ప్లైవుడ్

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
స్ప్రూస్ నుంచి తయారు చేయబడ్డ మ్రుదుకలప ప్లైవుడ్.

ప్లైవుడ్ పల్చని కలప రేకులతో తయారు చేయబడిన ఒక రకమైన కృత్రిమ చెక్క. చెక్కకు బలం చేకూర్చడం కోసం, చెక్కల ద్ధి రేఖలు ఒకదానికొకటి లంబ కోణంలో ఉండేలా చెక్క రేకులను ప్రక్కప్రక్కన పెట్టి గట్టిగా అతుకపెడతారు. ఈ చెక్క రేకులన్నీ బేసి సంఖ్యలోనే వుంటాయి. కారణం చెక్కలో అవయవానురూవత్వం లేకపోతే అది త్వరగా పొర్లిపోయే అవకాశాలు తక్కువగా వుంటాయి.

రకాలు[మార్చు]

అలంకార పొర కలిగిన సాధారణ నాణ్యతా ప్లైవుడ్.
ప్లైవుడ్లో తయారైన ఉన్నత నాణ్యత కలిగిన కాంక్రీటును ఒలకపోసే గిన్నె.

వివిధ అవసరాల కోసం ప్లైవుడ్లో విభిన్న రకాలు వున్నాయి.

ఉష్ణప్రదేశ ప్లైవుడ్[మార్చు]

ఉష్ణప్రదేశ ప్లైవుడ్ ను ఎప్పుడూ ఆసియా ప్రాంతాలలో దొరికే మెరంటి లేదా ఉష్ణప్రదేశ కలపల కలయికతోనే తయారు చేస్తారు. ఉష్ణప్రదేశ ప్లైవుడ్ సాంద్రము, పటిష్టతత్వం, పొరల సమానత మరియు ఉన్నత నాణ్యత మొదలగు విషయాలలో మ్రుదుకలప ప్లైవుడ్ పైన ఆధిపత్యం కలిగివుంటుంది. మామూలుగా అత్యుత్తమ ప్రమాణాలతో తయారు చేయబడిన ఉష్ణప్రదేశ ప్లైవుడ్ అనేక వ్యాపారాలలో మొదటి రకంగానే అమ్ముడవుతుంది. ప్రపంచవ్యాప్తంగా UK, జపాన్, తైవాన్, కొరియా, దుబాయ్ మొదలగు అనేక నగరాలలో ఉష్ణప్రదేశ ప్లైవుడ్ ను విరివిగా వాడుతుంటారు. చాలా ప్రాంతాలలో నిర్మాణ అవసరాల కోసం ఈ చెక్కనే ఎంపిక చేస్తుంటారు.

మ్రుదుకలప ప్లైవుడ్[మార్చు]

మ్రుదుకలప ప్లైవుడ్ సాధారణంగా డగ్లస్ ఫిర్ లేదా స్ప్రూస్, దేవదారు(పైన్) మరియు ఫిర్ (అన్నిటినీ కలిపి స్ప్రూస్-పైన్-ఫిర్ లేదా SPF అంటారు) నుంచి తయారు చేస్తారు. దీన్ని మామూలుగా నిర్మాణ మరియు పరిశ్రమల అవసరాల కోసం వాడతారు.[1]

తయారీ[మార్చు]

అత్యంత విరివిగా వాడే చెక్క ఉత్పత్తులలో ప్లైవుడ్ ఒకటి. అది మండుతుంది, సాగుతుంది, చవకైనది, పనిచేయడానికి అనువైనది మరియు దాన్ని ఎక్కడైనా సులువుగా తయారు చేసుకోవచ్చు. అలాగే ఒకసారి ఉపయోగించిన దాన్ని తిరిగి వాడుకోవచ్చు. చెట్ల దుంగల నుంచి ఒలిచిన సన్నని చెక్క పొరలతో దీన్ని తయారు చేస్తారు. ప్లైవుడ్ తయారు చేయడానికి ఈ పొరలను(వీనర్లుగా పిలుస్తారు) ఒకదానికొకటి తమ వృద్ధి రేఖలు లంబకోణంలో ఉండేలా పెట్టి గట్టిగా అతుకబెడతారు. ఈ చెక్కల పొరలన్నీ బేసి సంఖ్యలోనే ఉంటాయి. దీని వల్ల చెక్క సమానంగా ఉండి, పొర్లిపోకుండా ఉంటుంది. ప్లైవుడ్లో ఈ విధమైన సంబంధం(రేఖలన్నీ ఒకదానికొకటి అడ్డంగా ఉండి పొరలు బేసి సంఖ్యలో ఉంటాయి) ఉండడం వల్ల దాన్ని రేఖల దిక్కుకు లంబకోణంగా వంచడం చాలా కష్టమైన పని అవుతుంది. సాధారణ చెక్కకు బదులు ప్లైవుడ్ను ఉపయోగించడానికి మామూలు కారణాలు ఏంటంటే విరగకుండా ఉండటం, అణిగిపోకపోవటం, పొర్లకపోవటం/ముడతలు పడకపోవటం మరియు దాని అధిక పటిష్టత్వం.

కఠినకలప‌ ప్లైవుడ్[మార్చు]

దీన్ని మృదుత్వం అవసరమైన పనుల కోసం ఉపయోగిస్తారు. బిర్చ్ ప్లైవుడ్ అధిక బలానికి, పటుత్వానికి మరియు పాదుల ఆటంకానికి పెట్టింది పేరు. దానికి అధిక సమతల రాపిడి శక్తి మరియు సంధులను తట్టుకొనే శక్తి ఉండటం చేత భారీ పనులైన నేల మరియు గోడల నిర్మాణాలలో దీన్ని వాడతారు. తూర్పు ప్రదేశాలలో దొరికే ప్లైవుడ్ తో చేసిన నిర్మాణాలకి అధిక మొత్తంలో చక్రాలను మోయగలిగే సామర్థ్యం ఉంటుంది. బిర్చ్ ప్లైవుడ్ ఉపరిభాగం అమోఘమైన గట్టిగా ఉంది రోజూవారీ పనుల వల్ల కలిగే నష్టాలను తట్టుకోగలుగుతుంది. [2]

అలంకరణ ప్లైవుడ్[మార్చు]

ఇది మామూలుగా ఎర్రచందనం, బిర్చ్,మేపల్,లాన్(ఫిలిప్పైన్ మహాగని) మరియు అనేక రకాలైన కఠిన‌ కలపలతో తయారుచేయబడుతుంది.

సాధారణంగా ఇంటి లోపల అవసరాల కోసం ఉపయోగించే ప్లైవుడ్ కోసం చవకైన యూరియా-ఫార్మల్డిహైడ్ జిగురును ఉపయోగిస్తారు. ఇందువల్ల ఇది మిగిలిన వాటితో పోల్చితే నీటిని ఎక్కువగా తట్టుకోలేదు. అలాగే ఇంటి బయట మరియు సముద్ర అవసరాల కోసం ఉపయోగించే ప్లైవుడ్ కుళ్ళును తట్టుకునే విధంగా రూపొందిస్తారు. వాతావరణంలో తేమ ఎక్కువగా ఉన్నా పటుత్వానికి మరియు చెక్క యొక్క రక్షణ పొరను కోల్పోకుండా ఉండడానికి ఈ ప్లైవుడ్లో ఫినాల్-ఫార్మల్డిహైడ్ జిగురును వాడతారు. కనుక ఇది నీటిని ఎక్కువగా తట్టుకోగల్గుతుంది.

మ్రుదుకలప ప్లైవుడ్ సర్వ సాధారణంగా మూడు, ఐదు, లేదా ఏడు రేకుల రకాలుగా దొరుకుతుంది. ఇవి 12 x 2.4 మీటర్ల మెట్రిక్ కొలమానాలు లేదా కొంచెం పెద్దదైన 4 x 8 అడుగుల బ్రిటీషు కొలమానాలు కలిగి ఉంటాయి. పలకల మందాన్ని బట్టి ఈ రేకుల మందం 1/10" నుంచి 1/6" మధ్యలో మారుతూ ఉంటుంది. ఇంటి పైకప్పుల కోసం సన్నగా ఉండే 5/8-ఇంచుల ప్లైవుడ్ను ఉపయోగించుకోవచ్చు. అటకల కోసం కనీసం 3/4-ఇంచు మందపు ప్లైవుడ్ను వాడతారు. కానీ ఇది ఆ అంతస్తు అతుకు మధ్య ఉన్న దూరం పైన ఆధారపడి వుంటుంది. ఇంటినేల కోసం ఉపయోగించే ప్లైవుడ్ పట్టీలు మరియు వల్లములు కలిగి ఉంటుంది. నేల మూలలో వల్లము చేసి ఉంటుంది. దీనివల్ల ప్రక్కన ఉండే పలక యొక్క పట్టీ ఇందులో సరిగ్గా సరిపోయి నేల మొత్తం పటిష్టంగా ఉంటుంది. ఇందువల్ల ఒక పలక, ప్రక్కన ఉన్న పలకపైకి క్రిందకి జారకుండా ఉండి ఎలాంటి కుదుపులు లేకుండా నేల మొత్తం గట్టిగా అతుక్కున్నట్లుగా ఒక భావన కలుగుతుంది. పట్టీలు మరియు వల్లములు కలిగిన ప్లైవుడ్ మామూలుగా 1" మందం కలిగి ఉంటుంది.

ప్రత్యేక అవసరాల ప్లైవుడ్[మార్చు]

విమానాల ప్లైవుడ్ గా పిలిచే అధిక శక్తి కలిగిన ఈ రకం ప్లైవుడ్ను మహాగని మరియు/లేదా బిర్చ్ కలపనుంచి తయారు చేస్తారు.ఇందులో వేడి మరియు తేమను ఎక్కువగా తట్టుకోవడానికి ప్రత్యేకమైన జిగురులను వాడతారు. బ్రిటీషువారు తయారుచేసిన మస్కిటో బాంబర్తో సహా రెండవ ప్రపంచ యుద్ధంలో పాల్గొన్న అనేక యుద్ధ విమానాల తయారీలో దీన్ని ఉపయోగించారు. మస్కిటో బాంబర్కు ఉడెన్ వండర్ అనే ముద్దుపేరు కూడా ఉన్నది.

కొన్ని ప్లైవుడ్లకు ప్రత్యామ్నాయమైన రేకులు ఉండవు. వీటిని ప్రత్యక అవసరాల కోసమే ఉపయోగిస్తారు. అట్లాంటి వాటిలో గుర్తింపబడింది బెండీ బోర్డ్(ఒహియోలో మాత్రమే). సాధారణంగా దీన్ని సాగే ప్లైవుడ్ అని అంటారు. ఇది ఎక్కువగా సాగటం వల్ల దీన్ని వంపులుగా ఉండే వస్తువుల తయారీకోసం ఉపయోగిస్తారు. UK లో దీన్ని "హేట్టర్స్ ప్లై"గా పిలుస్తారు. కారణం విక్టోరియన్ కాలంలో మగవారు ధరించే పోయ్యిగొట్టాల ఆకారంలో ఉండే టోపీల తయారీ కోసం దీన్ని ఉపయోగించేవారు. కానీ కొన్ని దేశాలలో వీటిని ప్లైవుడ్ అని పిలవరు, కారణం అసలు ప్లైవుడ్ వివరణ ప్రకారం పొరలుగా ఉండే కలప రేకులను ఒకదాని పైన ఒకటి పేర్చి, వాటి వృద్ధి రేఖలు మరొకదానితో లంబకోణంలో ఉండేలా ఉంచి గట్టిగా అతుకబెట్టాలి.

సముద్రపు ప్లైవుడ్ అధిక తేమ ఉండే వాతావరణంలో పాడవకుండా ఉండడానికి ప్రత్యేక విధానంతో ఏమీ తయారుచెయ్యరు. కేవలం అది తేమ ప్రాంతాల్లో ఎక్కువకాలం మన్నే విధంగా మాత్రమే తయారు చేస్తారు. ప్రతి చెక్క అతుకు మధ్యలో అతి సున్నితమైన ఖాళీ ప్రదేశం మాత్రమే ఉండి, నీటిని పట్టి ఉంచే అవకాశం లేకుండా చేయడం వల్ల ఈ ప్లైవుడ్ ఘనమైన మరియు స్థిరమైన సంబంధం కలిగి ఉంటుంది. చాలా బయట ప్రదేశాల ప్లైవుడ్ల లాగే ఇది కూడా పైపూత కోసం వాటర్ బాయిల్డ్ ప్రూఫ్(WBP) జిగురును ఉపయోగిస్తుంది. సముద్రపు ప్లైవుడ్ అనేక సందర్భాలలో డెక్కల మరియు పడవల నిర్మాణాలలో వాడతారు. సాధారణ ప్లైవుడ్ కన్నా ఇది ఎంతో ఖరీదైనది. ఉదాహరణకు 4 x 8 అడుగుల 1/2 ఇంచు మందం కలిగిన ఈ ప్లైవుడ్ చెక్క ఖరీదు సుమారుగా $75 నుంచి $100 US లేదా చదరపు అడుగుకి $2.5 దగ్గర వుంటుంది. అంటే సాధారణ ప్లైవుడ్ కన్నా ఇది దాదాపు మూడు రెట్లు ఖరీధైనదన్నమాట.

సముద్రపు ప్లైవుడ్ల కోసం బ్రిటీషువారు తయారు చేసిన ప్రమాణాలలో ఒకటైన BS 1088ను ఇది పాటిస్తుంది. అంతర్జాతీయంగా సముద్రపు ప్లైవుడ్ల నాణ్యతా విలువల కోసం కొన్ని ప్రమాణాలు ఉన్నా అందులో చాలావి ఎవరికివారు తయారుచేసుకున్నవే. కొన్ని ప్లైవుడ్లు మాత్రం BS 1088 ప్రమాణాలు పాటించిన వాటికి ఇచ్చే లాయిడ్స్ ఆఫ్ లండన్ గుర్తును కలిగి ఉంటాయి. మరికొన్ని ప్లైవుడ్లకు వాటి తయారీకి ఉపయోగించిన చెక్క ఆధారంగా వాటికి గుర్తును ఇస్తారు. వీటికి ఉదాహరణ ఒకౌం లేదా మెరంటి.

మిగిలిన ప్లైవుడ్ల రకాలలో అగ్నిరహితం, తేమరహితం, నాణ్యత గుర్తు కలిగినవి, పీడనం ఉపయోగించినవి, అలాగే కఠినకలప మరియు మ్రుదుకలప కూడా ఉన్నాయి. వీటన్నిటినీ పరిశ్రమలో ఒక్కొక్క అవసరము కోసం వాటిని ఉపయోగిస్తారు.

పరిమాణాలు[మార్చు]

US: 4 x 8 అడుగులు
US: 5 x 5 అడుగులు
మెట్రిక్: 1220 x 2440 ఎం.ఎం [3]

ఉత్పత్తి[మార్చు]

ప్లైవుడ్ ఉత్పత్తి కోసం పీలర్ గా పిలవబడే ఒక మంచి చెట్టు దుంగ కావాలి. సాధారణంగా మిల్లులఱoపాలలో ఉపయోగించే లావుపాటి చెక్క దుంగ కన్నా ఇవి తిన్నగానూ మరియు వ్యాసం ఎక్కువగానూ ఉంటాయి. ఈ దుంగను అడ్డంగా ఉంచి, దాని ఇరుసు ఆధారంగా తిప్పుతూ, ఒక పొడవాటి పోచను దుంగ పైభాగంలో(స్విస్ రోలును కొలబద్ద దగ్గర పెట్టినట్లుగా) ఉంచుతారు.దీనివల్ల పలచని కలప పొర ఒలిచిపోతుంది. ఈ విధముగా చెక్క దుంగను బెరడుల రేకులగా ఒలిచిన తర్వాత, ఆ రేకులను కావాల్సిన పరిమాణాలలో కత్తిరించి, వాటిని ఎండబెట్టి, జిగురు పూసి, ఒకదానికొకటి అతకబెట్టి 140°చ (280°F) ఉష్ణోగ్రత మరియు 19 మప (2800 psi) పీడనం కలిగిన ఒక నిర్మానశాలలో ఉంచి, బాగా కాల్చి నొక్కిన తర్వాత ప్లైవుడ్ పలక తయారవుతుంది. తర్వాత ఈ పలకలో లోపాలు ఉంటే సరిచేసి, కత్తిరించి, ఇసుక రాసి లేదా పరిశ్రమల అవసరాల ప్రకారం తిరిగి కావలసిన సొగసులు అద్దుతారు.

ప్లైవుడ్ కోసం ఉపయోగించే జిగురు శ్రద్ధ పెట్టవలసిన అంశంగా మారింది. యూరియా ఫార్మల్డిహైడ్ మరియు ఫినాల్ ఫార్మల్డిహైడ్ రెండూ కూడా కాన్సర్కు కారణమైన పదార్థాలు అధిక మోతాదులో కలిగి ఉంటాయి. దీని వల్ల అనేక ఉత్పత్తిదారులు తక్కువ ఫార్మల్డిహైడ్ కలిగిన జిగురు వస్తువులకు మరులుతున్నారు. వీటిని "E" తరములుగా వ్యవహరిస్తుంటారు("E0" అంటే అందులో అతి తక్కువ ఫార్మల్డిహైడ్ వున్నట్టన్నమాట). "E0" ద్వారా తయారైన ప్లైవుడ్ దగ్గరదగ్గరగా అసలు ఫార్మల్డిహైడ్ ను వెలువరించదు.[4].

ఈ జిగురు విషయాలను ముందువరుస నుంచి ప్రక్కన పెడితే పర్యావరణ పరిరక్షణ మరియు సహజ శక్తి సంరక్షణలో భాగంగా ఉత్పత్తిదారులు కలప వనరులపై కూడా శ్రద్ధ పెట్టవలసిన అవసరం ఉంది. ఇవి పాటించే ఉత్పత్తిదారులకు అనేక యోగ్యతా ప్రమాణపత్రాలు కూడా అందుబాటులోకి వచ్చాయి. ఫారెస్ట్ ష్టివర్డ్షిప్ కౌన్సిల్(FSC), లీడర్షిప్ ఇన్ ఎనర్జీ ఎండ్ ఎన్విరాన్మెంటల్ డిజైన్(LEED), సష్టైనబుల్ ఫారెష్ట్రి ఇనీశ్యేటివ్(SFI) మరియు గ్రీన్గార్డ్ లాంటి ప్రమాణపత్రాలు ప్లైవుడ్ యొక్క ఉత్పత్తి మరియు పరిశ్రమల పనులు సాఫీగా సాగేలా నిలుపుతున్నాయి. ఇందులో చాలా కార్యక్రమాలు ఉత్పత్తిదారునికి మరియు వినియోగదారునికి పన్ను రాయితీలు ఇస్తున్నాయి.[5]

US ప్లైవుడ్ నాణ్యతా తరగతులు[మార్చు]

ప్రతి ప్లైవుడ్ పలకలపైన మరియు లోపల ఉపయోగించే బెరడుల నాణ్యత ప్రకారం వాటి తరగతులను విభజిస్తారు. ఇందులో మొదటి అక్షరం, పైనబెరడు(మంచి వైపు) నాణ్యతను సూచిస్తే, రెండవ అక్షరం పలక అడుగు భాగంలోని బెరడు నాణ్యతను సూచిస్తుంది.[6] సాధారణంగా అనుకున్నట్లుగా బయట కాకుండా మధ్యరేకుల దగ్గర తునక చెక్కలతో ప్లైవుడ్ పలకను తయారుచేస్తే దాన్ని "X" అక్షరంతో సూచిస్తారు.[citation needed] A-D ప్రమాణాలను కేవలం నిర్మాణ(మ్రుదుకలప) ప్లైవుడ్ కోసం ఉపయోగిస్తారు కాని కఠినకలప‌ అయిన ఓక్ లేదా మేపల్ లాంటి వాటి కోసం కాదు.

"A": అందుబాటులోని నాణ్యతా ప్రమాణాలలో ఉత్తమమైనది. దీని ప్రకారం చెక్కలో లోపాలు ఉండకూడదు లేదా చిన్న రంధ్రాలు ఉన్నా వాటిని చెక్క ముక్కలతో (వీటికి పడవ లేదా అమెరికన్ ఫుట్బాల్ ఆకారం ఉంటుంది) లేదా కృత్రిమ పదార్థాలతో సరిచేసి ఉండాలి. ఈ ప్రమాణాల చెక్కలకు అప్పుడప్పుడూ ఉపరిభాగాలలో పగుళ్ళు ఉన్నా వాటిని కృత్రిమంగా పూడుస్తారు. వీటి ఉపరిభాగం ఎప్పుడూ ఇసుకతో చదును చేయబడి ఉండి రంగులు వేయడానికి అనువైన ముఖనాణ్యతను కలిగిఉంటుంది.

"B": రెండవ ఉత్తమ బెరడు నాణ్యతా ప్రమాణం. సాధారణంగా ఇది "A" ప్రమాణం చెక్కకు కొంచెం నాణ్యత తగ్గించిన చెక్క. ఉపరిభాగం గట్టిగా ఉన్నా వ్యాసం దగ్గర చిన్న ఖాళీలు మరియు ఉపరిభాగం కింద కొంచెం పగుళ్ళు ఉండవచ్చు. మామూలుగా వీటిని చెక్క ముక్కలతోగాని లేదా కృత్రిమ పదార్థంతో కాని నింపుతారు. ఉపరిభాగం మామూలుగా ఇసుకతో చదును చేయబడి ఉంటుంది.

"C": కిన్ధముఖం యొక్క నాణ్యత కొంచెం తక్కువగా ఉంటుంది. కానీ మామూలు నిర్మాణ పనుల కోసం దీనిని ఎంపిక చేసుకుంటారు. 1½ ఇంచుల వ్యాసం వరకు పట్టీలు ఉండవచ్చు. అలాగే కొన్ని రంధ్రాలు, కొన్ని ముఖపగుళ్ళు కలిగి మరియు రంగు పాలిపోయి ఉండవచ్చు. కొంతమంది ఉత్పత్తిదారులు ఈ లోపాలను కృత్రిమ పద్ధతుల ద్వారా సరిచేస్తుంటారు. ఈ రకం పలకలను సాధారణంగా ఇసుకతో చదును చెయ్యరు.

"D": ఉన్నవాటిల్లో అత్యంత తక్కువ నాణ్యతా బెరడుగా పరిగణిస్తారు. మామూలుగా దీన్ని నిర్మాణప్రమాణ పలకల్ కింద భాగాలను తయారు చెయ్యడానికి ఉపయోగిస్తారు. ఈ చెక్కలకు చిన్న వాటినుంచి 2½ ఇంచుల వ్యాసంగల పెద్దవైన రంధ్రాలు ఉన్నా కూడా అనుమతింపబడతాయి. ఖాళీలు, పగుళ్ళు కలిగి రంగు పాలిపోయి ఉన్నా ఫరవాలేదు. "D" ప్రమాణ చెక్కలను బాగుచెయ్యడం కానీ ఇసుకతో చధూ చెయ్యడం కానీ జరగదు. సాధారణ వాతావరణంలో శాశ్వత బయటపనుల కోసం ఈ చెక్క పనికిరాదు.

అనువర్తనాలు[మార్చు]

ప్లైవుడ్ను ఉత్తమ నాణ్యత మరియు ఉత్తమ శక్తి కలిగిన రేకులు అవసరమయ్యే అనేక పనుల కోసం వాడతారు. ఇక్కడ నాణ్యత అంటే పగుల్లను తట్టుకోవడం, విరిగిపోకుండా ఉండడం, ఇంకిపోకపోవడం, ముడతలు మరియు పోర్లిపోకుండా ఉండటం వంటి లక్షణాలు.

ఉపరిభాగం జిగురుతోటి చదును చేసిన ప్లైవుడ్ ఇంటి బయట పనుల కోసం తగినది. కానీ తేమ చెక్క యొక్క శక్తిని ప్రభావితం చేస్తుంది కనుక మంచి పనితనం కోసం చెక్కలోని తేమ శాతం తక్కువగా ఉన్నప్పుడే కనపడుతుంది. కానీ మరోప్రక్క సున్నా డిగ్రీ ఉష్ణోగ్రత పరిస్థితులు కూడా ప్లైవుడ్ పరిమాణాలను కానీ శక్తిని కానీ ప్రభావితం చెయ్యలేవు కనుక దీన్ని కొన్ని ప్రత్యేకమైన పనుల కోసం ఉపయోగించవచ్చు.

ప్లైవుడ్ ఉపరిభాగాలను ఎక్కువ ఇబ్బంది పెట్టే యాంత్రిక పనుల కోసం కూడా ఉపయోగించవచ్చు. రెండవ ప్రపంచ యుద్ధం నుంచి దీన్ని సముద్రపు మరియు విమాన అవసరాల కోసం ఉపయోగిస్తూనే ఉన్నారు. ఇందులో ముఖ్యంగా గుర్తించదగినది ప్రారంభంనుంచి చేక్కతోనే తయారు చెయ్యబడిన బ్రిటీష్ డి హేవిల్లాండ్ మస్కిటో బాంబర్. ఉపరిభాగాలు ఎక్కువ బలంగా ఉండవలసిన పనులకు ఇప్పుడు ప్లైవుడ్ను విజయవంతంగా ఉపయోగిస్తున్నారు.[citation needed]. గృహోపకరణ వస్తువుల తయారీదారులైన అమెరికన్లు చార్లెస్ మరియు రే ఏమ్స్ లు తమ ప్లైవుడ్ ఆధారితా కలప ఉత్పత్తులకు ప్రసిద్ది చెందారు. అలాగే ఫిల్ బోల్గర్ ప్లైవుడ్ ఆధారిత పడవలను తయారు చెయ్యడంలో పేరుపొందారు.

మ్రుదుకలప ప్లైవుడ్ అనువర్తనాలు[మార్చు]

స్ప్రూస్ ప్లైవుడ్ యొక్క సాధారణ ఉపయోగాలు:

  • ఇంటి నిర్మాణంలోని నేల, గోడలు మరియు పైకప్పు.
  • ఈదురు గాలుల రక్షణ పలకలు.
  • వాహనాల లోపలి భాగాలు.
  • మూతలు మరియు డబ్బాలు
  • ప్రకటనా బోర్డులు
  • రక్షణ ప్రహరీలు

స్ప్రూస్ ప్లైవుడ్ యొక్క ప్రసిద్ధమైన వృద్ధి రేకల నిర్మాణాన్ని కాపాడడానికి పూత పదార్థాలు ఉన్నాయి. ఈ పూత పూసిన ప్లైవుడ్లను కొన్ని ప్రోఅత్యేక అవసరాల కోసం ఉపయోగిస్తారు. ఇక్కడ స్ప్రూస్ శక్తి కలిగిఉండే కన్నా తేలికగా ఉంటే మంచిది. ఉదా:

  • కాంక్రీటు మూసివేయు పలకలు.
  • అప్పటికప్పుడు నిర్మాణాలకు రంగులు వేసే పనులు.

బిర్చ్ ప్లైవుడ్ అనువర్తనాలు[మార్చు]

పూత పూసిన ప్రత్యేక బిర్చ్ ప్లైవుడ్ను వెంటనే ఉపయోగించ్చే వస్తువుల కోసం వాడతారు.ఉదా:

  • కాంక్రీటు నమూనా వస్తువులు.
  • రవాణా వాహనాల నేల, గోడలు మరియు పైకప్పు భాగాలు.
  • నిలువ డబ్బాల నేలభాగాలు.
  • అధిక రాపిడికి గురయ్యే పరిశ్రమ మరియు భవనాల నేల భాగాలు.
  • భవన నిర్మాణాల కట్టడాలు.

బిర్చ్ ప్లైవుడ్ కొన్ని ప్రత్యేక అనువర్తనాలలో నిర్మాణ వస్తువుగా కూడా ఉపయోగపడుతుంది. ఉదా:

  • గాలి మరల రెక్కలు.
  • లిక్విఫైడ్ నేచురల్ గ్యాస్(LNF) రవాణాకు ఉపయోగించే రక్షణ పెట్టెలు.

మృదువైన ఉపరిభాగము, సరైన మందము మరియు మన్నిక కలగపిన బిర్చ్ ప్లైవుడ్ చాల ప్రత్యేకమైన వినియోగ అవసరాలకు ప్రియమైన వస్తువుగా మారింది. ఉదా:

  • అచ్చులను కత్తిరించు పలకలు
  • ప్రదర్శనశాలకు మద్దతు నిర్మాణం
  • క్రీడాస్థల పరికరాలు
  • గృహోపకరణ వస్తువులు
  • గిరాకిగల వాణిజ్య ప్రకటనల గుర్తులు మరియు వాటి రక్షణ ప్రహరీలు
  • సంగీత వాయిద్యాలు
  • క్రీడా పరికరాలు

ఉష్ణప్రదేశ ప్లైవుడ్ అనువర్తనాలు[మార్చు]

  • సాధారణ ప్లైవుడ్
  • కాంక్రీటు పలకలు
  • నేల పునాది.
  • కట్టడాల పలకలు
  • నిలువ డబ్బాల నేలభాగాలు.
  • అతుకుల ఫలకాలు
  • లామినేటేడ్ వేనీర్ లంబర్(LVL)

ఉష్ణప్రదేశ ప్లైవుడ్ ఆగ్నేయాసియా ప్రాంతాల్లో ముఖ్యంగా మలేసియా మరియు ఇండోనేషియా విరివిగా దొరుకుతుంది. ఉష్ణప్రదేశ ప్లైవుడ్ యొక్క ఉన్నత నాణ్యత మరియు శక్తి గురుంచి గొప్పగా చెప్పుకోవచ్చు. అందుబాటులో ఉన్న యంత్రాంగం తోటి, ఉష్ణప్రదేశ ప్లైవుడ్ను అత్యంత సరిసమానమైన మందంతో తయారు చెయ్యవచ్చు. అమెరికా, జపాన్, తూర్పు మధ్యమ, కొరియా మరియు ఇతర ప్రపంచ దేశాలు దీన్ని ఎక్కువగా ఎంచుకుంటున్నారు.

వీటిని కూడా చూడండి[మార్చు]

  • యంత్రించిన కలప
  • చెక్కనారల పలక
  • జిగురు రక్షణ పొర కలిగిన కలప
  • గట్టి పలక
  • మేసొనైట్
  • మధ్యస్థ సాంద్రము కలిగిన చెక్కనారల పలక
  • ఓరియంటెడ్ స్ట్రాండ్ బోర్డ్
  • తుక్కు పలక
  • నొక్కబడ్డ కలప

సూచనలు[మార్చు]

బాహ్య లింకులు[మార్చు]

"http://te.wikipedia.org/w/index.php?title=ప్లైవుడ్&oldid=1288763" నుండి వెలికితీశారు