ప్రపంచ ఆరోగ్య సంస్థ
ప్రపంచ ఆరోగ్య సంస్థ (ఆంగ్లం : World Health Organisation (WHO) : 7 ఏప్రిల్ 1948 వ సంవత్సరంలో స్థాపించబడినది. ఐక్య రాజ్య సమితి సహకారంతో నడిచే ఈ సంస్థ యొక్క ముఖ్య కార్యాలయం స్విట్జర్లాండ్ లోని జెనీవాలో ఏర్పాటు చేయబడినది.
విషయ సూచిక |
ధ్యేయం [మార్చు]
మానవుడికి సరిక్రొత్త వైద్యసదుపాయాలు అందజేయడం.
స్థాపన [మార్చు]
ప్రపంచ ఆరోగ్య సంస్థ ఐక్య రాజ్య సమితిచే నడుపబడే సంస్థల్లో ఒకటి. ఈ సంస్థ అధికారికంగా 26 దేశాల అమోదంతో, మొదటి ప్రపంచ ఆరోగ్య దినోత్సవం (7 ఏప్రిల్ 1948) నాడు ప్రారంభిచబడినది. [1]
కార్యకలాపాలు [మార్చు]
అంతర్జాతీయ సమన్వయంతో పాటు ఈ అరోగ్య సంస్థ, సార్స్, మలేరియా మరియు ఎయిడ్స్ వంటి ప్రాణాంతకమయిన అంటువ్యాధులను అరికట్టడానికి నిరంతరం కృషి చేస్తున్నది. కొన్ని ఏళ్ళపాటు కష్టపడిన తర్వాత, 1979 లో మశూచి (స్మాల్ పాక్స్) (అమ్మవారు) వ్యాధిని సమూలంగా నివారించినట్టు ఈ సంస్థ పేర్కొన్నది. ఈ విధంగా మానవుని ప్రయత్నాల ద్వారా నివారించబడిన మొదటి వ్యాధిగా మశూచి (స్మాల్‌పాక్స్) చరిత్రలో నిలిచి పోయింది. మలేరియా మరియు సిస్టోసోమియాసిస్ కు టీకా మందులు కనిపెట్టే దిశలో సంస్థ నిరంతర శ్రమ కొనసాగుతున్నది. పోలియోను సమూలంగా నిర్మూలంచే దిశలో కూడా ఈ సంస్థ కృషి చేస్తున్నది.
సభ్యత్వం [మార్చు]
196 దేశాలు ప్రస్తుత సభ్యదేశాలు, వీటిల్లో ఒక్క లీచ్‌టెన్‌స్టెయిన్ తప్ప అన్ని ఐక్యరాజ్యసమితి దేశాలు మరియు 2 అన్య దేశాలు (నియూ and the కుక్ దీవులు) ఉన్నాయి.
ప్రాంతీయ కార్యాలయాలు [మార్చు]
ఇవి కూడా చూడండి [మార్చు]
మూలాలు [మార్చు]
- ↑ "Chronicle of the World Health Organization, April 1948". World Health Organization. p. 54. Retrieved 2007-07-18.