బడే గులాం అలీ ఖాన్

వికీపీడియా నుండి
ఉస్తాద్ బడే గులాం అలీ ఖాన్
बड़े ग़ुलाम अली ख़ान
بڑے غلام علی خان
ఉస్తాద్ బడే గులాం అలీ ఖాన్
ఉస్తాద్ బడే గులాం అలీ ఖాన్
నేపథ్యం
జన్మనామం బడే గులాం అలీ ఖాన్
మారుపేరు సబ్‌రంగ్
జననం ??, 1902
మూలం కసూర్, పంజాబ్ (పాకిస్తాన్)
మరణం 25 April, 1968
హైదరాబాదు భారత్
సాహిత్యం హిందుస్థానీ సంగీతము
వృత్తులు హిందుస్థానీ క్లాసికల్ గాయకుడు
క్రియాశీలక కాలం 1920 - 1967
రికార్డు కంపెనీలు ??

ఉస్తాద్ బడే గులాం అలీ ఖాన్ (ఆంగ్లం : Ustad Bade Ghulam Ali Khan) దేవనాగరి: बड़े ग़ुलाम अली ख़ान; షాహ్‌ముఖి: بڑے غلام علی خان; ఉర్దూ: بڑے غلام علی خان; జననం బ్రిటిష్ రాజ్ (నేటి పాకిస్తాన్) లోని పంజాబ్ లోని, లాహోర్ దగ్గర కసూర్ 1902 లో ; మరణం హైదరాబాదు భారతదేశం, ఏప్రిల్ 25, 1968. ఇతను ఒక భారతీయ గాయకుడు. హిందూస్థానీ సంగీతపు సాంప్రదాయ రీతిలో పాడగల దిట్ట. భారతీయ సంగీత శైలి యగు పాటియాలా ఘరానా కు చెందిన వాడు.

విషయ సూచిక

[మార్చు] పురస్కారాలు


[మార్చు] ప్రస్థానం

బడే గులాం అలీ ఖాన్ సారంగి వాదకుడిగా తన సంగీత జీవనం ప్రారంభించాడు. కోల్కతాలో తన మొదటి కచేరీలోనే పేరు ప్రఖ్యాతులు పొందాడు. 1944 కాలంలో సంగీత జగత్తులో మహామహులైన అబ్దుల్ కరీం ఖాన్, అల్లాదియా ఖాన్ మరియు ఫయాజ్ ఖాన్, లు సైతం ఇతడిని మకుటంలేని మహారాజుగా గుర్తించారు.[1]

ఇతను అనేక ప్రాంతాలలో జీవించాడు, లాహోర్, బాంబే, కలకత్తా మరియు హైదరాబాదు. ఇతడు అంతర్జాతీయ స్థాయిలో తన గాన కచేరీలను చేశాడు, గజల్, ఠుమ్రి, భజన్ శైలులలో పాడేవాడు.

భారత విభజన తరువాత, తన స్వస్థలమైన 'కసూర్' (పాకిస్తాన్) కు వెళ్ళాడు, అక్కడ కొన్నాళ్ళు జీవించిననూ మమేకం కాలేకపోయాడు. ఇతడు భారత విభజనను ఖండించాడు. భారత్ లో స్థిరంగా వుండిపోవుటకు, 1957లో భారత పౌరసత్వం పొందాడు. భారత విభజన గురించి ఈ విధంగా అన్నాడు "ప్రతి ఇంటిలో హిందుస్థానీ సంగీతం నేర్పివుంటే, భారత్ విభజింపబడేది కాదు".

సినిమాల కొరకు పాడడానికి ఇష్టపడేవాడు గాదు. కాని 1960 లో మొఘల్ ఎ ఆజం చిత్ర నిర్మాణ సమయంలో నౌషాద్ సంగీతంలో ఒక రాగయుక్త పాట పాడాడు. అదీ తాన్ సేన్ పాత్రకొరకు మాత్రమే. ఈ పాట "సోహ్నీ" మరియు "రాగేశ్రీ" రాగాలలో వుండినది. దర్శకుడు కె.ఆసిఫ్ మరియు నౌషాద్, మొఘల్ ఎ ఆజం కొరకు పాడమని కోరగా, తిరస్కరించడానికి తటపటాయించి, ఎక్కువ ఫీజు అడిగితే వెళ్ళిపోతారనే ఉద్దేశ్యంతో తన ఫీజు ఆ పాటకు 25,000/- అన్నాడు. కళాభిమానుడైన ఆసిఫ్ ఈ ఫీజును సంతోషంగా అంగీకరించాడు. ఆ విధంగా మొఘల్ ఎ ఆజం లో బడే గులాం అలీ ఖాన్ పాట వచ్చింది. ఆ కాలంలో ముహమ్మద్ రఫీ మరియు లతా మంగేష్కర్ లు తమ పాటకు 500/- ల కన్నా తక్కువ పారితోషకం పొందేవారు.

[మార్చు] లెగసి

ఖాన్ శిష్యురాలైన మాలతీ గిలానీ, ఖాన్ స్మృతికి చిహ్నంగా ఈనాడు, బడే గులాం అలీ ఖాన్ యాద్‌గార్ సభ ను స్థాపించింది. ఈ సభ అనేక కచేరీలను చేపడుతున్నది. దీని ముఖ్య ఉద్దేశ్యం, హిందుస్థానీ సంగీతాన్ని ఉచ్ఛస్థితికి తీసుకురావడం, అనారోగ్యంతో బాధపడే సంగీతకారులకు సహాయం చేయడం. ఈ సభ సబ్‌రంగ్ ఉత్సవ్ ను ప్రతి యేడాది చేపడుతుంది.

[మార్చు] సంతకము

BadeGhulamAliKhan.jpg

[మార్చు] బయటి లింకులు

[మార్చు] మూలాలు

  1. World Music, The Rough Guide Volume Two; London, 2000; pg. 92

[మార్చు] ఇవీ చూడండి

వ్యక్తిగత పరికరాలు
నేంస్పేసులు

వైవిధ్యాలు
పేజీకి సంభందించిన లింకులు
చర్యలు
మార్గదర్శకము
పరస్పరక్రియ
పరికరాల పెట్టె
ఇతర భాషలు