ప్యాసా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ప్యాసా
సినిమా పోస్టరు
దర్శకత్వంగురుదత్
రచనఅబ్రార్ అల్వి
నిర్మాతగురుదత్
తారాగణంగురుదత్
మాలా సిన్హా
వహీదా రెహ్మాన్
జానీ వాకర్
రెహ్మాన్
ఛాయాగ్రహణంవీ.కే.మూర్తి
కూర్పువై.జి. చౌహాన్
సంగీతంఎస్.డి.బర్మన్
విడుదల తేదీs
ఫిబ్రవరి 19, 1957
సినిమా నిడివి
146 నిమిషాలు
దేశంభారత్
భాషహిందీ

ప్యాసా (ఆంగ్లం : Pyaasa) (హిందీ: प्यासा; ఉర్దూ: پیاسا ) అర్థం : దప్పిగొన్నవాడు. ఇదొక హిందీ సినిమా. 1957 లో నిర్మింపబడింది. దీని నిర్మాత దర్శకుడు ప్రముఖ బాలీవుడ్ హీరో గురుదత్.

ఈ సినిమా, సంఘర్షణ పడే ఒక అభ్యుదయవాద కవి విజయ్ (గురుదత్) గాథ, భారత స్వాతంత్ర్యపూర్వం తన రచనలను ముద్రించాలనే తలంపుతో వుండేవాడు. గులాబో (వహీదా రెహ్మాన్) ఒక వేశ్య పాత్ర.[1] అవినీతి, నీతిరహిత ప్రపంచాన్ని చూసి, పేదరికం వలన తమ శరీరాలను అమ్ముకునే స్త్రీలను చూసి కన్నీళ్ళపర్యంతమౌతాడు. ఇలాంటి హేయకర సమాజాన్ని చూసి "జిన్‌హేఁ నాజ్ హై హింద్ పర్ వో కహాఁ హైఁ" (ఇలాంటి దృశ్యాలు గల భారత్ పై గర్వపడేవారెక్కడ?) అనే పాట ప్రేక్షకులకు కదిలించివేస్తుంది. తన కవితలను ప్రచురించడానికి ఒక ప్రెస్, పబ్లిషర్ అయిన ఘోష్ (రెహ్మాన్) ను ఆశ్రయిస్తే, అతను ద్రోహం చేస్తాడు. గులాబో విజయ్ ను సహాయం చేస్తుంది, అతడి కవితలను ప్రచురింపజేస్తుంది. ఈ సినిమాకు సంగీతం సమకూర్చినవాడు ఎస్.డి.బర్మన్ (ఆర్.డి.బర్మన్ తండ్రి). సాహిత్యపరంగా పాటలన్నీ హిట్టయ్యాయి. వ్యాపారపరంగా బాగా లాభాలు గడించిన సినిమా "ప్యాసా".

నటీనటవర్గం[మార్చు]

పాటలు[మార్చు]

ఎస్.డి.బర్మన్ చక్కటి సంగీతం, సాహిర్ లుధియానవి హృద్యమైన సాహిత్యం, గీతాదత్, ముహమ్మద్ రఫీ యొక్క గానకళా కౌశల్యాలు ఈ చిత్ర విశేషాలు. ఈ సినిమా భారతీయ సినీరంగంలో ఓ కలికితురాయి అనడంలో సందేహం లేదు. రచయిత చెప్పదలచుకున్నది, చక్కగా తెరపై కెక్కించబడిన ఈ సినిమా, ప్రముఖ కంపోజర్ ఎస్.డి.బర్మన్, గీతరచయిత సాహిర్ లుధియానవి లను అమరుల్ని చేసినది.[2]

2004లో, ప్యాసా సౌండ్-ట్రాక్ ను, బ్రిటిష్ ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్ మేగజైన్ వారు, సైట్ అండ్ సౌండ్వారి "ద బెస్ట్ మ్యూజిక్ ఇన్ ఫిల్మ్" అని ఎంపిక చేశారు.[3]

మూలాలు[మార్చు]

  1. Anindita Ghose (August 2006). "Of Names of Women in Hindi Cinema. The film is based on a book written by author and poet Chandra Shekhar 'Prem', from Himachal Pradesh. It was partly based on his life story. He was a struggling poet in the 1950's at the time and took the book to Bollywood. He sold the story and it's rights for Rs.500, so was never given any credit for his work. He went on to publish many books in Hindi and Urdu he was never recognised as the true author of this work. He died in 2002. An Exploration in Semantics" (PDF). e-Social Sciences. Archived from the original (PDF) on 2010-12-24. Retrieved 2009-04-02.
  2. "Pyaasa". Archived from the original on 2008-05-16. Retrieved 2009-06-03.
  3. Olivier Assayas (September 2004). "The Best Music in Film". Sight & Sound. Archived from the original on 2009-05-05. Retrieved 2009-04-26.

బయటి లింకులు[మార్చు]

"https://te.wikipedia.org/w/index.php?title=ప్యాసా&oldid=3824932" నుండి వెలికితీశారు