ప్రబంధము

వికీపీడియా నుండి

ప్రకృష్టమైన పదబంధమున్న కావ్యం ప్రబంధము. ప్రబంధమంటే కావ్యమనే అర్థంలో తిక్కన తాను రచించిన 15 పర్వాలను ప్రబంధమండలి అన్నాడు. ఎర్రనకు 'ప్రబంధ పరమేశ్వరుడు' అనే బిరుదు ఉన్నది. ఈ ప్రబంధ శబ్దానికి ప్రక్రియపరమైన ప్రబంధ శబ్దానికి భేదం ఉన్నదిన్. నన్నెచోడుడు అష్టాదశ వర్ణనలను పేర్కొనడమే కాక కుమార సంభవంలో అనేక వర్ణనలు చేశాడు. శ్రీనాథుడు, పిల్లలమర్రి పినవీరభద్రుడు అష్టాదశ వర్ణనల్లో కొన్నింటిని రసరమ్యంగా నిర్వహించారు. అయితే ఇవన్నీ స్వతంత్ర కావ్యాలు కాకపోవడం వల్ల, ఇంకా కొన్ని ప్రబంధ ప్రక్రియా లక్షణాలు లేకపోవడం వల్ల ఇవి ప్రబంధాలు కాలేకపోయాయి. అల్లసాని పెద్దన మనుచరిత్ర రచనతో ప్రబంధ ప్రక్రియకు అంకురార్పణ జరిగింది.

[మార్చు] లక్షణాలు

  1. వస్త్యైక్యము
  2. ఏకనాయకాశ్రయ తత్వము
  3. రస ప్రాధాన్యము
  4. వర్ణనాప్రాచుర్యము
  5. శయ్యానైగనిగ్యము

[మార్చు] ఉదాహరణలు

  1. మనుచరిత్ర
  2. సంస్కృతమునందలి మాలవికాగ్నిమిత్రము
  3. ఆముక్త మాల్యద
పేజీకి సంభందించిన లింకులు