ఫ్రీవర్స్ ఫ్రంట్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

1958లో కుందుర్తి ఆంజనేయులు (1922-1982) ఈ ఫ్రీవర్స్ ఫ్రంట్ (ఆంగ్లం: Free verse front) సంస్థను హైదరాబాదులో నెలకొల్పాడు. వచన కవితా ప్రక్రియను ప్రోత్సహించడం ఈ సంస్థ ప్రధాన ఆశయం. ఈ సంస్థ నిర్వహించిన కావ్యపఠనాలలో అడవికొలను మురళీధర్, అరిపిరాల విశ్వం, నగ్నముని, నిఖిలేశ్వర్, వీరవల్లి రాఘవాచారి (తదనంతర కాలంలో జ్వాలాముఖి) మొదలైన వచన కవులు పాల్గొనేవారు.[1]1967 నుండి ఉత్తమ వచన కవితాసంకలనానికి ఫ్రీవర్స్ ఫ్రంట్ అవార్డును ప్రకటిస్తున్నారు. 1979లో ఈ అవార్డు కోసం ఫ్రీవర్స్ ఫ్రంట్ ప్రైజ్ ట్రస్ట్ ను ప్రారంభించారు. ప్రారంభంలో బహుమతి కింద 116/-రూ. ఇచ్చేవారు. ఈ బహుమతి మొత్తం 1979లో రూ.500 లకు, 1983లో రూ.1116లకు, 1989లో రూ.5000 లకు పెంచారు. ప్రస్తుతం ఈ అవార్డు క్రింద ఒక్కొక్కరికి 10,000రూపాయల నగదు, జ్ఞాపిక ప్రదానం చేస్తున్నారు.[2]

ఫ్రీవర్స్ ఫ్రంట్ ప్రచురణలు[3][మార్చు]

  1. నాలోని నాదాలు (1966) - కుందుర్తి ఆంజనేయులు
  2. నగరంలో వాన - కుందుర్తి ఆంజనేయులు
  3. వైతరణి (1967) - సి.వి.కృష్ణారావు
  4. వచనకవిత: వివిధ కవుల పథాలూ, దృక్పథాలూ (1967) - కుందుర్తి ఆంజనేయులు, గోపాలచక్రవర్తి
  5. తరంతరం (1970) - వందమంది కవుల కవితాసంకలనం - కుందుర్తి ఆంజనేయులు (సంపాదకుడు)
  6. పెన్‌గన్ (1987) - కవితాసంపుటి
  7. Down to the Earth (1994) - An anthology of post modern telugu poetry

ఫ్రీవర్స్ ఫ్రంట్ పురస్కార గ్రహీతలు[4],[5][మార్చు]

  1. 1967 - శీలా వీర్రాజు - కొడిగట్టిన సూర్యుడు
  2. 1968 - వరవరరావు - చలినెగళ్ళు
  3. 1969 - వేగుంట మోహనప్రసాద్ - చితి-చింత
  4. 1970 - చెరబండరాజు - దిక్సూచి
  5. 1973 - నగ్నముని - తూర్పుగాలి
  6. 1974 - కె.శివారెడ్డి - రక్తం సూర్యుడు
  7. 1975 - కొత్తపల్లి సత్యశ్రీమన్నారాయణ - వెలుతురు పిట్టలు
  8. 1976 - ఇస్మాయిల్ - మృత్యువృక్షం
  9. 1977 - ఇంద్రగంటి శ్రీకాంత శర్మ - అనుభూతి గీతాలు
  10. 1979 - పి.హనుమయ్య - విభావరి
  11. 1980 - దేవిప్రియ - అమ్మచెట్టు
  12. 1981 - ఆసు రాజేంద్ర - గుండె చప్పుళ్ళు
  13. 1982 - ఎన్.గోపి - మైలురాయి
  14. 1983 - రేవతీదేవి - శిలాలోలిత
  15. 1984 - సౌభాగ్య - సంధ్యాబీభత్సం
  16. 1985 - పాపినేని శివశంకర్ - స్తబ్ధత - చలనం
  17. 1986 - నందిని సిధారెడ్డి - భూమిస్వప్నం
  18. 1987 - శిఖామణి - మువ్వల చేతికర్ర
  19. 1988 - కొండేపూడి నిర్మల - సందిగ్ధ సంధ్య
  20. 1989 - వసీరా - లోహనది
  21. 1990 - ఆశారాజు - నేపథ్యం
  22. 1991 - అఫ్సర్ - ఇవాళ
  23. 1992 - ఎండ్లూరి సుధాకర్ - వర్తమానం
  24. 1993 - వఝల శివకుమార్ - గోగుపువ్వు
  25. 1994 - నారాయణస్వామి - కల్లోల కలలమేఘం
  26. 1995 - జయప్రభ - యశోధరా వగపెందుకే
  27. 1996 - సతీష్‌చందర్ - పంచమవేదం
  28. 1997 - దర్భశయనం శ్రీనివాసాచార్య - ముఖాముఖం
  29. 1998 - జూకంటి జగన్నాథం - గంగడోలు
  30. 1999 - నాళేశ్వరం శంకరం - దూదిమేడ
  31. 2000 - ఛాయరాజ్ - దర్శని
  32. 2001 - యార్లగడ్డ రాఘవేంద్రరావు - ముంతపొగ
  33. 2002 - అద్దేపల్లి రామమోహనరావు - ఐనా ధైర్యంగానే
  34. 2003 - కందుకూరి శ్రీరాములు - సందర్భం
  35. 2004 - ఘంటశాల నిర్మల - నిర్వచనం
  36. 2005 - కొప్పర్తి వెంకటరమణమూర్తి- విషాదమోహనం
  37. 2006 - మందరపు హైమవతి - నిషిద్ధాక్షరి
  38. 2007 - గుడిహాళం రఘునాథం - ఒక జననం ఒక మరణం
  39. 2008 - చింతా అప్పలనాయుడు - దుక్కి
  40. 2009 - యాకూబ్- ఎడతెగని ప్రయాణం
  41. 2010 - నిఖిలేశ్వర్ - ఖండాంతరాల మీదుగా
  42. 2011 - పి.శ్రీనివాసగౌడ్ - ఒక మెలకువ
  43. 2012 - రామా చంద్రమౌళి - అంతర
  44. 2013 - ఈతకోట సుబ్బారావు - చీలిన మనిషి
  45. 2014 - తుల్లిమల్లి విల్సన్‌ సుధాకర్‌ - మాకూ ఒక భాష కావాలి
  46. 2015 - బి. ప్రసాదమూర్తి - పూలండోరు పూలు[6]
  47. 2016 - సి.భవానీదేవి - ఇంతదూరం గడిచాక
  48. 2017 - బాల సుధాకర్‌ మౌళి - ఆకు కదలని చోట
  49. 2018 - శ్రీ సిరికి స్వామినాయుడు - మట్టి రంగు బొమ్మలు
  50. 2019 - శ్రీ ఇబ్రహీం నిర్గుణ్ - ఇప్పుడేది రహస్యం కాదు

స్పందనలు[మార్చు]

  • సంపత్కుమార : ఫ్రీవర్స్ ఫ్రంట్ అంటే కుందుర్తి అనిమాత్రమే నేననుకుంటున్నాను. ఆయన వచనకవిత్వంగూర్చి ఆ తరహాలోనే కవిత్వం రావడాన్ని గూర్చి విపరీతంగా ప్రచారం చేశాడు. అనేకమంది 'కవులు' కావడానికి దోహదం చేశాడు.
  • నాగభైరవ కోటేశ్వరరావు : ఫ్రీవర్స్ ఇంకా చిక్కబడకముందు ఫ్రంట్ దాని ప్రగతికి దోహదం చేసిన మాట వాస్తవం. వచన కవిత్వవికాసం కోసం కుందుర్తి ఎంచుకున్న నిచ్చెన ఫ్రీవర్స్ ఫ్రంట్!
  • సినారె : ఉదయించే ఒక ప్రత్యేక కవితాప్రక్రియకు ఉద్యమం దోహదం చేయొచ్చు. ఫ్రీవర్స్ ఫ్రంట్ ఆ పాత్రను నిర్వహించింది.
  • చేరా : లబ్ధప్రతిష్ఠులైన ఈనాటి మేజర్ కవులంతా ఒకప్పుడు ఫ్రీవర్స్ ఫ్రంట్ ప్రోత్సాహం పొందినవాళ్ళే.

మూలాలు[మార్చు]

  1. [1] Archived 2016-03-05 at the Wayback Machine జ్వాలాముఖి తుదిపయనం - వరవరరావు
  2. [2] Archived 2012-02-02 at the Wayback Machine ఆంధ్రప్రభలో వార్త
  3. వచనకవితా వికాసంలో ఫ్రీవర్స్ ఫ్రంట్ - ద్వా.నా.శాస్త్రి
  4. పాతికేళ్ళ ఫ్రీవర్స్‌ఫ్రంట్ బహుమతులు
  5. వచనకవితా వికాసంలో ఫ్రీవర్స్‌ఫ్రంట్ - ద్వా.నా.శాస్త్రి
  6. "ఫ్రీవర్స్‌ ఫ్రంట్‌ పురస్కారాలు". Archived from the original on 2021-10-25. Retrieved 2018-06-23.