ఫైర్ఫాక్స్
మొజిల్లా ఫైర్‌ఫాక్స్ [1] ఒక ఉచిత, మూలాల అందుబాటుకల వెబ్ విహరిణి. దీనిని మొజిల్లా సంస్థ నిర్వహిస్తుంది. ఫైర్‌ఫాక్స్ 20.78 శాతం మందిచే వాడబడుతూ, ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరర్ తర్వాత రెండవ స్థానంలో వుంది.వెబ్ పేజీలు రూపుదిద్దటానికి గెకో అనే లేయవుటు ఇంజిన్ వాడుతుంది. దీని ఆకర్షణలలో ముఖ్యమైనవి టాబుల వీక్షణం, అచ్చుతప్పులు ఉపకరణము, దింపుకోళ్ళ నిర్వాహకి, శోధన పరికరము, వాడుకరి మలచుకోదగినఇంకా మరిన్ని ఆకర్షణలకొరకు ఇతరులు తయారుచేసిన యాడాన్లు కలవు. వీటిలో లినక్సు వాడే తెలుగు వారికి తెలుగు వార్తాపత్రికలు చూపటానికి ఉపయోగపడే ముఖ్యమైన పద్మ ప్లగ్ ఇన్. ఫైర్‌ఫాక్స్ అన్నిరకాల నిర్వాహణ వ్వవస్థలు అనగా మైక్రోసాఫ్ట్ విండోస్, మేకింతోష్ ఓయస్ ఎక్స్, లినక్స్ మరియు యునిక్స్ లాంటి వాటిపై పనిచేస్తుంది. ప్రస్తుత విడుదల సంఖ్య 10.0.2. దీని మూలపు కోడ్ జిపిఎల్/ ఎల్‌జిపిఎల్/ఎమ్‌పిఎల్ లైసెన్సుల ద్వారా లభ్యమవుతుంది.
విషయ సూచిక |
తెలుగు ఫైర్‌ఫాక్స్ [మార్చు]
23 సెప్టెంబరు 2008న ఫైర్‌ఫాక్స్ 3.0.2 ఆధికారిక తెలుగు బీటా విడుదల అయ్యింది. తెలుగు అనువాదం సమన్యయం మెయిలింగ్ లిస్టు మరియు ప్రత్యేక జాలస్థలం [2] దీనికి కొత్తపల్లి కృష్ణబాబు ముఖ్య అనువాదకర్త. దీనికి ముందు చాలా మంది పని చేసారు. 1.5 వర్షన్ కోసం స్వేచ్ఛ [3] జట్టు (సునీల్ మోహన్) మరియు, 2.0 వర్షన్ కోసం సి-డాక్ సంస్థ (RKVS రామన్) పని చేశారు. అయితే 3.0.2కు ముందు అధికారికంగా విడుదలకాలేదు.
తెలుగు ముద్రాక్షరాల తనిఖీ విస్తరణ [మార్చు]
ఫైర్‌ఫాక్స్‌లో సాధారణంగా ఇంగ్లిషు స్పెల్‌చెకర్ స్థాపితమై ఉంటుంది. తెలుగు వాడుకరులు తెలుగు ముద్రాక్షరాల తనిఖీ (స్పెల్ చెకర్) విస్తరణను [4]విస్తరణల సైట్ నుండి పొంది స్థాపించుకోవాలి. ఇలా చేస్తే తెలుగులో టైపు చేసేటప్పుడు జరిగే దోషాలను కనుగొనటం, అది యిచ్చే సలహాలను అవసరమైతే వాడుకొని మార్చటం సులభం అవుతుంది. ఇది తొలిసారిగా జనవరి 1, 2011న విడుదలయ్యింది.
వికీపీడియా ప్రయోగశాలలో ఎలా వాడవచ్చో తెరపట్టు చూడండి. దీనికోసం మీరు ఏ వెబ్సైట్లో సమాచారం ప్రవేశపెట్తున్నప్పుడైనా, మౌస్ పై కుడివైపు మీటని నొక్కి భాషను తెలుగుగా ఎంచుకొని, స్పెల్లింగు తనిఖీ చేతనం చేసిన తరువాత, మీరు టైపు చేస్తున్నప్పుడే, ఆ నిఘంటువులో పదం లేకపోతే, పదం పూర్తవగానే దాని కింద ఎర్రని తరంగపు గీతని చేరుస్తుంది. మరల మౌస్ పై కుడివైపు మీటని నొక్కితే, నిఘంటువు మరియు స్పెల్ చెకర్ నియమాల ప్రకారం సలహా పదాలను సూచిస్తుంది. వాటిలో తగిన పదముంటే దానిని ఎంచుకోవడం ద్వారా దోషాన్ని దిద్దవచ్చు. టైపు చేసిన పదం దోషం లేనిదైతే దానిని నిఘంటువులో చేర్చవచ్చుకూడా.