ఫీనిక్స్ నగరం

వికీపీడియా నుండి

ఫైలు:Phoenix-logo.svg

Phoenix, Arizona
Downtown Phoenix
Downtown Phoenix
ముద్దు పేరు:
Valley of the Sun, The Valley, PHX, The 602, Bird City, P-town[1][2]
Location in Maricopa County and the state of Arizona
Location in Maricopa County and the state of Arizona
Coordinates: 33°26′54″N 112°04′26″W / 33.44833, -112.07389
Country United States
State Arizona
County Maricopa
Incorporated February 5, 1881
ప్రభుత్వము
 - Type Council-Manager
 - Mayor Phil Gordon (D)
వైశాల్యము
 - City 517.17 sq mi (1,334.1 km²)
 - భూమి 517.126 sq mi (1,334.1 km²)
 - నీరు 0.2 sq mi (0.6 km²)
ఎత్తు 1,117 ft (340 m)
జనాభా (2007)[3][4][5]
 - City 1,552,259 (US rank : 5th)
 - సాంద్రత మూస:Permi2km2
 - మెట్రో 4,281,899 (US Census, July, 2,008 est.)
 - Demonym Phoenician
Time zone MST (UTC-7)
 - Summer (DST) no DST (UTC-7)
Area code(s) 602, 480, 623, 520
FIPS code 04-55000
వెబ్‌సైటు: http://www.phoenix.gov/

అరిజోనా రాష్ట్రంలోని అతిపెద్ద నగరం ఫీనిక్స్. అంతేకాక ఇది అరిజోనా రాష్ట్ర రాజధాని కూడా. అలాగే అమెరికా నగరాలలో జనసాంధ్రతలో 5వ స్థానంలో ఉంది.నగరంలోని నివాసితుల సంఖ్య 1,552,259. ఫీనిక్స్ నగరపాలనా ప్రదేశంలో ఫీనిక్స్ నగరం ప్రధాన కేంద్రం. నగరపాలిత ప్రదేశంలో నివాసితుల సంఖ్య 4,281,899. అమెరికాలో ఇది 12వ స్థానంలో ఉన్న నగరపాలితం.మారికోపా కౌంటీకి ఫీనిక్స్ నరమే కౌంటీ నియోజకవర్గం. ఈ ఫీనిక్స్ నగరం దేశంలో అతిపెద్ద భూభాగం ఉన్న నగరం.

సాల్ట్ రివర్ సమీపంలో 1868లో స్థాపించబడిన ఈ నగరానికి నగరపాలన హోదా 1881లో లభించింది. ఫీనిక్స్ ఉత్తర అమెరికాలోని ప్రధాన రవాణా కేంద్రం. అగ్నేయ అమెరికా యొక్క ప్రధాన ఆర్ధిక, రవాణా, పారిశ్రామిక మరియు సాంస్కృతిక కేంద్రం ఫీనిక్స్ నగరం. నగరం గుర్తించతగిన రాజకీయ సంస్కృతిని కలిగి ఉంది. ఒకప్పుడు ఇది రిపబ్లికన్ పార్టీకి కంచుకోటలా ఉండేది. ఫీనిక్స్ నగరం రాజకీయంలో హేమామీలైన అనేకనాయకులకు పుట్టిల్లు. వారిలో బారీ గోల్డ్ వాటర్, విలియమ్ రెహ్క్విస్ట్, జాన్ మెకైన్,జానెట్ నెపోలిటానో,కార్న్ హైడెన్ మరియు సాంద్ర ఓ కోన్నర్ ప్రసిద్ధులు.

సొనోరన్ ఎడారి ఈశాన్యంలో ఉపస్థితమైన ఈ నగరం అమెరికా నగరాలలోనే అసాదారణ వాతావరణానికి పేరుపొందింది. సంవత్సరంలో అయిదు నెలల కాలం ఉష్ణోగ్రత 100 ఫారెన్‌హీట్ ఉంటుంది. ఒక్కోసారి 120 డిగ్రీల ఫారెన్‌హీట్‌ వరకు చేరడం కద్దు.

విషయ సూచిక

[మార్చు] చరిత్ర

[మార్చు] స్థానిక అమెరికా కాలం

1000 సంవత్సరాల కంటే మునుపే ఈ ప్రాంతం హోహోకామ్ ప్రజలచే ఆక్రమించబడి ఆ తరవాత కాలంలో క్రమంగా ఫీనిక్స్ నగరంగా రూపుదిద్దుకుంది. ఇక్కడ హోనిక్స్ ప్రజలు 135 మైళ్ళ పొడవున వ్యవసాయ కాలువలను నిర్మించడం వలన ఎడారిగా ఉన్న ఈ ప్రాంతం సస్యశ్యామలమైంది. ఈ కాలువ మార్గం ఆధునిక అరిజోనా కాలువ నిర్మాణానికి ఉపయోగపడింది. ఈ కాలువ మార్గం ప్రస్థుతం సెంట్రల్ అరిజోనా సెంట్రల్ కెనాల్ మరియు ది హైడెన్-రోహ్డ్స్ అక్విడక్ట్గా రూపుదిద్దుకుంది. హోహోకామ్ ప్రజలు పరిసరాలలో ఉన్న అనాసాకి మొగొల్లాన్ మరియు మెసోమెరికన్ తెగతో విశేషంగా వ్యాపార సంబంధాలను ఏర్పరచుకున్నారు. 1300 నుండి 1450 ల మధ్య కాలంలో హోహోకామ్ ప్రజలు ఇక్కడ నివసించినట్లు విశ్వసించబడుతుంది. ఆ తరవాత కాలంలో సంభవించిన కరువు కాటకాలు వరదలు హోహోకామ్ ప్రజలు ఈ ప్రాంతాన్ని విడిచి వెళ్ళడానికి ప్రధాన కారణమైంది. ప్రాచీన సంతతి వారు నగర వెలుపలి ప్రాంతానికి తరలి వెళ్ళడానికి అకిమెల్ ఊధమ్ ఒప్పందం కారణమని భావించపడుతుంది. నగర వెలుపలి ప్రాంతానికి తరలి వెళ్ళిన హూహూకామ్ ప్రజలు, గిలా నది తీరంలో కేంద్రీకృతమైన తోనో ఊధమ్ మరియు మారికోపా ప్రజలు ఇందుకు తార్కాణం. కొన్ని కుటుంబాలు సమూహంగా సాల్ట్ రివర్ ప్రాంతంలో నివసిస్తున్నా పెద్ద పెద్ద పల్లెల్లు మాత్రం ఇప్పటికి సజీవంగా లేవు.

[మార్చు] హిస్పానిక్ కాలం

స్పానిష్ ప్రభుత్వ సేవలో ఒక భాగంగా ఫాదర్ కినో మరియు ఇటాలియన్ జెసూట్ 1600 నుండి 1700 వ శతాబ్ధాల మధ్య ఇక్కడకు ప్రయాణించిన మొదటి యూరప్ దేశస్థులు.ఆ కాలంలో ఈ లోయ న్యూ స్పెయిన్ పరిపాలిత భూభాగంలో భాగమే. ఇది స్పెయిన్ అధీనం నుండి తరవాతి కాలంలో స్వతంత్ర మెక్సికోలో ఒక భాగమైంది. ఫాదర్ కినో ఈ నదికి రివర్ సలాడో (సాల్ట్ రివర్) అని నామకరణం చేసాడు. ఇందుకు ఈ నదీ జలాలు అధిక లవణసాంద్రత కలిగి ఉండటమే అందుకు కారణం. ఆయన అక్కడ మిగిలి ఉన్న ప్రజలతో కలసి పనిచేసినా దక్షిణ అరిజోనాలో విస్తరిస్తున్న పిమా మిషనరీకి ముఖ్యత్వం ఇచ్చాడు. అలాగే ఆగ్నేయ మరియు కాలిఫోర్నియాలో నూతన భాభాగం కోసం శోధించడంలో కృషి సాగించాడు. దక్షిణ అరిజోనా మాత్రమే హిస్పానిక్ హిస్పానికులకు ప్రధాన నివాసమైంది. కొన్ని శతాభ్దాల కాలం సాల్ట్ రివర్ ప్రాంతం నిర్జనంగానే మిగిలి పోయింది.

[మార్చు] అమెరికా సంయుక్తరాష్ట్రాల ప్రారంభ కాలం

19వ శతాబ్ధంలో ప్రస్తుత మధ్య అరిజోనా ప్రాంతాన్ని శోధించి చేరుకున్న అమెరికా మరియు యూరప్ దేశకొండజాతి ప్రజలు ఫీనిక్స్ నగరం మార్గంలో ప్రయాణించినట్లు విశ్వసించబడుతుంది. నీరు లభ్యమై వాతావరణం అనుకూలించినప్పుడు ఇక్కడ జింకలు గుడ్లగూబలు ఇతర జంతువులనూ వారు చూసారు. మెక్సికన్ - అమెరికన్ యుద్ధం ముగుసిన తరవాత కాలంలో అధిక ఉత్తర మెక్సికన్ భాగం అమెరికా ప్రభుత్వ ఆధీనంలోకి వచ్చింది. ఫీనిక్స్ నగరంతో కలసి ఈ భూభాగం కొంతకాలం న్యూ మెక్సికన్ టెర్రిటరీగా గుర్తించబడింది. 1853లో ఈ ప్రాంతాన్ని గాడ్సన్ పర్చేస్ పేరుతో అమెరికా ప్రభుత్వం ఊపందం మూలంగా స్వాధీన పరచుకుంది. టక్సన్ ని రాజధానిగా చేసుకుని సదరన్ సానుభూతిపరులు అరిజోనాలోని కొంత ప్రాంతాన్ని చేర్చి కాన్ఫిడరేట్ అరిజోనా టెర్రిటరీ పేరుతో తమ ఆధీనంలో ఉంచుకున్నారు. ప్రస్తుతం ప్రెస్ కాట్, అరిజోనాగా ఉన్న అప్పటి ఫోర్ట్ విపిల్ నగరాన్ని రాజధానిగా చేసుకుని అప్పటి అమెరికా కాంగ్రెస్ 1863లో అరిజోనా టెర్రిటరీని రూపుదిద్దింది. సాల్ట్ రివర్ తీరం వరకు అరిజోనా భూగమైంది. ఈ ప్రాంతం మిలటిరీ ప్రాముఖ్యాన్ని సంతరించుకోలేదు. యుద్ధానికి సాక్షిగా నిలబడలేదు.

ప్రస్థుతం మారికోపా కౌంటీగా గుర్తించబడుతున్న ప్రదేశం 1863లో అప్పటి గనుల నగరమైన వికెన్ బర్గ్ గా అవతరించిందిప్పుడు ఈ నియోజక వర్గం ప్రెస్ కాట్ టౌన్ తో కలసి యవాకోపై కౌంటీగా ఉండేది. 1865 యు ఎస్ ఆర్మీ యార్డే నదీతీరంలో మెక్‌డ్వెల్ ఓడరేవును నిర్మించింది. హోహోకామ్‌ ప్రజలు ఈప్రాంతాన్ని విడిచి వెళ్ళిన తరవాత రేవు నిర్మాణంలో పనిచేస్తున్న హిస్పానిక్ స్థానికిలు 1866 సాల్ట్ నదీ ఏరపరుచుకున్న తాత్కాలిక నివాసాలు ఈ ప్రదేశంలో స్థిరనివాసాలు ఏర్పడటానికి నాందీ అయింది. ఆ తరవాత ఈ లోయప్రాంతంలో సమీపంగా ఏర్పరుచుకున్న ఇతర ఒప్పందాల కారణంగా ఏర్పడిన నివాసాల సంఘటిత రూపం టెంప్ నగరంగా మారింది. కానీ ఫీనిక్స్ నగరంగా మాఇన తరవాతనే ఇది నగరపాలనా వ్యవస్థగా మారింది.

[మార్చు] ఫీనిక్స్ నగరస్థాపన

ఫీనిక్స్ నగర చరిత్ర అమెరికా అంతర్యుద్ధం‌లో పనిచేసిన జాక్‌స్విల్లింగ్చే ఆరంభమైంది. ఆయన 1850 సంపదను వెతుక్కుంటూ వెళ్ళి మొదట వికెన్‌బర్గ్లో పనిచేసాడు. 1867లో అక్కడి నుంచి బయటబడి వైట్ టాంక్ మౌంటెన్ క్రింది భాగంలో విశ్రాంతి కోసం ఆగినప్పుడు స్విల్లింగ్ అక్కడి ప్రదేశాన్ని పరిశీలించి అది అభివృద్ది చేయటానికి అనువైన ప్రదేశంగా భావించాడు. అప్పటికే మెక్‌డ్వెల్ రేవు నిర్మాణంతో కొంత అభివృద్ది చెంది ఉంది. ప్రదేశం,వాతావరణం అనుకూలంగా ఉందని నిరంతర నీటి సరఫరా ఉంటే అభివృద్ధి సాద్యమని అభిప్రాయపడ్డాడు. హోహోకామ్ ప్రజలు వదిలి వెళ్ళిన శిధిలాలు కాలువల రూపురేఖలను రేఖలను పరిశీలించి వాటిని పునరుద్దరిస్తే చక్కటి నీటి పారుదల సాధ్యమని స్విల్లింగ్ ఊహించాడు.

స్థానిక అమెరికన్‌ల పద్ధతిలో పలు కాలువలు నిర్మించాడు. క్రమంగా నదీతీరంలో నాలుగు మైళ్ళ విస్తీర్ణంలో చిన్న సమూహంతో కూడిన స్థిరనివాసాలూ ఏర్పడ్డాయి. ఇక్కడి కాలువల ప్రక్కన విస్తారంగా అతిపెద్ద ఆకారంలో పండిన గుమ్మడికాయల కారణంగా ఈ ప్రదేశానికి మొదటిగా పంప్‌కిన్ సిటీ (గుమ్మడికాయల నగరం)అని పిలవడం ఆరంభం అయింది. ఆతరవాత నిర్మించబడిన స్విల్లింగ్ మిల్లు కారణంగా హెల్లింగ్ మిల్ల్, మిల్‌ సిటీ గా పిలువబడింది. చివరికి ఈస్ట్ ఫీనిక్స్‌గా పిలువబడింది. కాన్ఫిడరేట్‌కి చెందిన పూర్వ సైనికుడు జనరల్ స్టోన్‌వాల్ జాక్‌సన్గౌరవార్ధం స్విల్లింగ్ ఈ ప్రదేశానికి స్టోన్‌వాల్ సిటీ అని నామకరణం చేయాలని భావించాడు. ఇతరులు సలైనా అని పేరు సూచించారు. కానీ ఈపేర్లేవీ సమూహంచే అంగీకారం పొందలేదు. ఆఖరిగా లార్డ్ దారెల్ డుప్పా అక్కడి స్థానికులు వదిలి వెల్లిన శిధిలాల నుండి ఈ ప్రదేశం పునరుద్ధరింపబడిన దానికి గుర్తుగా ఫీనిక్స్ అని పేరు సూచించాడు. ఆ పేరు అందరి ఆమోదం పొంది స్థిరపడింది. ఆ ప్రదేశానికి చుట్టూ విస్తరించి ఉన్న యవాకోపీ కౌంటీకి చెందిన పర్యవేక్షకులు ఈ ప్రదేశాన్ని 1868, మే 4వ తారీఖున ఎన్నికల నియోజకవర్గంగా గుర్తించబడింది. జాన్ స్విల్లింగ్ పోస్ట్ మాస్టర్‌గా ఇక్కడ 1868, జూన్ 15న తపాలా కార్యాలయం ఆరంభించబడింది. నివాసితులు సంఖ్య అభివృద్ది చెందుతున్న కారణంగా (అమెరికా జనాభా గణాంకాలు నిర్ధారించి జనసంఖ్య 240)పట్టణ నిర్మాణానికి ప్రదేశం అవసరమని భావించారు. 1870సెప్టెంబర్ 20న ప్రజలంతా కూడి నగర నిర్మాణం ఎక్కడ నిర్మించాలో నిర్ణయించారు. 320 ఎకరాల ప్రాంతాన్ని నగర నిర్మాణం కొరకు కొనుగోలు చేయబడింది. అదే నగర వ్యాపారకూడలిగా అభివృద్ధి చెందిన ప్రస్తుత డౌన్ టౌన్.

ఫీనిక్స్ నగరం1871 ఫిబ్రవరి 12న ఆరవ కౌంటీ అయిన మారికోపా కౌంటీగా అవతరించింది. 1871లో మొదటి కౌంటీ ఎన్నికలు నిర్వహించబడ్డాయి. బర్నమ్ మొదటి షరీఫ్‌గా ఎన్నుకొన బడ్డాడు. 1870లో 48 అమెరికన్ డాలర్ల సరాసరి వెల నిర్ణయించి అనేక భూములు విక్రయించబడ్డాయి. 1871న మొదటి చర్చి నిర్మించబడింది అలాగే మొదటి పచారీ దుకాణం తెరవబడింది. 1872 సెప్టెంబర్ 5న కౌంటీ కోర్ట్ ఆవరణలో ప్రభుత్వ పాఠశాలకు చెందిన మొదటి తరగతి ప్రారంభించబడింది. 1873లో పాఠశాలకు ప్రత్యేక భవనం నిర్మించబడింది. 1873 నవంబర్ 10న ఫ్లారెన్స్ ల్యాండి ఆఫీస్‌లో ఇక్కడి భూములు అధికారపూర్వకంగా నమోదు చేయబడ్డాయి. 1874 ఏప్రిల్ 10న ప్రెసిడెంట్ ఉల్సెస్ ఎస్ గ్రాంట్ చే అదికారాన్ని ఆమోదిస్తూ ఫీనిక్స్ నగర పేటెంట్ పత్రం విడుదల చేయబడింది. నగర ప్రదేశం మొత్తం భూమి వెల 550 అమెరికన్‌డాలర్లుగా నిర్ణయించబడింది. డౌన్‌టౌన్ స్థలాలు 7 మరియు 11 వెలలు నిర్ణయించి విక్రయించబడ్డాయి. తరవాత అతికొద్ది కాలంలో ఒక తంతి కార్యాలయం,16 క్షవరశాలలు,4 నాట్యశాలలు మరియు రెండు బ్యాంక్‌లు తెరవబడ్డాయి.

[మార్చు] నగరపాలన

1881 నాటికి ఫీనిక్స్ పట్టణ స్థాయి పాలనా వ్యవస్థ రూపొందేటంతగా ఎదిగింది.11 టెర్రిటోరియల్ లెజిస్లేచర్ ఫీనిక్స్‌క్ నగరానికి నగరపాలనా వ్యవస్థకు ఆమోదం తెలుపుతూ ది ఫీనిక్స్ చార్టర్ బిల్లును జారీ చేయడంతో నగరం మేయర్-కౌన్‌సిల్ ప్రభుత్వం పాలనలోకి చేరింది.గవర్నర్ జాన్ సి ఫ్రిమోంట్చే 1881 ఫిబ్రవరి 25 న బిల్లు జారీ చేయబడింది.అప్పటి నగర జనాభా షుమారుగా 2,500.1881 మే 21 న ఫీనిక్స్ మొదటి మేయర్ ఎన్నికలు నిర్వహించింది.107 స్థానాలు గెలిచిన డి.మోనిహన్ ను 127 స్థానాలు సాధించిన న్యాయాధిపతి టి.అల్సాప్ ఓడించి నగరానికి మొదటి మేయర్ అనే గౌరవాన్ని పొందాడు.1888 ఆరంభ కాలంలో ప్రభుత్వ కార్యాలయాలు వాషింగ్‌టన్ మరియు సెంట్రల్‌ ప్రాంతానికి తరలి వెళ్ళాయి.ఆతరవాత బస్ టెర్మినల్‌ ఉన్న ప్రదేశానికి మార్చబడి అక్కడ 1990 లో సెంట్రల్ స్టేషన్ నిర్మాణం ప్రారంభం అయేవరకు ఉన్నాయి.1889లో ఆకార్యాలయాలు ఫీనిక్స్ నగరానికి మారచబడ్డాయి.1880 రైల్ రోడ్స్ రాకతో ఫీనిక్స్ ఆర్ధిక రంగంలో వ్ప్లవాత్మకమైన మార్పులు వచ్చాయి.వాణిజ్యం రైల్ మార్గంలో వ్యాగన్ల రూపంలో నగరానికి ప్రవాహంలా వచ్చి చేరింది.తూర్పు పడమటి ప్రాంతాలకు ఉత్పత్తులు పోయి చేరడంతో ఫీనిక్స్ ప్రధాన వ్యాపార కూడలి అయింది.ఫలితంగా ఫీనిక్స్ నగర చాంబరాఫ్ కామర్స్ 1888 నవంబర్ 4 న రూపుదిద్దుకుంది.1891 లో నిర్మించిబడిన ఆరంభకాల స్టేగ్ కోచ్ లైన్ ఆధారంగా ఎలెక్‌ట్రిక్ స్ట్రీట్ కార్ సిస్టమ్ ప్రారంభించబడింది.


[మార్చు] ఆధునిక ఫీనిక్స్ నగరం(1900 నుండి ప్రస్థుత కాలం వరకు)

1992లో అప్పటి ప్రెసిడెంట్ అయిన దియోడోర్ రూస్‌వెల్ట్ ఆమోదంతో నెరవేరిన నేషనల్ రిక్లెమేషన్ యాక్ట్ నగరంలో ఆనకట్టల నిర్మాణానికి మార్గం సుగమం చేసింది.పడమటి నదీప్రవాహాలపై ఆనకట్ట నిర్మాణానికి పనులు ప్రారంభం చేయడానికి ప్రజలుచే 1903 ఫిబ్రవరి 7న సాల్ట్ రివర్ వెల్లీ వాటర్ అసోసియేషన్ జల మరియు విద్యుత్ సరఫరాను నిర్వహించడానికి స్థాపించబడింది.సాల్ట్ రివర్ ప్రాజెక్ట్లో అంతర్భాగంగా ఈ ఏజెన్సీ ఇంకా కొనసాగుతూ ఉంది.తూర్ప కొండ ప్రాంతంలో రూజ్‌వెల్ట్ డామ్నిర్మాణం 1991 నాటికి పూర్తి అయింది.ఫీనిక్స్ నగర ప్రాంతాలలో పర్వత శ్రేణుల సమీపంలో పలు సరసులు ఏర్పడ్డాయి.నీటి పారుదలకు అధికంగా జలవినియోగం జరుగుతున్న కారణంగా నదీజలాలు తరచుగా ఎండిపోతున్నాయి.ఈ కారణంగా భారీగా వలస పక్షులు ఈ ప్రాంతాలను వదిలి బీవర్ డామ్స్ మరియు కాటన్ వుడ్ వృక్షాలకు తరలి వెళతాయి.

1912 ఫిబ్రవరి 14న ప్రెసిడేంట్ పాలనలో ఫీనిక్స్ నగరం అరిజోనా రాష్ట్ర రాజధాని అయింది.ఫీనిక్స్ రాష్ట్రరాజధానిగా మరియు భౌగోళికంగా కేంద్రస్థానంలో ఉండటంతో ట్క్సన్ మరియు ప్రెస్కాట్‌ల కన్నారిజోనా రాష్ట్రంలో ప్రాధాన్యత సంతరించుకుంది.అప్పట్లో ఫీనిక్స్ టక్సన్ నగరానికంటే చిన్నది అయినా తరవాతి కొన్ని దశాబ్ధాలలోనే అభివృద్ధి చెంది రాష్ట్రంలో పెద్దనగరంగా మారింది.

1912లో ఫీక్స్ నగరం మేయర్_కౌన్సిల్ పాలనావ్యవస్థ నుండి కౌన్సిల్_మేనేజర్ పాలనా వ్యవస్థగా మారింది.అమెరికాదేశంలో ఇలాటి పాలనా వ్యవస్థ ఏర్పరుచుకున్న మొదటి నగరం ఫీనిక్సే.

రెండవ ప్రపంచ యుద్ధకాలంలో ఫీనిక్స్ నగర ఆర్ధికవనరులు యుద్ధపరికరాల వినియోగ కేంద్రంగా మారింది.యుద్ధపరికరాల తయారుచేసి సరఫరాచేసే పరిశ్రమలు అతివేగంగా అబివృద్ధి చెందాయి.హైదర్ సెంటర్లో ల్యూక్ ఫీల్డ్,విలియమ్ ఫీల్డ్ మరియు ఫాల్కన్ ఫీల్డ్ ఏర్పరచిన బృహత్తర యుద్ధ శిక్షణా కేంద్రాలు నగరంలోకి వేలకొలది క్రొత్త జనవాహినిని తీసుకు వచ్చాయి.

నగరంలో జర్మన్ యుద్ధ ఖైదీలను నిర్భంధించటానికి ది పపాగో పార్క్ ప్రిజనర్ ఆఫ్ వార్ క్యాంప్ ఏర్పాటు చేయబడింది. వాటికి చెందిన కొన్ని భవనాలు మాత్రం ప్రస్థుతం మిగిలి ఉన్నాయి.1944 లో డజన్ల కొద్దీ ఖైదీలు దిగువ సాల్ట్ మరియు గిలా నదీ ప్రవాహాల గుండా బోట్లలో ప్రయాణీంచి మెక్సికో చేరాలని ఉయూహం పన్నారు.సాల్ట్ నదీ జలాలు దశాబ్ధాలుగా ఎండిపోయి ఉన్నాయని గ్రహించకుండా ధైర్యం చేయడంతో క్యాంప్ పరిసరాలలోనే పట్టుబడ్డారు.

1942 లో నగరంలో బసచేసి ఉన్న యు.ఎస్ సైకులూ ఆర్మీ పోలీసుల మధ్య జరిగిన దురదృష్టకరమైన కొన్ని దుర్ఘటనల తరవాత కల్నల్ ల్యూక్ ఫీల్డ్ నగర పరిసరాలలో సైనిక దళాలకు నిషేధం విధించాడు.విజయవంతంగా ముగుసిన ఈ ప్రయత్నం నగర కౌన్సిల్‌కు పరిపాలనలో విశేషాధికారం ఇవ్వడానికి కారణం అయింది.అలాగే నిధులను వినియోగించడంలో కూడా అధిక స్వాతంత్ర్యం లభిచింది.

1947 లో సంభవించిన అగ్ని ప్రమాదం అధిక సంఖ్యలో స్ట్రీట్ కార్లను దగ్ధంచేయడంతో నగరం కొత్త స్ట్రీట్ కార్లను తయారు చేసుకోవడం లేక ప్రయాణావసారలకు బసులపై ఆధారపడవససిన పరిస్థితిలో పడింది.

1950 నాటికి నగరజనాభా 1,00,000కు చేరుకుంది.ఇది కాక నగర పరిసర ఇతర సమూహాల జనాభా కొన్ని వేలకు చేరుకుంది.నగరంలో పేవ్‌మెంట్ నిర్మించిన వీధులు 148 మైళ్ళపొడవున ఉన్నాయి.అవికాక పేవ్‌మెంటులు లేని వీధులు 163 మైళ్ళ పొడవున ఉన్నాయి.

తరవాతి కొన్ని దశాబ్ధాల కాలం నగరం పరిసర ప్రాంతాలు ఆకర్షణీయమైన అభివృద్ధి సాధించాయి.రాత్రి జీవితం కొన్ని ప్రత్యేక సంఘటనలకుమాత్రం కేంద్రంగా ఉన్న సెంట్రల్ అవెన్యూలో 1970 నుండి నేరాల అభివృద్ధి వాణిజ్యం క్షీణించడం ఏకకాలంలో ప్రారంభం అయ్యాయి.1976లో అరిజోనా రిపబ్లిక్ రచయిత డాన్‌బోల్స్ కారు బాంబ్ పేలి హత్యకు గురి అయ్యాడు.ఫీనిక్స్ నగరంలో నేరాల జరుగుతున్న తీరు తెన్నులను గురించి ఆయన పరిశోధించి పత్రికలకు అందించడం ఈ హత్యకు మూలకారణంగా భావించారు.1980 నాటికి స్ట్రీట్ గ్యాంగ్ మరియు డ్రగ్ ట్రేడ్ ప్రజారక్షణ సంబందిత చర్చనీయాంశాలు అయ్యాయి. అనేకరకాల నేరాలు అప్పటినుండి పెరుగుతూ వచ్చాయి.ప్రస్తుతం నగరంలో నేరాలు జాతీయ సరాసరి కంటే అధికమే.1980 లో సాల్ట్ నదికి సంభవించిన వరదలు కారణంగా పలు వంతెనలు దెబ్బతిన్నాయి,ది అరిజోనా డిపార్ట్‌మెంటాఫ్ ట్రాన్స్‌పోర్టేషన్ మరియు అమ్‌ట్రాక్ఒకటిగా చేరి పనిచేసి తాత్కాలిక ట్రైన్ సర్వీసులు నడిపాయి.ది హట్టీ బి పేరుతో మద్య ఫీనిక్స్ నుండి ఆగ్నేయ సరిహద్దుల వరకు ట్రైన్ సర్వూసులు నిర్వహించారు.నిర్వహణలో నిధులు నిర్వహణ చేయడంలో స్థానిక అధికారులు తగినంత శ్రద్ధ చూపించక పోవడమూ ఖరీదైన ఇతర ప్రాజెక్టులు చేపట్టడమూ చేరి హట్టీబీ లైన్ ‌లో సర్వీసులను నిలిపి వేయడానికి కారణం అయ్యాయి.

1997 లో నగరచరిత్రలో ఫీనిక్స్ లైట్స్దృశ్యాలు స్థానం సంపాదించాయి.2000 నాటికి ఫీనిక్స్ నగరం 24.2% అభివృద్ధి చెందింది.ఇది దేశంలో ఫీనిక్స్ నగరాన్ని త్వరితగతిన అభివృద్ధి చెందుతున్న నగరాలలో లాస్ వెగాస్ తరవాతి స్థానంలోకి తీసుకు వచ్చింది.2008లో ఆర్ధిక సంక్షోభం వలన బలంగా బాధించబడిన నగరాలలో ఫీనిక్స్ నగరం ఒకటి.ఈ సంక్షోభం సబ్‌ప్రైమ్ మోర్ట్‌గేజ్ క్రైసిస్గా అభివర్ణించ బడింది.సమీపకాలంలో ఆకాశాన్నంటిన నివాసగృహాల ఖరీదు 2,62,000 అమెరికా డాలర్ల నుండి 1,50,000 కు పడిపోవడం విశేషం.ప్రస్థుతం ఫీనిక్స్ నేరాలు తగ్గుముఖం పట్టాయి.

[మార్చు] భౌగోళికం

ఉత్తరదిశగా సొనారన్ ఎడారి, పడమటి దిశలో సాల్ట్ నది సముద్ర తీరానికి 1,117 అడుగుల ఎత్తులో నగరం ఉపస్థితమై ఉంది. ఈశాన్యంలో నగరం చుట్టూ మెక్ డ్వెల్ పర్వతాలు',' పడమటి దిశలో వైట్ టాంక్ పర్వతం, తూర్పున సూపర్ స్టిషన్ పర్వతాలు, ఆగ్నేయంలో సైరా ఎస్ట్రెల్లా పర్వతాలు, నగరంలో ఫీనిక్స్ పర్వతాలు మరియు దక్షిణ పర్వతాలూ నగరానికి వింతశోభను సంతరించాయి. ప్రస్థుతం ఉత్తర మరియు పడమటి దిశలో భౌగోళిక సరిహద్దులు దాటి నగరం అభివృద్ధి చెందుతూ ఉంది. దక్షిణంలో పైనల్ కౌంటీలను తాకుతూ విస్తరిస్తూ ఉంది. యునైటెడ్ స్టేట్స్ సెన్సస్ బ్యూరో గణాంకాలననుసరించి నగర విస్తీర్ణం 475.1 చదరపు మైళ్ళు. 474.9 చదరపు మైళ్ళు భూభాగం,0.2 చదరపు మైళ్ళు జలభాగం.

ఫీనిక్స్ నగరపాలిత ప్రాంతం జనసంఖ్య అరిజోనాకు చెందిన మారికోపా మరియు పైనల్ కౌంటీల ప్రజలుతో కలిపి దేశంలో 13వ స్థానంలోఉంది. యు.ఎస్ గణాంకాలననుసరించి మొత్తం జనసంఖ్య 40,39,182. నగరపాలితంలోకి చేరిన ఇతర నగరాలు మెసా, స్కాట్‌డేల్, గ్లెండేల్, టెంప్, చాండ్లర్, గిల్‌బర్ట్ మరియు పియోరియా. పలు చిన్న చిన్న సాంస్కృతిక సమూహాలు నగర జనాభాలో అంతర్భాగమే. కేవ్‌గ్రీక్, క్వీన్‌గ్రీక్, బక్‌యే, గుడ్‌ఇయర్, ఫౌంటెన్ హిల్స్, లిచ్‌ఫీల్డ్ పార్క్, అనితమ్, సన్‌లేక్స్, సన్‌సిటీ, సన్‌సిటీ, అవోండేల్, సర్‌ప్రైస్, ఇఐ మైరేజ్, పారడైజ్‌వెల్లీ మరియు టాల్‌సన్ వీరంతా నగరపాలిత సాంస్కృతిక సమూహాలకు చెందిన వారే. వీరు కాక నగర ఇతర ప్రాంతాలలో నివసించే అహ్వాతుకీ ,అర్కాడియా, దీర్‌వెల్లీ, లావీన్, లావీన్, మేరీ వేల్ ప్రజలు ఉన్నారు. అహ్వాతుకీ మాత్రం దక్షిణ పర్వతాల నడుమ ప్రత్యేకంగా ఉన్నారు.

[మార్చు] వాతావరణం

ఉత్తర ఎమ్.టీ ప్రిజర్వ్ నుండి ఫీనిక్స్

[మార్చు] జనసంఖ్య

2007 అమెరికా గణాంకాలననుసరించి జనసంఖ్య వివరాలు;-

  • 48.1% హిస్పానికులు కాని శ్వేతజాతీయులు.
  • 6.0% ఆఫ్రికన్ అమెరికన్లు.
  • 2.4% అమెరికన్ ఇండియన్ స్థానికులు.
  • 2.7% ఆసియన్లు.
  • 0.2% స్థానిక హవాలియన్ మరియు ఇతర పసిఫిక్ ద్వీపవాసులు.
  • 14.1% ఇతరులు.
  • 1.9% మిశ్రిత జాతీయులు.
  • 4.1% హిస్పానికులు(అన్ని జాతీయులు).

2000 జనాభాలెక్కల గణాంకాలను అనుసరించి నగర జనాభా 1,321,045,నివాసాల సంఖ్య 865,834,నగర సరిహద్దులలో నివసిస్తున్న వారి సంఖ్య 407,450.ఒక చదరపు మైలు ప్రదేశ జనసాంద్రత 2,782.సరాసరి ఒక చరదరపు మైలు విస్తీర్ణంలో నివాసగృహాల సంఖ్య 1,044.18 సంవత్సరాల లోపు పిల్లల సంఖ్య జనాభాలో 35.7%.ఒకటిగా నివసిస్తున్న దంపతులు మరియు పిల్లల శాతం 46.9%.ఒంటరిగా నివసిస్తున్న స్త్రీల సంఖ్య జనాభాలో 12.9%. విజాతీయుల శాతం 34%.ఒంటరిగా నివసిస్తున్న ప్రజల శాతం 25.45%.65 సంవత్సరముల పైబడిన వారు 6.3%.సరాసరి నవాసగృహ నివాసితులు 2.7 మరియు సరాసరి కుటుంబంలో నివాసితులు 3.39.

నరసరిహద్దులలో 18 సంవత్సరాల లోపు వారు 28.9%,18 నుండి 24 సంవత్సరాల లోపు వారు 10.9%,25 నుండి 44 సంవత్సరాల ప్రజలు 33.2%, 45 నుండి 64 వయసు కలిగిన వారు 18.8%.65 సంవత్సరాల పైబడిన వారి సంఖ్య 8.1%.సరాసరి వివాహ వయసు 31 సంవత్సరాలు.ప్రతి 100 స్త్రీలకు పురుషుల నిష్పత్తి 103.5.18 సంవత్సరాల లోపు స్త్రీలకు పురుషుల నిష్పత్తి 102.7 పురుషులు.

సరాసరి గృహాదాయం 41,207 అమెరికన్ డాలర్లు.పురుషుల సరాసరి ఆదాయం 32,820 అమెరికన్ డాలర్లు కాగా స్త్రీల సరాసరి ఆదాయం 27,466.సరాసరి తలసరి ఆదాయం 19,833 అమెరికన్ డాలర్లు.జనసంఖ్యలో 15.8% కుంటుంబ నివాసితులలో 11.5% దారిద్ర్య రేఖకు దిగువున ఉన్నారు.18 సంవత్సరాలకు లోపు వారిలో 21% 65 సంవత్సరాల పైబడిన వారిలో 10.3% దారిద్ర్యరేఖకు దిగువున ఉన్నారు.

2000 సంవత్సరాల గణాంకాలను అనుసరించి ఫీనిక్స్ నగర జనాభాలో శ్వేతజాతీయుల శాతం 48.15%,ఆఫ్రికన్ అమెరికన్ల శాతం 5.1%,స్థానిక అమెరికన్ల శాతం 2%,ఆసియన్ల శాతం 2%,పసిఫిక్ ద్వీప వాసుల శాతం 0.13%,ఇతర జాతీయుల శాతం 16.4%,మిశ్రమ జాతీయుల శాతం 3.3%.జసంఖ్యలో అన్ని జాతులకు చెందిన హిస్పానికులు మరియు స్పానిష్‌ల శాతం 34.1%.బ్రూకింగ్ ఇన్‌స్టిస్ట్యూషన్‌కు చెందిన గణాంక నిపుణుడు విలియమ్ ఎర్రీ అంచనా ప్రకారం 2000 నుండి జనసంఖ్యలో హిస్పానికుల సంఖ్య 50% శాతం పడిపోయినట్లు గణాంకాలు సూచిస్తున్నాయి.

2000 జనాభా గణాంకాలను అనుసరించి జనాభాలో 45% కాధలిక్కులు,ఎల్.డి.ఏస్‌లు 13%,యూదులు 5%,మిగిలిన 37% జాతిని ప్రకటించని వారు.

[మార్చు] ఆర్ధిక రంగం

ప్రారంభంలో ఫీనిక్స్ నగరం వ్యవసాయ ఆధారిత ఆర్ధికపరిస్థితి కలిగిన నగరం.ప్రత్యేకంగా పత్తి మరియు నిమ్మ,కమలా లాంటి పండ్ల తోటల పెంపకంలాంటివి అధికం. జనాభాసంఖ్య చురుకుగా అధికం కావడంతో అర్ధికరంగంలో వివిధ మార్పులు సంభవించాయి.రెండు దశాబ్ధాల పైబడి ఆర్ధిక రంగంలో మార్పులు పొడచూపాయి.ఫీనిక్స్ నగరంలో అత్యధికులు ప్రభుత్వోద్యాగాలపై ఆధారపడి జీవిస్తున్నారు.రాష్ట్ర రాజధాని కావడంతో అధికంగా ప్రభుత్వోద్యాగాలలో నియమితులు అయ్యారు.అరిజోనా స్టేట్ యూనివర్శిటీనగర ప్రజల విద్యాభివృద్దికి అదికంగా తోడ్పడింది.లెక్కించదగిన సంఖ్యలో సమాచార మరియు సాంకేతిక సంస్థలు నగరంలో పున॰స్థాపించబడ్డాయి.శీతాకాల వెచ్చని వాతావరణం ఫీనిక్స్ నగర పర్యాటకరంగానికి మరింత ప్రోత్సాహాన్ని ఇచ్చింది.నగరంలో గోల్ఫ్‌కు మరింత ప్రత్యేకత ఉంది.

ఫీనిక్స్ నగరం ప్రస్థుతం ఫార్చ్యూన్ 1000 లో చేరిన ఏడు సంస్థలకు పుట్టిల్లు.మేనేజ్‌మెంట్ సంస్థ అలైడ్ మేనేజ్‌మెంట్,విద్యుత్ పరికరాల సంస్థ అవెంట్,యూనివర్శిటీ ఆఫ్ ఫీనిక్స్ను స్థాపించిన అప్పోలో గ్రూప్ ,గనుల సంబధిత సంస్థ ఫ్రీపోర్ట్-మెక్‌మోరన్,చిల్లర వ్యాపార సంస్థ పెట్ స్మార్ట్,విద్యుత్ సరఫరా సంస్థ పిన్నాకిల్ వెస్ట్,చిల్లర వ్యాపార సంస్థ సి ఎస్ కె ఆటో వీటితో హనీవెల్‌కి చెందిన ప్రధానకార్యాలయ విభాగం నగరంలో ఊపస్థితమై ఉన్నాయి.

[మార్చు] సంస్కృతి

[మార్చు] కళులు

అనేక సంగీత కళారూపాలు నగరంలో ప్రత్యేక పాత్ర వహిస్తున్నాయి.ముఖ్యంగా ప్రారంభంలో ఫీనిక్స్ నగర డౌన్ టౌన్ మరియు స్కాట్ డేల్ లో సంగీతానికి ప్రాముఖ్యత అధికం.ఫీనిక్స్ సింఫోనీ హాల్ ప్రధాన వేదికలలో ఒకటి.ఇకడ తరచుగా బ్యాలెట్ అరిజోనా మరియు అరిజోనా ఒపేరాలాంటి సాంస్కృతిక సంగాల ప్రదర్శనలు జరుగుతుంటాయి.ఫీనిక్స్ మెట్రో పాలిటన్ ప్రాంతంలో ఉన్న ఒర్‌ఫ్యూమ్ దియేటర్ మరొక ప్రధాన వేదిక.

[మార్చు] ఉద్యానవనాలు వినోదాలు

[మార్చు] విద్యాసౌకర్యాలు

[మార్చు] ప్రయాణ సౌకర్యాలు

[మార్చు] మూలాలు

  1. Leatherman, Benjamin (2009-04-08). Phoenix - Up on the Sun - AZPunk.com Returns. తీసుకొన్న తేదీ: 2009-04-30. “For those of you unfamiliar with AZPunk, it functioned as an information resource and meeting ground for P-Town's punk and hardcore community since being launched back in 2002 by founders Chris Lawson and Micah Elliot”
  2. Lemons, Stephen. "Pitiless P-Town", Phoenix News, 2007-10-10, p. 1. Retrieved on 2009-04-30. “The cranky cockatoo slams callous P-towners, pecks away at (sigh . . .) another bogus "plot" to off Sheriff Joe, and profiles the "Mexican Mutant"”
  3. "[1]." United States Census Bureau. 2005. Retrieved on June 27, 2007.
  4. Population Estimates for the 25 Largest U.S. Cities based on July 1, 2006 Population Estimates (PDF).
  5. Annual Estimates of the Population for Incorporated Places in Arizona. United States Census Bureau (2008-07-10). తీసుకొన్న తేదీ: 2008-07-14.
పేజీకి సంభందించిన లింకులు