ప్రస్థానత్రయం
| ఈ వ్యాసానికి సంబంధించిన రచనలు హిందూధర్మశాస్త్రాలు |
|
| వేదములు (శ్రుతులు) | |
|---|---|
| ఋగ్వేదం · యజుర్వేదం | |
| సామవేదము · అధర్వణవేదము | |
| వేదభాగాలు | |
| సంహిత · బ్రాహ్మణము | |
| అరణ్యకము · ఉపనిషత్తులు | |
| ఉపనిషత్తులు | |
| ఐతరేయ · బృహదారణ్యక | |
| ఈశ · తైత్తిరీయ · ఛాందోగ్య | |
| కఠ · కేన · ముండక | |
| మాండూక్య ·ప్రశ్న | |
| శ్వేతాశ్వర | |
| వేదాంగములు (సూత్రములు) | |
| శిక్ష · ఛందస్సు | |
| వ్యాకరణము · నిరుక్తము | |
| జ్యోతిషము · కల్పము | |
| స్మృతులు | |
| ఇతిహాసములు | |
| మహాభారతము · రామాయణము | |
| పురాణములు | |
| ధర్మశాస్త్రములు | |
| ఆగమములు | |
| శైవ · వైష్ణవ | |
| దర్శనములు | |
| సాంఖ్య · యోగ | |
| వైశేషిక · న్యాయ | |
| పూర్వమీమాంస · ఉత్తరమీమాంస | |
| ఇతర గ్రంథాలు | |
| భగవద్గీత · భాగవతం | |
| విష్ణు సహస్రనామ స్తోత్రము · త్రిమతాలు | |
| లలితా సహస్రనామ స్తోత్రము · శక్తిపీఠాలు | |
| శివ సహస్రనామ స్తోత్రము | |
| త్రిమూర్తులు · తిరుమల తిరుపతి | |
| పండుగలు · పుణ్యక్షేత్రాలు | |
| ... · ... | |
| ఇంకా చూడండి | |
| మూస:హిందూ మతము | |
భగవద్గీత, ఉపనిషత్తులు మరియు బ్రహ్మసూత్రములను ప్రస్థానత్రయం అంటారు.
- భగవద్గీత - 18 అధ్యాయములు (అర్జున విషాద, సాంఖ్య, కర్మ, జ్ఞాన, కర్మ సన్యాస, ధ్యాన, ఆత్మ సంయమ, అక్షర పరబ్రహ్మ, రాజవిద్యా రాజగుహ్య, విభూతి, విశ్వరూప సందర్శన, భక్తి, క్షేత్రక్షేత్రజ్ఞ విభాగ, గుణత్రయ విభాగ, పురుషోత్తమ ప్రాప్తి, దైవసుర సంపద్విభాగ, శ్రద్ధాత్రయ, మోక్ష సన్యాస యోగములు)
- దశోపనిషత్తులు (ఈశ, కఠ, కేన, మున్డక, ఐతరేయ, ప్రశ్న, ఛాందోగ్య, బృహదారణ్యక, మాండూక్య, తైత్తరీయ)
- బ్రహ్మ సూత్రములు (వేదవ్యాసులు పైన పేర్కొనిన ఉపనిషత్తులు, గీతల యొక్క సారాంశమును 555 సూత్రములుగ వ్రాసినారు)
శంకరభగవత్పాదులు పైన తెలిపిన ప్రస్థానత్రయానికి సంస్కృతములో భాష్యము (వ్యాఖ్యానములు) వ్రాసినారు. ఆ తర్వాత ఆయన శిష్యులకు మరియు విమర్శకులకు ఈ భాష్యమే మూలగ్రంధంగా విరాజిల్లుతోంది.
ఎవరైతే తన జీవితకాలంలో శాస్త్రములో తెలిపిన విధముగా బ్రహ్మనిష్ఠ (అనగా బ్రహ్మము కాక ఈ జగత్తులో మరియొకటి లేదని నిశ్చయముతో వున్న)మరియు శ్రోత్రియుడు (అనగా శ్రుతి తాత్పర్యము నెరిగినవాడు)అయిన ఒక గురువును ఆశ్రయించి, ఆ గురువు వద్ద ' ప్రస్థానత్రయం 'ను శంకర భాష్య సమేతంగా ఈ విద్యను అభ్యసించునో ఆతడు సధ్యోముక్తి పొందునని శాస్త్ర ప్రమాణం. అనగా చతుర్విధ పురుషార్ధ్హములు అయిన ధర్మ అర్థ కామ మోక్ష అను నాలుగు పురుషార్ధముల లోని చివరది అయిన మోక్షం (సధ్యో మోక్షం)అను పరమ పురుషార్ధమును పొందుదురని శాస్త్ర ప్రమాణం. సధ్యో మోక్షం అనగా జీవించి ఉన్నపుడే బంధ విముక్తి. కాని యెప్పుడో పొందేది కాదు. మున్డకోపనిషత్తు లోని రెండవ ఖండము - 12 వ మంత్రము ( పరీక్షలోకాన్ కర్మచితాన్...) దీనికి ప్రమాణము.