ప్రాచీన సంఖ్యా విధానము
ఇపుడు వాడుకలోనున్న అంకెలను గురించి, వాటి పుట్టుపూర్వోత్తరముల గురించి తెలిసికొనుట మనకు చాలా ఆశక్తి కలిగిస్తుంది. నేటి అంకెలు మన ప్రాచీన భారతీయులు ఉపయోగించిన లిపి నుండి, అరబ్బు అంకెల నుండి రూపొందాయి. ప్రాచీన భారతీయులు సంఖ్యా క్రమ విధానాన్ని దశ గుణాంక క్రమము అంటారు. ప్రతి స్థానము పది రెట్లు చొప్పున పెరుగుతూ ఉంటుంది. మన సంఖ్యా క్రమంలో స్థానాలు 35 ఉన్నాయి.
స్థానాల పేర్లు [మార్చు]
| స్థానముల పేర్లు | ఘాత రూపం | విస్తరణ రూపం |
| ఏకము | 100 | 1 |
| దశ | 101 | 10 |
| శత | 102 | 100 |
| సహస్ర | 103 | 1,000 |
| ఆయుతము (దశ సహస్రము) | 104 | 10,000 |
| నియుతము (లక్ష) | 105 | 1,00,000 |
| ప్రయితము(దశ లక్ష) | 106 | 10,00,000 |
| కోటి | 107 | 1,00,00,000 |
| దశ కోటి | 108 | 10,00,00,000 |
| శత కోటి | 109 | 1,00,00,00,000 |
| అర్భుదము | 1010 | 10,00,00,00,000 |
| న్యర్భుదము | 1011 | 1,00,00,00,00,000 |
| ఖర్వము | 1012 | 10,00,00,00,00,000 |
| మహా ఖర్వము | 1013 | 1,00,00,00,00,00,000 |
| పద్మము | 1014 | 10,00,00,00,00,00,000 |
| మహా పద్మము | 1015 | 1,00,00,00,00,00,00,000 |
| క్షోణి | 1016 | 10,00,00,00,00,00,00,000 |
| మహా క్షోణి | 1017 | 1,00,00,00,00,00,00,00,000 |
| శంఖము | 1018 | 10,00,00,00,00,00,00,00,000 |
| మహా శంఖము | 1019 | 1,00,00,00,00,00,00,00,00,000 |
| క్షితి | 1020 | 10,00,00,00,00,00,00,00,00,000 |
| మహాక్షితి | 1021 | 1,00,00,00,00,00,00,00,00,00,000 |
| క్షోభము | 1022 | 10,00,00,00,00,00,00,00,00,00,000 |
| మహాక్షోభము | 1023 | 1,00,,00,00,00,00,00,00,00,00,00,000 |
| నిధి(జలధి) | 1024 | 10,00,00,00,00,00,00,00,00,00,00,000 |
| మహానిధి | 1025 | 1,00,00,00,00,00,00,00,00,00,00,00,000 |
| పర్వతము | 1026 | 10,00,00,00,00,00,00,00,00,00,00,00,000 |
| పరార్థము | 1027 | 1,00,00,00,00,00,00,00,00,00,00,00,00,000 |
| అనంతము | 1028 | 10,00,00,00,00,00,00,00,00,00,00,00,00,000 |
| సాగరము | 1029 | 1,00,00,00,00,00,00,00,00,00,00,00,00,00,000 |
| అవ్యయము | 1030 | 10,00,00,00,00,00,00,00,00,00,00,00,00,00,000 |
| అచింత్యము | 1031 | 1,00,00,00,00,00,00,00,00,00,00,00,00,00,00,000 |
| అమేయము | 1032 | 10,00,00,00,00,00,00,00,00,00,00,00,00,00,00,000 |
| భూరి | 1033 | 1,00,00,00,00,00,00,00,00,00,00,00,00,00,00,00,000 |
| మహాభూరి | 1034 | 10,00,00,00,00,00,00,00,00,00,00,00,00,00,00,00,000 |
ఈ విధంగా స్థాన భెదాల చేత సంఖ్యలను తెలిపెటప్పుడు కొన్ని స్థానాలలో అంకెలేవీ లేకపోవచ్చును. అంకెలు లేని చోట్ల సున్నలు వ్రాయాలి. క్రీస్తు మరణించిన ఐదేండ్లకు ఈనాటి దాకా వాడుకలో నున్న అంకగణిత విధానాన్ని మన భారత దేశంలో కనుగొన్నారు. ఈ కాలంలో భారత దేశం విజ్ఞాన శాస్త్రాలకు పట్టు గొమ్మగాగణిత శాస్త్రానికి స్వర్ణయుగంగా భాసిల్లింది. దీనికి కారణం ఆర్యభట్టు, వరాహమిహిరుడు వంటి గణిత శాస్త్రవేత్తలు. మన పూర్వులు అధర్వణ వేదం లో అనేక గణిత సమస్యలను చర్చించారు. వాటిని అభ్యాసం చేసినచో అనేక క్లిష్టమైన గణిత సమస్యలనైనా సులభంగా గణించవచ్చు. భారతీయ గణిత విధానాన్ని గణిత శాస్త్రవేత్తలే కాక వ్యాపారస్తులు కూడా అభివృద్ధి చేశారని అంటారు. వారు ప్రతి దశాంశ స్థాయిలోను అంకెలను ఉపయోగించి ఖాళీలలో చుక్కలు పెట్టేవారట. తరువాత ఆ చుక్కలను తొలగించి సున్న ప్రవేశించింది. క్రీ.శ.800 ప్రాంతాలలో భారతీయ వర్తకులు బిడారులలో వర్తకం చేస్తూ పోయినపుడు బాగ్దాదు వారికి అరబ్బుల పాలనలో ఉన్న స్పెయిన్ కు చేరింది. యూదు పండితుల రచనల ద్వారా ఈ విధానం యూరప్ దేశానికి ప్రవేశించింది.
- గణిత శాస్త్రము విజ్ఞానమునకు తోడు వినోదాన్ని అందించుననుతకు సందేహం లేదు. గణిత సమస్యలు సాధించుటలో మెదదుకు మేత కలిగించి పిల్లల మనోవికాసమును పెంపొందుంచును.