పోతన కీ బోర్డు
| తెలుగు కొరకు పోతన కీ బోర్డు | |
|---|---|
| అభివృద్ధిచేసినవారు | తిరుమల కృష్ణ దేశికాచారి (విండోస్) |
| సరికొత్త విడుదల | 5.0.112.0(సాఫ్ట్‌వేర్) |
| నిర్వహణ వ్యవస్థ | విండోస్ ఎక్స్.పి., విండోస్ 2000, విండోస్ 95,98,ఎమ్.ఈ. లినక్స్ |
| రకము | కీ బోర్డు |
| లైసెన్సు | జీ.పి.ఎల్ |
| వెబ్‌సైట్ | http://www.kavya-nandanam.com |
పోతన తెలుగు కీ బోర్డు తిరుమల కృష్ణ దేశికాచార్యులు రూపొందించాడు. ఇన్స్ క్రిప్ట్ లాంటి వాటిలో మంచి లక్షణాలు (ఒకే కీల సమూహానికి ఒకే అక్షరము) మరియు ఐట్రాన్స్ లేక ఆర్ టి యస్ లో మంచి లక్షణాలు ( గుణింతాలకొరకు హల్లుల తర్వాత అచ్చులు వాడటం), మరియు ఇంగ్లీషు కీల ఉచ్ఛారణకి దగ్గరగా తెలుగు అక్షరాలు జతచేయబడి సులభంగా రెండు భాషలలో టైపు చేసుకోవటం నేర్చుకోవటానికి, వాడటానికి వీలుగా వుంటుంది. తెలుగు లో విండోస్ 2000, విండోస్ ఎక్స్.పి.(XP), విండోస్ 95,98,ME లో మరియు లినక్స్ అప్లికేషన్ల లో ఈ సాఫ్ట్‌వేర్ ను వాడవచ్చు. ఇది తెలుగు టైపు రైటరు కు దగ్గరగా ఉంటుంది. దీనిని మొదటిసారి విండోస్ వాడేవారికి పోతన ఫాంటు, వేమన ఫాంటులతో జతచేసి విడుదల చేసారు
విషయ సూచిక |
[మార్చు] మొదలు పెట్టడము
విండోసు
విండోస్ ఉన్న కంప్యూటర్ల లో సాఫ్ట్‌వేర్ ను దించి వ్యవస్థాపితం చేస్తే చాలు. తరువాత వర్డ్, వర్డ్పాడ్ లాంటి అప్లికేషన్ ల లో పోతన2000 అనే ఫాంట్ సెలక్టు చేసుకుని, తెలుగులో టైపు చెయ్యవచ్చు. మామూలుగా, విండోస్ లో తెలుగు భాషను ఎంచుకోవాలి. ఆ తరువాత కీమాన్ కీబోర్డు బార్ లో తెలుగుని ఎంచుకోవాలి
లినక్సు
దీని ఫైళ్లు m17n-contrib పాకేజిలో వున్నాయి అవసరమైతే scim-bridge, scim-m17n, m17n-contrib పాకేజీలు తెచ్చుకోవాలి. పాకేజిలు వ్యవస్థాపితం చేసి scim setup లో తెలుగు భాషని దానిలో పోతనను ఎంచుకోవాలి. ఫెడోరా, ఉబుంటు వాటిలో బాగానే పనిచేస్తుంది.