ప్రాధమిక విద్య
వికీపీడియా నుండి
దీనిలో 1 నుండి 5 తరగతులలో (ప్రాథమిక పాఠశాల), 6 నుండి 11 సంవత్సరాల వయస్సు గల బాలబాలికలు విద్యనభ్యసిస్తారు.
విషయ సూచిక |
[మార్చు] ఆంధ్రప్రదేశ్ లో ప్రాధమిక విద్య
2007-08 లెక్కల ప్రకారం నిర్వహణ పద్దతి ప్రాతిపదికన గణాంకాలు ఈ విధంగా వున్నాయి.
- పాఠశాలల సంఖ్య
నిర్వహణ |
సంఖ్య |
|---|---|
| కేంద్ర ప్రభుత్వ | 24 |
| రాష్ట్ర ప్రభుత్వ | 4861 |
| మండల ప్రజా పరిషత్ | 47954 |
| పురపాలకసంస్థ | 1396 |
| ఆర్ధిక సహాయముగల ప్రైవేట్ | 2246 |
| ఆర్ధిక సహాయము లేని ప్రైవేట్ | 5983 |
| మొత్తము | 62464 |
- పిల్లల నమోదు ప్రకారం
నిర్వహణ |
బాలురు | బాలికలు | మొత్తం |
|---|---|---|---|
| కేంద్ర ప్రభుత్వ | 2235 | 2308 | 4543 |
| రాష్ట్ర ప్రభుత్వ | 127203 | 146796 | 273999 |
| మండల ప్రజా పరిషత్ | 1360517 | 1458417 | 2818934 |
| పురపాలకసంస్థ | 66616 | 76542 | 143158 |
| ఆర్ధిక సహాయముగల ప్రైవేట్ | 153127 | 178884 | 332011 |
| ఆర్ధిక సహాయము లేని ప్రైవేట్ | 1010023 | 784281 | 1794304 |
| మొత్తము | 2719721 | 2647228 | 5366949 |
- ఉపాధ్యాయుల ప్రాతిపదికన
నిర్వహణ |
పురుషులు | స్త్రీలు | మొత్తము |
|---|---|---|---|
| కేంద్ర ప్రభుత్వ | 85 | 112 | 197 |
| రాష్ట్ర ప్రభుత్వ | 5336 | 3860 | 9196 |
| మండల ప్రజా పరిషత్ | 62641 | 36784 | 99425 |
| పురపాలకసంస్థ | 1413 | 1887 | 3300 |
| ఆర్ధిక సహాయముగల ప్రైవేట్ | 3034 | 4247 | 7281 |
| ఆర్ధిక సహాయము లేని ప్రైవేట్ | 15195 | 32465 | 47660 |
| మొత్తము | 87704 | 79355 | 167059 |
ఈ రంగంలో గణనీయమైన మార్పులకోసం కేంద్రప్రభుత్వం సర్వ శిక్షా అభియాన్ అనే పథకం రాష్ట్రప్రభుత్వ సహకారంతో అమలుచేస్తున్నది.
[మార్చు] ఫలితాలు/ నాణ్యత ప్రమాణాలు
ప్రధమ్ స్వచ్ఛంద సంస్థ ఆంధ్రప్రదేశ్‌లో అన్ని జిల్లాలలో 2006 నుండి సర్వే నిర్వహిస్తుంది. వారి గ్రామీణ వార్షిక విద్యాప్రమాణాల సర్వే నివేదిక-2008 (ASER-2008) ప్రకారం వివరాలు.
- 6-14 సంవతత్సరాల వయస్సుగల పిల్లలలో 68.9% మంది ప్రభుత్వ పాఠశాలలో, 27.6% మంది ప్రైవేటు పాఠశాలలో , 0.1% ఇతర పాఠశాలలో చదువతుండగా, 3.4% శాతంమంది పాఠశాలకు వెళ్లటంలేదు.
[మార్చు] చదువుట
దీనిలో ఏమి చదవలేకపోవుట, ఆక్షరాలను మాత్రమే చదువుట, పదాలను చదువుట, 1వతరగతి పాఠ్యాంశాలు అనగా అక్షరాలను, పదాలను, చిన్న వాక్యాలను చదవగలుగుట 2 వతరగతి పాఠ్యాంశాలు అనగా పిల్లలు చిన్ని వ్యాసాలను చదువగలుగుట అనే రంగాలలో సర్వే నిర్వహించితే ఈ వివరాలు తెలిసాయి.
5వ తరగతి పిల్లలలో, 0.5% మంది ఏమి చదువలేకపోగా 2.9% మంది అక్షరాలను మాత్రమే చదువగలిగారు 9.9% మంది పదాలను మాత్రమే చదువగలిగారు 26.6% మంది మొదటి తరగతి పుస్తకము చదువగలిగారు 60.0% మంది రెండవ తరగతి పుస్తకము చదువగలిగారు
2006 సర్వేతో పోలిస్తే, ప్రభుత్వ పాఠశాలలోని 5వతరగతి పిల్లలు రెండవ తరగతి పుస్తకము చదవగలగటంలో దాదాపు 30 శాతం పెరుగుదల కనబడింది. ప్రవేటు పాఠశాలలో ఫలితాలు దాదాపు 10 శాతం మెరుగుదల వుంది.
[మార్చు] గణితం
5 వ తరగతి పిల్లలలో ఈ విధంగా వున్నాయి: ఏ అంకె గుర్తించక పోవుట (0.6%), 1-9 అంకెలను మాత్రమే గుర్తించుట(1.7%), 10-99 అంకెలను గుర్తించుట(19.8%), తీసివేత(41.8%), భాగాహారం చేయుట(36.1%). అలగే సమయం చెప్పటం (46.6%), డబ్బు లెక్కించుట(85.9%) 5 వ తరగతి పిల్లలలో భాగాహారం చేయటం ప్రైవేటు పాఠశాలల పిల్లలలో దాదాపు 10 శాతం మెరుగుదల కనబడింది.
[మార్చు] ఇవీ చూడండి
- విద్య
- భారతదేశంలో విద్య
- ఆంధ్ర ప్రదేశ్లో విద్య
- ప్రాధమికోన్నత పాఠశాల విద్య
- ఉన్నత పాఠశాల విద్య
- ఇంటర్మీడియట్ విద్య
- విశ్వవిద్యాలయ విద్య
- భారత ప్రగతి ద్వారం