పొన్నాల లక్ష్మయ్య

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పొన్నాల లక్ష్మయ్య
పొన్నాల లక్ష్మయ్య


తెలంగాణ పిసిసి అధ్యక్షుడు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ మంత్రి
నియోజకవర్గం జనగామ, వరంగల్ జిల్లా

వ్యక్తిగత వివరాలు

జననం (1944-02-15) 1944 ఫిబ్రవరి 15 (వయసు 80)
ఖిలాషాపూర్, జనగామ జిల్లా, తెలంగాణ రాష్ట్రం, భారతదేశం
రాజకీయ పార్టీ భారత రాష్ట్ర సమితి
ఇతర రాజకీయ పార్టీలు కాంగ్రెస్
జీవిత భాగస్వామి పొన్నాల అరుణ దేవి
సంతానం ఇద్దరు కుమారులు
నివాసం జూబ్లీ హిల్స్ హైదరాబాదు, భారతదేశం
మతం హిందూ

పొన్నాల లక్ష్మయ్య తెలంగాణకు చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడు. ఈయన జనగామ శాసనసభ నియోజకవర్గం నుంచి 4 సార్లు శాసనసభకు ఎన్నికకావడమే కాకుండా 4 ముఖ్యమంత్రుల హయంలో రాష్ట్ర మంత్రిగానూ పనిచేశారు. 2014, మార్చి 11న తెలంగాణ పిసిసి తొలి అధ్యక్షులుగా నియమితులైనారు.[1]పొన్నాల లక్ష్మయ్య కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు.

పొన్నాల లక్ష్మయ్యకు 2023లో జరిగే శాసనసభ ఎన్నికల్లో జనగామ టికెట్‌ దక్కే పరిస్థితులు లేకపోవడంతో మసస్తాపం చెందిన ఆయన 2023 అక్టోబర్ 13న కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశాడు.[2][3] జనగామలో అక్టోబర్ 16న జరిగిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ సమక్షంలో భారత రాష్ట్ర సమితీ పార్టీలో చేరాడు.[4]

బాల్యం[మార్చు]

1944, ఫిబ్రవరి 15న రాధమ్మ, రామకిష్టయ్యలకు జన్మించాడు. పొన్నాల జన్మించిన గ్రామం ఖిలాషాపూర్, మండలం రఘునాధపల్లి తెలంగాణాలో వెనుకబడిన కులమైన మున్నూరు కాపులో జన్మించిన లక్ష్మయ్య తెలంగాణ పల్లెలలోని నాటి దొరల కులవివక్షకు గురయ్యాడు. దానితో ఎలాగైనా జీవితంలో మంచి స్థితికి చేరుకోవాలన్న పట్టుదల చిన్ననాటి నుండే బలంగా ఉండేది. పట్టుదలగా విద్యాభ్యాసం చేసి ప్రాథమిక విద్యను స్వగ్రామంలోనే అనేక ఆటుపోట్ల మధ్య పూర్తి చేశాడు.

విద్యాభ్యాసం[మార్చు]

మనదేశంలో తాంత్రిక శాస్త్రంలో ప్రాథమిక పట్టా అందుకొని అమెరికాలో మెకానికల్ ఇంజనీరింగ్ లో మాస్టర్స్ పట్టా అందుకొని అక్కడ కొన్ని రోజులు పనిచేశాడు.

రాజకీయాలు[మార్చు]

జనగామ నుండి నాలుగు పర్యాయాలు శాసన సభ్యులుగా ఎన్నికయ్యాడు. మూడు సార్లు మంత్రి పదవులను నిర్వహించాడు. ఇప్పటి వరకు ప్రభుత్వ, పార్టీ పదవులను ఎన్నో చేపట్టాడు.

  • 2010 - ఇప్పటి వరకు - ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఇన్ఫర్మెషన్ టెక్నాలజీ ‍& కమ్మునికెషన్స్ శాఖ మంత్రి
  • 2009 - ఇప్పటి వరకు - ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భారీ, మధ్యతరహా నీటి పారుదల శాఖ మంత్రి
  • 2004-2009 - ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భారీ, మధ్యతరహా నీటి పారుదల శాఖ మంత్రి
  • 2002 - ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజా పద్దుల సంఘ సభ్యుడు, నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ సంఘ సభ్యుడు
  • 1999 - జనగాం నియోజకవర్గం నుండి శాసనసభకి ఎన్నిక
  • 1991, 1992 - ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి వర్గ సభ్యుడు

పార్టీ పదవులు[మార్చు]

  • 2014- తెలంగాణ పిసిసి అధ్యక్షుడు
  • 2006 - హైదరాబాదులో జరిగిన 82వ కాంగ్రెస్ ప్లీనరీ సంఘము ఇంచార్జి
  • 1999 - కాంగ్రెస్ శాసనసభా పక్ష సంఘ సభ్యుడు
  • 1991 - ఇప్పటివరకు - అఖిల భారతీయ కాంగ్రెస్ పార్టీ సంఘ సభ్యుడు
  • 1999 - కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ శాసన సభ, పార్లమెంటు ఎన్నికల సంఘ సభ్యుడు
  • 1999 - కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ప్రచార సంఘ సభ్యుడు
  • 1998 - కాంగ్రెస్ పార్టీ హన్మకొండ పార్లమెంటు స్థాన ఎన్నికల ఇంచార్జి
  • 1998 - కాంగ్రెస్ పార్టీ మెట్‌పల్లి ఉప ఎన్నికల ఇంచార్జి
  • 1997 - కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ సంస్థాగత ఎన్నికల ఇంచార్జి
  • 1996 - కాంగ్రెస్ పార్టీ వంగల్ జిల్లా ప్రచార సంఘ అధ్యక్షుడు
  • 1996 - కాంగ్రెస్ పార్టీ అనంతపురం జిల్లా ఇంచార్జి
  • 1991 - తిరుపతిలో జరిగిన 79వ కాంగ్రెస్ ప్లీనరీ సంఘము విదేశీ ఆహ్వానితుల సంఘ అధ్యక్షుడు
  • 1989 - 1990 - ప్రదేశ్ కాంగ్రెస్ సంఘ సభ్యుడు
  • 1988- 1989 -వరంగల్ జిల్లా కాంగ్రెస్ సంఘ ఉపాధ్యక్షుడు
  • 1985- 1988 - వరంగల్ జిల్లా కాంగ్రెస్ సంఘ కోశాధికారి

ఇతరములు[మార్చు]

  • 1993- భారతదేశంలోఆత్యున్నత అధికారులైన ఐఎఎస్ అభ్యర్థులు శిక్షణ ఆచరించే లాల్ బహదూర్ శాస్త్రి అకాడమీ, ముస్సోరిలో అతిథి ఉపన్యాసం ఇచ్చేందుకు ఆహ్వానంపై 1993 వర్గానికి చెందిన అధికార బృందాన్ని ఉద్దేశించి ఉపన్యసించాడు.

మూలాలు[మార్చు]

  1. ఈనాడు దినపత్రిక, తేది 12-03-2014
  2. Eenadu (13 October 2023). "'కాంగ్రెస్‌ పార్టీకి పొన్నాల లక్ష్మయ్య రాజీనామా,'". Archived from the original on 13 October 2023. Retrieved 13 October 2023.
  3. Hindustantimes Telugu (13 October 2023). "కాంగ్రెస్‌ పార్టీని వీడిన పొన్నాల లక్ష్మయ్య రాజీనామా". Archived from the original on 14 October 2023. Retrieved 14 October 2023.
  4. Sakshi (16 October 2023). "సీఎం కేసీఆర్‌ సమక్షంలో బీఆర్‌ఎస్‌లో చేరిన పొన్నాల". Archived from the original on 16 October 2023. Retrieved 16 October 2023.