ప్రేమనగర్
| ప్రేమనగర్ (1971) | |
| దర్శకత్వం | కె.ఎస్.ప్రకాశరావు |
|---|---|
| నిర్మాణం | డి. రామానాయుడు |
| తారాగణం | అక్కినేని నాగేశ్వరరావు, వాణిశ్రీ, గుమ్మడి వెంకటేశ్వరరావు, కైకాల సత్యనారాయణ, రాజబాబు |
| సంగీతం | కె.వి.మహదేవన్ |
| నిర్మాణ సంస్థ | సురేష్ మూవీస్ |
| పంపిణీ | సురేష్ ప్రొడక్షన్స్ |
| విడుదల తేదీ | సెప్టెంబరు 24, 1971 |
| భాష | తెలుగు |
| ఐ.ఎమ్.డీ.బి పేజీ | |
ప్రేమ్ నగర్ లేదా ప్రేమనగర్, 1971లో విడుదలైన ఒక తెలుగు సినిమా. ప్రఖ్యాత రచయిత్రి అరికెపూడి కౌసల్యాదేవి (కోడూరి కౌసల్యాదేవి) వ్రాసిన నవల ఆధారంగా ఈ సినిమా నిర్మింపబడింది. అత్యంత విజయనంతమైన తెలుగు నవలాచిత్రాలలో ఇది ఒకటి. అంతకు ముందు కొన్ని సినిమాలలో నష్టాలనెదుర్కొన్న డి.రామానాయుడు ఈ సినిమాతో నిర్మాతగా సినీరంగంలో నిలద్రొక్కుకున్నాడు. ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో తమిళం, హిందీలలో కూడా పునర్నిర్మించారు.
కళ్యాణ్ (అక్కినేని) అనే జమీందారు కొడుకు విలాసనంతమైన జీవితానికి, దురలవాట్లకు బానిసయ్యాడు. ఎయిర్-హోస్టెస్‌గా పరిచయమైన లత (వాణిశ్రీ) వారింట్లో సెక్రటరీగా చేరుతుంది. అభిమానవతి అయిన ఆమె క్రమంగా కళ్యాణ్‌ను నిలకడైన జీవనవిధానంవైపు మళ్ళిస్తుంది. ఆమెపట్ల ఆకర్షితుడైన కళ్యాణ్ ఆమెను వివాహం చేసుకోవాలనుకోగా కుటుంబంనుండి ప్రతిఘటన ఎదురవుతుంది. అలా విడిపోయిన వారు తిరిగి కలుసుకొంటారు.
పాటలు [మార్చు]
ఈ సినిమాలో పాటలు తెలుగు చలన చిత్రరంగంలో ఆల్-టైమ్ హిట్లు అయిన పాటల జాబితాలో చేరుతాయి.
| పాట | రచయిత | సంగీతం | గాయకులు |
|---|---|---|---|
| ఉంటే ఈ ఊళ్ళో ఉండు, పోతే మీదేశం పోరా | కె.వి.మహదేవన్ | పి.సుశీల | |
| ఎవరికోసం ఎవరికోసం ఈ ప్రేమమందిరం ఈ శూన్యనందనం | ఆత్రేయ | కె.వి.మహదేవన్ | ఘంటసాల |
| ఎవరో రావాలీ, ఈ వీణను కదిలించాలలీ | కె.వి.మహదేవన్ | పి.సుశీల | |
| కడవెత్తుకొచ్చిందీ కన్నెపిల్లా అది కనబడితే చాలు నా గుండె గుల్లా | ఆత్రేయ | కె.వి.మహదేవన్ | ఘంటసాల పి.సుశీల |
| తేట తేట తెలుగులా తెల్లవారి వెలుగులా తేరులా సెలయేరులా | ఆత్రేయ | కె.వి.మహదేవన్ | ఘంటసాల |
| నీకోసం వెలిసిందీ ప్రేమమందిరం - నీకోసం విరిసిందీ హృదయనందనం | ఆత్రేయ | కె.వి.మహదేవన్ | ఘంటసాల పి.సుశీల |
| నేను పుట్టాను లోకం మెచ్చింది నేను ఏడ్చాను లోకం నవ్వింది | ఆత్రేయ | కె.వి.మహదేవన్ | ఘంటసాల |
| మనసు గతి యింతే మనిషి బ్రతుకింతే మనసున్న మనిషికి సుఖము లేదింతే | ఆత్రేయ | కె.వి.మహదేవన్ | ఘంటసాల |
| లేలేలే లేలేలే నా రాజా... లేవనంటావా నన్ను లేపమంటావా | ఆత్రేయ | కె.వి.మహదేవన్ | ఘంటసాల ఎల్.ఆర్.ఈశ్వరి |
పద్యాలు [మార్చు]
ఈ సినిమాలో రెండు సందేశాత్మకమైన పద్యాలు కూడా ఉన్నాయి:
- అంతములేని ఈ భువనమంత విశాలమగు పాంథశాల...(దువ్వూరి రామిరెడ్డి 'ఉమర్ ఖయ్యాం'లోనిది) (గానం: ఘంటసాల)
- కలడందురు దీనులయెడ...(పోతన 'భాగవతం'లోనిది) (గానం: పి.సుశేల)
మూలాలు [మార్చు]
- సి.హెచ్.రామారావు: ఘంటసాల 'పాట'శాల అనే పాటల సంకలనం నుండి.
- ప్రేమనగర్-మూలకథ ఆధారం:(కోడూరి)ఆరెకపూడి కౌసల్యాదేవి నవల - ప్రేమనగర్;మాటలు,పాటలు:ఆచార్యఆత్ర్యేయ