ప్రేమ సమాజం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
  • విశాఖపట్నంలో ప్రేమ సమాజాన్ని 1930 లో స్థాపించారు. 1941 లో రిజిస్టర్డు చేసారు. ప్రేమ సమాజం, డాబా గార్డెన్స్, విశాఖపట్నం-530020 ఫోన్ నెంబరు 0891-2544774. ఇది ఎందరో అభాగ్యులకు జీవితాలను ఇచ్చింది. ఎందరో అనాథలను పెంచి పెద్ద చేసి, చదువు చెప్పించి, వివాహాలు చేసి, వారు కోల్పోయిన కుటుంబాలను వారికి కల్పించింది. ప్రేమ సమాజం ద్వారా జీవితాలను, కుటుంబాలను పొందిన వారు మన సమాజంలో సగర్వంగా తిరుగు తున్నారు. దివి సీమ ఉప్పెనలో వీరు చేసిన సేవ మరువలేనిది. ఆనాడు వీరు చేసిన, అనాథ శవాల సంస్కారం చాలా గొప్పది. కుష్టు రోగులకు చేసే సేవ, వృద్ధులకు చేసే సేవ గొప్పది. విశాఖ లోని పుర ప్రముఖులు ఎందరో ఈ ప్రేమ సమాజంలో సభ్యులు, ప్రముఖ పాత్ర వహిస్తున్నారు.
  • సర్వమత సామరస్యంతో సర్వజన సౌభాగ్యం కొరకు సర్వవిధాల కృషి చేసి సర్వకాల సర్వావస్థలయందు సర్వ శక్తిమయుడగు సర్వేశ్వరుని

ధ్యానిస్తూ సర్వ సంపదలతో సుఖ సంతోషాలతో మీరు, మీ కుటుంబ సభ్యులు వర్ధిల్లాలని కాంక్షించే ప్రేమ సమాజం, విశాఖపట్నం – 530020.

  • శ్లోకం || అన్నోదక సమం దానం న ద్వాదశ్యా: పరం వ్రతం న గాయత్ర్యా: పరం మత్రం న మాతు: పరదైవతం
  • దయామయులారా!

ఆకలితో బాధపడువారికి అన్నం పెట్టవలెను. దుఃఖముతో బాధపడువారికి ఓర్మి కలుగ జేయవలెను. ప్రతి ప్రాణియు ఈశ్వర స్వరూపమని భావించి వారి యందు ప్రీమ కలిగి యుండవలెను.

  • సోదరీ సోదరులారా! మీ అందరి ఆదరాభిమానములు చూరగొనుచున్న ప్రేమ సమాజం, డాబాగార్డెన్స్, విశాఖపట్నం – ౫౩౦౦౨౦, దేశంలో ఏ ప్రాంతీయులైన, ఏ మతం వారైన ఏ వర్గానికి చెందిన వారైనా, అనాథలు, కుష్టురోగులు, అనాథ బాలబాలికలు, ఇత్యాది అనేక వర్గ, వర్ణ, దేశాది విచక్షణా రహితమైన మానవ సేవకే ఈ సమ్శ్ఠ అంకితంగావించబడింది. స్థాపితమయినది మొదలు ప్రజల సహాయంవల్ల, ఆదరణవల్ల, ప్రేమ సమాజం వివిధ సేవలు చేస్తున్నది.
  • అనాధ శరణాలయము: ఆశ్రయము, ఆదరణ లేక నిరాధారులై రోగగ్రస్తులై అలమటించే ఆర్తుల నిమిత్తము ౧౨౫ పడకలు గల శరణాలయం నిర్వహించబడుచున్నది.
  • బాలబాలికల వసతి: విధివశం చేత పసితనంలోనే, ఒకప్పుడు జన్మించిన మరుక్షణంలోనే తల్లిదండ్రుల్ని కోల్పోయి ఆవేదనపడే బాలబాలికల సంరక్షణ జరుగుచున్నది. ఇందులో ౧౦౦ మందికి వసతి ఉంది.
  • కుష్టు శరణాలయం: కుష్టు వ్యాధి వల్ల వికలాంగులై, కురూపులై కదలడానికి శక్తిలేని విభిన్న తరగతి కుటుంబాలకు చెందిన ౧౦౦ మందికి, కుష్టు సేవా కేంద్రములో వసతి ఉంది.
  • నిత్యసంతర్పణ : వృద్ధులు, అంగవిహీనులు, వ్యాధి గ్రస్తులు మొదలగు అన్నార్తులగువారి నిమిత్తం, నిత్య అన్న సంతర్పణ జరుపబడుతుంది.
  • ప్రేమా ప్రైమరీ స్కూల్ అండ్ ఉన్నత పాఠశాల: ప్రేమా ప్రైమరీ స్కూలు, హైస్కూలులలో ప్రతి యేడు సుమారు ౧౬౦౦ మందికి పైగా బాలబాలికలు ఉచితంగా విద్య నేర్చుకుంటున్నారు.
  • అనాధ ప్రేత సంస్కారము: ఒకప్పుడు మానవ సంఘంలో గౌరవ ప్రదంగా జీవించి విధివశంచేత రోడ్లమీద, రైల్వే ప్లాట్ ఫారాల మీద పడివున్న అనాథ శవాలకు గౌరవప్రదంగా అంత్యక్రియలు జరపటం సమాజ ప్రధాన సేవలలో ఒకటి.
  • గిరిజన సంక్షేమ యజ్నం : విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలలోని గిరిజనులకు బియ్యం, బట్తలు, వంట పాత్రలు, మందులు, పిల్లలకు బిస్కట్లు, మిఠాయి పంపిణీ చేయుట.
  • కుట్టుకేంద్రము: సమాజ బాలికలకు, ఇతరులకు, కుట్టు శిక్షణ ఇవ్వబడుచున్నది.
  • నివారణ సేవలు: అగ్నిబాధితులు, వరద పీడితులు మున్నగు ప్రకృతి ఉపద్రవాలకు గురైన వారికి నివారణ పరిచర్య చేయుట జరుగుతుంది. ఇటువంటి పవిత్ర కార్యకలాపాలలో ప్రతి ఒక్కరూ భాగస్థులు కావటం ఎంతైనా అవసరం.
  • గోసంరక్షణ : ప్రేమ సమాజంలో ప్రస్తుతం 75 గోవులున్నవి. వాటి నిర్వహణ నిమితం అనగా గడ్ది, తవుడు, పొట్టు వగైరాలను సేకరణ నిమిత్తం దాతలు తమ సహాయ సహకారాలను అందింఅ గోరుతున్నాము.
  • ధర్మాత్ములగు పట్టణ, పల్లెప్రజలకు ప్రేమ సమాజం చేసే పవిత్ర దీనజన సేవను గుర్తించి ఔదార్యముగా ధనవస్తురూప సహాయాలు అందించుచున్న మహాజనులందరకూ మా కృతజ్ఞతావందనమ్లులు.
  • సర్వేశ్వరుడు మీకు, మీ కుటుంబమునకు ఆయురారోగ్య ఐశ్వర్యములు ప్రసాదించాలని మా ప్రార్థన.
  • నిత్య సహాయ సేకరణ యత్నం
  • ప్రేమ సమాజంలోని దీనజనుల యొక్క శాశ్వత పోషణ రెండు పద్ధతుల వలన సాధ్యమని విశ్వసించబడుతుంది. మొదటిది స్థిరనిధి. (రిజర్వు ఫండ్), రెండవది వార్షిక విరాళాలు. పక్క పేజీలో వివరించబడిన విభాగాలలోని వారి పోషణకు ఒక దాత రిజర్వు నిధి గురించి రూ\\౬౫,౦౦౦/-లు ఇచ్చినట్లయిన ఏడాదికి బ్యాంకు వడ్డీరేట్ల దృష్ట్యా సుమారు రూ.4000 ల వరకు వడ్డీ రాగలదు. ఆ వడ్డీతో దాత అభీష్టం ప్రకారం సంవత్సరాన్క్ ఒక రోజు ఆశ్రమ రోగులకు, ఆశ్రమ అనాథ బాల, బాలికలకు, కుష్టు శరణాలయం వారికి భోజనానికి సాధ్యం కాగలదు. రూ. 32,000 లు ఇచ్చిన దాత పేర సంవత్సరంలో ఒక పూట సమాజ విభాగములన్నిటికి భోజనం పెట్టుటకు సాధ్యపడుతుంది.
  • రెండవ పద్ధతి ప్రతి ఏడు రూ. 2,000 లు విరాళమిచ్చిన దాతల పేర నిర్ణీతమైన ఒక రోజున సంవత్సరానికి ఒక పూట సమాజంలో అన్ని విభాగాల వార్క్ భోజనం ఏర్పాటు చేయబడుత్ంద్. అట్టి ఏర్పాటు వల్ల సమాజ సేవలు చిరకాలం నిర్విఘ్నంగా నడవగలవన్ మా దృఢ విశ్వాసము.
  • సమాజవాసులు, సుమారు ౪౦౦ మందికి బట్తల నిమితము కట్టుబట్టలు, దుప్పట్లు, తువ్వాళ్ళు వగైరా, మందులు తదితర వైద్య సేవల నిమితము..... సమాజ బాలబాలికల విద్యావసరములు నిమితము దాతలు తమ చేయూతను అందించ వచ్చును.
  • సమాజ బాలబాలికలలో ఒకరికి నెలకు రెండు వందల రూపాయల చొప్పున స్పాన్సర్ షిప్ ప్రోగ్రామునకు సహాయము చేయవచ్చును.
  • ఈ పద్ధతుల ప్రకారము కొందరు దాతలు అప్పుడే కొంతవరకు తమ తమ అమూల్యమైన విరాళములను అందజేయడం జరిగింది. దాతలంద్రు వితరణ భావముతో తమ విశిష్టమైన విరాళాలను ధారాళంగా అందించి ఆర్తజన పరిరక్షణార్ధం సంకల్పించబడిన ఈ పవిత్ర యజ్నాన్ని ఫలవంతం చేసెదరని వినయ పూర్వకంగా మనవి చేస్తున్నాము.
  • పర్వదినాలలోను, శుభ కార్య సందర్భాలలోను, పెద్దల స్మారక దినాలలోను దాతలు ప్రేమతో ఏర్ఫాటు చేయు అన్న దానానికి, ఆతిధ్యానికి అవసరమైన వివరాలు:
విరాళాలు రూ. స్వీటుతో రూ. సాధారణ రూ. ఫలహారం స్వీటుతో రూ.
బాల బాలికలకు 500/- 400/- 500/-
అనాథ శరణాలయానికి 700/- 600/- 700/-
కుష్టు శరణాలయానికి 800/- 700/- 800/-
3 విబాగాలకు 2000/- 1700/- 2000/-
  • పైనుండి వచ్చే నిరుపేదలకు100 మందికి పులుసు / చారు, అన్నము, ఒక కూరకు రూ. 1000 లు స్వీటుతో రూ. 1200 లు
  • ధార్మిక మహాశయులు వారి వారి అనుకూలతను బట్టి అన్న దాన కార్యక్రమాలను జరిపించాలని మా ప్రార్థన.

తేడీల ప్రకారము, తిథి ప్రకారము, అన్న దానము ఏర్పాటు చేయబడును. ఒకే తేదీ, ఒకే తిథి, ఒకే రోజు పడినను, ఒకరికంటే ఎక్కువ దాతలు కోరినను, దాతలందరిపేరున ప్రార్థన చేసి నాటి కార్యక్రమము జరిపించబడును. ఒకసారి ఇచ్చిన విరాళములు ఎట్టి పరిస్థితులలోను వాపసు ఇవ్వబడవు. ఇది దాతలు గమనించ ప్రార్థన.

  • గమనిక: దాతలిచ్చు విరాళాలపై ఇన్ కమ్ టాక్సు యాక్టు సెక్షన్ 80జి క్రింద పన్ను రాయితీ సౌకర్యం ఉంది. అన్ని దానముల కంటే అన్నదానమే గొప్పది.
  • ఆధారం : 2010 డిసెంబరు 18 నాటి కరపత్రిక