పొద్దుతిరుగుడు నూనె

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
మొక్క
పువ్వు
గింజలు
చిన్నరకం నూనెతీయు యంత్రం
సూర్యకాంతి గానుగ పిండి/చెక్క
సూర్యకాంతి రిపైండ్ నూనె

పొద్దుతిరుగుడు నూనెను పొద్దు తిరుగుడు లేదా సూర్యకాంతి మొక్కయొక్క విత్తనాలనుండి తీయుదురు.పొద్దుతిరుగుడు గింజలనుండి తీసిన నూనె ఆహారయోగ్యమైన వంటనూనె.సూర్యకాం తి మొక్క వృక్షజాతిలో అస్టరేసి(Asteraceae) కుటుంబానికి చెందినమొక్క.మొక్క యొక్క వృక్షశాస్త్ర పేరు హెలియంథస్ అన్నూస్(helianthus annus).ఈ మొక్క ఆదిమ పుట్తుక స్థలం అమెరికా[1].5వేలసంవత్సరాలక్రితమే అక్కడదీని వునికి వున్నట్లు తెలుస్తున్నది.కీ.పూ.2600 నాటికే పొద్దుతిరుగుడుమొక్కను మెక్సికోలో సాగులోకి తెచ్చినట్లు తెలుస్తున్నది[2].స్పానిష్ పరిశోధకులు దీని యూరప్ కూ తీసువచ్చారు.మొదట స్పానిష్ లో పెంచబడి,అక్కడినుండి పొరుగురాజాలకు విస్తరించబడినది[3],ఇది ఏకవార్షికం. ప్రపంచంలో నూనెగింజలకై అత్యధికంగా సాగుచేయబడుచున్నపంటలలో సూర్యకాంతి ఒకటి.చీడపీడలనుతట్టుకొని అత్యధిక దిగుబడి సంకరవంగడాలు అనేకం కనిపెట్టబడినాయి.

భారతీయభాషలలో పొద్దుతిరుగుడు సాధారణపేరు[4][5][మార్చు]

ప్రపంచంలో పొద్దుతిరుగుడు పంటను అధికంగా సాగుచేస్తున్న దేశాలు[మార్చు]

ప్రపంచంలో చాలా దేశాలు పొద్దుతిరుగుడు పంటను పండిస్తూన్నాయి.అందులో రష్యా,అర్జెంటినా,టర్కీ,బల్గెరియా,దక్షిణ అమెరికా,చైనా మరియు ఇండియాలో ఈపంటను ఎక్కువ విస్తీర్ణంలో సాగుచేస్తున్నారు.

భారతదేశంలో సూర్యకాంతి/పొద్దుతిరుగుడు పంటను అధికవిస్తీర్ణంలొ సాగుచేస్తున్న రాష్ట్రాలు[మార్చు]

భారతదేశంలో పొద్దుతిరుగుడు పంటసాగులో కర్నాటకరాష్ట్రం మొదటి స్థానంలో వున్నది.రెండో స్థానం ఆంధ్ర ప్రదేశ్,మూడోవది మహారాష్ట్ర.బీహారు,హర్యానామరియు ఉత్తర ప్రదేశ్రాష్ట్రాలలో తక్కువ విస్తీర్ణంలో సాగవుతున్నది.

సాగువిధానం[మార్చు]

చాలారకాలభూములో పెరుగుతుంది.నల్లరేగడి భూములు అనుకూలం.విత్తనాన్ని విత్తినతరువాత మొలకవచ్చేవరకు చల్లని వాతావరణం వుండాలి.మొలక ఏపుగా అయ్యినప్పటినుండి,పూతసమయంవరకు వెచ్చని వాతావరణం వుండాలి,నేల PH 6.5-8.0 మధ్యలో వున్నసరిపోతుంది.పంటకాలం90-100 రోజులు.హెక్టారుకు విత్తన దిగుబడి 1200-1500 కిలోలు.విత్తనం నల్లటి పెలుసైన పొట్టునుకల్గివుండును.విత్తనం రెండు చివరలు దగ్గరిగానొక్కబడి మధ్యభాగం ఉబ్బెత్తుగా,వెడల్పుగా వుండును.విత్తనాన్ని పక్షుల ఆహారంగా కూడా ఉపయోగిస్తారు.విత్తనంలో నూనే,ప్రోటిన్,పీఛు పదార్థాలు పుష్కలంగా వున్నాయి.భారతదేశంలో ఉత్పత్తిఅయ్యే విత్తానాలో ఉండే పోషకాలకు,విదేశంలో పండే విత్తనాలలో వుండే పోషకాల నిష్పత్తిలో తేడావున్నది.

పొద్దుతిరుగుడు గింజలోవున్న పదార్థాల పట్టిక [4]

పోషక పదార్థం విదేశ విత్తనం భారతదేశ విత్తనం
తేమ% 3.3-12.8% 5.0-6.0%
ముడి మాంసకృత్తులు 13.5-19.1 20.0-30.0
నూనె 22.2-36.5 30.0-50.0
నూనెలోని అన్ సపొనిఫియబుల్ పదార్థం 0.8-1.5
పీచు పదార్థం 23.5-32.3 11.0-22.0
కాల్చిన ఏర్పడు బూడిద 2.6-4 3.0-6.0
నత్రజని 8.0-20.0

నూనె ఉత్పత్తి[మార్చు]

విత్తనాలనుండి నూనెను రెండురకాలుగా ఉత్పత్తిచేయుదురు.ఒకవిధానంలో విత్తనాలను ఎక్సుపెల్లరు అను నూనెతీయు యంత్రాలలో ఆడించి నూనెను తీయుదురు.ఈ పద్ధతిలో నూనెతీయగా మిగులుగా వచ్చు పిండిని గానుగ పిండి లేదా తెలగపిండి అంటారు.ఇందులో 6-10% వరకు నూనె మిగిలివుంటుంది.ఇలా పిండి/గానుగచెక్కలో వున్న నూనెను తిరిగి సాల్వెంట్ ప్లాంట్ అనే పరిశ్రమలో ఆడించి,పిండిళో వున్న మొత్తంనూనెను తీయ్యడం జరుగుతుంది.మరొక పద్ధతిలో గింజలను ఎక్సుట్రూడరు అనేయంత్రం ద్వారా సన్నని ముద్దలాంటి ముక్కలుగా చేసి,దాన్నినేరుగా సాల్వెంట్ ప్లాంట్లో ఆడీంచి నూనెను తీయుదురు.అంతేకాకుండ గ్రామీణస్థాయిలో విద్యుత్తు మోటారు తో తిరిగే గానుగ వంటి రోటరిలలో కూడా పొద్దుతిరుగుడు గింజలనుండి నూనెను తీయుదురు.

నూనె బౌతిక ధర్మాలు-నూనెలోని కొవ్వుఆమ్లాలు[మార్చు]

పొద్దుతిరుగుడులో పలురకాలైన వంగడాలవలన,మరియు పంటపెరిగిన నేల స్వభావం,వాడిన రసాయనిక ఎరువుల ప్రభావం వలన నూనెలోని ఒలిక్ మరియు లినొలిక్ ఆమ్లనిష్పత్తి మారడం వలన నూనెయొక్క అయోడిన్ విలువ,సపోనిఫికెసను సంఖ్య,మరియు సాంద్రతలో తేదాలు వుంటాయి.అలాంటి మూడురకాలనూనెలను పట్టికలో ఇవ్వడం జరిగినది.

పొద్దుతిరుగుడు నూనె భౌతిక గుణాల పట్టిక [6][4]

భౌతిక లక్షణం సగటు పొద్దుతిరుగుడు నూనె నుసన్ మధ్యస్తంగా ఒలిక్ ఆమ్లమున్న నూనె అత్యధికంగా ఒలిక్ ఆమ్లమున్ననూనె
సాంద్రత250C/200C 0.910-0.923 0.914 0.909-0.915{250C
వక్రీభవనసూచిక(ND 40C) 1.461-1.466 1.461-1471(250C 1.467-1.472-1(250C
సపోనిఫికెసను సంఖ్య/విలువ 188-194 190-191 182-194
అయాడిన్ విలువ 118-141 94-122 78-90
అన్ సపోనొఫియబుల్ పదార్థం ≤1.5 ≤1.5 ≤1.5

పొద్దుతిరుగుడు వంగడం రకంనుబట్టి నూనె లోని కొవ్వు ఆమ్లాల నిష్పత్తి మారుచుండును.భారతదేశంలో పండు నూనెగింజలలో లినోలిక్ ఆమ్లంలో 40-75% వరకుంటుంది,అలాగే ఒలిక్ ఆమ్లం 19-44% వరకుంటుంది.లినొలిల్ ఆమ్లశాతం నూనెలో పెరిగేకొలది దానియొక్క అయోడిన్ విలువ/సంఖ్య పెరుగుతుంది.కారణం లినొలిక్ బహుద్విబంధాలు(రెండు ద్విబంధాలు)వున్న అసంతృప్తకొవ్వుఆమ్లం.దీనినే బహుబంధాలున్న అసంతృప్తకొవ్వుఆమ్లాలు(ఫ్యూపా:PUFA→Polyunsaturated fatty acids)అంటారు.

నూనెలో సగటుగా లినొలిక్ మరియు ఒలిక్ ఆమ్లాలు వున్న పట్టిక [7]

కొవ్వు ఆమ్లాలు శాతం
పామిటిక్‌ ఆమ్లం( C16:0) 6.52±1.75
స్టియరిక్ ఆమ్లం(C18:0) 1.98±1.44
ఒలిక్ ఆమ్లం(C18:1) 45.39±18.77
లినొలిక్ ఆమ్లం(C18:2) 46.02±16.75
లినొలెనిక్‌ ఆమ్లం(C18:3) 0.12±0.09

భారతదేశంలో పండించు వివిధ వంగడాల/రకాల నూనెలోని కొవ్వుఆమ్లాల నిష్పతి పట్టిక[4]

వంగడం రకం పామిటిక్ స్టియరిక్ ఒలిక్ లినొలిక్
1701 6.9 3.5 18.9 70.4
1703 7.0 3.9 18. 70.5
1710 10.8 8.0 27.2 53.3
KSP-9 9.0 8.1 24.7 57.4
KSP-10 7.6 5.3 24.8 61.5
camp-7 8.3 3.2 19.5 68.8
KSR-11 6.6 4.6 20.2 68.1
EC 68415 6.2 5.0 30.8 58.0
సరాసరి 5.9 5.8 44.0 44.3

పొద్దుతిరుగుడునూనె-వినియోగం[మార్చు]

  • అత్యధికంగా ప్రపంచం మొత్తంలో ప్రధమంగా వినియోగించెది వంటనూనెగా[4].
  • సౌందర్య ద్రవాలు,లేపనాలలో,చర్మరక్షణ నూనెలలో వినియోగిస్తారు[8].

ఉల్లేఖనాలు/మూలాలు/ఆధారాలు[మార్చు]

  1. Blackman et al. (2011) [1]. PNAS.
  2. Lentz et al. (2008) PNAS.
  3. http://www.whfoods.com/genpage.php?tname=foodspice&dbid=57
  4. 4.0 4.1 4.2 4.3 4.4 SEA,HandBook-2009 by The Solvent Extractors Association of India
  5. http://www.flowersofindia.net/catalog/slides/Sunflower.html
  6. http://www.sunflowernsa.com/uploads/resources/51/warner_.pdf/ KATHLEEN WARNER1 , BRADY VICK2 , LARRY KLEINGARTNER3 , RUTH ISAAK3 , AND KATHI DOROFF4
  7. Studies on the Fatty Acid Composition of Edible Oil K. Chowdhury, L. A. Banu, S. Khan and A. Latif IFST, BCSIR, Dhaka-1205, Bangladesh
  8. http://www.stylecraze.com/articles/best-benefits-of-sunflower-oil-for-skin-hair-and-health/