ప్రకాశం జిల్లా

వికీపీడియా నుండి
(ప్రకాశం నుండి దారిమార్పు చెందింది)
  ?ప్రకాశం జిల్లా
ఆంధ్ర ప్రదేశ్ • భారతదేశం
ప్రకాశం జిల్లా
ప్రకాశం జిల్లా
అక్షాంశరేఖాంశాలు: 15°30′N 80°03′E / 15.5, 80.05
కాలాంశం భాప్రాకా (గ్రీ.కా+5:30)
విస్తీర్ణం 17,626 కి.మీ² (6,805 చ.మై)
ముఖ్య పట్టణము ఒంగోలు
ప్రాంతం కోస్తా
జనాభా
జనసాంద్రత
పట్టణ
• మగ
• ఆడ
అక్షరాస్యత శాతం
• మగ
• ఆడ
33,92,764 (2011)
• 192/కి.మీ² (497/చ.మై)
• 4,66,000(2001)
• 17,12,735 (2011)
• 16,80,029 (2011)
• 57.86 (2001)
• 69.78(2001)
• 45.6(2001)

అక్షాంశరేఖాంశాలు: 15°30′N 80°03′E / 15.5, 80.05


ప్రకాశం జిల్లా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రము యొక్క తొమ్మిది కోస్తా ప్రాంతపు జిల్లాల్లో ఒకటి. ప్రకాశం జిల్లా ముఖ్య పట్టణము ఒంగోలు. ఒంగోలు జిల్లా ఫిబ్రవరి 2,1970వ తేదీన, నెల్లూరు, కర్నూలు మరియు గుంటూరు జిల్లాల యొక్క కొంత భాగముల నుండి ఆవిర్భవించినది. తరువాత డిసెంబర్ 5,1972వ తేదీన, జిల్లాలోని కనుపర్తి గ్రామములో పుట్టిన గొప్ప దేశభక్తుడు మరియు ఆంధ్ర నాయకుడైన, ఆంధ్ర కేసరి టంగుటూరి ప్రకాశం పంతులు జ్ఞాపకార్ధము ప్రకాశం జిల్లాగా నామకరణము చేయబడినది. ప్రకాశంజిల్లా అనగానే గుర్తుకు వచ్చేవి ఒంగోలు జాతి గిత్తలు.

విషయ సూచిక

[మార్చు] చరిత్ర

జిల్లా చరిత్రకు నెల్లూరు, కర్నూలు, గుంటూరు జిల్లాల చరిత్రే ఆధారం.[1] ఈ ప్రాంతాన్ని ఇక్ష్వాక, పల్లవ, చాళుక్య,కాకతీయ రాజ వంశాలు, రెడ్డిరాజులు, విజయనగర రాజులు, గోల్కొండ, కర్ణాటక నవాబులు పరిపాలించారు. భారతాన్ని తెనిగించిన కవిత్రయములో ఒకరైన ఎర్రాప్రగ్గడ, సంగీతంలో పేరుగాంచిన శ్యామశాస్త్రి, జాతీయ జెండా రూపశిల్పి పింగళి వెంకయ్య, ఇంజనీరు మోక్షగుండం విశ్వేశ్వరయ్య ఈ ప్రాంతానికి చెందినవారే.

స్వాతంత్రోద్యమ సమయంలో చీరాల పేరాల ఉద్యమం నడిపిన దుగ్గిరాల గోపాలకృష్ణయ్య, కొండా వెంకటప్పయ్య, నరసింహరావు ప్రసిద్దులు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రావతరణ తర్వాత మొదటిగా ఒంగోలు జిల్లా ఏర్పడింది. ప్రకాశం జిల్లా గుంటూరు జిల్లా యొక్క మూడు తాలూకాలు (అద్దంకి, చీరాల మరియు ఒంగోలు), నెల్లూరు జిల్లా యొక్క నాలుగు తాలూకాలు (కందుకూరు, కనిగిరి, పొదిలి మరియు దర్శి) మరియు కర్నూలు జిల్లా యొక్క రెండు తాలూకాలతో (మార్కాపురం మరియు గిద్దలూరు) ఏర్పడినది. 1972 లో టంగుటూరి ప్రకాశం పంతులు గుర్తుగా ప్రకాశం జిల్లాగా [2]పేరు మార్చబడింది.

ఒంగోలు, చీరాల, మార్కాపురం, వేటపాలెం, సింగరాయకొండ, కనిగిరి, కంభం, కందుకూరు,అద్దంకి, గిద్దలూరు ప్రధాన పట్టణాలు. వరి, సజ్జలు, రాగులు, జొన్నలు, చెరకు, వేరుసెనగ, ప్రత్తి, పొగాకు ప్రధానపంటలు. మార్కాపురం పలకలకు, చీమకుర్తి గ్రానైట్ గనులకు ప్రసిద్ధి. దీనిలో గుండ్ల బ్రహ్మేశ్వర అభయారణ్యం వుంది.

[మార్చు] భౌగోళికము

ప్రకాశం జిల్లా ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రపు దక్షిణ కోస్తాలో సుమారు 150.90 మరియు 160 డిగ్రీల ఉతర అక్షాంశాలు 79 మరియు 80 డిగ్రీల తూర్పు రేఖాంశాల మధ్య నెలకొని ఉన్నది. ఉత్తరాన మహబూబ్ నగర్ మరియు గుంటూరు జిల్లాలు, పశ్చిమాన కర్నూలు జిల్లా, దక్షిణాన వైఎస్సార్ జిల్లా, నెల్లూరు జిల్లాలు, తూర్పున బంగాళా ఖాతము సరిహద్దులుగా ఉన్నాయి. జిల్లాలోని మధ్య ప్రాంతం చిన్న చిన్న పొదలతో, కొండలతో, రాతి నేలలతో కూడి జిల్లాకు ఒక ప్రత్యేకతను ఆపాదిస్తున్నాయి.


[మార్చు] కొండలు

నల్లమల, వెలుగొండలు జిల్లాలోని ముఖ్యమైన కొండలు. నల్లమల కొండలు గిద్దలూరు, మార్కాపురం మండలాలలో వ్యాపించి ఉండగా, వెలుగొండ కర్నూలు, కడప జిల్లాల సరిహద్దులలో ఉన్నాయి. నల్లమలలో నంది కనుమ, మాబాల కనుమ అనే రెండు ముఖ్యమైన కనుమలు ఉన్నాయి. నంది కనుమ పశ్చిమాన గల కర్నూలు,బళ్ళారి జిల్లాలకు, తూర్పున కోస్తా జిల్లాలకు ప్రధాన మార్గం కాగా, మాబాల కనుమ పశ్చిమాన ఆత్మకూరు, కర్నూలు ను తూర్పున దోర్నాల, యర్రగొండపాలెం, మార్కాపురం లను కలుపుతుంది.


[మార్చు] నదులు

2,900 అడుగుల ఎత్తున ఉన్న గుండ్లబ్రహ్మేశ్వరం కొండల నుండి క్రిందకు దిగుతూ గుండ్లకమ్మ వేగం పుంజుకొని రాచర్ల మండలం, జె. పుల్లలచెరువు

గుండ్లకమ్మ, పాలేరు, మూసీ, మున్నేరు, సగిలేరు లు జిల్లాలో ప్రవహించే ముఖ్యమైన నదులు. వీటిలో 220 కి మీలు ప్రవహించే గుండ్లకమ్మ నది జిల్లా యొక్క తాగునీటి, సాగునీటి అవసరాలకు తల్లి వంటిది. తమ్మిలేరు, ఈగిలేరు, గుడిశలేరు అనే చిన్న నదులు, వాగేరు వాగు, నల్లవాగు, యేడి మంగల వాగు వంటి వాగులు కూడా జిల్లాలో ప్రవహిస్తున్నాయి.

[మార్చు] వాతావరణం, వర్షపాతం

జిల్లా లోని కోస్తా ప్రాంతాల్లో సముద్రపు గాలి వలన అన్నికాలాల్లోను వాతావరణం ఒకే రకంగా ఉంటుంది. ఇతర ప్రాంతాల్లో, ముఖ్యంగా మెట్ట ప్రాంతాల్లో వేసవి కాలం చాలా తీవ్రంగా ఉంటుంది. జూన్‌- సెప్టెంబరు లో నైరుతి ఋతుపవనాలు, అక్టోబరు - డిసెంబరు లో ఈశాన్య ఋతుపవనాల వలన వర్షాలు కురుస్తాయి. జిల్లా సగటు వర్షపాతం 764మిమి.


[మార్చు] నేలలు

ఎర్ర, నల్ల రేగడి, ఇసుక నేలలు క్రమంగా 51% , 41%, 6% వరకు జిల్లాలో ఉన్నాయి.

[మార్చు] వృక్ష సంపద

జిల్లా విస్తీర్ణంలో 4,42,500 హెక్టార్లలో (25.11% )అడవులు ఉన్నాయి. కోస్తా ప్రాంతంలో చీరాల, వేటపాలెం, చిన్నగంజాం, కొత్తపట్నం, సింగరాయకొండ, ఉలవపాడు లలోజీడి మొదలైన చెట్లతో కూడిన అడవులు ఉన్నాయి. ఉలవపాడు లలో మామిడీ,సపొటా తోటలు ప్రసిద్ది.

[మార్చు] ఖనిజ సంపద

పలకలు, బలపాలకు పనికివచ్చే రాయి విస్తారంగా గిద్దలూరు మండలంలోని ఓబయనాపల్లి నుండి మార్కాపురం మండలంలోని కుళ్లపేట వరకు దొరుకుతుంది. భారతదేశం వుత్పత్తిలో దాదాపు 80 శాతం ఇక్కడేజరుగుతుంది. కోగిజేడు, మార్లపాడు గ్రామంలో మాగ్నటైట్, ముడి ఇనుము నిక్షేపాలున్నాయి. ఇంకా క్వార్ట్జ్, జిప్సం, సిలికా, సున్నపురాయి, బేరియం సల్ఫేట్ దొరుకుతున్నాయి. ప్రపంచంలోనే అతి శ్రేష్ఠమైన గాలక్సీ గ్రానైటు జిల్లాలో దొరుకుతుంది.

[మార్చు] పరిశ్రమలు

ప్రత్తి జిన్నింగ్, పొగాకు , మంగుళూరు టైల్స్, పలకల తయారీ, జీడిపప్పు, గ్రానైటు గనులు సంబంధిత పరిశ్రమలు వున్నాయి. దేశానికి అవసరమైన రాతి పలకలో 80% మార్కాపురం నుండే వస్తుంది. సముద్ర తీరం (చినగంజాం,పాకల,ఊళ్ళపాలెం,కేసుపాలెం,కరేడు ....మొదలైనవి. )పొడుగునా 5000 ఎకరాల విస్తీర్ణంలో ఉప్పును పండిస్తారు. 370 పరిశ్రమల్లో 50,687 మంది కార్మికులు పనిచేస్తున్నారు. ఉత్పాదక మూలధనం 6.8 కోట్లు కాగా సంవత్సర వుత్పత్తి 70.32 కోట్లుగా వుంది.

[మార్చు] వ్యవసాయం

ఒంగోలు జాతి గిత్త

జిల్లా విస్తీర్ణంలో 37 శాతం మాత్రమే వ్యవసాయభూమి. 72 శాతం ఆహర పంటలు ,28శాతం అహారేతర పంటలు పండుతున్నాయి. 3,10,433 కమతాలున్నాయి. వర్జీనియా పొగాకు ఉత్పత్తిలో జిల్లా ప్రసిద్ధి చెందింది. వరి, జొన్న, రాగి, మొక్కజొన్న, కొర్రలు, పప్పు ధాన్యాలు, మిరప, పత్తి,శనగ, వేరుశనగ, ఆముదం ఇక్కడ పండే ఇతర పంటలు. పత్తివుత్పత్తిలో నాలుగో స్థానంలో వుంది.

మొత్త సాగుభూమిలో 24 శాతానికి నీటి పారుదల సౌకర్యం వుంది. కాలువల ద్వారా 71000 హెక్టార్లు, చెరువుల ద్వారా 34000 హెక్టార్లు, గొట్టపు బావులద్వారా 65000 హెక్టార్లు భూమి సాగవుతున్నది.

జిల్లాలోని 102 కి మీల సముద్ర తీరంలో సముద్ర ఉత్పత్తులు విరివిగా అవకాశాలున్నాయి.

[మార్చు] విద్య

2001 నాటికి 57.86 శాతం అక్షరాస్యత. 75 డిగ్రీ, 19 జూనియర్ కళాశాలలు, 2220 ప్రాథమిక పాఠశాలలు వున్నాయి. 2001 గణాంకాల ప్రకారం137 ప్రాథమికోన్నత పాఠశాలలు, 144 ఉన్నత పాఠశాలలు, ఒక ఐటిఐ వున్నాయి. 13 ఇంజనీరింగ్ కళాశాలుకూడా వున్నాయి.

[మార్చు] పదవ తరగతి

ప్రభుత్వ పాఠశాలలు ఒంగోలు, చీరాల, మార్కాపురం, అద్దంకి, సింగరాయకొండ, వేటపాలెం, పొదిలి, మార్టూరు, దొనకొండ యందు కలవు.

[మార్చు] ఇంటర్మీడియట్

2010 మార్చి ఇంటర్ ద్వితీయ పరీక్షలో19742 సాధారణ విద్యార్థులు హాజరు కాగా, 11967 మంది అనగా 61శాతం ఉత్తీర్ణత సాధించారు. ఇది గత సంవత్సరం తో పోల్చితే తేడా లేదు. ప్రభుత్వ మరియు ప్రైవేట్ కళాశాలలు ముఖ్యంగా ఒంగోలు, చీరాల యందు కలవు.

[మార్చు] ఇంజినీరింగ్ కళాశాలలు

  • రైశ్ ప్రకాశం గ్రూప్ ఆఫ్ ఇన్సిట్యూట్స్, ఒంగోలు
  • రైశ్ గాంధీ గ్రూప్ ఆఫ్ ఇన్సిట్యూట్స్, ఒంగోలు
  • ఎస్.ఎస్.ఎన్ ఇంజినీరింగ్ కాలేజ్, ఒంగోలు
  • రావు ‍మరియు నాయిడు ఇంజినీరింగ్ కాలేజ్, ఒంగోలు
  • కిస్ ఇంజినీరింగ్ కాలేజ్, ఒంగోలు
  • చీరాల ఇంజినీరింగ్ కాలేజ్, చీరాల
  • డా. సామ్యూల్ జార్జ్ ఇన్సిట్యూట్ ఆఫ్ ఇంజినీరింగ్ , టెక్నాలజీ, మార్కాపురం
  • సెయింట్ ఆన్స్ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ , టెక్నాలజీ
  • వి.ఆర్.ఎస్. అండ్ వై.ఆర్.ఎన్ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ, చీరాల
  • మాలినేని లక్ష్మయ్య ఇంజినీరింగ్ కాలేజ్, సింగరాయ కొండ
  • ఎ.బి.ఆర్ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ , టెక్నాలజీ, కనిగిరి
  • ప్రకాశం ఇంజినీరింగ్ కాలేజ్
  • పేస్ ఇన్సిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ

[మార్చు] వైద్య కళాశాలలు

ప్రస్తుతం జిల్లాలో వైద్య కళాశాల లేదు.

[మార్చు] రవాణా

ఒంగోలు రైల్వే స్టేషన్

చెన్నయ్-ఢిల్లీ రైలు మార్గము, గుంతకలు గుంటూరు రైలు మార్గము జిల్లాలోని ప్రాంతాలకు రవాణా సౌకర్యం కలిగిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ రోడ్డు రవాణా సంస్థ బస్సుసౌకర్యం కలిగిస్తున్నది. 1856 కిమీ రోడ్లు ప్రజాపనుల శాఖ వారి నిర్వహణలో, 1378 కిమీ జిల్లాపరిషత్ పంచాయితీ సమితి నిర్వహణలో రహదార్లు వున్నాయి. ఎన్.హెచ్.5. జాతీయ రహదారి జిల్లా గుండా పోతుంది.

[మార్చు] వైద్యం

9 అల్లోపతి వైద్యశాలలు, 46 డిస్పెన్సరీలు, 90 అయుర్వేద వైద్యశాలలు, 1 యునాని వైద్యశాల వున్నాయి.

[మార్చు] సహకార సంఘాలు

2,62,000 మంది సభ్యులతో జిల్లాలో 1275 సహకార సంఘాలున్నాయి. వీటిలో 1086 సాధారణ, 69 చేనేత,68 పారిశ్రామిక, 31 మత్స్యకార, 21 పాలసరఫరా సహకార సంఘాలు.

[మార్చు] ప్రముఖ వ్యక్తులు

  • ఆంధ్రకేసరి బిరుదాంకితులు టంగుటూరి ప్రకాశం పంతులు. ఈయన ఆంధ్ర రాష్ట్ర ప్రథమ ముఖ్యమంత్రి, స్వాతంత్ర్య సమరయోధుడు
  • దగ్గుబాటి రామానాయుడు (కారంచేడు) అత్యధిక చలన చిత్రాలు నిర్మించిన నిర్మాతగా గిన్నిస్ బుక్ లో చోటు సంపాదించాడు
  • అసెంబ్లి స్పీకర్ పిడతల రంగారెడ్డి. ఈయన 1972-74 వరకు ఆంధ్ర రాష్ట్ర శాసనసభ స్పీకర్.1942 లో క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొని 3 సంవత్సరాలు జైలు శిక్ష అనుభవించాడు.
  • కమ్యూనిస్టు నాయకుడు పూల సుబ్బయ్య. ఈయన కృష్ణా నది జలాలను మెట్టప్రాంతానికి తరలించాలని, నాగర్జున సాగర్ రెండోదశ కొనసాగించాలని ఉద్యమం చేపట్టాడు. ప్రస్తుతం వెలుగొండ ప్రాజెక్టుకు ఈయన పేరు పెట్టారు.
  • అసెంబ్లీ స్పీకర్ దివికొండయ్య 1978 - 1983.
  • ప్రముఖ చలన చిత్ర నటుడు గిరిబాబు,అతని కుమారుడు రఘుబాబు ప్రకాశం జిల్లాకు చెందినవారే.
  • సినీ హీరో గోపిచంద్,అతని తండ్రి టి.కృష్ణ (దివంగత దర్శకుడు) ప్రకాశం జిల్లా వాసులే.

[మార్చు] జిల్లా ప్రముఖాలు

  • నదులు: గుండ్లకమ్మ, పాలేరు, మూసీ, మున్నేరు, సగిలేరు.
  • ముఖ్య పంటలు : వరి, వరిగలు,శనగ, మొక్కజొన్న, పెసర, మినుము, పసుపు, పొగాకు, వేరుశనగ, మిర్చి, ప్రత్తి, కంది.
  • ముఖ్య ఖనిజాలు : పలక రాయి, గ్రానైటు, రాగి.
  • ముఖ్య పరిశ్రమలు : ప్రత్తి, పొగాకు, తోలు, పలకలు , బిల్డింగు రాళ్లు, జీడీపప్పు.
  • ముఖ్య పట్టణములు : ఒంగోలు, చీరాల, మార్కాపురం, అద్దంకి, గిద్దలూరు, కందుకూరు,సింగరాయకొండ, పొదిలి, దర్శి,కనిగిరి,మార్కాపురం,మార్టూరు.

[మార్చు] పరిపాలన

  • రెవిన్యూ డివిజన్లు (3): కందుకూరు, ఒంగోలు, మార్కాపురం.
  • మునిసిపాలిటీలు (3) ఒంగోలు, చీరాల, మార్కాపురం
  • గ్రామాలు:1005, గ్రామ పంచాయితీలు:775
  • రెవిన్యూ మండలములు: 56
ప్రకాశం జిల్లా మండలాలు

1.యర్రగొండపాలెం

2.పుల్లలచెరువు

3.త్రిపురాంతకము

4.కురిచేడు

5.దొనకొండ

6.పెద్దారవీడు

7.దోర్నాల

8.అర్ధవీడు

9.మార్కాపురం

10.తర్లపాడు

11.కొంకణమిట్ల

12.పొదిలి

13.దర్శి

14.ముండ్లమూరు

15.తాళ్ళూరు

16.అద్దంకి

17.బల్లికురవ

18.సంతమాగులూరు

19.యద్దనపూడి

20.మార్టూరు

21.పర్చూరు

22.కారంచేడు

23.చీరాల

24.వేటపాలెం

25.ఇంకొల్లు

26.జే.పంగులూరు

27.కొరిసపాడు

28.మద్దిపాడు

29.చీమకుర్తి

30.మర్రిపూడి

31.కనిగిరి

32.తిమ్మారెడ్డిపల్లె

33.బేస్తవారిపేట

34.కంభం

35.రాచర్ల

36.గిద్దలూరు

37.కొమరోలు

38.చంద్రశేఖరపురం

39.వెలిగండ్ల

40.పెదచెర్లోపల్లి

41.పొన్నలూరు

42.కొండపి

43.సంతనూతలపాడు

44.ఒంగోలు

45.నాగులుప్పలపాడు

46.చినగంజాము

47.కొత్తపట్నం

48.టంగుటూరు

49.జరుగుమిల్లి

50.కందుకూరు

51.వోలేటివారిపాలెము

52.పామూరు

53.లింగసముద్రము

54.గుడ్లూరు

55.ఉలవపాడు

56.సింగరాయకొండ

[మార్చు] నియోజకవర్గాలు

  • లోక్‌సభ నియోజకవర్గములు (1): ఒంగోలు-మాగుంట శ్రీనివాసులరెడ్డి (కాంగ్రేస్ )
  • శాసనసభ నియోజకవర్గములు (13): ఒంగోలు-బాలినేని శ్రీనివాసరెడ్డి (కాంగ్రెస్ ..................వై.యస్.ఆర్ కాంగ్రెస్ )

, , కందుకూరు-మానుగుంట మహీధర్ రెడ్డి(కాంగ్రేస్ )

, కనిగిరి-ముక్కు ఉగ్రనరసింహా రెడ్డి(కాంగ్రేస్ )
, కొండపి-జి.వి. శేషు(కాంగ్రేస్ )
, అద్దంకి-గొట్టిపాటి రవికుమార్(కాంగ్రేస్ )

, మార్కాపురం-కందుల నారాయణ రెడ్డి.(తెలుగుదేశం )

, దర్శి-బూచేపల్లి శివ ప్రసాద్ రెడ్డి(కాంగ్రేస్ )

. , చీరాల-ఆమంచి కృష్ణమోహన్(కాంగ్రేస్ )

, గిద్దలూరు-అన్నా రాంబాబు(పిఆర్పీ .... కాంగ్రెస్ )
, పర్చూరు-దగ్గుమాటి వెంకటేశ్వర రావు(కాంగ్రేస్ )

[మార్చు] పర్యాటక కేంద్రాలు

చీరాల (ఓడరేవు), మార్కాపురం చెన్నకేశవస్వామి దేవాలయము, కొమ్మినేనివారిపాలెం దేవాలయము, కంభం చెరువు, సింగరాయకొండ ప్రసన్నాంజనేయస్వామి మరియు లక్ష్మినృసింహ స్వామివార్ల దేవాలయాలు, భవనాసి చెరువు, త్రిపురాంతకంలోని త్రిపురాంతకేశ్వరుని ఆలయం, మణికేశ్వరం లోని మండూకేశ్వరస్వామి ఆలయం, భార్గవకొండలో దుర్గాభైరవస్వాముల ఆలయం మరియుమాలకొండలో మాల్యాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయం ప్రముఖ పర్యాటక కేంద్రాలు. పాకల(సింగరాయకొండ) సముద్రతీరప్రాంతంలో ప్రతి వారములో సందర్శించే పర్యాటకస్థలంగా పేరు పొందింది. [3]

[మార్చు] ఇవీ చూడండి

[మార్చు] మూలాలు

  1. ఈనాడు లో ప్రకాశం జిల్లాచరిత్ర
  2. ఎపిఆన్లైన్ లో జిల్లా పరిచయపత్రం
  3. ఆంధ్రప్రదేశ్ పర్యాటక సంస్థలో జిల్లాపేజి


వ్యక్తిగత పరికరాలు
నేంస్పేసులు

వైవిధ్యాలు
పేజీకి సంభందించిన లింకులు
చర్యలు
మార్గదర్శకము
పరస్పరక్రియ
పరికరాల పెట్టె
ఇతర భాషలు