ప్రపంచ పిచ్చుకల దినోత్సవం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ప్రపంచ పిచ్చుకల దినోత్సవం ప్రతి సంవత్సరం మార్చి 20న జరుపుకుంటారు.[1][2] పిచ్చుకలూ, జనావాసాల్లో ఎక్కువగా కనిపించే ఇతర పక్షుల గురించీ, వాటి మనుగడకు వాటిల్లుతున్న ముప్పు గురించి జనాల్లో అవగాహన పెంచడం దీని వెనుక ఉన్న ఆశయం. ఈ దినోత్సవాన్ని భారతదేశానికి చెందిన "నెయ్చర్ ఫరెవర్ సొసైయటి", ఫ్రన్స్‌కు చెందిన "ఈకో-సిస్ ఎక్షన్ ఫౌన్డెయ్షన్"లు మరిన్ని జాతీయ, అంతర్జాతీయ సంస్థలతో కలిసి ప్రారంభించాయి.[3]

నేపథ్యం[మార్చు]

నెయ్చర్ ఫరెవర్ సొసైయటి స్థాపకుడు మహమద్ దిలావర్. భారతీయ ప్రకృతి పరిరక్షకుడైన దిలావర్ నాసిక్‌లో పిచ్చుకల పరిరక్షణా ప్రయత్నాలతో తన ప్రస్థానాన్ని ప్రారంభించాడు. ఇతని కృషికి గానూ టైమ్ ఇతన్ని 2008లో "హీరోస్ ఒఫ్ ద ఎన్‌వైరన్‌మెన్ట్"లో ఒకడిగా గుర్తించింది. ఒకసారి సొసైటీ కార్యాలయంలో కబుర్ల మధ్యలో ఈయనకి ప్రపంచ పిచ్చుకల దినోత్సవం అనే ఆలోచన వచ్చింది. పిచ్చుకలూ, ఇతర సాధారణ పక్షుల పరిరక్షణ గురించిన సందేశాన్ని ఇవ్వడానికి ఒక రోజును అంకితం చేయడంతో పాటు, జీవవైవిధ్యానికి తగిన అందాన్ని చేకూర్చడంలో వీటి పాత్రను గుర్తుచేసుకోవడం ఈ దినోత్సవపు ఆశయాలు.

ఈ దినోత్సవం 2010లో మొదటిసారిగా ప్రపంచంలో వేర్వేరు చోట్ల జరిగింది. ఈ సందర్భంగా రకరకాల కళల పోటీలూ, అవగాహనా సదస్సులూ, ఊరేగింపులూ, వివిధ మాధ్యమాల సిబ్బందితో మాటామంతీలూ జరిగాయి.[3][4]

పక్షుల మనుగడకున్న ముప్పులపై అవగాహనతో పాటు, ప్రపంచ నలుమూలలా ఉన్న పక్షి పరిరక్షకులు ఒకరితో ఒకరు సంప్రదించుకుని, సహకరించుకునేందుకు ఒక ఉమ్మడి వేదిక కల్పించడం ఈ దినోత్సవపు సుదూర లక్ష్యం.

ప్రాముఖ్యత[మార్చు]

గ్రామీణ జీవనంలో పొలాల్లోని గింజలు తింటూ, ఇళ్ళ చూర్లలో గూళ్ళు కట్టుకుని పిచ్చుకలు ఉండేవి. సాంకేతిక అభివృద్ధిలో భాగంగా పెరిగిన కాలుష్యం, చరవాణుల వాడకంలో భాగంగా పెరిగిన వికిరణతా వీటి మనుగడకు ముప్పు వాటిల్లడానికి ప్రధాన కారణాలు. ప్రస్తుతం పిచ్చుకలను కాపాడుకోవడానికి ప్రపంచవ్యాప్తంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి.[5]

పిచ్చుక పురస్కారాలు[మార్చు]

పిచ్చుకలను సంరక్షించుటకు ప్రజలకు ప్రోత్సహించడానికి ఎన్.ఎఫ్.ఎస్ సంస్థ మొదటిసారి పిచ్చుకల పురస్కారాలను గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాదులో మార్చి 20, 2011న ప్రారంభించింది.

పిచ్చుకల అవార్డు విజేతలు 2014[మార్చు]

  • మోహన్ గార్గ్
  • ఎన్.షెహజాద్ & ఎం.సౌద్
  • జల్ గ్రాహన్ కామేటి, పిప్లాంట్రి

పిచ్చుకల అవార్డు విజేతలు 2013[మార్చు]

  • సలీమ్ హమీదీ, వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్, ఇలస్ట్రేటర్
  • ఆబిద్ సుర్తి, లిటరేటూర్ & ఎన్జిఓ హెడ్, డ్రాప్ డెడ్
  • జయంత్ గోవింద్ దుఖండే, ముంబై పోలీసులు

పిచ్చుకల అవార్డు విజేతలు 2012[మార్చు]

  • దిల్షేర్ ఖాన్
  • రమిత కొండేపూడి
  • వ్యక్తిగత విజేతుల (విక్రమ్ యెండే, కపిల్ జాదవ్, మహేంద్ర ఖవ్నేకర్, విశాల్ రేవంకర్)
  • మహాత్మా గాంధీ ఆశ్రమశాల

పిచ్చుకల అవార్డు విజేతలు 2011[మార్చు]

  • భవిన్ షా
  • నరేంద్ర సింగ్ చౌదరి
  • ఎల్. శ్యామల్
  • ది స్పారో కంపెనీ[6]

ఇవి కూడా చూడండి[మార్చు]

మూలాలు[మార్చు]

  1. "'Save sparrows for nature's balance'". Times of India. Bennett, Coleman & Co. 21 March 2012. Archived from the original on 2013-04-10. Retrieved 2015-03-21.
  2. Sathyendran, Nita (21 March 2012). "Spare a thought for the sparrow". The Hindu. Retrieved 22 March 2012.
  3. 3.0 3.1 "'Chirp for the Sparrow, Tweet for the Sparrow' on World Sparrow Day". Bombay Natural History Society. 7 July 2011. Archived from the original on 19 అక్టోబరు 2013. Retrieved 8 May 2012.
  4. "Background". World Sparrow Day. Nature Forever Society. Archived from the original on 4 June 2012.
  5. "చిట్టి గువ్వా! చిరునామా ఎక్కడ? ( 20న ప్రపంచ పిచ్చుకల దినోత్సవం) | Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi". web.archive.org. 2023-03-20. Archived from the original on 2023-03-20. Retrieved 2023-03-20.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  6. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2015-05-06. Retrieved 2015-03-21.

వెలుపలి లంకెలు[మార్చు]