడేవారు, ఒక వ్యక్తి వధువును ఎత్తుకుపోవడానికి సహాయ పడవలసినదిగా పిలిచినపుడు, పురాతన కాలంలోని బంధించి వివాహం చేసుకోవడం యొక్క కొనసాగింపుకి వీరు ప్రాతినిధ్యం వహించేవారు.

బెస్ట్ మాన్ [మార్చు]

కంబోడియ, కంపోట్[31]‌లో జరిగిన ఈ వివాహంలో, వరుని కుడి వైపు ముగ్గురు తోడి పెండ్లికొడుకులు నిలబడి ఉండగా వధువు ఎడమ వైపు ముగ్గురు తోడి పెండ్లికూతుళ్ళు నిలబడి ఉన్నారు.

ఒక వివాహంలో వరునికి సేవలను అందించే ప్రధాన వ్యక్తి బెస్ట్ మాన్ . ఉత్తర అమెరికా మరియు ఐరోపాలో, వరుడు ఈ గౌరవాన్ని అతనికి సన్నిహితమైన వారికి, సాధారణంగా అతని సన్నిహిత మిత్రుడు లేదా సోదరునికి ఇస్తాడు. వరుడు ఈ గౌరవాన్ని ఒక స్త్రీకి ఇవ్వాలని కోరుకున్నట్లయితే, ఆమెను బెస్ట్ వుమన్ లేదా బెస్ట్ పర్సన్ అని వ్యవహరించవచ్చు, లేదా 'బెస్ట్ మాన్' అని కూడా అనవచ్చు. బెస్ట్ మాన్‌కి వధువు తరపు సమానమైన పదం పరిచారిక లేదా గౌరవ పర్యవేక్షకురాలు. లింగభేదం లేని ఒక పదం గౌరవ సహాయం చేసే వ్యక్తి .

బెస్ట్ మాన్ యొక్క విధులు ఒక స్నేహితుని విధుల వలెనే ఉంటాయి, పాశ్చాత్య శ్వేత వివాహంలో, బెస్ట్ మాన్ సాధారణంగా ఇవి చేయవలసి ఉంటుంది:

  • వివాహం జరిగే రోజు వరునికి సహాయ పడటం,
  • వివాహ వేడుకలో అవసరమయ్యేంత వరకు వివాహపు ఉంగరాన్ని జాగ్రత్తగా ఉంచడం,
  • వివాహానికి చట్టపరమైన సాక్ష్యంగా పనిచేయడం, మరియు
  • ఆతిధ్యంలో వధువు మరియు వరులకు పానీయాన్ని తయారు చేయడం. (గతంలో, బెస్ట్ మాన్ వివాహానికి హాజరు కాలేని వారి తంతులను చదివేవాడు.) దీనిని బెస్ట్ మాన్ ఉపన్యాసం లేదా పానీయం అంటారు.

పూర్వకాలంలో, వివాహానికి ముందు వారంలో ఒక అనుకూలమైన సాయంత్రం సాధారణంగా ఒక బ్రహ్మచారుల విందు ఏర్పాటు చేయబడేది. ఒక విధమైన వీడుకోలు విందు ఎప్పుడూ వరునిచే నిర్వహించబడి, చెల్లించబడేది.[15] ప్రపంచంలోని వివిధ భాగాలలో ఈ వేడుకకు సామాన్య పదాలు బ్రహ్మచారి విందు, ఒంటరి వినోదం లేదా మగవారి రాత్రి . అనేక ప్రాంతాలలో ఈ విందు, ప్రస్తుతం బెస్ట్ మాన్ చే నిర్వహించబడుతోంది, మరియు ఖర్చులను విందులో పాల్గొనేవారు పంచుకోవడం జరుగుతుంది.[17]

బెస్ట్ మాన్, లేదా గౌరవ పరిచారకులు సార్వత్రిక సాంప్రదాయాలు కాదు.[18] బెస్ట్ మాన్ సాంప్రదాయం ఉన్న ప్రాంతాలలో కూడా, ఇతర ప్రాంతాలు మరియు కాలాలతో పోల్చినపుడు వారి పాత్ర చాల భిన్నంగా ఉంటుంది.

అత్యంత ఆధునిక, ఆంగ్ల భాష మాట్లాడే దేశాలలో, బెస్ట్ మాన్ సాధారణంగా వరునికి అత్యంత సన్నిహిత మిత్రుడై ఉంటాడు. పురాతన సంప్రదాయాలైన ఎత్తుకుపోయి వివాహం చేసుకోవడం లేదా వధువును ఎత్తుకు పోబోయే వారి నుండి కాపాడటానికి బెస్ట్ మాన్ ఆవిర్భావం జరిగి ఉంటుందని కొందరు రచయితల నమ్మకం.[19][20]

గ్రీస్ లోని ప్రాచ్య సాంప్రదాయ వివాహాలలో, బెస్ట్ మాన్ ఎక్కువగా కౌమ్బరోస్ లేదా మత సమర్పకునిగా కూడా ఉంటాడు, మరియు సాంప్రదాయకంగా ఇతను వరుని యొక్క తండ్రి వంటి వాడు(గాడ్ ఫాదర్).[18] కౌమ్బరోస్ (లేదా కౌమ్బర, స్త్రీ అయినట్లయితే) జంటకు కిరీటం తొడిగే గౌరవ ప్రదమైన వ్యక్తి మరియు మూడుసార్లు పీఠం చుట్టూ ప్రదక్షిణ చేయడంలో పాల్గొంటాడు. కొన్ని ప్రాంతాలలో, ఈ వ్యక్తి వివాహ ఖర్చులన్నిటినీ భరిస్తాడు.

ఉక్రెయిన్‌లో వివాహ వేడుకల సమయంలో వధువు సంరక్షణ బాధ్యతను బెస్ట్ మాన్ స్వీకరిస్తాడు. అతను లేదా వరుడు ప్రక్కకు వెళ్ళినపుడు, వధువు "ఎత్తుకుపోబడటం" లేదా జోళ్ళు దొంగిలించబడటం జరుగుతుంది. అప్పుడు వరుడు లేదా బెస్ట్ మాన్ వధువు తిరిగి రావడానికి ప్రతిగా పరిహారం చెల్లించవలసి ఉంటుంది, ఇది సాధారణంగా డబ్బు చెల్లింపు (వధువుకు ఇవ్వబడుతుంది) లేదా ఏదైనా అవమానకరమైన దానిని చేయడం అయి ఉంటుంది.[21]

ఉగాండాలో ఒక బెస్ట్ మాన్ నూతనంగా వివాహమయ్యే వారికి వివాహ పద్ధతులలో మార్గదర్శకత్వం వహించాలని ఆశించబడుతుంది. దీని అర్ధం బెస్ట్ మాన్‌కు తప్పని సరిగా వివాహం అయిఉండాలి, ఒక భార్యతో అయితే మంచిది మరియు చక్కని, ఉపయోగకరమైన మరియు పరీక్షించబడిన సలహాలను ఇవ్వగలిగే స్థితిలో ఉండాలి. ఒక బెస్ట్ మాన్ తాను నూతన జంటతో పంచుకొనే వివరాల పట్ల విశ్వాసిగా మరియు విచక్షణ కలిగి ఉండాలి.[citation needed]

భూటాన్‌లో బెస్ట్ మాన్, వివాహంలో తనను తాను వధూవరుల యొక్క వేడుక రక్షకుడిగా చెప్పుకుంటాడు. ఆ తరువాత అతను, కొన్ని సార్లు అనేక గంటల పాటు అతిధులను అలరిస్తాడు.

సుమ బాలలు [మార్చు]

సుమ బాల

ఒక సుమ బాల ఒక వివాహ ఊరేగింపులో పాల్గొంటుంది. ఉంగరం తెచ్చేవారు మరియు పేజ్ బాయ్స్ వలె, సుమ బాలలు వధువు లేదా వరుని యొక్క విస్తరించిన కుటుంబ సభ్యులు, అయితే స్నేహితులు కూడా కావచ్చు.[22]

సాధారణంగా, సుమ బాల ఊరేగింపు ప్రవేశం వద్ద వధువుకు ముందు నడుస్తుంది. ఆమె వధువుకు ముందు పూల రేకులు నేలపై చల్లవచ్చు లేదా ఒక పూల గుత్తి లేదా ముళ్ళు లేని గులాబి పూలను పట్టుకొని రావచ్చు. ఊరేగింపు పూర్తైన తరువాత, యువ సుమ బాల తన తల్లిదండ్రులతో పాటు కూర్చుంటుంది. వేడుక మరీ దీర్ఘమైనది కాకపొతే, వయసులో పెద్దదైన ఒక బాలిక ఇతర గౌరవ సేవకులతో పాటు పీఠం ప్రక్కన నిశ్శబ్దంగా ఇతర గౌరవ సేవకులతో పాటు నిలబడాలని కోరుకోవచ్చు.

మరీ చిన్నపిల్లలు తమ బాధ్యతల పట్ల అత్యుత్సాహంతో ఉంటారు, మరియు పెద్ద వారైన బాలికలు తమకు "పిల్ల" పాత్రలు ఇస్తే చిన్నబుచ్చుకోవడం దీనికి కారణం, నాలుగు నుండి ఎనిమిది సంవత్సరాల మధ్య వయసు,[23] ఒక వేళ భాలిక యొక్క భావాలు దెబ్బతినకుంటే అంతకంటే ఎక్కువ వయసు సూచించబడుతుంది.

వధువుకు గౌరవించదగిన అనేకమంది యువ బంధువులు ఉంటె, ఒకరి కంటే ఎక్కువ సుమ బాలలు ఉండవచ్చు. ఈ ఆచారం బ్రిటిష్ రాచరిక వివాహాలలో, వాటి నమూనాలో జరిపే ఇతర సాంప్రదాయ వివాహాలలో లేదా విక్టోరియన్-పధ్ధతిలో జరిగే వివాహాలలో ఇది సర్వసాదారనమైనది.

చారిత్రకంగా, వీరి వస్త్రాలంకరణ వధువు మరియు వరుని కుటుంబాలచే అందచేయబడుతుంది, కానీ ఆధునిక వివాహాలలో ఎక్కువ జంటలు ఆ సుమ బాలల వస్త్రాలంకరణకు మరియు సంబంధిత ఇతర ఖర్చులను వారి తల్లిదండ్రులే భరించాలని భావిస్తున్నారు.[22]

ఆమె పురుష సమానుడిని ఉంగరం తెచ్చే వ్యక్తి(రింగ్ బేరర్) లేదా పేజ్ బాయ్ అంటారు. తరచుగా ఉంగరం తెచ్చే వ్యక్తి మరియు సుమ బాల ఒక జంటగా గోచరింప చేస్తారు, వారి వస్త్రాలంకరణ కూడా వధువు మరియు వరునికి సూక్ష్మ నమూనాగా పోలి ఉండవచ్చు.

పేజ్ బాయ్స్, కాయిన్ బేరర్స్ మరియు రింగ్ బేరర్స్ [మార్చు]

పేజ్ బాయ్ , వివాహం లేదా కొటిలియన్ నృత్యంలో ఒక సహాయకుడు. ఈ రకమైన వివాహ సహాయకుడు ఉండటం పేరుకే కానీ సాధారణంగా అరుదుగా జరుగుతుంది, అయితే వివాహంలో యువ బంధువులను లేదా బంధువుల మరియు స్నేహితుల పిల్లలను ఈ విధంగా పాల్గొనేలా చేయటం ఇప్పటికీ జరుగుతున్న ఒక పధ్ధతి. పేజ్ బోయ్స్‌ను తరుచుగా బ్రిటిష్ రాచరిక వివాహ వేడుకలలో గమనించవచ్చు. మంచి ప్రభావాన్ని కలిగించడం కోసం కొటిలియన్ నృత్యాలలో ఎక్కువ మంది పేజ్‌లు ఉండవచ్చు.

సాంప్రదాయకంగా, పేజ్ బోయ్స్ వధువు వెనుక వ్రేలాడే వస్త్ర భాగాన్ని, ప్రేత్యేకించి ఆమె పొడవైనది ధరించినపుడు, దానిని మోయటానికి వినియోగించబడతారు. ఎక్కువ వయసు ఉన్న బాలురు ఎక్కువ కష్టతరమైన బాధ్యతలకు అవసరం కావున, ఈ వస్త్ర భాగాన్ని మోయటంలో ఉన్న క్లిష్టత దృష్ట్యా సాధారణంగా ఈ బాలురు ఏడు సంవత్సరాలు నిండినవారై ఉంటారు.[24]

ఒక మెత్తని దిండుపై వివాహ ఉంగరాన్ని పట్టుకున్న ఉంగరాన్ని పట్టుకునే వ్యక్తి.

సాంప్రదాయ వివాహంలో, రింగ్ బేరర్ వధువు బృందం తరపున వివాహ ఉంగరాలను తెచ్చే ప్రత్యేక పేజ్ బాలుడు. ఇది దాదాపుగా ఎల్లపుడూ సంకేతాత్మకంగా జరిగే ఒక ప్రక్రియ, అనగా, రింగ్ బేరర్ ఒక శాటిన్ దిండుపై పొదగబడి ఉంచిన అనుకరణ ఉంగరాలను మోసుకుని రాగా, నిజమైన వివాహ ఉంగరాలు బెస్ట్ మాన్ రక్షణలో ఉంటాయి. అసలైన ఉంగరాలు అయితే, అవి ప్రమాదవశాత్తూ పడిపోకుండా ఉండటం కోసం ఒక దారంతో వదులుగా కుట్టబడతాయి.

రింగ్ బేరర్ ఒక ప్రత్యేక పాత్రగా ఉండటం సాపేక్షంగా ఒక ఆధునిక ఆవిష్కరణ. నేటి సాధారణ వివాహాలలో బెస్ట్ మాన్ ఉంగరాలను తీసుకువస్తాడు.

రింగ్ బేరర్లు తరచుగా మేనల్లుళ్ళు లేదా యువ సోదరులై ఉంటారు (వారు మేనకోడళ్ళు లేదా చెల్లెళ్ళు అయినా కావచ్చు) మరియు సాధారణంగా సుమ బాలలతో సమ వయస్కులై ఉంటారు, దానర్ధం వారు 5సంవత్సరాల కంటే తక్కువ వయసుతో గానీ 10సంవత్సరాల కంటే ఎక్కువ వయసుతో గానీ ఉండరు.[24] వివాహానికి పూర్వమే ఆ జంటకు పిల్లలు ఉన్నట్లైయితే, వారి స్వంత బిడ్డ(రెన్) రింగ్ బేరర్‌గా ఉండవచ్చు.

కాయిన్ బేరర్ కూడా రింగ్ బేరర్ లాంటి వాడే. వివాహ వేదికకు నడిచే మార్గంలో వివాహ నాణేలతో నడిచే బాలుడిని కాయిన్ బేరర్ అంటారు. వివాహ నాణేలు సర్వ సాధారణంగా వెడ్డింగ్ అర్ర్హా అని అంటారు.[25]మూస:Verify credibility. ఈ నాణేలు దీవెన కొరకు వేడుక జరిపే పూజారికి ఇవ్వబడతాయి. జీసస్ మరియు అతని ప్రధాన శిష్యులకు గుర్తుగా ఈ నాణేలు పదమూడు బంగారు మరియు వెండి నాణేలను కలిగి ఉంటాయి.[citation needed] చారిత్రకంగా, స్పానిష్ వలసదారులు ఈ ఆచారాన్ని ప్రారంభించారు.[citation needed]

నిర్వాహకుడు/పురోహితుడు [మార్చు]

పొదరింటి వైపు నడుస్తున్న యూదు వధువు

యునైటెడ్ స్టేట్స్, కెనడా మరియు ప్రపంచం లోని అనేక ఇతర దేశాలలో, ఒక పురోహితుడు అంటే వివాహాలు, అంత్యక్రియలు, నామకరనోత్సవాలు, యుక్త వయసు వేడుకలు, మరియు ఇతర మతపర వేడుకలకు మతపరమైన లేదా లౌకిక నిర్వహణ సేవలను అందించే ఒక వ్యక్తి.

ఎక్కువ మంది పురోహితులు చర్చిచే నియోగించబడిన వారు కాగా, కొంతమంది చట్ట నిర్వాహకులు(సాధారణంగా న్యాయాధికారులు), కాగా మరికొంత మంది ప్రపంచ వ్యాప్తంగా ఉన్న మానవతా సంఘాలచే నియమించబడిన అధికారులు.

పురోహితులు, ప్రధాన స్రవంతి మతపరమైన చర్చ్ వ్యక్తులు జరుపని చోట చోట ప్రత్యామ్నాయ మరియు సాంప్రదాయేతర వేడుకలను జరుపవచ్చు. కొందరు పురోహితులు స్వ-లింగ వివాహాలు మరియు ఒప్పంద వేడుకలు నిర్వహిస్తారు. నిర్వాహకులుగా కూడా పిలువబడే పురోహితులు, వేడుకలను తరచు ఉద్యానవనాలలో, సముద్ర తీరాలలో, పర్వతాల మీద, పడవల పైన, నడిచే త్రోవలపైన, హోటళ్ళలో, లేదా సమావేశ మందిరాలలో, వ్యక్తిగత గృహాలలో, మరియు అనేక ఇతర ప్రదేశాలలో తరచు వేడుకలను నిర్వహిస్తారు.

వివాహ వేడుకలను జరిపించే సామర్ధ్యం ఎవరికి ఉంది అనే దానిపై యునైటెడ్ స్టేట్స్ యొక్క రాష్ట్ర చట్టాలు విభిన్నంగా ఉన్నాయి, కానీ మతాధికారులు లేదా నిర్వాహకులు సాధారణంగా "చర్చికి చెందిన వ్యక్తులు"గా వర్గీకరించబడి శాసన ప్రకారం చర్చి అధికారుల వలె ఒకే విధమైన హక్కులు మరియు బాధ్యతలను కలిగి ఉంటారు. కెనడాలో మరియు US రాష్ట్రాలు అయిన మసాచుసెట్స్, కనెక్టికట్, డిస్ట్రిక్ట్ అఫ్ కొలంబియా, అయోవా, న్యూ హాంప్ షైర్ మరియు వెర్మోంట్, ఉత్తర అమెరికాలో స్వ-లింగ వివాహాలు చట్టబద్ధమైన ప్రదేశాలు, మతాధికారులు మరియు నిర్వాహకులు అనేక LGBT వివాహాలను నిర్వహించవచ్చు. 2010 నాటికి, బెల్జియం, ఐస్ లాండ్, ది నెదర్లాండ్స్, నార్వే, పోర్చుగల్, స్పెయిన్, స్వీడెన్ వంటి ఏడు ఐరోపా దేశాలలో, మరియు దక్షిక్న అమెరికాలోని ఒక దేశం అర్జెంటినాలో, మరియు ఆఫ్రికాలోని ఒక దేశం దక్షిణ ఆఫ్రికాలో స్వ-లింగ వివాహాలు కూడా చట్టబద్ధంగా నిర్వహించబడతాయి.

స్కాట్లాండ్లో, జూన్ 2005 నుండి రిజిస్ట్రార్ జనరల్ ఆదేశం ద్వారా, మానవతావాద వివాహాలు ప్రస్తుతం చట్టబద్ధమయ్యాయి, అయితే వాటిని హ్యూమనిస్ట్ సొసైటీ అఫ్ స్కాట్లాండ్ యొక్క అధీకృత నిర్వాహకుడు నిర్వహిచి ఉండాలి, దీనితో స్కాట్లాండ్ ప్రపంచంలోని ఈ విధమైన మూడు దేశాలలో ఒకటిగా మారింది. (మిగిలిన రెండు USA మరియు నార్వే.)

పురోహితులు, సైనిక మత ప్రచారకుల నుండి విభిన్నంగా ఉంటారు, పురోహితులు సాధారణంగా సంస్థకు అనుబంధం కాని ప్రజలకు సేవలను అందిస్తారు, అయితే సైనిక మత ప్రచారకులు సాధారణంగా ఒక ఆసుపత్రి లేదా ఆరోగ్య సంరక్షణ కేంద్రం, సైన్యం వంటి ఒక సంస్థచే నియమించబడతారు.

ఆస్ట్రేలియాలో, స్థానిక మరియు దేశీయ చట్టాలచే నియంత్రించబడే పురోహితులు, కొంత విభిన్నమైన పాత్రను కలిగిఉంటారు. మరింత సమాచారం కొరకు సెలబ్రెంట్ (ఆస్ట్రేలియా) చూడుము.

యునైటెడ్ స్టేట్స్ లో, మతాధికారులంటే మతపర కార్యక్రమం మరియు తంతులు సమాజం మరియు వ్యక్తుల ప్రాధమిక అవసరాలను తీర్చే శక్తి మరియు ప్రభావం కలిగి ఉంటాయని నమ్ముతూ వాటిని వృత్తిపరంగా నిర్వహించేవారు. మతాధికారులు తమ స్వీయ నమ్మకాలతో సంబంధం లేకుండా, తమ సేవార్దుల వ్యకిగత వేడుకలను వారి నమ్మకాలు, జీవన సిద్ధాంతాలు, మరియు వ్యక్తిత్వాన్ని ప్రతిఫలించేటట్లుగా నిర్వహిస్తారు. మరింత సమాచారం కొరకు సెలబ్రెంట్ (యునైటెడ్ స్టేట్స్) చూడుము.

క్వాకర్ వివాహాలలో జంట మూడవ వ్యక్తి నిర్వహణ లేకుండానే వివాహం చేసుకుంటారు.

చిత్రకళా ప్రదర్శన [మార్చు]

ఆధునిక వివాహాలు [మార్చు]

చారిత్రిక వివాహాలు [మార్చు]

వీటిని కూడా చూడండి [మార్చు]

  • ఆఫ్రుఫ్, వధువుల కొరకు ఒక యూదు వేడుక
  • ఇతర వివాహ పదాల నిర్వచనాల కొరకు వివాహ పదాల పదానుక్రమణి

సూచనలు [మార్చు]

{{{1}}} గురించిన మరింత సమాచారము కొరకు వికీపీడియా యొక్క సోదర ప్రాజెక్టులు:అన్వేషించండి

Wiktionary-logo-en.png [[wiktionary:Special:Search/{{{1}}}|నిఘంటువు నిర్వచనాలు]] విక్క్షనరీ నుండి
Wikibooks-logo.svg [[wikibooks:Special:Search/{{{1}}}|పాఠ్యపుస్తకాలు]] వికీ పుస్తకాల నుండి
Wikiquote-logo.svg [[wikiquote:Special:Search/{{{1}}}|ఉదాహరణలు]] వికికోటు నుండి
Wikisource-logo.svg [[wikisource:Special:Search/{{{1}}}|మూల పుస్తకాల నుండి]] వికి మూల పుస్తకాల నుండి
Commons-logo.svg [[commons:Special:Search/{{{1}}}|చిత్రాలు మరియు మాద్యమము]] చిత్రాలు మరియు మాద్యమము నుండి
Wikinews-logo.png [[wikinews:Special:Search/{{{1}}}|వార్తా కథనాలు]] వికీ వార్తల నుండి

మూస:1911

  1. ఆన్‌లైన్ ఎటిమోలోజి డిక్షనరీ.
  2. (Monger 2004, p. 107)
  3. Maura Banim; Ali Guy; Green, Eileen (2003). Through the Wardrobe: Women's Relationship with Their Clothes (Dress, Body, Culture). Oxford, UK: Berg Publishers, 61–62. ISBN 1-85973-388-3. 
  4. Martin, Judith (2005). Miss Manners' Guide to Excruciatingly Correct Behavior, Freshly Updated, Kamen, Gloria, New York: W. W. Norton & Company, 408–411. ISBN 0-393-05874-3. 
  5. వెడ్డింగ్ పర్స్ యొక్క సంక్షిప్త చరిత్ర, బ్రైడ్స్' విలేజ్, 28 మార్చ్ 2010న తిరిగి పొందబడింది
  6. (Monger & 2004 p49-52)
  7. (Monger 2004, p. 232)
  8. బ్రాండ్, యాంటిక్విటీస్ అఫ్ గ్రేట్ బ్రిటన్ (హజ్లిత్ట్'స్ ఎడిషన్, 1905)
  9. రెవరెండ్ J. ఎడ్వర్డ్ వాక్స్, చర్చ్ ఫోక్‌లోర్ (1894)
  10. *క్లీన్, ఎర్నెస్ట్, Dr., ఎ కాంప్రహెన్సివ్ ఎటిమలాజికల్ డిక్షనరీ అఫ్ ది ఇంగ్లీష్ లాంగ్వేజ్ డీలింగ్ విత్ ది ఆరిజన్ అఫ్ వర్డ్స్ అండ్ దెయిర్ సెన్స్ డెవలప్మెంట్ థస్ ఇల్లస్ట్రేటింగ్ ది హిస్టరీ అఫ్ సివిలైజేషన్ అండ్ కల్చర్, ఎల్సేవిఎర్ (సైన్సు B.V.), ఆక్స్ఫర్డ్, 1971, పేజీ 324
  11. గ్రూమ్‌పవర్.కామ్
  12. వివాహానికి కంటాభరణాలు
  13. Martin, Judith (2005). Miss Manners' Guide to Excruciatingly Correct Behavior, Freshly Updated, Kamen, Gloria, New York: W. W. Norton & Company, 383. ISBN 0-393-05874-3. “[I]n polite society...the bridesmaids' only duties are to make a special fuss over the bride by gathering around her at the wedding and, in the weeks before, by pretending to be interested in all the wedding details. It is also nice, but not obligatory, for them to plan a girlishly informal gathering—a luncheon or shower—for her beforehand.” 
  14. Martin, Judith (1999). Miss Manners on weddings. New York: Crown Publishers, 136–137. ISBN 0-609-60431-7. 
  15. 15.0 15.1 Post, Emily (1922). Etiquette in Society, in Business, in Politics and at Home'. Funk & Wagnalls Company, 335–337. 
  16. ఓట్నెస్, సెలె C.; ప్లెక్, ఎలిజబెత్ H.. "ది ఎంగేజ్మెంట్ కాంప్లెక్స్". సిన్డరెల్లా డ్రీమ్స్: ది అల్యూర్ అఫ్ ది లావిష్ వెడ్డింగ్. యూనివర్శిటీ ఆఫ్ కాలిఫోర్నియా ప్రెస్. ISBN 0-520-24008-1.పేజీ 74
  17. Post, Peggy (2006). Emily Post's wedding etiquette, 5, London: Collins, 183–184. ISBN 0-06-074504-5. 
  18. 18.0 18.1 "International Wedding Customs". Archived from the original on 2008-05-03. Retrieved 2008-06-20. 
  19. T. Sharper Knowlson [1910] (2008). The Origins of Popular Superstitions and Customs (Forgotten Books). Forgotten Books, 100–102. ISBN 1-60506-4580. 
  20. Leopold Wagner (1995). Manners, Customs and Observances. Omnigraphics Inc, 61–62. ISBN 978-1605067988. 
  21. "Essential Guide to Ukrainian Wedding Traditions!". What's On Kiev. Retrieved 2008. 
  22. 22.0 22.1 Post, Peggy. Emily Post's Wedding Etiquette, 5e. London: Collins, 85. ISBN 0-06-074504-5. 
  23. ఎవెడ్డింగ్‌మినిస్టర్స్.కామ్
  24. 24.0 24.1 Stewart, Arlene Hamilton (1995). A bride's book of wedding traditions. New York: Hearst Books, 106. ISBN 0-688-12768-1. 
  25. http://lovelywed.com/blog/2006/12/coin-bearer-explained.html