ఫల్వార నూనె

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

ఫల్వారచెట్టు సపోటేసి వృక్షకుటుంబానికి చెందిన మొక్క.వృక్షశాస్త్రనామము డిప్లొనెమ బుటిరేసి(Diploknema butyracea).ఈ చెట్టును చిహరి,ఛుర అనికూడా పిలుస్తారు. దీని తెలుగు పేరు తెలియరాలేదు.

చెట్టు
పూలమొగ్గలు
కాయ

చెట్టు-వ్యాప్తి[మార్చు]

పొడవైన ఆకురాల్చు వృక్షము.ఇంచుమించు 15 మీటర్లేత్తు పెరుగుతుంది.ఏపుగా పెరుగుతుంది.నేపాల్,సిక్కింలలో కొన్నిచోట్ల 40 మీటర్లేత్తు పెరిగినవికూడా వున్నవి.చెట్టుబెరడు గ్రే లేదా బ్రౌన్ గా వుండును. ఇవి సముద్రమట్టంనుండి 400-1500 మీటర్లవరకు వ్యాపించి పెరుగుతాయి.ఈచెట్లు కొండలోయల్లోని నదులవడ్దున,కొండవాలుల్లో(Hill slopes)పెరుగుతాయి.5-10 సంవత్సరాలకు గట్టిపడి, కాయల దిగుబడి మొదల్వైతుంది.50-60 సంవత్సరాల వరకు కాపునిస్తాయి.ఒక చెట్టు నుండి 100-250 కిలోల వరకు కాయలదిగుబడి వుంటుంది.భారతదేశంలో హిమాలయ పరిసరప్రాంతాలు, కుమోన్ (kumoan), సిక్కిం,ఉత్తరబెంగాల్.భూటన్ వరకు వున్నాయి.సిక్కిం,ఉత్తరప్రదేశ్,పశ్చిమ బెంగాల్ వీటిపెంపకానికి అనువైన ప్రాంతాలు.5-10 సంవత్సరాలనుండి చెట్టుపండ్లను కాయడం ప్రారంభమవుతుంది[1].

పూలు :ఏప్రిల్-మే నెలలలో పూస్తాయి.పూలు తెల్లగా లేదా పాలిపోయిన పసుపురంగులో వుండును

పళ్ళు : గ్లోసిగా బాదంకాయ ఆకారంలోవుండును.సైజు 2-2.5 సెం,మీ,వుండును.పళ్లలో చక్కెర 8.5%,పీచు పదార్దం 5.6% వుండును.పళ్లు మే-అగస్టునెలల్లో పక్వానికివచ్చును.జూన్-జులైలలో పండ్లను సేకరించవచ్చును.

గింజలు(seeds): గింజలు గ్లోసిగా,నల్లగా వుండి,1.8-2.0సెం.మీ.పరిమాణంలో వుండును.పండులో విత్తనశాతం 80% వుండును.గింజలో విత్తనము(kernel) తెల్లగా బాదంపప్పు ఆకారంలో వుండును.గింజలో నూనె 42-47%,విత్తనము/బీజములో 60% వరకు నూనెశాతం వుండును.ప్రొటిన్ 18% వుండును.

నూనె[మార్చు]

మంచివిత్తనములనుండి తీసిననూనె మంచిరుచి,వాసనకల్గి తెలుపుగా వుండును.ఎక్కువకాలం నిల్వవుంచినను త్వరగా పాడవదు.

ఫల్వార నూనె భౌతికలక్షణాల పట్టిక[2]

భౌతిక లక్షణాలు మితి
వక్రీభవన సూచిక 400Cవద్ద 1.4552-1.4650
ఐయోడిన్ విలువ 90-101(44-48)*
సపనిఫికెసను విలువ 191-200
అన్సఫొనిపియబుల్ పధార్దం 1.4-5%
ఆమ్ల విలువ 9.1%
విశిష్ట గురుత్వం 300Cవద్ద 0.856-0.862
ద్రవీభవ ఉష్ణొగ్రత 39-510C
టైటరు విలువ 48-520C

గమనిక=*కొన్నిరకాలనూనెల్లో


ఫల్వార నూనెలోని కొవ్వు ఆమ్లంల శాతం[3][1]

కొవ్వు ఆమ్లాలు శాతం
పామిటిక్ ఆమ్లం(C16:0) 56.6
స్టియరిక్ ఆమ్లం(C18:0) 3.6
ఒలిక్ ఆమ్లం(C18:1) 36.0
లినొలిక్ ఆమ్లం((C18:2) 3.8

నూనె ఉపయోగాలు[మార్చు]

  • కొకో బట్టరు బదులుగా చాకోలెట్ల తయారిలో వాడవచ్చును[1].
  • వనస్పతి తయారిలో ఉపయోగించవచ్చును
  • మందుల,సబ్బుల,కొవ్వొత్తుల, మిఠాయిల తయారిలో ఉపయోగిస్తారు.దీపనూనెగా వాడెదరు[4] .

ఇవికూడా చూడండి[మార్చు]

ఉల్లేఖన/మూలాలు/ఆదారాలు[మార్చు]