బజాజ్‌ పల్సర్‌

వికీపీడియా నుండి

మూస:Infobox Motorcycle

బజాజ్‌ పల్సర్‌ (Bajaj Pulsar) అనేది భారతదేశంలో బజాజ్‌ ఆటో కంపెనీ యొక్క మోటార్‌ సైకిల్‌ బ్రాండ్‌. ఈ ద్విచక్ర వాహనాన్ని బజాజ్‌ ఆటో ప్రొడక్ట్‌ ఇంజినీరింగ్‌ విభాగం, మోటార్‌ సైకిల్‌ డిజైనర్‌ గ్లెన్‌ కెర్‌ టోక్యో ఆర్‌ అండ్‌ డితో కలిసి అభివృద్ధి చేసింది.[1] ప్రస్తుతం ఇది నాలుగు రకాలుగా అందుబాటులో ఉంటుది- ఇంజన్‌ సామర్ధ్యం 135 సిసి, 150 సిసి, 180 సిసి మరియు 220 సిసిలలో అందుబాటులో ఉంది. నవంబరు 2005 నాటికి పది లక్షల పల్సర్‌ మోటార్‌ సైకిళ్లు అమ్ముడయ్యాయి. జూన్‌ 2009లో ఒక్క నెలలోనే 48వేల మోటారు సైకిళ్లు అమ్ముడయ్యాయి. భారత దేశంలో 150 సిసిల విభాగంలో పల్సర్‌ ఆధిపత్యంలో ఉంది. మార్కెట్‌లో దీని వాటా 43 శాతం కావడం విశేషం.[2]

విషయ సూచిక

[మార్చు] చరిత్ర

పల్సర్‌ను ప్రవేశపెట్టడానికి ముందు, భారత దేశ మోటార్‌ సైకిల్‌ మార్కెట్‌ పూర్తిగా ఇంధన సామర్ధ్యం దిశగానే సాగింది. చిన్న సామర్ధ్యం ఉన్న మోటారు సైకిళ్లు (80-125 సిసి తరగతిలో) మాత్రమే ఉండేవి. పెద్ద మోటారు సైకిళ్లు ఎక్కువ సామర్ధ్యంతో వచ్చేవి కాదు. (దీనికి ఎన్‌ఫీల్డ్‌ బులెట్‌ మినహాయింపు). 1999లో హీరోహోండా సిబిజెడ్‌ను ప్రవేశపెట్టి విజయం సాధఙంచింది. దీనివల్ల దేశంలో ప్రదర్శన బైకులకు డిమాండ్‌ ఉంటుందని రుజువయింది. అక్కడ నుంచి బజాజ్‌ ఈ మార్గంలోకి వచ్చి, పల్సర్‌ ట్విన్స్‌ను నంబరు 24, 2001లో విడుదల చేసింది.[3] బజాజ్‌ పల్సర్‌ను విడుదల చేసి, అది విజయం సాధించిన దగ్గర్నించి, భారత దేశంలో యువత బైకులలో ఎక్కువ సామర్ధ్యం మరియు లక్షణాలు ఉండాలని ఆశించడం మొదలయింది.

ఈ ప్రాజెక్ట్‌ అంతర్గతంగా వ్యతిరేకను ఎదుర్కొంది. మెకిన్సీ లేవనెత్తిన రిజర్వేషన్స్‌ మరియు కవాసకితో బజాజ్‌ సంబంధం పై ఇది చూపించే ప్రభావం పై సందేహాలు మొదలయ్యాయి. ఈ ప్రాజెక్ట్‌ను పూర్తి చేయడానికి బజాజ్‌కు సుమారుగా 36 నెలల సమయం మరియు వంద కోట్ల రూపాయలు ఖర్చు అయ్యాయి.[4]

{{{1}}}

[మార్చు] ప్రత్యేకతలు

పల్సర్‌ 135[5] 2010 పల్సర్‌ 150 డిటిఎస్‌-ఐ 2010 పల్సర్‌ 180 డిటిఎస్‌-ఐ (2009లో సీజ్‌ చేయబడింది) పల్సర్‌ 200 డిటిఎస్‌-ఐ (2009లో సీజ్‌ చేయబడింది) పల్సర్‌ 220 డిటిఎస్‌-ఎఫ్‌ఐ 2010 పల్సర్‌ 220 ఎఫ్‌ డిటిఎస్‌-ఐ 2010 పల్సర్‌ 220 ఎస్‌ డిటిఎస్‌-ఐ
శక్తి (బిహెచ్‌పి) 9.6 [9] [10] 10.3% 5-2 20 21.04 21.04
సామర్ధ్యం (ఎన్‌-ఎమ్‌) 3 .4 12.45 14.22 17.98 1416.7 19.12 19.16
వీల్‌బేస్‌ (ఎమ్‌ఎమ్‌) 1325 1320 1345 1345 1350 1350 1350
బరువు (కేజీ) 122 143 147 147 150 152 148
అత్యధిక వేగం (కి.మీ/గం.) 115[6] 115 120 126 135 145 145[7]

[మార్చు] పరిణామం

[మార్చు] 2001

ఆరంభంలో పల్సర్‌ 150 సిసితో ఎయిర్‌కూల్డ్‌, సింగిల్‌ సిలిండర్‌, పెట్రోల్‌, స్పార్క్‌ ఇగ్నిటర్‌ ఫోర్‌ స్ట్రోక్‌ ఇంజిన్‌ లక్షణాలతో 12 బిహెచ్‌పి గరిష్ట శక్తితో తయారయింది. కార్బొరేటర్‌ నుంచి వచ్చి ఫెడ్‌ ఎయిర్‌ ఫ్యూయల్‌ మిక్సర్‌తో సింగిల్‌ స్పార్క్‌ ప్లగ్‌ను ఇగ్నేట్‌ చేసే విధంగా రూపొందించారు. సాధారణ స్ప్రింగ్‌ షాక్‌అబ్జార్బర్స్‌, రౌండ్‌ హెడ్‌ల్యాంప్‌ డోమ్‌ మరియు 1,265 ఎమ్‌ఎమ్‌ వీల్‌బేస్‌తో ఇది తయారయింది. డిస్క్‌ బ్రేక్‌ అనేది కచ్చితంగా దీనికి ఉండే పరికరంగా మారింది. ఇది 2000ల ఆరంభంలో భారత మార్కెట్‌లో ఓ గొప్ప సౌకర్యం. ఇతర ప్రామాణిక అంశాలు పార్కింగ్‌ లైట్స్‌ మరియు ఎయిర్‌ క్రాఫ్ట్‌ తరహాలో ఉన్న ఫ్యూయల్‌ ట్యాంక్‌ లిడ్‌.

180 సిసి వెర్షన్‌ 15 బిహెచ్‌పి గరిష్ట శక్తితో తయారయింది. దీనికి ట్విన్‌ టోన్‌ హారన్‌ ఉంది. ఇది 150 సిసి ఆప్షనల్‌గా మాత్రమే ఉంటుంది. ఎలక్ట్రిక్‌ స్టార్ట్‌ (ఇఎస్‌) కూడా ఈ రెండు రకాల బైక్‌లలో అదనపు అవకాశం ఆఫర్‌ చేయబడింది.[8]

[మార్చు] 2003

రెండో తరం పల్సర్‌ బండి బజాజ్‌ ఆటో కొత్తగా అభివృద్ధి చేసిన డిటిఎస్‌-ఐ సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించబడింది.>

మూస:Convert/bhpమూస:Convert/test/Aon ఇది రెండు విభాగాల్లోనూ పవర్‌ రేటింగ్‌ను పెంచడంతో పాటు ఇంధన ఎకానమీని మెరుగుపరిచింది.[9] ఈ మోడల్‌లో కొత్త హెడ్‌ల్యాంప్‌, 1,320 ఎమ్‌ఎమ్‌ వీల్‌బేస్‌,[10] ప్రామాణిక ట్విన్‌ టోన్‌ హారన్‌ మరియు ట్రిప్‌ మీటర్‌ను ప్రవేశపెట్టారు.

[మార్చు] 2005

2005లో, బజాజ్‌ మరింత అభివృద్ధి పరిచిన పల్సర్‌ను విడుదల చేసింది. ఈ బండికి >

17-inch (430 mm)మూస:Convert/test/Aఎలాయ్‌ వీల్స్‌ను ప్రామాణిక ఫిటింగ్‌గా రూపొందించారు మరియు దీని స్టాన్స్‌ 12 ఎమ్‌ఎమ్‌కు తగ్గించారు. భారత మార్కెట్‌లో తొలిసారి దీనితోనే రేర్‌ చక్రాల>

17-inch (430 mm)మూస:Convert/test/A ప్రొఫైల్‌ను ప్రవేశపెట్టింది. ప్రస్తుతం దీని ఇంధన సామర్ధ్యం 15 లీటర్లు.[11] పవర్‌ అవుట్‌ పుట్‌ను 150కి>

మూస:Convert/bhpమూస:Convert/test/Aon 8500 ఆర్‌పిఎమ్‌కు, 180కి >

మూస:Convert/bhpమూస:Convert/test/Aon8500 ఆర్‌పిఎమ్‌కు పెంచారు.[12] రేర్‌ షాక్‌ అబ్జార్బర్స్‌ ఇప్పుడు గ్యాస్‌తో నిండిన నైట్రోక్స్‌ అబ్జార్బర్స్‌.

పల్సర్‌ యొక్క యుజి-3 వెర్షన్‌లో ప్రవేశపెట్టిన ఎల్‌సిడి స్క్రీన్‌

[మార్చు] 2006

బజాజ్‌ మరో వెర్షన్‌ పల్సర్‌ను ప్రవేశపెట్టింది. ఇందులో ఉన్న కొత్త లక్షణాలు: ప్రధాన ల్యాంప్‌ నుంచి విడిగా ఉండే పైలట్‌ ల్యాంప్స్‌, స్పష్టమైన లెన్స్‌ మరియు ఎంబర్‌ బల్బ్‌తో టర్న్‌ ఇండికేటర్లు, సెల్ఫ్‌ క్యాన్సలింగ్‌ టరఱ్న్‌ ఇండికేటర్‌ స్విచ్‌, వాహన డేటాను చదివే డిజిటల్‌ ఫ్లష్‌ ఎల్‌సీడీ స్క్రీన్‌, నాన్‌ కాంటాక్ట్‌ స్పీడ్‌ సెన్సర్‌, నాన్‌ కాంటాక్ట్‌ బ్యాక్‌లిట్‌ స్విచెస్‌, ట్విన్‌ స్ట్రిప్‌ ఎల్‌ఇడి టెయిల్‌ లైట్‌ అసెంబ్లీ మరియు కొసగా చేసిన సైడ్‌ ప్యానెల్స్‌, రేర్‌ లుక్‌ కొలకు ట్యాపరింగ్‌. ఇంజన్‌ యొక్క టోర్క్య్‌వను పెంచారు. దీని వల్ల వైబ్రేషన్‌ తగ్గి, గేర్‌ షిప్ట్‌ ఫీల్‌ మెరుగుపడింది. తొలిసారిగా 150 సిసి విభాగంలో ఒకటి కిందకు, నాలుగు పైకి గేర్‌ బాక్స్‌ను ప్రవేశపెట్టారు.[13]

2006లో మొత్తం అన్ని పల్సర్‌ సిరీస్‌లలో ప్రవేశపెట్టిన కొత్త హెడ్‌ల్యాంప్‌ డిజైన్‌.

[మార్చు] 2007

ప్రధాన వ్యాసం: Bajaj Pulsar 220 DTS-Fi

2007 జులైలో, బజాజ్‌ తన కొత్త బజాజ్‌ పల్సర్‌ 220 డిటిఎస్‌-ఎఫ్ఐ మరియు పల్సర్‌ 200 డిటిఎస్‌-ఐని అమ్మడం ప్రారంభించింది. ఇందులో ఫ్యూయెల్‌ ఇంజెక్షన్‌ మరియు ఆయిల్‌ కూల్డ్‌ ఇంజిన్స్‌, డిజిటల్‌ డాష్‌ ఆధునిక స్టైలింగ్‌ ఉంది. ఈ బైక్‌ ద్వారా భారత మార్కెట్‌కు పూర్తిగా కొత్త లక్షణాల‌ను పరిచయం చేశారు. ఇందులో తనంతట తానే ఇంధనం ఇంజెక్ట్‌ చేసుకోవడం, రేర్‌ డిస్క్‌ బ్రేక్‌ మరియు క్లిప్‌ హ్యాండిల్‌ బార్స్‌ (మొదటి రెండు లక్షణాలు కేవలం 220 మోడల్‌ మాత్రమే అందుబాటులో ఉన్నాయి)ను చెప్పుకోదగినవి.

[మార్చు] 2009

ఏప్రిల్‌ 2009లో బజాజ్‌ పల్సర్‌ 150 సిసి మరియు పల్సర్‌ 180 సిసిలలో యుజి 4 (నాలుగో మెరుగుదల)ను బజాజ్‌ విడుదల చేసింది. 150 సిసికి దిద్దిన మెరుగలలో ఆల్‌బ్లాక్‌ థీమ్‌, టాంక్‌ స్కూప్స్‌ ఉన్నాయి. ఇవి పల్సర్‌ 200కు దగ్గరగా ఉంటాయి. ఒక 3డి పల్సర్‌ చిహ్నం మరియు మారిన ఎలక్ట్రికల్‌ వ్యవస్థ (పూర్తిగా డిసి) ఉన్నాయి. శక్తి కూడా 13.5 బిహెచ్‌పి నుంచి 14.09 బిహెచ్‌పికి (8500 ఆర్‌పిఎమ్‌ దగ్గర) పెరిగింది.

ఎలక్ట్రిక్‌ మెరుగుదల వలన ముఖ్యంగా ఇంజిన్‌ను ఆఫ్‌ చేసిన తర్వాత కొన్ని సెకన్లకు హెడ్‌లైట్‌ ఆగిపోవడం, దీనివల్ల బ్యాటరీకి రక్షణ వస్తుంది. టర్న్‌ సిగ్నల్స్‌ వాటంతట అవే క్యాన్సిల్‌ కావడం, ఐకాన్‌ వెలుగు (హారన్‌ ఐకాన్‌, ఇండికేటర్‌ ఐకాన్‌, ఇంజిన్‌ కటాఫ్‌ ఐకాన్‌ మొదలైనవి), సైడ్‌ స్టాండ్‌ హెచ్చరిక లైటు, డ్యూయల్‌ డిజిటల్‌ ట్రిప్‌ మీటర్‌, ఇంధనం తక్కువగా ఉన్నప్పుడు హెచ్చరిక లైటు (ఇంజిన్‌ వేగం బాగా పెరిగినప్పుడు కూడా వెలుగుతుంది), మరియు బ్యాటరీ తక్కువగా ఉన్నప్పుడు ఇండికేటర్‌ మొదలైనవి అన్ని రకాల మోడళ్లలో సహజ ఫీచర్లుగా వచ్చాయి.

పల్సర్‌ 180కి వెడల్పాటి టైర్లు, స్ప్లిట్‌ సీటు, ట్యాంక్‌ స్కూప్స్‌, క్లిప్‌ ఆన్‌ హ్యాండిల్‌ బార్స్‌, 3డి పల్సర్‌ చిహ్నం,పల్సర్‌ 200 తరహాలో స్వింగ్‌ ఆర్మ్‌ సస్పెన్షన్‌, మందపాటి ఫోర్క్స్‌లతో మెరుగులు దిద్దడంతో పాటు శక్తిని 17 పిఎస్‌కు పెంచారు.[14]

బజాజ్‌ కార్బునేటెడ్‌ వెర్షన్‌లో పల్సర్‌ 220ని జూన్‌ 2009లో విడుదల చేసింది. దీనికి ట్యాగ్‌లైన్‌ భారతదేశంలో వేగవంతమైన బైక్‌.[15] జులై 2009లో పల్సర్‌ 2009 ఉత్పత్తిని ఆపివేసింది.

బజాజ్‌ కొత్తగా లైట్‌ స్పోర్ట్స్‌ వెర్షన్‌లో పల్సర్‌ను పల్సర్‌ 135 ఎల్‌సి పేరుతో ప్రవేశపెట్టింది. భారతదేశంలో 4 వేల్యూ డిటిఎస్‌-ఐ సాంకేతిక పరిజ్ఞానాన్ని కలిగి ఉన్న తొలి బైక్‌ ఇదే. ఇందులో రెండు పెద్ద ప్రామాణిక వాల్వ్‌లకు బదులు, నాలుగు చిన్న వాల్వ్‌లు ఉంటాయి. స్టైలింగ్‌ కూడా మార్చడం వల్ల బాగా దూకుడుగా కనిపిస్తుంది. ఈ బైక్‌కు ఏఆర్‌ఏఐ ఆమోదం లీటరుకు 68.5 కిలోమీటర్లు బరువు 122కుగాను లభించింది.

[మార్చు] 2010

బజాజ్‌ పల్సర్‌ 150లో యుజి 4.5 (ఐదో మెరుగుదల)ను విడుదల చేసింది. పల్సర్‌ 150కి చేసిన మెరుగుదలలో పల్సర్‌ 135 ఎల్‌ఎస్‌ మాదిరిగా క్లిప్‌ ఆన్‌ హ్యాండిల్‌ బార్‌ వచ్చింది. శక్తి కూడా 14.09 బిహెచ్‌పి నుంచి 15.06 బిహెచ్‌పికి (9000 ఆర్‌పిఎమ్‌ దగ్గర) పెరిగింది.

పల్సర్‌ 220 యొక్క అసలు వర్షన్‌ కూడా విడుదల చేశారు. దీనికి పల్సర్‌ 220ఎస్‌ (స్ట్రీట్‌ ఫైటర్‌) అని పేరు పెట్టారు. ఇందులో ఫ్రంట్‌ ఫెయిరింగ్‌ మినహా అన్ని పల్సర్‌ 220 లక్షణాలను ఏర్పాటు చేశారు. ఫ్రంట్‌ ఫెయిరింగ్‌ పల్సర్‌ 180/150 తరహాలో ఏర్పాటు చేశారు. పాత పల్సర్‌ 220ని ఇప్పుడు పల్సర్‌ 220 ఎఫ్‌ అని పిలుస్తున్నారు.

[మార్చు] సాంకేతిక పరిజ్ఞానం

[మార్చు] DTSi

DTSi అంటే డిజిటల్‌ ట్విన్‌ స్కార్క్‌ ఇగ్నిషన్‌, ఇది బజాజ్‌ ఆటో ట్రేడ్‌మార్క్‌. DTSi సాంకేతిక పరిజ్ఞానానికి బజాబ్‌ భారత పేటెంట్‌ను కలిగి ఉంది.[citation needed] ఆల్ఫా రోమియో ట్విన్‌ స్పార్క్‌ ఇంజిన్స్‌, బిఎమ్‌డబ్ల్యు ఎఫ్‌ 650 ఫున్‌డురో, ఇవి భారత్‌లో 1995 నుంచి 1997 వరకు అమ్మారు. వీటిలో కూడా ట్విన్‌ స్పార్క్‌ ప్లగ్‌ సాంకేతిక పరిజ్ఞానం ఉంది. రోటాక్స్ మోటార్‌ సైకిల్‌ ఇంజిన్స్‌లోనూ ఉంది. ఇటీవల కాలంలో హోండా యొక్క iDSI వాహనం ఇంజిన్‌ కూడా ఇదే తరహాలో రెండు స్పార్క్‌ ప్లగ్స్‌ ఏర్పాటుతో వచ్చింది. ఏదేమైనా, చాలా తక్కువ సామర్ధ్యం ఉన్న ఇంజిన్లలో ఇలాంటి పథకాలను వాటి ఉత్పత్తుల్లో ప్రవేశపెడుతున్నాయి.

[మార్చు] పేటెంట్‌ ఉల్లంఘన ఆరోపణలు

2007 సెప్టెంబరులో బజాజ్‌ ఆటో, తమ DTS-I పేటెంట్‌ను ఉల్లంఘిస్తూ టివిఎస్‌ ఫ్లేమ్‌ను తయారు చేస్తున్నారని ఆరోపిస్తూ క్లెయిమ్‌ దాఖలు చేసింది.[16] టివిఎస్‌ దీనికి బదులుగా తమ మీద లిఖితపూర్వక నింద వేసినందుకు బజాజ్‌ ఆటో పై దావా వేస్తానని హెచ్చరించింది.[17][18] 2008 ఫిబ్రవరిలో, చెన్నైలోని మద్రాస్‌ హైకోర్టు, టివిఎస్‌ దాని ట్విన్‌ స్పార్క్‌ ప్లగ్‌ పరిజ్ఞానాన్ని విడుదల చేయకుండా ఆపుతూ ఉత్తర్వులు ఇచ్చింది.[19] టివిఎస్‌ ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా అప్పీలు చేసింది. ఈ కేసులో కీలకమైన సాక్ష్యాలను పరిగణలోకి తీసుకోలేదని పేర్కొంది.[20] మార్చి 2008లో, ఒక స్పార్క్‌ ప్లగ్‌తోనే అభివృద్ధి చేసిన ఫ్లేమ్‌ను విడుదల చేసింది.[21] ఈ DTSi ఆలోచన అర్థం చేసుకోవడానికి చాలా సులభం. ఇందులో ఇంజిన్‌ సిలిండర్లలో రెండు స్పార్క్‌ ప్లగ్‌లు ఉపయోగిస్తారు (ఒకదానికి బదులుగా). 2009 సెప్టెంబరు 16న భారత సుప్రీంకోర్టు, టివిఎస్‌ ఫ్లేమ్‌ ట్విన్‌ స్పార్క్‌ టెక్నాలజీని ఉపయోగించుకుని 125 సిసి వాహనాలను తయారు చేసి అమ్ముకోవడానికి అనుమతి ఇచ్చింది.[22]

[మార్చు] ఎగ్జాస్‌ టిఇసి

ఎగ్జాస్‌ టిఇసి అంటే ఎగ్జాస్ట్‌ టోర్క్వ్‌ ఎక్స్‌పాన్షన్‌ చాంబర్‌, ఈ సాంకేతిక పరిజ్ఞానానికి కూడా బజాజ్‌ పేటెంట్‌ పొందింది.[23] ఈ పరిజ్ఞానంలో ఒక చిన్న చాంబర్‌ ఇంజిన్‌ యొక్క ఎగ్జాస్ట్‌ పైప్‌కు అనుసంధానించబడి ఉంటుంది. దీని వల్ల బ్యాక్‌ ప్రెజర్‌ను మోడిఫై చేసి, క్యారక్టరిస్టిక్స్‌ను మెరుగుపరచవ్చు. తక్కువ ఎండ్‌లో ప్రదర్శన బైక్‌లను అభివృద్ధి చేయడం ఈ సాంకేతిక పరిజ్ఞానం యొక్క ముఖ్య ఉద్దేశం. ఎగ్జాస్‌ టిఇసి పరిజ్ఞానం తక్కువ మరియు మధ్య స్థాయి టోర్క్వ్‌ను మెరుగుపరచడంలో చాలా సమర్ధంగా పని చేస్తుందని చెప్పుకుంటుంది.[24]

[మార్చు] పురస్కారాలు

పల్సర్‌లోని రకరకాల మోడళ్లు కింది అవార్డులను పొందాయి[25]

[మార్చు] 2008

  • బైక్‌ ఇండియా అవార్డ్స్‌- బైక్‌ ఆప్‌ ద ఇయర్‌ (250 సిసి వరకు)[26]
  • ఇండియన్‌ మోటార్‌ సైకిల్‌ ఆఫ్‌ ద ఇయర్‌[27]

[మార్చు] 2007

  • సిఎన్‌బిసి-టివి18 ఆటోకార్‌ ఆటో అవార్డ్స్‌ - బైక్‌ ఆఫ్‌ ద ఇయర్‌

[మార్చు] 2003

  • బిబిసి వరల్డ్‌ వీల్స్‌ అవార్డ్‌ - వ్యూయర్స్‌ చాయిస్‌ టూ వీలర్‌ ఆఫ్‌ ద ఇయర్‌
  • బిబిసి వరల్డ్‌ వీల్స్‌ అవార్డ్‌ - ఉత్తమ ద్విచక్ర వాహనం 55 వేలు - 70 వేల రూపాయల మధ్య
  • బిబిసి వరల్డ్‌ వీల్స్‌ అవార్డ్‌ - ఉత్తమ ద్విచక్రవాహనం 45 వేలు - 50 వేలు మధ్య
  • ఎన్‌ఎఫ్‌ఓ ఆటోమోటివ్‌ - మోటార్‌ సైకిల్‌ పూర్తి వినియోగదారుడి సంతృప్తి అధ్యయనం
  • ఐసిఐసిఐ బ్యాంక్‌ ఓవర్‌ డ్రైవ్‌ అవార్డ్స్‌ - బైక్‌ ఆఫ్‌ ద ఇయర్‌

[మార్చు] 2002

  • ఓవర్‌ డ్రైవ్‌ అవార్డ్స్‌ - ఏడాదిలో బాగా ఆసక్తిని కలిగించిన బైక్‌

[మార్చు] సూచనలు

  1. ఆసియా సాంకేతిక పరిజ్ఞాన వ్యాపారవేత్త
  2. మూస:Cite document
  3. Pulsar design. తీసుకొన్న తేదీ: 2007-04-06.
  4. [1][dead link]
  5. Bajaj Pulsar 135 LS. Bajaj Auto. తీసుకొన్న తేదీ: 21 December 2009.
  6. Pulsar 135LS Review- Light and Sporty. Business Standard. తీసుకొన్న తేదీ: 21 December 2009.
  7. మూస:Cite document
  8. Pulsar DTSi: Suave but savage. The Hindu Business Line (2003-11-30). తీసుకొన్న తేదీ: 2010-07-28.
  9. DTSi Technology. తీసుకొన్న తేదీ: 2007-04-06.
  10. Wheelbase. తీసుకొన్న తేదీ: 2007-04-06.
  11. 2004 design upgrades. తీసుకొన్న తేదీ: 2007-04-07.
  12. 2004 power upgrades. తీసుకొన్న తేదీ: 2007-04-07.
  13. 2006 Pulsar features. తీసుకొన్న తేదీ: 2007-04-09.
  14. మూస:Cite document
  15. కొత్త పల్సర్‌: భారతదేశంలో వేగంగా ఉత్పత్తవుతున్న బైక్‌
  16. "Patent row: Bajaj-TVS spat may end up in court", Economic Times (India Times), 2007-09-06. Retrieved on 2008-01-11.
  17. "TVS takes lead in legal war with Bajaj", Economic Times (India Times), 2007-10-27. Retrieved on 2008-01-11.
  18. "Bajaj says to defend patent; TVS says will sue for libel", Reuters, 2007-09-03. Retrieved on 2008-01-11.
  19. HC restrains TVS from launching Flame motorcycle.
  20. Patent dispute: TVS Motor goes on appeal.
  21. TVS Flame launched with modified engine.
  22. Apex court allows TVS to sell ‘Flame’.
  23. Bajaj gets engine technology patent. Sify.com. తీసుకొన్న తేదీ: 2010-07-28.
  24. ఎస్‌హాస్‌ టిఇసి సాంకేతిక పరిజ్ఞానానికి పేటెంట్‌ పొందిన బజాజ్‌
  25. [2][dead link]
  26. [3][dead link]
  27. Bajaj Pulsar 220 DTS-Fi bags Indian Motorcycle Award. Moneycontrol.com (June 13, 2008). తీసుకొన్న తేదీ: 2010-07-28.

[మార్చు] బాహ్య లింకులు

Commons-logo.svg
వికీమీడియా కామన్స్ లో కింది విషయానికి సంబంధించిన మీడియా ఉంది.
[[Commons: Category:Bajaj Pulsar

| Bajaj Pulsar

]]


మూస:Bajaj motorcycles

వ్యక్తిగత పరికరాలు
నేంస్పేసులు

వైవిధ్యాలు
పేజీకి సంభందించిన లింకులు
చర్యలు
మార్గదర్శకము
పరస్పరక్రియ
పరికరాల పెట్టె
ఇతర భాషలు